సాక్షి, ఏలూరు: అంబేద్కర్ మార్గంలో పయనిస్తూ.. దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. అంబ్కేదర్ ఏలూరు నగరాన్ని సందర్శించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వ్రిగహాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించే దిశగా నామినేషన్ పద్దతిలో 50 శాతం పనులు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ పేరు పెట్టాలనే దళితన నాయకుల విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా, మాజీ ఎంపీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment