inaugurates
-
అరకులో పాస్ పోర్ట్ ఆఫీస్ ప్రారంభించిన ఎంపీ తనూజ రాణి
-
హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్.. ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో రూ. 5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నగరంలో రెండో అతిపెద్ద ప్లై ఓవర్(జూపార్క్ టు ఆరాంఘర్)ను సీఎం ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో హెచ్సీఐటీసీ ఫేజ్-1లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. సిటీలో వరద నీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు రూ.17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ జల మండలి (హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ప్రారంభించారు. రూ.669 కోట్ల అంచనాలతో ప్రభుత్వం చేపట్టింది.తాగునీటి సరఫరాకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను ప్రారంభించిన సీఎం.. హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్ వేర్‌ను లాంఛనంగా సీఎం ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. -
ఆదివాసీ సమాజాన్ని ఆరాధిస్తున్నాం
పాట్నా: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది గిరిజన యోధులు పోరాటం సాగించారని, క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబం కొట్టేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్షేపించారు. గిరిజన నాయకుల పోరాటాలు, త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రల వల్ల అడవి బిడ్డలకు పేరు ప్రతిష్టలు దక్కలేదని, వారు అనామకులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన పోరాట వీరుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శుక్రవారం బిహార్‌లోని జమూయిలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గిరిజన సంక్షేమానికి సంబంధించి రూ.6,640 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ‘పీఎం జన్ మన్ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆదివాసీ సమాజాన్ని తాము ఆరాధిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా గిరిజన జాతికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సంకలి్పంచామని తెలిపారు. ఇందులో భాగంగా బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించి, వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... నిజం సమాధికి కుట్రలు ‘‘శతాబ్దాలుగా దేశ సాంస్కృతిక చరిత్ర, ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో గిరిజనుల పాత్ర వెలకట్టలేనిది. శ్రీరాముడు ఒక రాజకుమారుడి నుంచి భగవంతుడిగా మారడానికి గిరిపుత్రులు సహకరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, గత ప్రభుత్వాలు ఈ నిజాన్ని సమాధి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నంచాయి. కొందరి కుట్రల కారణంగా స్వాతంత్య్ర ఉద్యమ క్రెడిట్ మొత్తం ఒక పార్టీకి, ఒక కుటుంబానికి(నెహ్రూ) దక్కింది. దీనివల్ల బిర్సా ముండా, తిల్కా మాంజీ(18వ శతాబ్దపు సంథాల్ నాయకుడు) పేర్లు మరుగునపడ్డాయి. కొందరు ప్రచారం చేస్తున్నట్లు కేవలం ఒక్క కుటుంబం పోరాటం వల్లే దేశానికి స్వాతంత్య్రం వస్తే మరి బిర్సా ముండా ఎందుకోసం పోరాటం చేసినట్లు?’’ అని మోదీ ప్రశ్నించారు.రూ.24,000 కోట్లతో జన్ మన్ యోజన ఈరోజు ‘పీఎం జన్ మన్ యోజన’ ప్రారంభించుకుంటున్నాం. గిరిజనుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాల సంక్షేమం కోసం రూ.24,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. పథకం అమల్లోకి రావడం వెనుక రాష్ట్రపతి ముర్ము చొరవ ఉంది. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. గిరిజనుల జీవన విధానం ప్రకృతికి దగ్గరగా, పర్యావరణ హితంగా ఉంటుంది. ఆధునిక యుగంలో వారి జీవన విధానం అందరికీ అనుసరణీయం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
అనంతపురంలో జ్యువెలరీ షాప్ ప్రారంభించిన అక్కినేని నాగార్జున (ఫొటోలు)
-
నిజామాబాద్‌లో సందడి చేసిన పాయల్, రామ్ (ఫొటోలు)
-
బలమైన బంధానికి ఇదే సంకేతం
బందర్ సేరీ బేగావాన్: బ్రూనైలో నూతన రాయబార కార్యాలయం భారత్, బ్రూనైల బలమైన బంధానికి సంకేతమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్రూనైలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్న మోదీ మంగళవారం మధ్యాహ్నం బందర్ సేరీ బేగావాన్ సిటీలో భారత నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి ఇండియన్ హైకమిషన్ ప్రాంగణంలో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ సంతతి ప్రజలతో మోదీ మాట్లాడారు.‘‘ఇరు దేశాల దౌత్యబంధానికి సజీవ సేతువులుగా మీరు నిలిచారు. భారత వైద్యులు, ఉపాధ్యాయులు బ్రూనై వైద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు’’ అని శ్లాఘించారు. అంతకుముందు మోదీకి బ్రూనై రాజధాని నగర ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడి యువరాజు హజీ అల్–మహతాదీ బిల్లాహ్ సాదరంగా మోదీని ఆహ్వానించారు. ఆసియాన్‌సదస్సు కోసం 2013లో నాటి ప్రధాని మన్మోహన్ బ్రూనైలో పర్యటించగా దౌత్య పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. బుధవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
బైరామల్ గూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, మంత్రులు, మేయర్ (ఫొటోలు)
-
బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
5 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
Live: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం
-
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం
-
Allu Arjun In Nalgonda Latest Photos: నాగార్జునసాగర్‌లో ఐకాన్ స్టార్ సందడి (ఫొటోలు)
-
రాజీవ్ పార్క్ ను కడప ప్రజలకు అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
సర్వీస్ సెంటర్లలో మారుతీ సుజుకీ రికార్డ్! ఏకంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సర్వీస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4,500ల కేంద్రాల మార్కును చేరుకుంది. హైదరాబాద్‌లోని రాంపల్లి సర్వీస్ సెంటర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2022–23లో భారత్‌లో 310 సర్వీస్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేశామని సంస్థ సర్వీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు. ‘పట్టణేతర ప్రాంతాల్లో అత్యధికంగా ఇవి ప్రారంభం అయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో సర్వీస్ కేంద్రాలను అందుబాటులోకి తేవడం సంస్థ చరిత్రలో తొలిసారి. 2023–24లో కొత్తగా 350 కేంద్రాలను నెలకొల్పుతాం. సర్వీసు కోసం నగరాల్లో 10–15 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25 కిలోమీటర్లకు మించి కస్టమర్ ప్రయాణించకూడదు అన్నది మా లక్ష్యం. సర్వీస్ టచ్ పాయింట్స్ 2,271 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. 335 సర్వీస్ ఆన్ వీల్స్ వర్క్‌షాప్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 326 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 2.23 కోట్ల వాహనాలకు సర్వీసు అందించాం’ అని వివరించారు. ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే.. -
Shriya Saran: పంజాగుట్టలో నటి శ్రియ సందడి (ఫొటోలు)
-
విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు
-
ఆది మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
ఆది మహోత్సవను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
ఢిల్లీకి కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఎల్లుండి (బుధవారం) తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సర్దార్ పటేల్ మార్గంలోని అద్దె భవనంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో కార్యాలయం బయట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి నవ చండీయాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ చండీయాగం నిర్వహించేందుకు యాగశాలను నిర్మించి అందులో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నవ చండీయాగంలో సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం 12.37 నిమిషాల సమయంలో పూర్ణాహుతిలో పాల్గొంటారని వాస్తు నిపుణులు తేజ వెల్లడించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ వర్గాన్ని కూడా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజా ప్రతినిధులు సుమారు 1500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వీలును బట్టి భావసారుప్యత కలిగిన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగానే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చదవండి: ఎమ్మెల్యే టికెట్లపై తేల్చేసిన కేసీఆర్, తగ్గేదేలే! అంటున్న బొంతు? -
‘స్పర్శ్’లో పీడియాట్రిక్ పాలియేటివ్ కేర్ని ప్రారంభించిన రానా (ఫొటోలు)
-
రెండు బ్యారేజీలను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
-
ప్రపంచ సంక్షేమానికే రక్షణ ఉత్పత్తులు
పటాన్చెరు: రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో సాధిస్తున్న విజయాలు, మిస్సైళ్లు, ఇతర సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఏ దేశాన్నో భయపెట్టేందుకు కాదని.. అవి కేవలం ప్రపంచ సంక్షేమానికేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్ హెడ్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో బీడీఎల్ కంచన్ బాగ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ రంగ సాంకేతికత ఆర్ఎఫ్ సీకర్ను.. ఏపీలోని వైజాగ్‌లో నెలకొల్పిన రక్షణ రంగం సెంట్రల్ స్టోర్స్‌ను, పశ్చిమ గోదావరిలోని మిలటరీ, మాధవరంలో బీడీఎల్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన స్కూల్, జిమ్, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం దేశ రక్షణ రంగంలో ఎవరూ ఊహించని విధంగా గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని.. అందులో అగ్నిపథ్ కూడా ఒకటని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లోని విధివిధానాలను అధ్యయనం చేశాకే అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టామన్నారు. బీడీఎల్ పరిశోధనలు, యుద్ధ ట్యాంకుల తయారీ, సాంకేతికతలో రక్షణ రంగానికి తోడ్పాటునందిస్తున్న తీరు హర్షణీయమని చెప్పారు. శాస్త్రవేత్తలను, బీడీఎల్ ఉద్యోగుల పనితీరును అభినందించారు. రక్షణ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం రక్షణ రంగ పరిశోధనలకు, విద్యా సంస్థల అనుసంధానం అవసరమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఉండేవని.. ఇప్పుడు 250 సీపీఎస్ఈలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులతో కొనసాగుతున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా.. హత్య కంటే తీవ్రం
తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణాను మనిషి హత్య కంటే తీవ్రమైన నేరంగా భావించి మరణశిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణ నిమిత్తం గురువారం రెండు కోర్టులను ప్రారంభించిన అనంతరం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో సమావేశం నిర్వహించారు. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా.. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల్లో మాత్రమే లభిస్తుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అధికంగా ఉండడంవల్లే అక్రమ రవాణా జరుగుతోందన్నారు. స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చట్టంలో శిక్షా కాలాన్ని, జరిమానాలను పెంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదన్నారు. సత్వర న్యాయం అందించాలి.. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర ఎంత ఉందో.. న్యాయవాదుల పాత్ర అంతే ఉందన్నారు. న్యాయవాదులు కేసులను వాయిదాలు తీసుకోకుండా కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు. భవిష్యత్తు డిజిటల్ వైపు పరుగులు తీస్తోందని, అందుకు తగ్గట్లుగా సీనియర్, జూనియర్ న్యాయవాదులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో 195 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా అందులో 167 పోస్టుల్లో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. 11మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించామన్నారు. 180 న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సీజేఐ తెలిపారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి న్యాయమూర్తుల పనిలేకుండా కోర్టులు మాత్రమే ఉండేటట్లు భవిష్యత్తులో జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. కేసుల సంఖ్య పెరుగుతోంది : హైకోర్టు సీజేఐ అనంతరం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు త్వరలో ఎర్రచందనం కేసుల విచారణకు మరికొన్ని కోర్టులను ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం సీజేఐని న్యాయమూర్తులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల న్యాయవాదుల సంఘాల కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి, బదిలీపై వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమానుల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి భీమారావ్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, హైకోర్టు రిజి్రస్టార్ దుప్పల వెంకటరమణ, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షులు దినకర్, స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు.. ఎర్రచందనం కేసుల విచారణకు ఏర్పాటుచేసిన రెండు కోర్టులను ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక కోర్టు సెషన్స్ జడ్జిగా ఎన్.నాగరాజు, స్థానిక నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ ఇన్చార్జ్ న్యాయమూర్తిగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాలి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎర్రచందనం కేసుల విచారణకు తాజాగా ఏర్పాటుచేసిన రెండు కోర్టులే కాకుండా మరిన్ని కోర్టులను రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుచేయాలని సీజేఐ సూచించారు. కోర్టులతో పాటు న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బంది నియామకాలు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు. కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇన్ని రోజులు ఎర్రచందనం విచారణకు ప్రత్యేక కోర్టు లేకపోవడంతో ప్రస్తుతం 2,340 కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అమాయక ప్రజలు వెళ్లకుండా అటవీ శాఖ సిబ్బంది అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జీఓలను నియమించి అక్రమ రవాణాను ఆపాలని సీజేఐ సూచించారు. అడవులను కొల్లగొట్టడంవల్ల మానవజాతికి కలిగే దు్రష్పభావాలను అందరూ గమనించాలన్నారు. ఇక తుడా కాంప్లెక్స్‌లోని రెండు భవనాలను రెండు కోర్టుల ఏర్పాటుకు తక్కువ అద్దెకు ఇవ్వడానికి అంగీకరించిన చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. -
కొండవీడులో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్
-
షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో తారల సందడి
-
లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ
గచ్చిబౌలి: భారత్‌లోనే కాకుండా యావత్ ఆసియా ఖండంలోనే లైఫ్ సైన్సెస్ రంగానికి కీలక హబ్‌గా తెలంగాణ రాష్ట్రం గుర్తింపు పొందిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పెట్టుబడులు, సంస్థల విస్తరణకు ఈ ప్రాంతం గమ్యస్థానంగా మారిందని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నాలెడ్జి సిటీలో మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ «థర్మో ఫిషర్ ఆర్ అండ్ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. గత నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలిసినట్లు కేటీఆర్ వివరించారు. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్, ఇక్రిశాట్, సీఎస్ఐఆర్ వంటి ఎన్నో ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కూడా హైదరాబాద్ మంచి ప్రదేశమని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో నైపుణ్యంగల వర్క్‌ఫోర్స్ అందుబాటులో ఉండటంతోపాటు ప్రభుత్వ సానుకూల విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలికవసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, థర్మోఫిషర్ సైంటిఫిక్ ఏసియా పసిఫిక్ అండ్ జపాన్ అధ్యక్షుడు టోని అసియారిటో, థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఇండియా సౌత్ ఏసియా ఎండీ అమిత్ మిశ్రా, థర్మో ఫిషర్ ఆపరేషన్స్ లేబొరేటరీ ఎక్విప్మెంట్ ఉపాధ్యక్షుడు మైఖేల్ మెగుయర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఫలించిన పరి‘శ్రమ’
మహేశ్వరం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలు, కంపెనీల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు, సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. కంపెనీలకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో ఎలక్ట్రానిక్ పార్కులో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పరిశ్రమను మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల పెట్టుబడితో విప్రో కంపెనీ పరిశ్రమను స్థాపించిం దని చెప్పారు. ‘ఇక్కడ 90 శాతం మంది స్థానికు లకు ఉపాధి కల్పిస్తాం. అందులో 15 శాతం మహిళలకు కేటాయిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్–ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చాం. 16 లక్షల మందికిపైగా ఉపాధి కల్పించాం. విప్రో లాంటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం అభినందనీయం’అని అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని కేటీఆర్ కొనియాడారు. ప్రేమ్‌జీ కరోనా సమయంలో ఆరోగ్య సంరక్షణకు రూ.25 కోట్లు, టీకా కోసం రూ.12 కోట్లు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మరో రూ.44 కోట్లు ఇచ్చారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర పరిశ్రమల ఎండీ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, విప్రో సీఈఓ వినీత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు: సబితా మహేశ్వరం, రావిర్యాల, తుమ్మలూరు గేటు ప్రాం తాల్లో త్వరలో భారీ పరిశ్రమలు రానున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి చెప్పారు. మరిన్ని ఐటీ, ఎలక్ట్రానిక్, ఇతర పరిశ్రమల రాకతో ఈ ప్రాం తం రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ వైపు చూసినప్పుడు.. హైదరాబాద్ నగరం వారికి కనిపిస్తోందని చెప్పారు. హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థానికంగా సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ కంపెనీని సందర్శించి కంపెనీలో తయారైన వస్తువుల తయారీని పరిశీలించి, అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటారు. జీనోమ్ వ్యాలీలో ‘జాంప్ ఫార్మా’ మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్లలోని జీనోమ్ వ్యాలీలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాంప్ ఫార్మాను మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33శాతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీని మరింత విస్తృత పరిచేలా మరో 400ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జాంప్ ఫార్మా గ్రూప్ సీనియర్ వైస్ చైర్మన్ సుకంద్ జునేజా మాట్లాడుతూ కెనడా తర్వాత జీనోమ్ వ్యాలీలోనే అతిపెద్ద జాంప్ ఫార్మాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విప్రో కన్జ్యూమర్ కేర్‌ను ప్రారంభిస్తున్న విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, మంత్రులు కేటీఆర్, సబిత -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘ఉద్యమిక’
దినదినాభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్, ఇతర నూతన రంగాల్లో ఉన్న అవకాశాలను మహిళా పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలి. సంప్రదాయ, చిన్నచిన్న ఉత్పత్తి రంగాలకే పరిమితం కాకుండా నూతన రంగాలపైనా దృష్టి సారించాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారి. – కేటీఆర్ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభు త్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశా లను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి, పటాన్చెరులో మంగళవారం నిర్వహిం చిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల పారిశ్రామికో త్పత్తిని సులభతరం చేసేందుకు కార్పస్‌ఫండ్ సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించిం దన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు... కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ఉత్పత్తిలో 66 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందని, హైదరాబాద్ దేశానికి ఫార్మా క్యాపిటల్‌గా అవతరిస్తోందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు ఏర్పాటు చేసిన ‘వీ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్’ సేవలను వినియోగించుకోవాలని మహి ళా పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4.90 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) ఇప్పుడు రూ.11.50 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 130 శాతం వృద్ధి సా«ధించిందని పేర్కొన్నారు. ఆ అగ్ని ప్రమాదంతోనే ‘కల్యాణలక్ష్మి’కి శ్రీకారం పటాన్చెరు టౌన్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ‘కల్యాణలక్ష్మి’ పథకానికి పునాది ఓ అగ్ని ప్రమా దమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ వారం పటాన్చెరు పట్టణంలోని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిం చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒకసారి పల్లెనిద్రలో భాగంగా మహబూ బాబాద్‌లోని ఓ తండాకు వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి కేసీఆర్ వద్దకు వచ్చి తన కూతురు వివాహం కోసం దాచుకున్న డబ్బు, ఇల్లు అగ్ని ప్రమాదం లో కాలిపోయాయని తన బాధను చెప్పుకున్నా డని కేటీఆర్ వివరించారు. ఆ తండ్రి వేదన, ఆ అగ్నిప్రమాదం బాధ నుంచి కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనే కల్యాణలక్ష్మి పథకమని వెల్లడించారు. రూ.9వేల కోట్లతో పథకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు పది లక్షల మంది ఆడపిల్లలకు ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్ ఓ మేనమామలా నిలిచారని మంత్రి తెలిపారు. -
షేక్‌పేట ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన:మంత్రి కేటీఆర్
-
కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం జగన్ అనంతరం సాంప్రదాయ పంచకట్టుతో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్.. బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దుష్ప్రచారమే టీడీపీ అజెండా -
పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు: బొత్స
సాక్షి, నెల్లూరు: భగత్‌సింగ్ నగర్లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.1000 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని తెలిపారు. 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని.. పేదలకు భారం కాకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. సీఎం జగన్ పాలనాదక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమన్నారు. (చదవండి: ఎక్కడా ఎరువుల కొరతలేదు: మంత్రి కన్నబాబు) గత ప్రభుత్వం మోసం చేసింది: మంత్రి అనిల్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకుని మోసం చేసిందన్నారు. పేదలపై భారం పడకూడదనే రూ.7వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని మంత్రి అనిల్ అన్నారు. చదవండి: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు -
ఖమ్మం లో ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి సందడి ఫొటోలు
-
మనది రైతుపక్షపాత ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలను మార్చిన ఘనత వైఎస్ఆర్ది అని సీఎం జగన్ గుర్తుచేశారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం జగన్ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు పెట్టుబడిసాయం కింద రైతన్నలకు ఏటా రూ.13,500 ఇస్తున్నామని, రెండేళ్లలో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని, ప్రతి పంటకు ఈ-క్రాపింగ్ చేయిస్తున్నామని ఆయన చెప్పారు. ఏ పంట వేశారు? ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ అందజేస్తున్నాం పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆర్బీకేలో అమ్ముకోవచ్చని, రైతులకు అడుగడుగునా ఆర్బీకేలు అండగా ఉంటాయని సీఎం జగన్ తెలిపారు. పంట నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందజేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఏ సీజన్‌లోని ఇన్పుట్ సబ్సిడీని ఆ సీజన్లోనే ఇస్తున్నామని, ఆర్బీకేల ద్వారా తక్కువ అద్దెకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా అన్ని సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ కలిస్తేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని, ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలుసని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ, కేంద్రం కలిసి 2015 జూన్‌లో నీటి కేటాయింపులు జరిగాయని సీఎం జగన్ గుర్తుచేశారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా నీళ్లు 20 నుంచి 25 రోజులకు మించి లేవన్నారు. దీనికంటే ముందు రాయదుర్గం మార్కెట్ యార్డ్‌లో అగ్రి ల్యాబ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రంలో స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం మొక్కను నాటారు. రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్.. కాసేపు రైతులతో ముచ్చటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాలానగర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్: ప్రత్యేక ఆకర్షణగా శివమ్మ..
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారో తెలుసా.. మంత్రి కేటీఆర్ ఓ కూలీ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయించారు. ఆమెనే వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. గత రేండేళ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ఆమె పాలు పంచుకుంది. శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకోవడంతో కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శివమ్మ. కాగా. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలి’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి తావులేకుండా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో 264 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను బుధవారం మంత్రి కేటీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు హజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా రూపాయి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించామన్నారు. ఇళ్ల వద్ద ఖాళీ స్థలంలో హరితవనం పెంచాలని సూచించారు. వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలని తెలిపారు. చెట్లు పెంచితే కరోనాకష్ట కాలంలో ఆక్సిజన్ సమస్యే ఉండదని హితవు పలికారు. నాలుగు లక్షల 75 వేల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎంతో మంది సీఎంలు.. ఆడబిడ్డలకు, బీడీలు చుట్టే మహిళలకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడాలేని పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, రైతుబందు, ఉచిత విద్యుత్‌ను సీఎం కేసీఆర్ ఇచ్చారని కొనియాడారు. -
