
సాక్షి, ఏలూరు: ఈ నెల 4న పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రులు ఆళ్ల నాని, పేర్నినాని, కలెక్టర్ ముత్యాల రాజు ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు జిల్లా వాసుల ఎన్నో సంవత్సరాల కల అని.. ఆ కలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. శుక్రవారం మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన అనంతరం ఇండోర్ స్టేడియంలో ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకంలో భాగంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తారని వెల్లడించారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేర్చబోతున్నారని తెలిపారు. ఏలూరు బహిరంగ సభలో ఆటోడ్రైవర్లకు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఏలూరులోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిపారు.
జిల్లాలో 13,062 మంది ఆటో, ట్యాక్సీ వాహనదారులకు రూ.10 వేల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందజేయనున్నారని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. సీఎం పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment