West gadavari
-
వైరల్: కోడిపందాల్లో లేడీ బౌన్సర్లు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఇటీవల కాలంలో బౌన్సర్ల ఏర్పాటు సాధారణంగా మారింది. అయితే, తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేశారు. పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్ల(Lady Bouncers)ను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూడెంలో కోడిపందాలు(Cockfighting) జోరుగా సాగుతుండగా, రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా, సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు బరితెగించారు. భీమవరంలో పందెం బరి వద్ద మూడు రోజుల నుంచి క్యాసినో నిర్వహిస్తున్నారు. సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా షెడ్లు వేసి జూద క్రీడలను నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లును ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను కూడా కూటమి నేతలు రప్పించారు. పోలీసులు మాత్రం అటువైపు తొంగిచూడటం లేదు. యథేచ్ఛగా కాసులు వేట సాగిస్తూ సామాన్యులు జేబులు గుల్ల చేస్తున్నారు.మరో వైపు, కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది.కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 18వరోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననాయకుడికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నుదిటిపై గాయం మానకపోయినా.. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం జగన్ తన బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
లంక సిస్టర్స్.. ఇద్దరూ డాక్టర్స్..!
పెనుగొండ(పశ్చిమగోదావరి): ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన గొర్రె వెంకటేశ్వరరావు కుమార్తెలు సాయి తేజస్వి, ఐశ్వర్య ఈ ఘనత సాధించారు. ఇప్పటికే బీడీఎస్ పూర్తిచేసిన సాయితేజస్వి, నీట్ (ఎండీఎస్)లో జాతీయస్థాయిలో 1048 ర్యాంకు సాధించింది. చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? అక్క స్ఫూర్తితో ఐశ్వర్య కూడా ఈ ఏడాది నీట్లో జాతీయస్థాయిలో 7395 ర్యాంకు సాధించింది. వెంకటేశ్వరరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి డాక్టర్లుగా అవకాశం రావడంపై కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
Andhra Pradesh: మరో రెండ్రోజులు వర్షాలే
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతం ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ తీవ్రరూపం దాల్చకపోయినా అల్పపీడనంగానే 4, 5 రోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం అల్లూరి జిల్లాలో 1.2 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు మండలం బోరంగులలో 5.3 సెం.మీ. అత్యధిక వర్షం కురిసింది. అరకు లోయ, పాడేరు, చింతూరు, హుకుంపేటలలో 3 నుంచి 3.5 సెం.మీ. వర్షం పడింది. వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నస్రత్ మండ్రూప్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268), విజయవాడ–బిట్రగుంట–విజయవాడ (07978/07977) రైళ్లు ఈ నెల 11 నుంచి 13 వరకు పూర్తిగా రద్దు చేశారు. కాకినాడ పోర్టు–విజయవాడ (17258) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరి, విజయవాడ వరకు నడుస్తుంది. విజయవాడ–కాకినాడ పోర్టు (17257) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 11 నుంచి 13 వరకు విజయవాడలో బయలుదేరి, రాజమండ్రి వరకు నడుస్తుంది. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 1800 425 3077 కాకినాడ ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 0884 2368100 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్: 9606363327 -
ఉసిరి లడ్డూ కావాలా నాయనా!
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): ఉసిరి లడ్డూ కావాలా నాయనా... ఉసిరి క్యాండీతో ఎంజాయ్ చెయండి అంటున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషివిజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన కొందరు ఔత్సాహికులు. రాతి ఉసిరి అంటే పచ్చడి మాత్రమే అందరికి తెలుసు. కాలక్షేపానికి ఒకట్రెండు కాయలు తినేందుకో, వైద్యానికో వినియోగిస్తారు. ఇప్పుడు ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి లడ్డూలు, ఆమ్లా మురబ్బా, ఆమ్లా హనీ, చట్పటా (కాలక్షేపానికి తినడానికి)తయారు చేస్తున్నారు. సహజసిద్ధమైన ఉసిరి పులుపు రుచికి తేనెను చేర్చి కొత్త రుచులు తీసుకొస్తున్నారు. ఉసిరిని హనీ లడ్డూగా మారుస్తున్నారు. ఆర్యతో కొత్త అడుగు : యువతను వ్యవసాయం వైపు ఆకర్షించి వారిని ఆ రంగంలో నిలదొక్కుకొనేందుకు తీసుకొచ్చిన పథకం ఆర్య(అట్రాకింగ్ అండ్ రీటెనియింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్). ఇందులో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, సమీకృత వ్యవసాయం ఉన్నాయి. ఫ్రూట్ అండ్ విజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకాన్ని సమ్మిళితం చేసిన ప్రయోగానికి ప్రతిరూపమే ఉసిరి లడ్డూలు, మురబ్బాలు. కృషి విజ్ఞాన కేంద్రంలోని శిక్షణను అందిపుచ్చుకున్న పెదతాడేపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు మధుశ్రీ ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి యూనిట్‌ను ప్రారంభించారు. దీంతో ఉసిరి లడ్డూలు ఇతర ఉత్పత్తులు మార్కెట్లోకి గత 6 నెలలుగా వస్తున్నాయి. ఉసిరి లడ్డూ తయారీ ఇలా.. ఉసిరి కాయలను తీసుకొని తేమ 20 శాతం ఉండేలా చూస్తారు. తేనెలో 72 నుంచి 80 వరకు బ్రిక్స్ (చక్కెర శాతం )ఉండేలా చూస్తారు. 72 గంటల పాటు తేనెలో ఉసిరి కాయలు నాననిచ్చి మాగపెడతారు. తర్వాత ఆరబెడతారు. ఇలా తయారయ్యిన ఉసిర లడ్డూలు ఏడాది పాడవకుండా ఉంటాయి. గ్రేడింగ్‌లో తీసేసిన కాయలతో ఆమ్లా మురబ్బా( తొనలు) తయారు చేస్తారు. ఉసిరి కాయలకు ఉప్పును చేర్చి చట్పటా తయారు చేస్తారు. పరిశ్రమను మరింత విస్తరిస్తాం ఉసిరితో ఉత్పత్తులను తయారుచేసే విషయంపై ఐదుగురం శిక్షణ పొందాం. ఏడు నెలల క్రితం ఉత్పత్తులు ప్రారంభించాం. జిల్లాతో పాటు కర్నూలు, వైజాగ్, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకు ఉత్పత్తులు పంపించి వ్యాపారం చేస్తున్నాం. పరిశ్రమను అన్ని హంగులతో విస్తరించే యోచనలో ఉన్నాం. – గీతాంజలి, మధుశ్రీ ఆర్గానిక్స్, పెదతాడేపల్లి -
విషాదం నింపిన చేప సరదా.. బాలుడి మృతి, అనుమానాలు?
సాక్షి, పశ్చిమగోదావరి (ఉండి): అప్పటివరకూ తల్లి ఒడిలో ఆనందంగా గడిపిన పసివాడు నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడిచాడు. చిన్నపాటి చేపను చూపిస్తూ తండ్రి ఆడిస్తుండగా అది జారి బాలుడి గొంతులో పడటంతో ఊపిరాడక మృత్యుఒడికి చేరాడు. గొరక చేప గొంతులో అడ్డుపడి తొమ్మిది నెలల బాలుడు మృతిచెందిన ఘటన చెరుకువాడలో చోటుచేసుకుంది. సోమవారం వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చెరుకువాడకు చెందిన తోలాపు నారాయణ (బాబి), సుధారాణి (ఉష) దంపతులు. వీరికి తొమ్మిది నెలల కుమారుడు నందకిశోర్ ఉన్నాడు. ఆదివారం సాయంత్రం వీరి ఇంటి పక్కన ఉంటున్న వ్యక్తి గాలం వేసి చేపలు పట్టుకొచ్చాడు. అతడి నుంచి నారాయణ ఐదు గొరక చేపలు తీసుకున్నాడు. అదే సమయంలో తల్లి సుధారాణి ఒడిలో ఆడుకుంటున్న బాలుడి వద్దకు ఓ చేపను తీసుకువచ్చాడు. చేపను చూపిస్తూ ఆడిస్తుండగా పొరపాటున అది జారి బాలుడి గొంతులో పడింది. దీంతో బాలుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. చేపను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆకివీడులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బా లుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఈ మేరకు సోమవారం ఉదయం బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్తే చంపాడంటూ ఆరోపణ తన బిడ్డ మృతికి భర్త నారాయణ కారణమంటూ సుధారాణి ఆరోపించింది. ఉండి పోలీస్‌స్టేషన్ వద్ద ఆమె మాట్లాడుతూ తనపై భర్తకు అనుమానం ఉందని, దీంతో పెళ్లయిన రెండేళ్ల లో చాలాసార్లు గొడవపడ్డాడని తెలిపింది. బిడ్డ పుట్టిన తొమ్మిది నెలలకు గాను మెట్టినింటికి తీసుకురాలేదని, ఈనెల 1వ తేదీన చెరుకువాడ తీసుకువచ్చాడని వివరించింది. రెండు రోజులుగా తనను వేధిస్తున్నాడని, ఆదివారం తన కాళ్ల పట్టీలు బలవంతంగా తీసుకువెళ్లి మద్యం తాగి వచ్చాడని బోరుమంది. బిడ్డ నోట్లో చేపను తనే పెట్టాడని, దీంతో తన కుమారుడు చనిపోయాడని కన్నీరుమున్నీరైంది. ఆమె బంధువులు పెదగాడి నాగభూషణశాస్త్రి, చించినాడ మల్లేశ్వరరావు, దుర్గాభవాని కూడా నారాయణపై ఆరోపణలు చేశారు. -
పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకఘట్టం ఆవిష్కృతం
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ ప్రాంతం అన్నివిధాలుగా సస్య శ్యామలం అవుతుందని వారి నమ్మకం. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి హాయాంలో పట్టాలెక్కిన పోలవరం ప్రాజెక్టు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం రాబోతుంది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదల కార్యక్రమానికి శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్ప్రోచ్ ఛానల్ గుండా స్పిల్ వేకు మళ్లించిన సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ అధికారులు చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, సీజీఎం రవీంద్రరెడ్డి, ఎజీఎం రాజేశ్, డీజీఎం శ్యామలరావు, మేనేజర్ మురళి పాల్గొన్నారు. గోదావరి డెల్టా సస్యశ్యామలం.. గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల చేయడం ద్వారా ఆ నీరు స్పిల్ వే.. రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు.. పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సస్య శ్యామలం చేయనుంది. సహజంగా గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు అందుతుంది. పోలవరం పూర్తయిన తరువాత స్పిల్ వే.. రివర్ స్లూయిజ్.. పవర్ హౌస్ డిశ్చార్జ్‌ల ద్వారా బ్యారేజ్‌ల నుంచి కాలువలకు చేరుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది. ఇకపై అప్రోచ్ ఛానెల్ ద్వారా నీటి విడుదల.. పోలవరం నిర్మాణంలో స్పిల్ వే తో పాటు మూడు గ్యాపులు (ఈసీఆర్ఎఫ్ 1,2,3)తో పాటు జల విద్యుత్ కేంద్రం, జల రవాణా పనులు కీలకమైనవి. ఇందులో ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా (వర్క్ మ్యానువల్, ప్రోటోకాల్) స్పిల్ వే పనిని మేఘా ఇంజనీరింగ్ ఛాలెంజ్‌గా తీసుకొని పూర్తి చేసింది. గోదావరి నీటిని అప్రోచ్ ఛానెల్ నుంచి దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదల కానుంది. దీంతో ఇక నుంచి ఏడాది పోడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలెట్ ఛానెల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు. 6.6 కిలోమీటర్ల మేర నది మళ్లింపు ఓ అద్భుతం.. గోదావరి నది నీటిని 6.6కిలోమీటర్ల మేరకు మళ్లించడం అంటే సాధారణ విషయం కాదు. ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన. దేశంలోనే రెండో పెద్ద నది అయిన గోదావరిపై ఇలాంటి ప్రయత్నం చేయడం సాహసమే. సహజంగా ప్రవహించే గోదావరిని పోలవరం వద్ద కుడి వైపునకు అంటే అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు మళ్లిస్తారు. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత కూడా అలాగే కొనసాగుతుంది. నది మధ్య భాగంలో పనులు.. నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) నిర్మించాలి. అందులో గ్యాప్-2 గా పిలిచే ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం) అతిపెద్దది. 50 లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునేలా దీనిని నిర్మిస్తారు. ఈ పని ప్రారంభం కావాలంటే నీటి ప్రవాహం నిలిపివేయాలి. అందుకోసం అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించి ఈ ఏడాది వచ్చే వరదల్లో కూడా ఈసీఆర్ఎఫ్ నిర్మాణ పనులు కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నది మళ్లింపు చేపట్టారు. వరదలను తట్టుకునేలా అప్రోచ్ ఛానెల్ నిర్మాణం.. అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ పొడవు 6.6 కిలోమీటర్లు ఉంది. ఇవి ప్రధాన నదికి కుడివైపున సమాంతరంగా నిర్మించారు. అప్రోచ్ ఛానెల్ స్పిల్ వే వైపు 2.4 కిలోమీటర్లు వరకు నిర్మించారు. స్పిల్ వే నుంచి స్పిల్ ఛానెల్ 3.1 కిలోమీటర్లు, స్పిల్ ఛానెల్ చివరి నుంచి మళ్లీ గోదావరి తన సహజసిద్ధ ప్రవాహంలోకి కలిసే విధంగా 1.1 కిలోమీటర్లు పైలెట్ ఛానెల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం మూడు రీచ్‌లుగా 2480 మీటర్ల పొడవు, 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఇటీవలనే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాపులను ప్రభుత్వ నిర్ణయానుసారం మేఘా ఇంజనీరింగ్ పూడ్చివేసింది. ఫలితంగా 30 లక్షల క్యుసెక్కుల వరకు వరద వచ్చినా నదిలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవాహం అప్రోచ్ ఛానెల్ మీదుగా వెళ్లిపోతుంది. రికార్డ్ స్థాయిలో పనులు చేపట్టిన ‘మేఘా’.. గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించే పనులను మేఘా ఇంజనీరింగ్ రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దాంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం కోటి 54 లక్షల 88వేల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికి కోటి 4లక్షల 88వేల ఘనపు మీటర్లు పూర్తయింది. ఇందుకోసం రేయింబవళ్లు యంత్రాంగం పని చేసింది. మొత్తం మట్టి పని 5 కోట్ల 92 లక్షల పనికి గాను 5 కోట్ల 24 లక్షల ఘనపు మీటర్ల మేర పూర్తయ్యింది. మొత్తం సిసి బ్లాకులు (స్పిల్ వే) 17 లక్షల ఘనపు మీటర్లు కాగా 15.17 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయ్యింది. హైడ్రాలిక్ గేట్లు.. ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్ వే గా త్రిగాడ్జెస్ జలాశయంకు పేరుంది. దీని కన్నా పోలవరం సామర్థ్యం మూడు లక్షల క్యుసెక్కులు అధికం. దీనిని తట్టుకునే విధంగా ప్రపంచంలోనే అతపెద్ద గేట్ల ఏర్పాటు పూర్తయింది. ఇందుకోసం 15.17 ఘనపు మీటర్ల కాంక్రీట్ పని పూర్తయ్యింది. గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అందులో భాగంగా 22 పవర్ ప్యాక్ లను 44 గేట్లకు అమర్చారు. 28 రేడియల్ గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో ఈ సీజన్లో వరద వచ్చినా విడుదల చేసే విధంగా 28 గేట్లను ఎత్తి ఉంచారు. చదవండి: YS Jagan: రాష్ట్రాభివృద్ధి సాకారానికి.. కావాలి.. మీ సహకారం పోలవరం పనులపై కేంద్రం ప్రశంస -
‘అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీని గెలిపించండి’
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏలూరు 2వ డివిజన్లో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఏలూరును ఎంతో అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఏలూరులో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏలూరు కార్పొరేషన్‌ను గెలుచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. విశాఖపట్నం: విశాఖలోని 90వ వార్డులో వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్‌ది సంక్షేమ ప్రభుత్వమని, విశాఖకు త్వరలో పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. భరత్‌నగర్‌లో ఇల్లు లేని 30 కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసానిచ్చారు. చదవండి: 'చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టే హక్కే లేదు' మళ్లీ చెంప చెళ్లుమనిపించిన బాలయ్య -
దారుణం: పసికందును పీక్కుతున్న కుక్క
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పొదలలో వదిలేయడంతో ఆ పసికందు మృతదేహాన్ని కుక్కలు రోడ్డుమీదకు ఈడ్చుకు వచ్చాయి. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గ్రామ మహిళా పోలీసు తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన ఐసీడీఎస్ సీడీపీఓ ఆశా రోహిణి సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో ఆ దగ్గర్లోనే పొదలలో ఎవరో గుర్తు తెలియని మహిళ ప్రసవం జరిగినట్లు గుర్తించారు. ప్రసవం జరిగిన ఆనవాళ్లను కనుగొన్నారు. పొలాల్లోనే ప్రసవించిన మహిళ పసికందును వదిలి వెళ్ళిపోవడంతో పసికందు మృతి చెందిందని తెలిసింది. పొదలో ఉన్న పసికందు మృతదేహాన్ని కుక్క నోటకరచుకొని వస్తుండగా స్థానికులు గమనించి విధించడంతో రోడ్డుపైనే పసికందు మృతదేహాన్ని కుక్క వదిలి వెళ్ళిపోయింది. వెంటనే స్థానికులు గ్రామ మహిళా కానిస్టేబుల్ ద్వారా పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటువంటి అవాంఛనీయ గర్భం ధరించిన మహిళలు ఐసీడీఎస్ అధికారులకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని పిల్లలను సంరక్షించి తామే వేరే వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. దయచేసి ఇలాంటి పాపపు పనులు చేయొద్దని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఆశా రోహిణి తెలియజేశారు. -
వైరల్: భీమవరం అల్లుడికి అరిటాకు భోజనాలు
సాక్షి, భీమవరం: సంక్రాంతి సందర్భంగా ఒకే కుటుంబంలోని సభ్యులు పెద్ద పెద్ద అరటి ఆకుల్లో వరుసగా కూర్చుని భోజనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన పంజా మాణిక్యాలరావు సోదరుల సంతానమంతా సంక్రాంతి పండుగను వేడుకగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కలవడంతో పండుగ రోజుల్లో ఉత్సాహంగా గడిపారు. దీనిలో భాగంగానే పెద్ద పెద్ద అరటి ఆకులు వేసుకుని అందరూ సహపంక్తి భోజనం చేస్తున్న ఫొటో వాట్సప్‌లో రావడంతో వాటికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చదవండి: అతిథిలా వచ్చిన నగల దొంగ దొరికాడు ఇప్పటికే భీమవరం పట్టణంలో కురిశేటి కాశీవిశ్వనాథం ఇంటిలో అల్లుడు నారాయణ అఖిల్‌కు 125 రకాల వంటలతో భోజనం పెట్టడం చర్చనీయాంశమైంది. ఒకే టేబుల్‌పై వెండి పళ్లెంలో వివిధ రకాల పిండి వంటలు, స్వీట్స్, కూరలు, ఐస్‌క్రీమ్ వంటివి వడ్డించారు. ఈ ఫొటోలకు కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పంజా వేమవరంలో అరటి ఆకులో సహపంక్తి భోజనం చేస్తున్న దృశ్యం -
జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు
సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అవార్డులు దక్కించుకుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్మెంట్, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని పేర్కొన్నారు. (చదవండి: ‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’) విశాఖ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ.. విశాఖ: అంతర్జాతీయ పోటీల్లో విశాఖ నగరం మూడో స్థానంలో నిలవడం శుభపరిణామం అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు.. ప్రజలు సహకరించటంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అన్ని పార్టీల ప్రజలు ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్నా.. సీఎం వైఎస్ జగన్ మాత్రం పేదల విషయంలో రాజీ పడలేదన్నారు. ఇళ్ల పట్టాలు తీసుకోబోతున్న వ్యక్తుల్లో టీడీపీ సానుభూతి పరులు కూడా ఉన్నారని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
మమ్మల్ని ఆదుకోండి
ఏలూరు (మెట్రో): ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినా.. సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేడ్కర్ కోరారు. కలెక్టరేట్లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, తానేటి వనితలను కలిసి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మాట్లాడుతూ రవీంద్రభారతి వంటి యాజమాన్యాలు జనవరి నెల నుంచి కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వలేదన్నారు. మిగతా యాజమాన్యాలు మార్చి, ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని వేధిస్తున్నారని, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి సగం జీతం మాత్రమే ఇస్తున్నారన్నారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని.. ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సమాజానికి సేవ చేస్తున్న సుమారు 5 లక్షల ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. విద్యాసంస్థలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులవల్ల సిబ్బందికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంత్రులను కోరారు. దీనిపై మంత్రి రంగనాథరాజు స్పందిస్తూ.. యాజమాన్యాలు ఈ సమయంలో సిబ్బందిని ఆదుకోవాలన్నారు. తమ విద్యా సంస్థల్లో సిబ్బందికి మే జీతాలు ఇచ్చామని.. మిగతా యాజమాన్యాలు కూడా స్పందించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరాల కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు జయ ప్రకాష్ , పట్టణ జనరల్ సెక్రటరీ దాసు, ఇతర ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు. -
కరోనా విధుల్లో ఉన్నా కేసులే
సాక్షి ప్రతినిధి, పశ్చిమ గోదావరి, ఏలూరు: కొవ్వూరు డివిజన్లో పనిచేస్తున్న పోలీసు అధికారి తీరుపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కొవ్వూరు పట్టణంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మునిసిపల్ సిబ్బందికి చెందిన మోటారు సైకిళ్లు ఆపి ఆన్లైన్లో ఫైన్లు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. గుర్తింపు కార్డులు, వెహికల్ పాసులు చూపినా.. ఆపి మరీ హెచ్చరికలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఒక ఏఎన్ఎం రెడ్‌జోన్ పరిధిలో శాంపిల్స్ సేకరణకు వెళ్తుండగా ఆపి ప్రశ్నించారు. విషయం చెప్పినా వినిపించుకోకుండా ఆమె వాహనానికి ఫైన్ వేశారు. మున్సిపల్ సిబ్బందికీ ఇదే సమస్య ఎదురైంది. ఇబ్బందులకు గురి చేస్తే బుధవారం నుంచి విధులకు రాలేమని మున్సిపల్ కమిషనర్ వద్ద వారు గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం వార్డు వలంటీర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వచ్చిన అభ్యర్థులకు సైతం చేదు అనుభవం ఎదురైంది. ధ్రువీకరణ పత్రాలు చూపినా పట్టించుకోకపోవడంతో సాయంత్రం వరకు వారు మున్సిపల్ కార్యాలయంలోనే ఉండిపోయారు. ఆ అధికారి తీరును కమిషనర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాగైతే మున్సిపాలిటీ తరఫున తాము కూడా సహాయ నిరాకరణ చేయాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆర్డీఓ రంగంలోకి దిగి సమస్యను సర్ధుబాటు చేశారు. -
మరో కొత్త అధ్యాయం
-
క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య చికిత్స : సీఎం జగన్
సాక్షి, ఏలూరు : పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తనకు ఎంతో సంతృప్తికరమైన పథకం ఆరోగ్యశ్రీ అని పేర్కొన్నారు. ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్ ప్రాజెక్టుకు సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఈ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. నూతన సంవత్సరంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన రెండో సంక్షేమ కార్యక్రమం ఆరోగ్య శ్రీ అని తెలిపారు (మొదటిది ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం). దీని ద్వారా రాష్ట్ర చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం ప్రకటించారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుతం 1059 రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని, ఆ సంఖ్యను 2059 రోగాలకు వర్తించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశామన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి క్యాన్సర్ రోగులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తామని సీఎం ప్రకటించారు. (నాడు వైఎస్సార్.... నేడు వైఎస్ జగన్) సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ ‘పాదయాత్రలో ప్రజల కష్టాలకు అతిదగ్గరగా చూశా. అప్పులు చేయకుండా వైద్యం ఎలా అందించాలో ఆలోచించా. దానిలో నుంచి పుట్టిందే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణ. ఏప్రిల్ నుంచి ప్రతినెల ఒక్కో జిల్లాలో 2029 వ్యాధులకు చికిత్స విస్తరణ జరుపుతాం. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నా. నాడు చెప్పిన మాట ప్రకారం రూ.వెయ్యి దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపచేస్తాం. రూ.ఐదు లక్షల ఆదాయంలోపు వారు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తాం. అర్హలైన వారందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 42 లక్షల కార్డులను పంపిణీ చేస్తాం. వాటికి క్యూఆర్ నెంబర్లు కూడా జారీచేస్తాం. సచివాలయాల ద్వారా గ్రామాల్లో కార్డులను పంపిణీ చేస్తాం. ప్రతి 350 ఇళ్లకు ఆశా వర్కర్‌ను అటాచ్ చేస్తాం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోపే ఇచ్చిన మాట నెలబెట్టుకున్నాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆరోగ్య నెట్‌వర్క్‌లో చేరుస్తాం. ఆపరేషన్ చేయించుకున్నాక విశ్రాంతి సమయంలో, రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5వేలు ఆర్థిక సహాయం చేస్తాం. పుట్టుకతో చెవుడు, మూగ ఉన్న పిల్లలకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులోకి తీసుకువస్తాం. ఏప్రిల్ నుంచి డబ్ల్యుహెచ్వో ప్రమాణాలతో మందుల పంపిణి చేస్తాం. డయాలాసిస్ రోగులకు రూ.10వేల పెన్షన్ అందిస్తాం. పక్షవాతం, తలసేమియా రోగులకు రూ.5 వేలు పెన్షన్ అందిస్తాం. ఆస్పత్రుల్లో పారిశుధ్య కార్మికులకు జీతం రూ. 8 వేల నుంచి రూ. 16వేలు పెంపుతున్నాం. నాడునేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. మర్చినాటికి 1056 కొత్త అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతాం. మే నెలాఖరుకల్లా ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు పోస్టులకు భర్తీ చేస్తాం. పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం నాలుగడుగులు ముందుచేస్తోంది. ఈనెల 9న అమ్మ ఒడి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మధ్యాహ్నా భోజనంలో పౌష్టికాహారాన్ని అందిస్తాం’ అని సీఎం జగన్ అన్నారు. -
జంగారెడ్డిగూడెంలో టీడీపీకి షాక్!
