గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు సొంత నియోజవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
వైఎస్ జగన్.. రేపు ఉదయం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులతో ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. కడప నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతారు. అది ముగిశాక సాయంత్ర సమయంలో పులివెందుల బయల్దేరుతారు.
25న సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.
సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు.
26వ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు
27వ తేదీన స్థానికంగా ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అదే మధ్యాహ్నాం పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు
Comments
Please login to add a commentAdd a comment