సాక్షి,గుంటూరు: విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత అంబటిరాంబాబు అన్నారు. ఈ విషయమై అంబటి శుక్రవారం(ఆగస్టు9) మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక దాడులు జరిగాయి.
ఇప్పటివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహాలపై, వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై టీడీపీ నేతలకు దాడులకు పాల్పడ్డారు. తాజాగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహంపైనే దాడికి పాల్పడ్డారు. దేశం మొత్తం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’అని మండిపడ్డారు.
బాబు, లోకేష్‌ల ఆధ్వర్యంలోనే దాడి.. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి చేయడమే. రాష్ట్రంలో లాఅండ్‌ఆర్డర్ పనిచేయడం లేదు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆధ్వర్యంలోనే విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం పై దాడి జరిగింది. అంబేద్కర్ స్మృతివనంపై కుట్ర ప్రకారమే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడిలో టీడీపీకి ప్రమేయం లేకపోతే వెంటనే అంబేద్కర్ స్మృతి వనంలో తొలగించిన వైఎస్‌జగన్ పేరును పున: ప్రతిష్టించాలి
దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి: వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు
యావత్తు దళిత జాతితో పాటు ప్రజాస్వామ్యవాదులంతా రాత్రి విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని ఖండించాలి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అప్పటివరకు పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఏ ఒక్కరికి భరోసా లేదు. యావత్తు ప్రజానీకం భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు.
దాడుల పర్వం కొనసాగుతోంది: గుంటూరు తూర్పు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం కేవలం దాడులకే పరిమితమయింది. సీఎం చంద్రబాబు అభివృద్ధిలో పోటీపడాలి కాని విధ్వంసాలతో పరిపాలన చేయడం మంచి విధానం కాదు.
Comments
Please login to add a commentAdd a comment