సాక్షి, జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మూడు వందల మంది కార్యకర్తలు గురువారం వైఎస్సార్ సీపీలోకి చేరారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు వందనపు సాయి బాలపద్మ, పొల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలకు ఆకర్షితులై వందలాదిగా వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఆరు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని పేర్కొన్నారు. ఎంతో మంది నాయకులు అవకాశాలు ఉంటేనే సేవ చేస్తారని.. కానీ సీఎం జగన్ అవకాశం కల్పించుకుని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపటినప్పటి నుండి రోజుకోక పథకం ప్రవేశపెడుతున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. మహిళల కోసం మద్యపాన నిషేధం తో పాటు, బీసీ మహిళలకు చేయూతనిచ్చే పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. జంగారెడ్డిగూడెం ను గ్రీన్ సిటిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం వంద పడకల ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. ఆరు కోట్ల రూపాయలతో డ్రైయిన్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే ఎలీజా పేర్కొన్నారు. -
అక్కడే హామీ.. అక్కడే అమలు
సాక్షి, ఏలూరు: ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, పేర్నినాని, కలెక్టర్ ముత్యాల రాజు ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు జిల్లా వాసుల ఎన్నో సంవత్సరాల కల అని.. ఆ కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. శుక్రవారం మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన అనంతరం ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకంలో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తారని వెల్లడించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. ఏలూరు బహిరంగ సభలో ఆటోడ్రైవర్లకు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఏలూరులోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. జిల్లాలో 13,062 మంది ఆటో, ట్యాక్సీ వాహనదారులకు రూ.10 వేల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందజేయనున్నారని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
‘ఇప్పటి దాకా విన్నాం..ఇక కళ్లారా చూస్తాం’
సాక్షి, భీమవరం: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేయబోతున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం భీమవరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. గ్రామ స్వరాజ్యం గురించి ఇప్పటిదాకా విన్నామని.. వైఎస్ జగన్ పాలనలో కళ్లారా చూడబోతున్నామన్నారు.దేశంలో మిగతా రాష్ట్ర్రాలు కూడా జగన్ నాయకత్వాన్ని అనుసరించే విధంగా ఏపీలో పాలన సాగుతోందన్నారు.మళ్లీ మన రాష్ట్ర్రం రాజన్న రాజ్యం చూస్తోందని తెలిపారు. -
దళితుల అభివృద్ధికి పెద్దపీట: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: అంబేద్కర్ మార్గంలో పయనిస్తూ.. దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. అంబ్కేదర్ ఏలూరు నగరాన్ని సందర్శించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వ్రిగహాన్ని డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర్రంలో దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించే దిశగా నామినేషన్ పద్దతిలో 50 శాతం పనులు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ పేరు పెట్టాలనే దళితన నాయకుల విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా, మాజీ ఎంపీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
తక్షణమే డెంగీ నివారణ చర్యలు చేపట్టండి
సాక్షి, పాలకొల్లు: డెంగీ జ్వరాలు వ్యాపించకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్యం, డెంగీ జ్వరాలపై అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో 11వ వార్డులో డెంగీ మరణాలు అధికంగా ఉన్నాయని.. నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో పాలకొల్లు, నరసాపురం, భీమవరం పట్టణాల్లో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మూడు, నాలుగు నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైన్లు గుర్రపు డెక్కతో నిండిపోయి మురుగు నీరు పారడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని.. వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో నియోజకవర్గ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ, చందక సత్తిబాబు పాల్గొన్నారు. -
వైఎంహెచ్ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: వైఎంహెచ్ఏ హాలు అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఏలూరు వైఎంహెచ్ఏ హాలులో గురువారం కేవీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు బహుకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవీఎస్ లాంటి వ్యక్తి ఏలూరులో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. దేశ విదేశాల్లో కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాందించిన కేవీఎస్‌ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ఉష గ్రూప్ సంస్థల ఛైర్మన్ డాక్టర్ వివి బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
పాలకొల్లులో మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, పాలకొల్లు: పోలీసుస్టేషన్లో అన్యాయంగా నిర్బంధించారంటూ ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చోటు చేసుకుంది. తన ఇంట్లో బంగారం చోరి జరిగిందని మడికి మేరిరత్నం అనే మహిళ పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భాగంగా ఆమెను స్టేషన్‌కు పిలిచిన సిఐ ఆంజనేయులు.. బంగారం రీకవరి చేస్తామని, కాకపోతే ఆ బంగారం ధరను తక్కువగా చూపించి మరో కేసు పెట్టాలని డిమాండ్ చేశారని బాధితురాలు తరపు బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా ఆమెను చేయి పట్టుకుని లాగి నిర్బధించారని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పాలకొల్లు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ ఆంజనేయులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేరిరత్నం బంధువులు డిమాండ్ చేస్తున్నారు. -
అవసరమైతే పల్లెనిద్ర: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మలేరియా,డెంగీ జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా వాటర్ ట్యాంకుల్లో క్లోరిన్ వేసి శుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల్లో అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ‘నాలుగైదు రోజుల్లో గ్రామాల్లో పర్యటిస్తానని..అవసరమైతే పల్లెనిద్ర’ కూడా చేస్తానని తెలిపారు. సీజనల్ వ్యాధులను నివారించడానికి రేపటి నుంచి మూడురోజుల పాటు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా..మందులను 24 గంటలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. -
ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని
సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా చింతమనేని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేనిని అదుపులోకి తీసుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే చింతమనేనిపై పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. గతంలో ఆయనపై నమోదైన కేసులను ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ పరిశీలిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, ఏలూరు (టూటౌన్): దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై శనివారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధితులు ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్‌ను కలిసి నేరుగా ఫిర్యాదులు చేశారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాల్లో ఫిర్యాదుదారుల పొలాలను ఆక్రమించి వారిపై చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దళితుల భూములను ఆక్రమణలు చేసి చంపుతామని బెదిరించినట్లు పలువురు బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. చింతమనేనిపై కేసులు పెట్టినా రాజకీయ పలుకుబడి ఉపయోగించి సదరు కేసుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అడ్డుపడినట్లు బాధితులు తెలిపారు. దెందులూరు మండలం శ్రీరామవరంలో గతేడాది నవంబరు 15 రాత్రి బహిరంగ ప్రదేశంలో దళితులను ఉద్దేశించి అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడిన విషయం గురించి శనివారం కొత్తపల్లి సురేష్, కొంతమంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ ఇచ్చిన ఫిర్యాదులను పూర్వాపరాలు విచారించిన అనంతరం కేసుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జల దిగ్భంధనంలోనే గిరిజన గ్రామాలు
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరంలో వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటిమట్టం 26 అడుగులుగా కొనసాగుతోంది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.19 గిరిజన గ్రామాలు తొమ్మిది రోజులుగా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తుంగభద్ర జలాశయానికి వరద నీరు కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద నీరు చేరుతుంది. పూర్తిస్థాయి నిల్వ 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 36 టీఎంసీలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 23,052 క్యుసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1230 క్యుసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతుంది.ప్రస్తుతం నీటిమట్టం 866.60 అడుగులు కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 2,55,779 టీఎంసీలు ఉండగా, ఔట్ ఫ్లో 50,880 క్యుసెక్కులుగా ఉంది. -
కేజీ బేసిన్.. చమురు నిక్షేపాలు దొరికెన్!
నరసాపురం: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం ప్రభుత్వరంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) అధికారులు రెండేళ్లుగా చేస్తున్న అన్వేషణ సత్ఫలితాలనిచ్చింది. తాజాగా చమురు నిక్షేపాల కోసం అధికారులు వేగం పెంచి విస్తృతంగా అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగుచోట్ల అపారంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కొత్త బావులు కావడం విశేషం. ఇప్పటికే రెండుచోట్ల సర్వే డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. మిగిలిన రెండు చోట్ల కూడా గ్యాస్ వెలికితీతకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేజీ బేసిన్ పరిధిలో నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా తవ్వుతున్న బావులు ఖాళీ అయ్యాయి. దీంతో ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, మార్టేరు, పెనుగొండ, భీమవరం ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించింది. మార్టేరు, పెనుగొండ ప్రాంతాల్లో పెద్దస్థాయిలో, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం, వేండ్ర వద్ద మొత్తం నాలుగుచోట్ల చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించి, వెలికితీతకు ఉపక్రమించారు. నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు నాలుగు దశాబ్దాలుగా నరసాపురం కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు ఓఎన్జీసీ కేవలం ఆన్షోర్పైనే దృష్టి పెట్టింది. రిలయన్స్, గెయిల్ వంటి ప్రైవేట్ ఆయిల్‌రంగ సంస్థలు రంగప్రవేశం చేయడంతో వాటి పోటీని తట్టుకోవడానికి ఓఎన్జీసీ 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణలపై దృష్టి సారించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంగా సముద్రగర్భంలో గ్యాస్ వెలికితీత ప్రారంభమైంది. అదనపు ఉత్పత్తిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్జీసీ ప్రస్తుతం ఇదే ప్రధాన వనరుగా భావిస్తోంది. ఆన్‌షోర్‌కు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో కవిటం, నాగిడిపాలెం, ఎస్–1 వశిష్టాబ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లో, తూర్పుగోదావరి జిల్లా కేశనపల్లి, కృష్ణా జిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లో గత కొంతకాలంగా చేపట్టిన అన్వేషణలు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటి ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఓఎన్జీసీ అధికారులు చెపుతున్నారు. 25 శాతం ఉత్పత్తి పెంపు లక్ష్యంగా.. రానున్న ఏడాది మరో 25 శాతం ఉత్పత్తి పెంపు కోసం ఓఎన్జీసీ ప్రయత్నాలు సాగిస్తోంది. రోజుకు 35 నుంచి 40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్ వెలికితీయడమే లక్ష్యంగా ముందుకెళుతోంది. గ్యాస్ వెలికితీతలో ఇప్పటికే దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న ఓఎన్జీసీ.. ఇదే దూకుడుతో లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆఫ్‌షోర్ (సముద్రగర్భం)లో అన్వేషణలకు సంబంధించి నరసాపురం తీరంలో చురుగ్గా కార్యకలాపాలు సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాదే అగ్రస్థానం కొత్తగా జిల్లాలో కనుగొన్న బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే, రోజుకు ఇక్కడి నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికితీయవచ్చని ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీ బేసిన్లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కొత్త బావుల ద్వారా మరో 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ఇక్కడి నుంచి పెరిగితే ఈ జిల్లాదే అగ్రస్థానం అవుతుంది. -
‘గుండె ఝల్లే’రు!
సాక్షి, బుట్టాయగూడెం : ఎప్పుడూ జలసిరితో నిండుగా కనిపించే గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం ప్రస్తుతం కళతప్పి రైతులను కలవరానికి గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా జలాశయం నీటి మట్టం కనీస స్థాయి కన్నా దిగువకు పడిపోయింది. ఫలితంగా జల్లేరుపైనే ఆధారపడిన సుమారు 4,200 ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్లేరు జలాశయం కనీస నీటి మట్టం స్థాయి 216 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 208.4 మీటర్లు మాత్రమే ఉంది. జూన్ మాసంలోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత నీటి మట్టం చూస్తే ప్రాజెక్టు కింద భూములకు సాగు నీరు అందే పరిస్థితులు కనపడడం లేదు. జలాశయం ఎప్పుడు నిండుతుందో తెలీని దుస్థితి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా వర్షాధారం ఈ జలాశయం పూర్తిగా వర్షాకాలంలో కొండ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవహించే వరదతోనే నిండుతుంది. వేసవిలోనూ కనిష్టస్థాయికి నీటిమట్టం పడిపోదు. కానీ ఇప్పుడు దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ ప్రాజెక్టును నమ్ముకొని దాదాపు 16 వందల మందికిపైగా రైతులు 4,200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, చెరకు, అపరాలు వంటి పంటలను ఏటా వేస్తుంటారు. రైతులకు కనీసం బోర్లు కూడా లేవు. ప్రాజెక్టు నీరే ఆధారం. ప్రాజెక్టు శిథిలావస్థకు చేరడంతో అధికారులు పూర్తి స్థాయిలో వర్షాకాలంలో కూడా స్టోరేజ్ చేయలేకపోతున్నారు. అక్టోబర్‌లో రబీ సీజన్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వేసవికాలం నాటికి నీటి మట్టానికి నీరు ఇంకిపోవడంతో రైతులు కలవరం చెందుతున్నారు. కనీసం ప్రాజెక్టు సమీపంలో ఉన్న పొలాలకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆధునికీకరణ ఎక్కడ! గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 44 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనిని ప్రారంభించారు. జలాశయం ద్వారా 4,500 ఎకరాలకు సాగు అందించాలనేది లక్ష్యం. అయితే నేటికీ పూర్తి స్థాయిలో నీరు అందడంలేదు. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపడమే తప్ప మంజూరైన దాఖలాలు లేవు. కనీస మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల గట్టు బలహీన పడి అధికారులు పూర్తి స్థాయిలో నీటిని నిల్వచేయలేకపోతున్నారు. దీంతో ఏటా వేసవినాటికి నీటిమట్టాలు పడిపోతున్నాయి. ఈ సారి పరిస్థితి మరీదారుణంగా ఉంది. కనిష్టస్థాయి కంటే నీటిమట్టం పడిపోయింది. ఖరీఫ్ సీజన్‌కు వర్షాలు విస్తారంగా కురిసి ప్రాజెక్టులో నీరు నిండితేనే ఆయకట్టు పరిధిలోని రైతులకు నీరు అందే పరిస్థితి ఉంది. -
టీడీపీ తలకిందులే.. ‘పశ్చిమ’లో మారిన రాజకీయం
సాక్షి, పశ్చిమ గోదావరి : తూర్పు చాళుక్యులు ఏలిన ప్రాంతం. వేంగి రాజుల రాజధాని నగరం. శాంతిని చాటే గుంటుపల్లి బౌద్ధ గుహలు. ఆధ్యాత్మిక సౌరభాలు విరాజిల్లే క్షీరారామం, సోమారామం.. ద్వారకా తిరుమల, మావుళ్లమ్మ క్షేత్రాలకు ఆలవాలం. తెలుగు వాడి పౌరుషాగ్నికి ప్రతీక అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన గడ్డ. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా’ అంటూ స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదిన అడవి బాపిరాజు, టెట్రాసైక్లిన్ లాంటి మందులెన్నో కనుగొని విశ్వ మానవాళి ప్రాణాలు నిలిపిన యల్లాప్రగడ సుబ్బారావు లాంటి మహానుభావులెందరికో పురిటి గడ్డ. క్విట్ ఇండియా ఉద్యమంలో ‘రెండో బార్డోలీ’గా గాంధీజీచే కీర్తించబడిన గడ్డ. ఆక్వా రాజధానిగా.. జిల్లాకు ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న భీమవరం.. వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం.. అగరు ధూప పరిమళాలను వెదజల్లే చారిత్రక నగరం ఏలూరు.. స్వచ్ఛతకు మారుపేరైన గిరిపుత్రులను గన్న బుట్టాయగూడెం, పోలవరం అటవీ ప్రాంతం.. సినీ పరిశ్రమను ఏలుతున్న మేటి నటులు, దర్శకులకు జన్మనిచ్చిన ప్రాంతం. ఇదీ పైరుపచ్చలు పొదిగిన పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం. భీమవరం భీమవరంలో త్రిముఖ పోరు ఉంది. పవన్‌కల్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో ఆసక్తి నెలకొంది. ప్రచారంలో వెనుకబడటం, గాజువాకపైనే దృష్టి పెట్టడం, స్థానికంగా ఉండరని ప్రజలు నమ్ముతుండటం పవన్‌కు మైనస్. హాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఎదురీదుతున్నారు. భీమవరం టౌన్షిప్లో పేదల గృహ రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీ నెరవేర్చకపోవడం, యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన చేపట్టకపోవడంతో ప్రజలు టీడీపీపై విశ్వాసం కోల్పోయారు. సమస్యలపై పోరుడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండటం, సానుభూతి, రీల్ హీరో పవన్‌తో తలపడుతున్న రియల్ హీరోగా ఆదరణ, క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర వర్గాలు గ్రంధి శ్రీనివాస్ పక్షాన నిలవడం ఈసారి విజయానికి కలిసి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉండి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరూ తొలిసారి ఎమ్మెల్యే పదవికి పోటీపడుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు బరిలో ఉన్నారు. సొసైటీ అధ్యక్షునిగా రైతులకు చేసిన సేవలకు గాను జాతీయ స్థాయిలో అవార్డు పొందిన నరసింహరాజుకు రైతు పక్షపాతిగా మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివకు బినామీ అని పేరుపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీకి పెట్టారు. వేల ఎకరాల్లో అక్రమంగా చెరువుల తవ్వకాలు, అవినీతి, అక్రమార్జనల్లో ఎమ్మెల్యేకు బినామీ రామరాజు అనే ముద్ర ఉంది. డబ్బుతో అంతా మార్చేస్తామనే ధీమాతో టీడీపీ ఉంది. జనసేన తన మిత్రపక్షమైన సీపీఎం నుంచి బి.బలరామ్‌ను పోటీకి పెట్టడం టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడుతుందని విశ్లేషిస్తున్నారు. పాలకొల్లు సౌమ్యుడు, మంచి వైద్యుడు, నిజాయితీపరుడిగా పేరున్న డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణ (బాబ్జి) వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కులాలకు అతీతంగా అన్నివర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉండటం, సొంత సామాజికవర్గం నుంచి జనసేనవైపు మళ్లిన వారు మన డాక్టర్ కోసమంటూ వైఎస్సార్సీపీలోకి తిరిగొస్తుండటం ఆయనను విజయం వైపు నడిపిస్తోంది. డాక్టర్ బాబ్జి ముందు నిలవటం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కత్తిమీద సామే. అభివృద్ధి కంటే కమీషన్ల కక్కుర్తే శాపమై తమను దెబ్బతీసేలా ఉందని టీడీపీ అంతర్మథనం చెందుతోంది. వివాదాస్పద దూకుడు స్వభావం జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబుకు మైనస్ అయి పరిమిత ఓటు బ్యాంక్‌తో సరి అంటున్నారు. నరసాపురం నరసాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు అన్నివిధాలా కలిసివస్తోందని టీడీపీ వర్గాలే అభిప్రాయపడటం విశేషం. రాజకీయ ఎత్తుగడల్లో చేయితిరిగిన ప్రసాదరాజుకు డెల్టాలో పట్టున్న మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అండగా నిలవటంతో వైఎస్సార్ సీపీ మరింత బలం పుంజుకుంది. నరసాపురం పట్టణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు, చెప్పుకోదగ్గ పనులు చేయకపోవటం, చిన్నచిన్న పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడటం వంటి పరిస్థితుల నడుమ ఆ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎదురీదుతున్నారు. జనసేన మత్స్యకార వర్గం నుంచి బొమ్మిడి నాయకర్ను బరిలోకి దింపింది. ఆ సామాజిక వర్గంలో ప్రసాదరాజుకు మొదటి నుంచీ మంచి పట్టు ఉండటంతో జనసేన పోటీ నామమాత్రమే. తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో ప్రధాన పోరు వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే కనిపిస్తోంది. వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ రెండో ఫ్లైఓవర్ (ఆర్వోబీ), వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, వెటర్నరీ పాలిటెక్నిక్, ఏయూ పీజీ క్యాంపస్, నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి పైడికొండల మాణిక్యాలరావు మంత్రిగా ఉండటంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. సీటు ఆశించి భంగపడ్డ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం అంతర్గతంగా దెబ్బతీసే ప్రయత్నాలు టీడీపీ అభ్యర్థి ఈలి నానికి ప్రతికూలాంశాలుగా మారాయి. టీడీపీలో వర్గం కలిగిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ మేరకు టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడి కొట్టు సత్యనారాయణకు లాభిస్తుంది. ఏలూరు వైఎస్సార్ సీపీ నుంచి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రంగంలో ఉన్నారు. ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచటం, వర్షాకాలంలో ఏలూరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారంగా తమ్మిలేరుకు కాంక్రీట్ వాల్, నగర ప్రజలందరికీ రెండు పూటలా మంచినీరు అందించటం వంటి కార్యక్రమాలు నాని చేపట్టారు. ముస్లిం, మైనార్టీ వర్గానికి చెందిన మేయర్ షేక్ నూర్జహాన్, భర్త, కో–అప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీ మరింత బలపడింది. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అవినీతి, అక్రమాల చిట్టాలో టాప్–3లో ఉన్నారు. భూ ఆక్రమణలు, ఏలూరు మార్కెట్లో కబ్జాలు, సెటిల్మెంట్లు టీడీపీకి నష్టాన్ని కలిగించనున్నాయి. జనసేన నుంచి బరిలో దిగిన రెడ్డి అప్పలనాయుడు పోటీ నామమాత్రమే. ఉంగుటూరు వైఎస్సార్సీపీకి ఈసారి సానుకూల పవనాలు వీస్తున్న నియోజకవర్గం. పుప్పాల వాసుబాబు వైఎస్సార్సీపీ తరఫున రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమితో వచ్చిన సానుభూతి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సమస్యలపై పోరాటాలు చేస్తుండటం వాసుబాబుకు కలిసివచ్చే అంశం. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇసుక దోపిడీ మొదలు అంగన్వాడీ, ఆశ వర్కర్లు, సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకం వరకూ పెచ్చుమీరిన అవినీతి టీడీపీకి శాపాలుగా మారాయి. గత ఎన్నికల్లో లక్షలు పెట్టుబడులు పెట్టి ఆయన విజయం కోసం పనిచేసిన నేతల నుంచి కూడా కమీషన్లు వసూలు చేయడంతో వారంతా ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయడం టీడీపీని దెబ్బతీయనున్నాయి. నౌడు వెంకటరమణ జనసేన నుంచి బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఆచంట రాజకీయ వ్యూహకర్త, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్టగా పేరొందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇక్కడ రంగంలో ఉన్నారు. బలహీన వర్గాల విద్యార్థులకు స్కూల్ బస్సుల ఏర్పాటు, సొంత సొమ్ముతో ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన మంత్రి పితాని సత్యనారాయణకు చెరుకువాడ గట్టి పోటీ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూనపురెడ్డి చినబాబు వైఎస్సార్ సీపీలో చేరడంతో బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో వెన్నంటి నిలిచిన సొంత సామాజిక వర్గం నుంచి పితాని వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మంత్రి సామాజిక వర్గం ఈ సారి టీడీపీ నుంచి బయటకు వచ్చి చెరుకువాడకు పనిచేస్తుండటం వైఎస్సార్ సీపీకి సానుకూల అంశంగా మారింది. నిడదవోలు టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పోటీగా పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు కుమారుడు గెడ్డం శ్రీనివాసనాయుడు బరిలో నిలిచారు. తండ్రి జీఎస్ రావుకు నియోజకవర్గంలో వివిధ వర్గాల్లో పట్టుంది. నాయుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారంలో ముందున్నారు. ఎమ్మెల్యే శేషారావు ఇసుక మాఫియాను పెంచి పోషించారు. ఐదేళ్లయినా రైల్వేఫ్లైఓవర్ నిర్మించలేకపోయారు. చివరి వరకు టికెట్టు కోసం పట్టుపట్టి భంగపడ్డ శేషారావు సోదరుడు గోపాలకృష్ణ, మరో కీలక నేత కుందుల సత్యనారాయణ వర్గం శేషారావుకు వ్యతిరేకంగా ఉండటం టీడీపీకి గడ్డుకాలమేనంటున్నారు. జనసేన అభ్యర్థి ఎ.