
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సర్వీస్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 4,500ల కేంద్రాల మార్కును చేరుకుంది. హైదరాబాద్‌లోని రాంపల్లి సర్వీస్ సెంటర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2022–23లో భారత్‌లో 310 సర్వీస్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేశామని సంస్థ సర్వీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు.
‘పట్టణేతర ప్రాంతాల్లో అత్యధికంగా ఇవి ప్రారంభం అయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో సర్వీస్ కేంద్రాలను అందుబాటులోకి తేవడం సంస్థ చరిత్రలో తొలిసారి. 2023–24లో కొత్తగా 350 కేంద్రాలను నెలకొల్పుతాం. సర్వీసు కోసం నగరాల్లో 10–15 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25 కిలోమీటర్లకు మించి కస్టమర్ ప్రయాణించకూడదు అన్నది మా లక్ష్యం. సర్వీస్ టచ్ పాయింట్స్ 2,271 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. 335 సర్వీస్ ఆన్ వీల్స్ వర్క్‌షాప్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 326 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 2.23 కోట్ల వాహనాలకు సర్వీసు అందించాం’ అని వివరించారు.
ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
Comments
Please login to add a commentAdd a comment