Indrakaran Reddy: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన తెలంగాణ డయగ్నోస్టిక్ హబ్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లతో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. 19 జిల్లాల్లో డయగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో 57 రకాల నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. రూ.2.40 కోట్లతో రిమ్స్ ఆవరణలో డయగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కృషి చేస్తామని, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇటీవల రూ.20 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, విందులు, వినోదాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గతేడాది రూ.40వేల కోట్ల ఆదాయం నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌లు మాట్లాడారు. జిల్లాలో నాలుగు రూట్లు ఏర్పాటు చేసి 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను తెలంగాణ డయగ్నోస్టిక్ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం పంపించడం జరుగుతుందన్నారు. వైద్యం కంటే ప్రైవేటులో నిర్ధారణ పరీక్షలకే అధిక డబ్బులు ఖర్చవుతున్నట్లు తెలిపారు. చాలా మంది అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని, పేదల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం నిర్ధారణ పరీక్షలు తీసుకొచ్చే వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. చదవండి: Telangana: ఎంసెట్ వాయిదా! -
అల.. అంతర్వేదిలో.. కొంగొత్త 'రథ'సప్తమి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రథసప్తమి రోజున ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ గావించారు. సీఎం జగన్ ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి రథాన్ని లాగే వరకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి.. కల్యాణోత్సవం నాటికి కొత్త రథం తయారవుతుందని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు నెలల్లోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త రథాన్ని తయారు చేయించారు. కల్యాణోత్సవాల నేపథ్యంలో నూతన రథాన్ని ప్రారంభించారు. స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ సీఎం వైఎస్ జగన్.. ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న రాజగోపురానికి నమస్కరిస్తూ.. గంటా మంటపం, ముఖ మంటపం మీదుగా అంతరాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో స్వామికి ప్రీతిపాత్రమైన వింజామర సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. కోవిడ్–19 నేపథ్యంలో మార్చి 20 నుంచి రద్దు చేసిన అంతరాలయ దర్శనాన్ని.. ప్రస్తుతం కల్యాణోత్సవం సందర్భంగా సీఎం ద్వారా తిరిగి పునరుద్ధరించారు. అర్చకులు సీఎం జగన్ గోత్ర నామంతో అర్చన గావించారు. మంత్రపుష్ప సమర్పణ అనంతరం హారతిని సీఎం భక్తి భావంతో కళ్లకు అద్దుకుని నమస్కరించారు. అంతకు ముందు ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి శ్రీనివాస్, స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకట శాస్త్రి, అర్చకులు శ్రీను తదితరులు ధ్వజ స్తంభం వద్ద ఉన్న సింహద్వారం వద్ద ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు ♦ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం రాజ్యలక్ష్మీ అమ్మవారి ఉపాలయంలోని వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ♦ఆశీర్వచన మంటపం వద్ద అర్చకులు, వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. లక్ష్మీనరసింహ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. అర్చకులు అందించిన స్వామి వారి ప్రసాదం పులిహోర, చక్కెర పొంగలిని ముఖ్యమంత్రి స్వీకరించారు. ♦అనంతరం దేవస్థానంలో సుదర్శన హోమం జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, నూతన రథం తయారీకి సంబంధించిన ఫొటోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిలకించారు. కొత్త రథం తయారీలో వినియోగించిన బస్తర్ టేకు సేకరణ మొదలు.. చివరలో సంప్రోక్షణ ప్రక్రియ వరకు ఆయా దశలకు సంబంధించిన ఫొటోలను ఆసక్తిగా వీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన రథం తయారీని ప్రశంసించారు. ♦అనంతరం ఆలయానికి తూర్పు వైపున ఉన్న రాజగోపురం వద్ద నుంచి ఉన్న స్వామి వారి 38 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను దేవదాయ శాఖ కమిషనర్ అర్జున్‌రావు ముఖ్యమంత్రికి వివరించారు. హారతి తీసుకుని నమస్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి పసుపు, కుంకుమ పెట్టి.. కొబ్బరి కాయ కొట్టి.. ♦స్వామి సన్నిధి నుంచి పశ్చిమ రాజగోపురం ద్వారా సీఎం.. రథం వద్దకు చేరుకున్నారు. స్వయంగా పసుపు, కుంకుమలతో నూతన రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కొబ్బరి కాయ కొట్టారు. ఇతర భక్తులతో కలిసి రథాన్ని కొద్ది దూరం లాగారు. అనంతరం ఆలయానికి నలువైపులా ఉన్న భక్తులకు నమస్కరిస్తూ ముందుకు కదిలారు. ♦ఈ కార్యక్రమంలో సీఎం వెంట దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోష్, వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నృసింహుని రథానికి పూలదండ వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చదవండి: (మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..) (కోనసీమలో పల్లెపోరు) -
భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అవకాశాల దృష్ట్యా భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణకు వస్తారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆరేళ్లలో భారతదేశానికి హైదరాబాద్ నూతన టెక్‌హబ్‌గా మారిందని, ఐటీ కార్యకలాపాల తీరుతెన్నులు కూడా మారిపోయాయని చెప్పారు. హైదరాబాద్ ప్రీమియర్ ఐటీ హబ్‌లోని నాలెడ్జ్ సిటీ డల్లాస్ సెంటర్లో నైట్ ఫ్రాంక్ ఇండియా నూతన కార్యాలయాన్ని కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. నగరంలో ఇటీవల మౌలిక వసతులు గణనీయంగా వృద్ధి చెందాయని అన్నారు. కరోనా వల్ల అనిశ్చితి ఏర్పడినా ఐటీ రంగ కార్యకలాపాలతో ముడిపడిన హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ మార్కెటింగ్‌కు డిమాండ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ రియల్ ఎస్టేట్ రంగం పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, డేటా సెంటర్స్, వేర్ హౌసెస్ రంగాలు ఊపందుకుంటున్నాయని చెప్పారు. కొన్నేళ్లుగా హైదరాబాద్ దేశంలోనే ముఖ్యమైన బిజినెస్ హబ్‌గా అవతరించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజల్ అన్నారు. ఐటీ రంగంతోపాటు ఇతర రంగాల ఆర్థిక వ్యవస్థలకు హైదరాబాద్ ఆధునిక బిజినెస్ క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటోందని నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలసి ఫ్లాగ్షిప్ అధ్యయన నివేదిక ‘డబ్ల్యూఎఫ్‌హెచ్– వర్క్ ఫ్రమ్ హైదరాబాద్’ నివేదికను కేటీఆర్ ఆవిష్కరించారు. డబ్ల్యూఎఫ్‌హెచ్ నివేదికలోని ముఖ్యాంశాలు హైదరాబాద్ వాణిజ్య, రియల్ ఎస్టేట్ మార్కెట్ 2014–2019 మధ్యకాలంలో లావాదేవీలపరంగా 172 శాతం వృద్ధిరేటు సాధించింది. వాణిజ్య మార్కెట్పరంగా 2020 మూడో త్రైమాసికానికి 2 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేసింది. పదేళ్లలో నివాసధరలు 5.3 శాతం వృద్ధిరేటుతో పెరుగుతూ కోవిడ్ సమయంలోనూ అద్దెలు స్థిరంగా ఉన్నాయి. అనిశ్చిత మార్కెట్, అమ్మకాలు తక్కువగా ఉన్నా నివాసధరలు తగ్గని రెండు నగరాల్లో బెంగళూరు సరసన హైదరాబాద్ నిలిచింది. గత ఐదేళ్లలో కార్పొరేట్ కార్యకలాపాల వృద్ధితోపాటు వార్షిక ఆఫీస్ స్పేస్ డిమాండ్ పరంగా 2014లో 6వ స్థానంలో ఉండగా, 2019లో 2వ స్థానానికి చేరింది. దేశీయ విమాన ప్రయాణాల వృద్ధిరేటు 2014–15లో 5.5 శాతం కాగా 2019–20 నాటికి 6.4 శాతానికి పెరిగింది. -
నిజామాబాద్‌లో హెబ్బా, పాయల్ సందడి ఫొటోలు
-
దేవాదాయ భూముల సమస్య పరిష్కరించండి: హరీశ్
సాక్షి, మెదక్: జిల్లాలోని దంతాన్‌పల్లిలో ఉన్నదేవాదాయ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ ధర్మారెడ్డిని ఆదేశించారు. మంత్రి శనివారం దంతాన్‌పల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం గుండ్లపల్లిలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిచారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాకు పీఎమ్‌జీ రోడ్లకు రూ.112 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడతలో భాగంగా రూ.13 కోట్లు, రెండో విడతలో రూ.10 కోట్లు మంజూరు అయినటట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. (తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్ సీరియస్) -
విలువలతో కూడిన విద్య అవసరం
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు నాణ్యమైన విద్యనందించడం ఎంత అవసరమో, విలువలతో కూడిన విద్యను అందించడం కూడా అంతే అవసరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. శనివారం తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యం లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎడ్యుకేషన్ ఎక్స్ పో–2019ను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరమో ట్రస్మా చాటిచెప్పిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, ప్లాస్టిక్ రహిత సమాజం పట్ల అవగాహన, మొక్కల పెంపకం, సమయ పాలన నేర్పాలని వీటిని విద్యాలయాల నుంచే పిల్లలకు దేశ చట్టాలు, విలువలు నేర్పించాలన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పేదల గృహాలకు డెవలపర్లు సహకరించాలి రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో ప్రైవేట్ డెవలపర్లూ భాగస్వాములు కావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. పేదలకు సొంతింటి కలను తీర్చడాన్ని ప్రైవేట్ బిల్డర్లు సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్మించే పేదల గృహాలను వేగంగా పూర్తి చేయడంలో సహకరించాలని కోరారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన 2వ క్రియేట్ అవార్డ్స్–2019 ప్రదానోత్సవంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. విద్యుత్, నీటి వినియోగం ఎక్కువగా అవసరం లేని గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణాలపై డెవలపర్లు దృష్టి సారించాలన్నారు. -
దెబ్బ తగలని పార్క్
గచ్చిబౌలి: చిన్నారులు చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోతూ ఆడిపాడుతుంటే తల్లిదండ్రులందరికీ ఆనందమే.. అయితే కొంచెం భయం కూడా! ఎక్కడ పట్టుతప్పి పడిపోతారో.. దెబ్బలు తగిలించుకుంటారోనని.. చిల్డ్రన్స్ ప్లే ఏరియాకు వెళ్తే అటువంటి భయం అవసరం లేదు. పిల్లలను స్వేచ్ఛగా, సీతాకోకచిలుకల్లా వదిలేయొచ్చు. నిశ్చింతగా కూర్చుని వారి ఆటలను, ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఏమిటీ ప్లే ఏరియా? ఎక్కడుంది? జారుడుబండ, ఊయల.. సాధారణంగా పిల్లల పార్కుల్లో ఆటల పరికరాలంటే ఇవే. కానీ, గచ్చిబౌలి డాగ్ పార్కు ఆవరణలో ఏర్పాటైన చిల్డ్రన్స్ ప్లే ఏరియా కాస్త డిఫరెంట్. ఇక్కడ ఆనందాన్నిచ్చే ఆట వస్తువులే కాదు, అటు వ్యాయామాన్ని, ఇటు నైపుణ్యాన్ని పెంచే యాక్టివిటీస్ ఎన్నో.. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, చిన్నారుల భద్రత కోసం ఆట వస్తువుల చుట్టూ అడుగు భాగంలో ఒక రకమైన సింథటిక్ రబ్బర్‌గా పిలిచే ఈపీడీఎం (ఇథలీన్ ప్రొపలీన్ డయనీ మానిమర్)ను అమర్చారు. కాబట్టి పిల్లలు ఆడుకుంటూ పడిపోయినా గాయపడరు. రూ.40 లక్షల వ్యయంతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ పిల్లల ప్లే ఏరియాను రెండు కేటగిరీలుగా విభజించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు చిన్న ఆట వస్తువులు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి పెద్ద ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. దేశంలోనే ఇటువంటి పిల్లల పార్కు ఇదే మొదటిదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీనిని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు. ఓపెన్ జిమ్.. సోలార్ లైటింగ్ ►ఈ ప్లే ఏరియాలో చిన్నా, పెద్దా గుట్టలు, స్టెప్పింగ్ స్టోన్స్, మల్టీప్లే ఎక్విప్మెంట్లు ఎన్నో ఉన్నాయి. ఆపిల్, క్యాప్సికమ్, కీరా, టమాటా వంటి పండ్లు, కూరగాయలు, పురుగులు వంటి బొమ్మలు ఆకట్టుకుంటాయి. ►పార్కులో రాత్రి వేళ లైటింగ్ కోసం సోలార్ ఎల్ఈడీ లైట్లను అమర్చారు. పార్క్‌లో నాలుగు వైపులా ఉన్న లైట్లు.. విద్యుత్ లేకున్నా 6 గంటల పాటు బ్యాకప్‌తో వెలుగులు విరజిమ్ముతాయి. పిల్లల ఆనందానికి అంతరాయం కలగదు. ►ఈ పిల్లల పార్కు డాగ్ పార్కులో భాగంగా ఉంది. డాగ్ పార్కుకు పెట్స్‌ను తీసుకొచ్చే పెద్దల కాలక్షేపానికి మూడుచోట్ల ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న వారు ఇక్కడ అప్పర్ బాడీ, కార్డియో, సైక్లింగ్, స్టెప్పర్ వంటి కసరత్తులు చేయొచ్చు. ►సెల్ఫీ ఫొటో ఫ్రేమ్ ప్రత్యేకాకర్షణ. దీనివద్ద పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సెల్ఫీ దిగొచ్చు. ►ఇక్కడున్న బ్లాక్ బోర్డుపై పిల్లలు తాము పార్క్‌ను విజిట్ చేసినట్టు సంతకం చేస్తూ.. పొందిన అనుభూతి గురించి రాయవచ్చు. దేశంలోనే మొదటిది.. ఈపీడీఎంతో ఈ పిల్లల పార్కును తీర్చిదిద్దాం. ఇక్కడ చిన్నారులు చక్కగా ఆడుకోవచ్చు. ఆడుకుంటూ కిందపడినా దెబ్బలు తగలవు. దేశంలోనే ఇటువంటి పార్కు మరెక్కడా లేదు. పెద్దల కోసం ఓపెన్ జిమ్ కూడా ఉంది. – హరిచందన దాసరి, జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ కమిషనర్ ఆటలతో పాటే వ్యాయామం, నైపుణ్యం హిల్ మౌండ్: ఇదో చిన్న గుట్ట. దీనిపైకెక్కి.. కిందికి జారవచ్చు. గుట్టలు ఎక్కిన అనుభూతి కలుగుతుంది. పిల్లల్లో క్లైంబింగ్ స్కిల్స్ పెరుగుతాయి. పిరమిడ్: త్రిభుజాకారంలో ఉండే దీని పైకెక్కి, వెనుక వైపు ఉన్న మెట్ల ద్వారా కిందికి దిగవచ్చు. మంకీ బార్స్: కోతులు చాలా బ్యాలెన్స్డ్గా చెట్లపై వేలాడుతుంటాయి. పిల్లల్లోనూ ఈ నైపుణ్యం పెంచేందుకు మంకీ బార్స్ ఏర్పాటు చేశారు. వీటిపై నిలబడి ఊగడం ద్వారా పిల్లలు పట్టు నిలుపుకునే శక్తిని అలవర్చుకుంటారు. టన్నెల్: ప్లాస్టిక్ గడ్డితో పచ్చగా తీర్చిదిద్దిన సిమెంట్ పైపు ఇది. చిన్నారులు పైపు లోపల నుంచి నడుచుకుంటూ బయటకు రావచ్చు. చిన్న ర్యాంపుపై నుంచి ఈ సిమెంట్ టన్నెల్‌ను ఎక్కేందుకూ ప్రయత్నించవచ్చు. ట్రాంపోలిన్: చిన్నారులు ఎగరడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లే ఏరియాలో రెండు ట్రాంపోలిన్లు ఉన్నాయి. వీటిపై నిల్చుని అప్ అండ్ డౌన్స్ ఎగరొచ్చు. ఈ ప్రక్రియ పిల్లల మోకాళ్లను బలంగా చేస్తుంది. స్నేక్ మౌండ్: ఇది ఎత్తుగా ఉండే పాము బొమ్మ. బ్యాలెన్స్ చేసుకుంటూ దీనిపై చిన్నారులు నడవాల్సి ఉంటుంది. ఇదో మంచి వ్యాయామం. -
ప్రకృతి వైద్యంతోనే ఆరోగ్యం
వెంగళరావునగర్: భారతీయ వైద్యాన్ని పరిరక్షించడానికి, దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ తెలిపారు. హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని యునానీ కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలో (యునా నీ ఆసుపత్రి) ఇటీవల ఆధునీకరించిన భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం యునానీ ఆస్పత్రి హాల్లో జరిగిన సమావేశంలో యశోనాయక్ మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యంతోనే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. యునానీ, ఆయుర్వేదం, సిద్ధ, యోగ, ప్రకృతి చికిత్స తదితర విధానాల ద్వారా దీర్ఘకాలిక రోగాలు సైతం మాయం అవుతాయని చెప్పారు. దీని ని ప్రతి ఒక్కరూ విశ్వసించాలన్నారు. యునా నీ, ఆయుర్వేదం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మరోసారి రోగం తిరిగి రాకుండా పూర్తి స్థాయిలో నయం అవుతుందని తెలిపారు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం మన భారతీయ వైద్యాన్ని క్షేత్రస్థాయి నుంచి ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మందులను తయారు చేయి స్తున్నామని చెప్పారు. ఇందుకోసం కోట్లాది రూపాయల బడ్జెట్‌ను ప్రధాని మోదీ కేటాయిస్తున్నారన్నారు. దేశంలో 50 ప్రాంతాల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటికి నిరంతరం నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించాలి: కిషన్‌రెడ్డి యునానీ మీద మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రకృతి వైద్యం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని, అయితే ఎలాంటి ప్రమా దం లేదని వారికి మనం నిరూపించి అనుమానాలను నివృత్తి చేయాలని వైద్యులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ అడిషనల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ పాఠక్, యునానీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మునావర్ హుస్సేన్ ఖజ్మీలతో పాటు ఆయుర్వేద, సిద్ధ, ప్రకృతి వైద్యాలయం, యోగా తదితర ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. భవన సముదాయాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు యశోనాయక్, కిషన్‌రెడ్డి -
అమీర్పూర్ ఆడపడుచులకు ఈరోజే నిజమైన పండుగ : హారీష్ రావు
-
యువతకు ఉపాధే లక్ష్యం
సాక్షి, యాదాద్రి: యువతకు ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో టీఎస్ఐఐసీ–టీఐఎఫ్–ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సహచర మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడారు. రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాక్–టు–వర్క్ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలను సృష్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా? అని ఎగ తాళి చేసిన వాళ్లే ఇవాళ రాష్ట్ర విధానాలను అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ పరిశ్రమల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని చెప్పారు. ‘మాది తెలంగాణ’అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చామన్నారు. పక్షం రోజుల్లోనే అనుమతులు... సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని, 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్ అఫ్రూవల్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలకు అనుమతులివ్వడంలో జాప్యం చేసిన అధికారులకు రోజుకు రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెం ట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. పెద్ద పరిశ్రమల్లో యాంత్రీ కరణ ఎక్కువగా ఉండి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయని, ఎంఎస్ఎంఈ పరిశ్రమల్లోనే 70 శాతం ఉద్యోగాలు వస్తాయన్నారు. భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరణ... గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ తెలిపారు. 440 ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసినా మరింత స్థలం కావాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారని, పార్క్ విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు. గ్రీన్ ఇండస్ట్రీకి మాత్రమే ఇందులో పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించుకున్నామని, పెరిగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర 132 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభిస్తామన్నారు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌ను, సంగారెడ్డి జిల్లా లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ పార్క్, మైక్రో ప్రాసెసింగ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఏ పరిశ్రమ ఏర్పాటైన మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పా రు. చౌటుప్పల్ ప్రాంతంలో 40 కాలుష్యకారక పరిశ్రమలు పనిచేస్తున్నాయన్నారు. కాలుష్య నివారణకు ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. మరో 3 చోట్లా ఇండస్ట్రియల్ పార్క్‌లు... నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు. ఖాయిలా పరిశ్రమలను ఆదుకోవడానికి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్‌ను తీసుకురానున్నట్లు వివరించారు. పార్క్‌కు భూములిచ్చిన వారికి కుటుంబానికో ఉద్యోగమివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10 ఎకరాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాష్ట్రానికి అన్నీ చిన్న పరిశ్రమలే వస్తున్నాయని, భారీ పరిశ్రమలను తీసుకురావాల్సిన అవ సరం ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. స్థానిక యువతకు ప్రాధాన్యత: మంత్రి జగదీశ్‌రెడ్డి మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దేశానికే ఆదర్శంగా ఉంటుందని, ఇందులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యతిస్తా మని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ తన ప్రతిభతో రాష్ట్రాన్ని పరిశ్రమలు, ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చివేశారన్నారు. -
గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానం!
