
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు.
బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం జగన్
అనంతరం సాంప్రదాయ పంచకట్టుతో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్.. బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి:
దుష్ప్రచారమే టీడీపీ అజెండా
Comments
Please login to add a commentAdd a comment