రమ్యశ్రీ ప్రభావం కొద్దోగొప్పో పెరవలి మండలానికే పరిమితం. దెందులూరు వివాదాస్పదుడు, అవినీతి, అక్రమాలు, సెటిల్మెంట్ దందాలతో నిత్యం పత్రికల పతాక శీర్షికల్లో నిలిచే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. అన్నీ తానై ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాను నడిపించి రూ.కోట్లు కొల్లగొట్టడం, ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌పై దౌర్జన్యానికి దిగడం వంటి దురాగతాలతో ఈసారి టీడీపీకి భారీ షాక్ తప్పదంటున్నారు. కృష్ణా డెల్టా నుంచి సాగునీరు తీసుకువస్తానన్న మాట నిలబెట్టుకోలేకపోవడంతో, కొల్లేరు మత్స్యకారుల మధ్య విభేదాలు సృష్టించడం వంటి పరిణామాలతో టీడీపీ ఎదురీదుతోంది. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం, రూ.లక్షల వేతనాన్ని వదులుకుని వచ్చి వైఎస్సార్ సీపీ నుంచి బరిలోకి దిగిన కొఠారు అబ్బయ్యచౌదరి వీటిని సానుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతులయ్యారు. చింతమనేని ఓటమే లక్ష్యంగా అన్నివర్గాలు ఏకం కావడం వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చే అంశం. జనసేన నుంచి ఘంటశాల వెంకటలక్ష్మి పోటీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైఎస్సార్ సీపీ నుంచి రంగంలో నిలిచారు. పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేయడంపై నిత్యం వారి తరఫున పోరాడటంతో గిరిజనుల్లో ఆదరణ పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని టీడీపీ బి.శ్రీనివాసులును బరిలోకి దింపింది. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో టీడీపీ నేతల అవినీతిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ముందస్తుగా భూములు ఇచ్చిన నిర్వాసితులకు రూ.5 లక్షలు అదనపు పరిహారం ఇస్తామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించడం గిరిజనుల్లో ఆశలు చిగురించి వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నారు. జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ ఇక్కడ నామమాత్రమే. కొవ్వూరు వైఎస్సార్ సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత బరిలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్ మంత్రి కేఎస్ జవహర్‌ను తిరువూరుకు సాగనంపి.. పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితను టీడీపీ దిగుమతి చేసింది. ఆమె స్థానికురాలు కాకపోవటం, మంత్రి జవహర్ వర్గం కలిసి రాకపోవడం, పాయకరావుపేటలో అనిత అవినీతి అక్రమాలతో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వనిత నిత్యం ప్రజల్లో ఉంటూ ఇసుక, మద్యం మాఫియాకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడంతో ప్రజల్లో వైఎస్సార్ సీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గోపాలపురం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి తలారి వెంకట్రావు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నిత్యం ప్రజలతో మమేకం కావడం, ఆర్థికంగా దెబ్బతిన్నా.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడంతో వెంకట్రావుకు సానుభూతి ఉంది. నిజాయితీపరుడనే పేరు, అన్నివర్గాల ఆదరణ వైఎస్సార్ సీపీకి సానుకూలంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ముప్పిడి ఏమీ చేయకపోవడం, పనుల కాంట్రాక్ట్‌లను ఒకరిద్దరికి మాత్రమే కట్టబెట్టడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను తప్పించి టీడీపీ అభ్యర్థిగా కర్రా రాజారావును బరిలోకి దింపింది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గంగా రాజారావు పోటీ చేస్తుండటంతో పీతల వర్గం అతనికి సహకరించడం లేదు. పరిహారం పెంచాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే పరిహారం అందించి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో ఆయకట్టు రైతులు వైఎస్సార్ సీపీకి సానుకూలంగా మారడం కలిసి వస్తోంది. తణుకు కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ నుంచి రంగంలో ఉన్నారు. నియోజకవర్గాన్ని రూ.700 కోట్లతో అభివృద్ధి చేయడం, గోదావరి జలాలను తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను బరిలోకి దింపింది. తణుకు దివాణం నుంచి వైటీ రాజా సీటు ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన వర్గం టీడీపీకి సహాయ నిరాకరణ చేస్తోంది. కాంట్రాక్ట్‌లన్నీ తన బినామీలకే కట్టబెట్టడం సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వేల్పూరులో 1,008 మంది నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని 2015లో చంద్రబాబుతో శంకుస్థాపన చేయించగా, శిలాఫలకానికే పరిమితమైంది. వేసవిలో గోదావరి జలాల కోసం సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ నిర్మాణానికి 60 ఎకరాలు కూడా సేకరించలేక చేతులెత్తేశారు. ఇవన్నీ టీడీపీకి మైనస్‌గా ఉన్నాయి. జనసేన నుంచి పసుపులేటి రామారావు పోటీలో ఉన్నారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి -
‘అక్రమ మైనింగ్‌లో చంద్రబాబుకి వాటా
-
‘అక్రమ మైనింగ్‌లో చంద్రబాబుకి వాటా’
పశ్చిమ గోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత అబ్బయ్య చౌదరి రాయన్నపాలెంలో చేపట్టిన నిరహార దీక్ష ఉద్రిక్తల పరిస్థితుల నడుమ ప్రారంభమైంది. అక్రమంగా క్వారీని నడుపుతున్నా చింతమనేనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అబ్బయ్య చౌదరి విమర్శించారు. దెందులూరులో జరుగుతున్న దోపిడీ కేవలం నియోజకవర్గ పరిధిలోనిది కాదని.. దీనిలో సీఎం చంద్రబాబు నాయుడికి కూడా వాటా ఉందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాయన్నపాలెంలో శనివారం ప్రారంభమైన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అధికార యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అన్యాయం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి నోరు నొక్కెస్తున్నారని విమర్శించారు. అక్రమ మైనింగ్ వెనుక ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని.. వారిపై కోర్టుకు కూడా వెళ్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చింతమనేని తన అవినీతి వైఖరి మార్చుకోకపోతే ప్రజలే ఓటు ద్వారా బుద్ది చెప్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ళనాని హెచ్చరించారు. పబ్లిక్‌గా ఇసుకా, గ్రావెల్ అమ్ముకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. కలెక్టర్‌కి వినితి పత్రం ఇచ్చినా కూడా ధైర్యంగా దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చింతమనేని అక్రమ క్వారిపై ఎంక్వయిరీ వేస్తామని ఏలూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ కోటగిరి శ్రీధర్ అన్నారు. -
దళిత ఉద్యోగిపై టీడీపీ నేత దాడి
-
దళితుడిపై టీడీపీ నేత దాడి
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. అధికార మదంతో తెలుగు తమ్ముళ్లు అడ్డూఅదుపు లేకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేత ఒకరు బరితెగించారు. కొమదవోలు గ్రామ కార్యదర్శి యువి రత్నంపై టీడీపీ నాయకుడు గంటా మోహనరావు దాడి చేశారు. ఇంటికి పిలిపించుకుని బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. పంచాయతీకి సంబంధించిన 5 లక్షల రూపాయిలను అడ్వాన్స్‌గా ఇవ్వలేదన్న అక్కసుతో కార్యదర్శిపై గూండాయిజం ప్రదర్శించారు. దళితుడైన తనపై టీడీపీ నేత గంటా మోహనరావు దాడికి పాల్పడినట్లు బాధితుడు ఎన్జీఓ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. దాడి విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఎన్జీఓ నేతలు నిర్ణయించారు. అధికారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో..!
ద్వారకాతిరుమల: ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. ఆర్టీసీ బస్సు ఎక్కి ఆదివారం సాయంత్రం ద్వారకాతిరుమలకు చేరాడు ఈ బాలుడు. తప్పిపోయి వచ్చాడేమోనన్న అనుమానంతో స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో బాలుడిని ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజుకు అప్పగించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం ఏలూరు నుంచి ఒక ఆర్టీసీ బస్సు సాయంత్రం ద్వారకాతిరుమల కొత్త బస్టాండుకు వచ్చింది. బస్సు నుంచి బాలుడు దిగకపోవడంతో కండక్టర్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించింది. తన పేరు ఏసు అని అక్షయ్ అని, తనది ఏలూరు పాత బస్టాండు అని, దెందులూరని, విజయవాడ అని, తన తండ్రే బస్సు ఎక్కించాడని బాలుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో స్థానికులు బాలుడిని పోలీసులకు అప్పగించారు. బాలుడి వివరాలు తెలిసిన వారు 94407 96653, 08829 – 271433 నంబర్లలో సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. -
గజ్జరంలో ఘోర రోడ్డు ప్రమాదం
తాళ్లపూడి: మండలంలోని గజ్జరం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గజ్జరం గ్రామానికి చెందిన దేపాటి అనిల్‌కుమార్ (17), రామవరపు మురళి (16) ద్విచక్రవాహనంపై గ్రామంలోని తాళ్లపూడి వైపు వస్తున్నారు. ఈ సమయంలో తాళ్లపూడి వైపు నుంచి గోపాలపురం వైపునకు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ ఒకరిపై ఒకరు కిందపడ్డారు. వారి తలలకు బలమైన గాయాలయ్యాయి. శరీరభాగాలూ చెల్లాచెదురుగా ముక్కలుగా పడ్డాయి. çకళ్ల ముందే జనం చూస్తుండగానే మృత్యువాత పడ్డారు. ఈఘటన స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. ఇద్దరూ స్నేహితులు అనిల్, మురళి ఇద్దరూ స్నేహితులు గ్రామంలో బంధువుల ఇంటి వద్ద జరి గిన శుభకార్యంలో పది నిమిషాల ముందు భోజనం చేసి తాళ్లపూడికి బైక్‌పై బయలుదేరారు. ఇంతలో ఈ ఘోరం జరిగింది. ఎదిగొచ్చిన కొడుకులు ఇలా.. ఎదిగొచ్చిన కొడుకులు ఇలా మరణించడంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. దేపాటి అనిల్‌కుమార్ తణుకు ఎస్‌ఎన్‌వీటీ పాలిటెక్నిక్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చాడు. తండ్రి శ్రీనివాస్, తల్లి పోసమ్మ కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. మృతునికి ఓ అక్క కూడా ఉంది. రామవరపు మురళి చిన్న చిన్నపనులు చేసుకుంటూ పదో తరగతి ప్రైవేట్‌గా కట్టి చదువుతున్నాడు. ఇతనికి తండ్రి పోసియ్య, తల్లి లక్ష్మి, చెల్లి ఉన్నారు. తండ్రి ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి కూలి పనులు చేస్తుంటుంది. రెండు కుటుంబాల్లోనూ మగపిల్లలు కావడంతో ఘటనా స్థలంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్నేహితులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. డీఎస్పీ ఆదేశాల మేరకు తాళ్లపూడి ఎస్సై కె.అశోక్ కుమార్, సిబ్బంది ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
తల్లీ బిడ్డల ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి జిల్లా : కుక్కునూరు మండలం రావికుంట గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. గ్రామానికి చెందిన కృష్ణకుమారి సోమవారం తన భర్తతో బైక్ విషయంలో గొడవపడింది. భర్త తన మాట వినకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తన పిల్లలకు తాగించి తర్వాత తానూ తాగింది. అప్రమత్తమైన స్థానికులు తల్లి సోమరాజు కృష్ణ కుమారి(25)తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రుతిక్(2), స్వప్నిక(3)లను దగ్గరలోని వేలేరుపాడు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెలుగు తమ్ముళ్ల అశ్లీల నృత్యాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉంగుటూరు నియోజకవర్గం ఆశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది. జాతర జరిగినా, జన్మదిన వేడుకలు జరిగినా అశ్లీల నృత్యాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా భీమడోలు మండలంలోని కురెళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని అంబర్‌పేటలోని ఓ తోటలో తెలుగు తమ్ముళ్లు అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఆదివారం కురెళ్లగూడెం గ్రామానికి చెందిన ఓ నాయకుడి పుట్టిన రోజు వేడుకలు కావడంతో ముఖ్య నేతలను అంబర్‌పేటలోని కొబ్బరి తోటలో జరిగే విందుకు ఆహ్వానించారు. టీడీపీ నేతకు చెందిన ఆ తోటలో జరిగిన విందు కార్యక్రమం అనంతరం అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి సొంత గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చర్చనీయాంశంగా మారింది. విందు పూర్తయిన తర్వాత మహిళలను వేదికపై ఎక్కించి తెలుగు తమ్ముళ్లు అసాంఘిక కార్యకలాపాలు సాగించారు. ఇద్దరు అర్థనగ్న దుస్తులతో ఉన్న మహిళలతో తెలుగు తమ్ముళ్లు సైతం చిందులేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగుచూడటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తుందుర్రులో ఉద్రిక్త వాతావరణం
-
హెచ్ఏఎల్ ఛైర్మన్ గా సువర్ణరాజు
హైదరాబాద్: తెలుగువాడికి అరుదైన గౌరవం లభించింది. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఛైర్మన్ గా ఆంద్రప్రదేశ్ కు చెందిన సువర్ణ రాజు నియమితులైయ్యారు. ఆర్కే త్యాగి స్థానంలో 17 వ ఛైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పి.వేమవరంలో పుట్టిన సువర్ణరాజు చెన్నై ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. 1980 సంవత్సరంలో హెచ్ఏఎల్ లో చేరిన సువర్ణరాజు పలు కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అత్యుత్తమ పనితీరు కనబర్చడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
జీలుగుమిల్లి, న్యూస్‌లైన్ :ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఓ రైతు తన పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేయగా, ఆ పని చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ జీలుగుమిల్లి ఏఈ ఎ.వెంకటేశ్వరరావును అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఇలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం తాటియాకుల గూడెంకు చెందిన గంధం వెంకటేశ్వరరావు అనే రైతు తన పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం కొంతకాలంగా విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ పని చేసిపెట్టాలంటే రూ.10 వేలు ఇవ్వాలని ఏఈ ఎ.వెంకటేశ్వరరావు డిమాండ్ చేయగా, మంగళవారం రూ.2 వేలు అతనికి ముట్టజెప్పినట్టు రైతు గంధం వెంకటేశ్వరరావు తెలిపాడు. మిగిలిన రూ.8 వేలను బుధవారం ఇస్తానని చెప్పిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు విద్యుత్ ఏఈ కోసం వలపన్నారు. రూ.8వేలను రైతు వెంకటేశ్వరరావుకు ఇచ్చి ఏఈ వద్దకు పంపించారు. ఆ మొత్తాన్ని ఏఈ తీసుకుం టుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి వివరాలు రాబట్టిన అనంతరం అరెస్ట్ చేశారు. కాగా, ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ వెంకటేశ్వరరావు ఐదు నెలల క్రితమే కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లికి బదిలీపై వచ్చారు.