సాక్షి, అమరావతి: గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుని కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల దాహార్తి తీర్చి రాష్ట్రాన్ని కరువనేది ఎరుగని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానానికి డిసెంబర్ 26వ తేదీన సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆలోగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక, అంచనాలు (ఎస్టిమేట్లు) రూపొందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నదుల అనుసంధానం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. గోదావరి–పెన్నా అనుసంధానంపై వ్యాప్కోస్ నివేదికను తుంగలో తొక్కిన టీడీపీ సర్కారు ఎన్నికల ముందు కమీషన్ల కోసం చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టుకు అందించాల్సిన నీటినే నాగార్జునసాగర్ కుడి కాలువకు తరలించే పనులను ‘గోదావరి–పెన్నా’ అనుసంధానం తొలిదశ కింద రూ.6,020 కోట్లతో చేపట్టింది. పర్యావరణ, హైడ్రలాజికల్ తదితర అనుమతులు లేకుండా చేపట్టిన ఈ పనులను రద్దు చేయాలని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. గోదావరి వరద జలాలను రోజుకు కనీసం నాలుగు టీఎంసీల చొప్పున కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాలకు తరలించి మూడు నదుల అనుసంధానం పనులను చేపట్టాలని జలవనరులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. సమగ్ర డీపీఆర్‌పై కసరత్తు.. గత సర్కారు హయాంలో రూ.8.59 కోట్లతో తయారు చేసిన డీపీఆర్ అసమగ్రంగా ఉన్నందున గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానంపై తాజా ప్రతిపాదనల మేరకు గతంలో చెల్లించిన బిల్లులతోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక అందజేయాలని వ్యాప్కోస్ను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు నాటికి డీపీఆర్ ఇవ్వాలని నిర్దేశించారు. దీని ఆధారంగా నవంబర్ 15 నాటికి పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్లు, పరిపాలన అనుమతులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వెంటనే టెండర్లు పిలిచి డిసెంబర్ 15 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించనున్నారు. డిసెంబర్ 26న గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధానం పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. -
దళితుల అభివృద్ధికి పెద్దపీట: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: అంబేద్కర్ మార్గంలో పయనిస్తూ.. దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. అంబ్కేదర్ ఏలూరు నగరాన్ని సందర్శించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వ్రిగహాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించే దిశగా నామినేషన్ పద్దతిలో 50 శాతం పనులు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ పేరు పెట్టాలనే దళితన నాయకుల విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా, మాజీ ఎంపీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రారంభించిన ప్రధాని
-
నర్సాపురం ఆనకట్టపైన టీడీపీ కనికట్టు
-
సంగారెడ్డిలో ఇంటింటికీ భగీరథ నల్లాలు ఏర్పాటు
-
లింగాపురంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్
-
గుమ్మలూరులో వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ
-
లాక్మీ సంస్థ 29వ ఫ్రాంచైజీ సెలూన్
-
ఆర్ట్ కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది
-
త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ
-
త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ
వడోదర(గుజరాత్): వడోదర ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానయాన రంగం అభివృద్ధి కోసం కొత్త పాలసీ తీసుకు వచ్చామన్నారు. కేరళలోని కొచ్చి, గుజరాత్‌లోని వడోదరలో గ్రీన్ ఎయిర్ పోర్ట్‌లు పర్యావరణ అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎంతో అధునికత వస్తోందని, రైళ్లలో కొత్త సాంకేతికత తీసుకొస్తామని చెప్పారు. త్వరలో వడోదరలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. -
చీరాలలో సినీతార సమంత సందడి
-
ఐసీయూని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రికి మెరుగైన పరికరాల కోసం రూ.16కోట్లు విడుదల చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయన జడ్చర్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. -
ఒంగోలులో PMKVY ట్రైనింగ్ సెంటర్
-
’ఏపీని నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతా’
-
మోడల్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి
నల్లగొండ : నల్లగొండ జిల్లా వేములపల్లిలో నూతనంగా నిర్మించిన ఆదర్శ పాఠశాల హాస్టల్ భవనాన్ని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి జగదీష్‌రెడ్డి మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని పార్టీ నాయకులు మిర్యాలగూడ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు తేరా చెన్నపురెడ్డి గ్రామ శివారులో వేచి చూస్తున్నారు. కానీ మంత్రి వాహనాన్ని అక్కడ ఆపకుండా.. నేరుగా హాస్టల్ భవనం వద్దకు చేరుకుంది. దాంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా... మంత్రికి అత్యవసర పనులు ఉండటంతోనే.. ఎక్కువ సమయం కేటాయించలేక పోయారని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను సముదాయించినట్లు సమాచారం. -
విశాఖలో తమన్నా,కాజల్ సందడి
-
సైకిల్ తొక్కండి..లేదా లావైపోతారు:మహేశ్
-
సాక్షి'లివ్ వెల్ ఎక్స్పో'ను ప్రారంభించిన మంత్రి
-
టెక్సాస్‌లో హనుమాన్ మందరం
టెక్సాస్(యూఎస్ఏ):మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా టెక్సాస్‌లోని ఫ్రిస్కో ప్రాంతంలో కార్యసిధ్ధి హనుమాన్ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూఎస్ఏలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సువిశాల ప్రాంతంలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు జూలై 18నుంచి జూలై 23 వరకు ఆరు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఇక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆగష్టు 30 వరకు మొత్తం 40 రోజుల పాటూ కొనసాగనున్నాయి. గర్భగుడిలో ఆకు పచ్చ రంగుతో ఉండే హనుమంతుడి విగ్రహం ఎంతో అందంగా మరెక్కడా లేని విధంగా రూపొందించారు. గర్భగుడికి నాలుగు వైపులా మరో నాలుగు దేవాలయాలను నిర్మించారు. దేవాలయానికి వచ్చే భక్తుల కోసం.., ప్రార్ధనా మందిరం, ఉచిత వైద్య శిబిరాలు, ఆదివారం పాటశాలలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రదేశం, పుస్తకాల ప్రదర్శన శాలలు, కమ్యూనిటీ సేవల కోసం ఖాళీ ప్రదేశం ఇంకా మరెన్నో ప్రత్యేకతలతో ఈ మందిరాన్ని నిర్మించారు. ఎన్నో దేశాల్లో భారీ ఆంజనేయ, కుమార స్వామి (సుబ్రమణ్యస్వామి) విగ్రహాలను స్థాపించి హిందుమత పటిష్టానికి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎంతగానో కృషి చేశారు. ధర్మం, భక్తి, భజన, కీర్తన వంటి సంప్రదాయాలు స్వామీజీ బోధించే మార్గాలలో ప్రధానమైనవి. సంగీతం ద్వారా రోగాలను నయం చేయవచ్చునని స్వామీజీ బోధిస్తారు. -
సేవల్లో మరో రెయిన్బో హాస్పిటల్
-
'లాజిస్టిక్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం'
-
'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మాటలే తప్ప చేతల్లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని పాలించారని అన్నారు. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన సాగించారని ఆమె గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను బతికించుకుందామని... పార్టీని అందరం కలిసి ముందు తీసుకెళ్తామని వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ... ప్రతి నిమిషం ప్రజలకు ఏం చేయాలన్న తపనే వైఎస్ఆర్లో ఉండేదని తెలిపారు. ప్రతి ఒక్కరికి సాయపడాలన్నదే వైఎస్ఆర్ సంకల్పమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన తపించారని చెప్పారు. వైఎస్ఆర్కు కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్న తేడాల్లేవని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం మన ప్రభుత్వమని ప్రజలందరూ భావించేలా కృషి చేశారని వైఎస్ విజయమ్మ తెలిపారు. -
GMR బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించిన కెసిఆర్
-
అబ్బురపరుస్తున్న జివికె ముంబాయ్ టెర్నినల్-2
-
తమిళనాడు ప్రజారవాణాలోకి మినీ బస్సులు