
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్‌జగన్ కలవనున్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్‌జగన్
Comments
Please login to add a commentAdd a comment