Pulivendula Assembly Constituency
-
ముగిసిన వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
వైఎస్సార్, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. సోమవారం మధ్యాహ్నాం తన పర్యటన ముగించుకుని సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లారు. సోమవారం పులివెందులలో వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు.. చుట్టు పక్కల జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను కలిశారు. పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. పార్టీ ఓటమిని తల్చుకుని బాధపడొద్దని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సంకిరెడ్డి మృతదేహానికి జగన్ దంపతులు నివాళులర్పించారు. సంకిరెడ్డి కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. తన మూడు రోజుల పులివెందుల పర్యటనలో పార్టీ నాయకులతో ఎన్నికల ఓటమిపై సమీక్ష జరిపిన ఆయన.. అధైర్య పడొద్దని, రాబోయే రోజులు పార్టీవేనని, ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. మరోవైపు సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్‌కు అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా మీ వెంటే ఉన్నామంటూ నియోజకవర్గం.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజానీకం నినాదాలతో చాటి చెప్పింది. క్లిక్ చేయండి: పులివెందులలో జననేత -
వైఎస్ జగన్ ఘన విజయం
కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో తమకు ఎదురే లేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు రుజువు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 1,77,580 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇందులో జగన్‌కు 1,16,315 (65.50 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవిపై 61,687 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 54,628 ఓట్లు వచ్చాయి.కాంగ్రెస్ అభ్యర్థి ధృవకుమార్రెడ్డికి 10,083 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 23 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండులోనూ వైఎస్ జగన్ తన ఆధిక్యతను చాటుకోవడం విశేషం. పులివెందుల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో వైఎస్సార్ కుటుంబం ఎంతో కృషి చేసింది. అందుకే పులివెందులలో వైఎస్సార్ కుటుంబానికి ప్రజలు 1978 నుంచి పట్టం కడుతూనే ఉన్నారు. -
పులివెందులలో సీఎం జగన్ గెలుపు
వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. వైఎస్సార్సీపీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం జగన్ విజయం సాధించారు. -
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
ప్రజా క్షేత్రంలో ఒక్కడిని.. ఒకేఒక్కడిని ఎదుర్కొనే దమ్ము లేని పార్టీలు ఏకం అయ్యాయి. కూటమిగా కుట్రలు చేస్తూ.. అసత్య ప్రచారాలతో, మోసపూరిత హామీలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయి. కానీ, ఆ జననేత ఈ 58 నెలల పాలనలో ప్రజలకు చేసిన మంచిని నమ్ముకున్నారు. సంక్షేమం తోపాటు అభివృద్ధి, సామాజిక న్యాయం.. ఇవే ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌కు మరోసారి అధికారం కట్టబెడుతాయి అని వైఎస్ భారతి అంటున్నారు . పులివెందులలో సీఎం జగన్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి.. ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాల్ని పంచుకున్నారు..పులివెందుల నా సొంతగడ్డ. నెలకు రెండు రోజులు ఇక్కడికి వస్తుంటా. పులివెందుల ఎమ్మెల్యే సీఎం జగన్‌కు, ఇక్కడి ప్రజలకు మధ్య నేనొక వారధిని. ఇక్కడి ప్రజల బాగోగుల్ని వీళ్ల ఎమ్మెల్యే తరఫున నేనే చూస్తుంటా. ఎప్పుడు, ఎవరు, ఏ సమయంలో అయినా సరే తమకు ఫలానా కష్టం వచ్చింది అంటే చాలూ.. అప్పటికప్పుడే పరిష్కారం చూపిస్తుంటాం. ఇప్పుడు.. ఈ ప్రచారంలోనూ కొందరు విజ్ఞప్తులు ఇస్తున్నారు. కానీ, కోడ్ అమలులో ఉంది కాబట్టి ఎన్నికలయ్యాక పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నాం. తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే..సీఎం వైఎస్ జగన్ తన 58 నెలల పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృష్టి చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబర్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం మొదలు.. బడికి వెళ్తే ప్రత్యేక మెనూతో నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. పేదపిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువును అందిస్తున్నారు. ఎనిమిదో తరగతి నుంచే విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందిస్తూ.. డిగ్రీ కోర్సులతో పాట టోఫెల్ వంటి కోర్సుల శిక్షణ అందించటం కోసం ఎడెక్స్ లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.లక్షల మంది యువతకు ఉపాధిసీఎం జగన్ పాలనలో గత ఐదేళ్ల పాలనలో ప్రైవేటు, ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగాలు కలిపితే.. సుమారు 30.32 లక్షల మంది యువతకు ఉపాధి దక్కింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను గాలికి వదిలేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఎంఎస్ఎంఈలకు భారీ ఇన్సెంటీవ్స్ అందించింది. సీఎం జగన్ ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు యువతకు కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నాయి.మరోవైపు ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయం, మత్య్స రంగాలను అభివృద్ధి చేసి ఉపాధి కల్పనపై దృష్టి పెట్టింది. నూతనంగా నాలుగు పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. తద్వారా మత్స్య పరిశ్రమ ఆదాయాన్ని పెంచటంతో పాటు ఉపాధిని కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాలు లేవు. అయినా.. రాష్ట్రంలో ఉన్న వనరులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినియోగించుకొని అభివృద్ధి చేయటంతో పాటు.. యువతకు ఉద్యోగాలు కల్పించింది.కరోనా కాలంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ఆపలేదు. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంది. ఆ సమయంలోనూ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసింది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలో రాగానే.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది.ఈ మేనిఫెస్టో సంక్షేమం కొనసాగింపే..ఈ మధ్యే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ప్రకటించింది. గత ఐదేళ్ల ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కొనసాగిస్తామని.. ఆ పథకాలకు అదనపు సంక్షేమం ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అంటే సంక్షేమం విషయంలో అడుగులు ముందుకే ఉంటాయని ఆయన అన్నారు. గిగ్ వర్కర్లకు కూడా ఇన్స్‌రెన్స్ సదుపాయం కల్పించడం హర్షనీయమైన విషయం.ఇద్దరిలో ఎవరిపైన పులివెందుల ప్రజలకు ఎక్కువ ప్రేమ? పులివెందులలో మూడు తరాల ప్రజలకు వైఎస్సార్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్సార్ తొలిసారి 1978లో ఎమ్మెల్యే గెలిచారు. ఆస్పత్రులు, కాలేజీలు నిర్మించారు. అప్పటి నుంచి 45 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు వైఎస్సార్ కుటుంబం సేవ చేస్తోంది. సీఎం జగన్‌కు కూడా పులివెందుల ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైఎస్సార్ చేసిన అభివృద్ధిని సీఎం జగన్ కొనసాగిస్తున్నారు. మా కుటుంబం కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది. వైఎస్సార్, సీఎం జగన్‌కు పులివెందుల ప్రజల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. పులివెందులలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో ఇంటింటికి ప్రచారం చేసి.. సీఎం జగన్‌కు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరుతున్నా. వెళ్లిన ప్రతీ చోట్లా అంతా ఆప్యాయంగా పలకరించడం సంతోషంగా ఉంది. ఆ స్పందనే సీఎం జగన్ గెలుపును తెలియజేస్తోందని వైఎస్ భారతి అన్నారు👉: ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వీళ్లా YSR వారసులు?.. పులివెందులలో సీఎం జగన్ ఫైర్
వైఎస్సార్, సాక్షి: ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు.. ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్.. అంతకు ముందు సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. ‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ.... పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయడం, మంచి మనసుతో ఉండడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది ఈ పులివెందుల బిడ్డేలే. .. వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు?.. ప్రజలే. మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారు... వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?. వైఎస్సార్ పేరును ఛార్జిషీట్లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్ వారసులా?.. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వాళ్లా వైఎస్సార్ వారసులు?.. అని ప్రశ్నిస్తున్నా... YSR పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా? కాదా?. .. నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా?. ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే.. అవినాష్ అక్కడికి వెళ్లారు?. పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా!. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదు. అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్‌ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి.ఇదీ చదవండి: సునీత, దస్తగిరి లాలూచీ!.. అవినాష్ లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే.... బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు?. తమ సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రతీ ఒక్కరూ చెడిపోయిన ఈ రాజకీయాలను చూడండి. .. పరిపాలనలోనూ, పథకాల్లోనూ, సంక్షేమంలోనూ జగన్‌ను ఎవరూ కొట్టలేరు. ఏ రంగంలోనూ జగన్ కంటే మంచి చేశామని వాళ్లు చెప్పుకోలేరు. వైఎస్సార్, జగన్ పేర్లు చెరిపేయాలని చూసేవాళ్లు మన శత్రువులే. జగన్ బ్రాండ్, వైఎస్సార్ బ్రాండ్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్నవాళ్లకు గుణపాఠం చెప్పడానికి పులివెందుల సిద్ధమా? అని సీఎం జగన్ గర్జించారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. పులివెందుల వాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలో ఆ కాలేజీ ప్రారంభిస్తాం. పేదలకు మంచి చేయాలని ఆ దేవుడు మీ బిడ్డకు సీఎం పదవి ఇచ్చాడు. అందుకే మరింత మంచిని అందించే అవకాశం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
నేడు పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం 7.45 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు.స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. -
పులివెందుల నా ప్రాణం.. శత్రువులతో చేతులు కలిపిన నా చెల్లెమ్మలు.. సీఎం జగన్ డైనమిక్ ప్రసంగం (ఫొటోలు)
-
Bus Yatra: ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. బుధవారం ఉదయం 10.56 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహా్ననికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అరి్పస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజాక్షేత్రంలోనే జననేత.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నాటి అరాచకాలను ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. అదే సమయంలో టీడీపీ–జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జతకలిశాక మూడు పారీ్టలు చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టటాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు. -
Jagan Bus Yatra : మేమంతా సిద్ధం
ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం సాయంత్రం జరగనున్న మేమంతా సిద్ధం సభ నిర్వహణ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఉన్న తిమ్మయ్య కల్యాణ మండపం ఎదురుగా సభను నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తున్నారు. మార్చి 27, బుధవారం నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. "రేపు(27- మార్చి) ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి,సర్వరాజుపేట,వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల,నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్,చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు" అని తెలిపారు. జనంతో మమైకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర వీరపునాయునిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరులో జరగనున్న తొలి ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఇందు కోసం అన్ని జాగ్రత్తలు, చర్యలు చేపట్టారు. ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. బస్సు యాత్రకు సిద్ధం వేంపల్లె: ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే బస్సు యాత్రకు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన ఇడుపులపాయలోని బస్సుయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐలు గోవింద్‌రెడ్డి, చాంద్‌బాషా, ఎస్సై రంగారావు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. జగన్ సభ రూట్ మ్యాప్ ప్రొద్దుటూరు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభ రూట్ మ్యాప్ ఇలా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. అక్కడి నుంచి వీరపునాయునిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్‌కు చేరుకోనున్నారు. -
మార్చి 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్‌ను వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని, అదే విషయాన్ని ప్రజలకు చెప్పి ఓటు అడుగుతామని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగు సిద్ధం సభలతో క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేశాం. ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి. దీనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు. ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుస్తారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు’ అని సజ్జల పేర్కొన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు. ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి. ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది. వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం . తొలిరోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్. నంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర ►ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ 4 సిద్ధం సభలు లక్షలాది మంది కార్యకర్తలతో నిర్వహించింది. ►రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించాం ►ఈ నాలుగు సభలు జరిగిన తీరు, అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు..మా అధినాయకుడు సీఎం జగన్‌కి నీరాజనాలు పట్టారు ►చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారుపేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారు ►మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి.. ఇలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు అనే మార్గదర్శకత్వం ఇచ్చారు ►ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్ స్టెప్‌గా బస్సు యాత్ర చేపడుతున్నారు ►ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ బస్సు యాత్ర నిర్వహించాలని తలపెట్టాం ►ఒక వైపు సిద్ధం సభల ప్రతిధ్వని వినిపించింది ►జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఇటువైపు పడింది ►దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని బూత్ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారు ►వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నామని వారు ప్రకటిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ►ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు ►కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర ►రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అని డిక్లేర్ చేసే సందర్భం ఇది. ►27వ తేదీ మొదలైతే.. నోటిఫికేషన్ వచ్చే దాదాపు 18వ తేదీ వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది ►సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నీ కలిసి వచ్చేలా బస్సు యాత్ర ప్లాన్ జరుగుతుంది ►ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు మొదలైనప్పటి నుంచీ ఎన్నికల సభలకు ముఖ్యమంత్రి బయలుదేరతారు ►మా పార్టీ పెట్టినప్పటి నుంచీ అట్టడుగు వర్గాల వైపు నిలబడి అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు వారి కోసం జగన్ తపన పడ్డారు ►ఇదే రీతిలో 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. పండుగలు, సెలవులు వచ్చినా ఆయన అక్కడే ఉంటారు ►27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు ►ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి ‘మేమంతా సిద్ధం’సభ జరుగుతుంది ►చాలా పెద్ద ఎత్తున ఈ సభలు జరుగుతాయి.. అంచనాలకు మించి జరుగుతాయి ►గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకో ఒక మహాసభ జరుగుతుంది ►ప్రతి పార్లమెంటు, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్ చేసేలా ఈ సభలు జరుగుతాయి ►బస్సు యాత్రలో ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది ►ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు ►మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారు. సభ జరిగే నియోజకవర్గానికి వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు ►వీలైనంత వరకూ ఒక పార్లమెంటులో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడితే బాగుంటుందని భావిస్తున్నాం ►ఎంత మంది కూటమి కట్టినా మా బ్రాండ్ జగన్ ►అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకంగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మా వైపు ఒంటరిగా వస్తున్నారు ►స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్సార్సీపీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ఈ యాత్రల తర్వాత ఎన్నికల సభలకు వెళ్తాం. ఇప్పటికి బస్సు యాత్ర 3 రోజుల వరకూ ఖరారు అయింది ►తొలిరోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల లేదా అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ ►మూడో రోజు కర్నూలు పార్లమెంటులోకి ప్రవేశిస్తారు. ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ►ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ యాక్టివిటీ అంతా పాదయాత్రలో ఎలా జరిగిందో అలానే జరుగుతుంది మొదటి మూడు రోజుల షెడ్యూల్ విడుదల ►ఈ నెల 27 నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర ►ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం ►తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ►ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు ►27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ ►28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ ►30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ -
Bus Yatra: జనంలోకి సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ( ఫైల్ ఫోటో ) ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైఎస్సార్సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇదీ చదవండి: ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో!? -
అభివృద్ధికి నిదర్శనం.. పులివెందుల పట్టణం..!
సాక్షి, పులివెందుల: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయం.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డపై జనం ముందు సగర్వంగా పేర్కొన్నారు. ఒక్క రోజు వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన సీఎం జగన్.. సోమవారం పులివెందుల పట్టణ, నియోజకవర్గ పరిధిలో రూ. 861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన పలు నిర్మాణాల వివరాలు.. ► రూ. 500 కోట్ల నాబార్డ్, ఆర్.ఐ.డి.ఎఫ్-37 నిధులు వెచ్చించి.. అధునాతన వసతులతో నూతనంగా నిర్మనించిన డా. వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జెనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) భవనాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్ తో మొత్తం 750 మంది విద్యార్థులు, 627 పడకల కేపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ప్రధానంగా ఓపిడి బ్లాక్, ఐపీడి బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలు ఉన్నాయి. ► పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద.. రూ. 20.15 కోట్ల (రాష్ట్ర ప్రభుత్వం, పాడా నిధులతో) వ్యయంతో జిల్లాకే తలమానికంగా, అత్యాధునిక సాంకేతిక, సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు (4×150) కోల్డ్ రూములు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు (6×21) ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జితో పాటు.. బనానా, స్వీట్ లైం కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లినింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ► పులివెందుల పట్టణంలో 2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ (రూ.10కోట్లు), పాడా (రూ.28 కోట్లు) నిధులతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డా.వైఎస్ఆర్ మినీ సెక్రెటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే&అకౌంట్స్, సబ్ ట్రెజరీ, 3.కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, సీడీపీవో కార్యాలయం, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాకులు ఉన్నాయి. ► పులివెందుల పట్టణ నడిబొడ్డున రూ.70 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా సర్వాంగ సుందరంగా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కెప్ మధ్యలో చూపరులను ఆకట్టుకునేలా డా.వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్ లో భాగంగా... రూ. 11.04 కోట్లతో (రాష్ట్ర ప్రభుత్వం+ఏపీఎస్పీడిసిఎల్ నిధులు) అభివృద్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. వైఎస్ఆర్ జంక్షన్ కు 500 మీటర్ల దూరంలో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో.. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్, రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల ఫుట్ పాత్, 2.25 మీటర్ల సీటింగ్ ఏరియా, బెంచిలు, 3 మీటర్ల పార్కింగ్ ఏరియా, స్టోన్ బొల్లార్డ్స్, రోడ్డుకు ఇరువైపులా నగిషీలతో తయారైన విద్యుత్ దీపాలు, పూల కుండీల ఏర్పాటుతో.. 6 మీటర్ల బిటి క్యారేజ్ వే వంటి ప్రత్యేకతలు పులివెందుల పట్టణ సరికొత్త జీవనశైలికి నాంది కానున్నాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ. 20.69 కోట్లతో అధునాతన వసతులతో 4595 చదరపు మీటర్లలో అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భావన సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో 58 షాపులు, మొదటి ఫ్లోర్ లో 32 షాపులతో పాటు.. టాయిలెట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. పట్టణ నడిబొడ్డున రూ.80 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన గాంధీ జంక్షన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సర్కిల్ లో అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టి పడేలా ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం, చుట్టూ పూలమొక్కలతో ల్యాండ్ స్కెప్, లైటింగ్స్ పులివెందుల పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా.. రూ.65.99 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో.. ఎంట్రన్స్ ప్లాజా, ఎంట్రన్స్ వాటర్ ఫౌంటెన్, "ఐ లవ్ పులివెందుల" ఎలివేటెడ్ స్టెప్స్, ఓ.ఏ.టి. ఏరియా, బ్రిడ్జి, మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్, మేజ్ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, కనెక్టింగ్ బ్రిడ్జి, ఐస్ ల్యాండ్ -స్టోన్ గజాబొ, గజాబొ పార్క్, పెర్గోలా, బోటింగ్ జెట్టీ, అర్బన్ ఫారెస్ట్ తదితర ప్రత్యేక సదుపాయాలు పులివెందుల పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందివ్వనున్నాయి. ► పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా.. ప్రయివేట్ పార్ట్నర్ ఆధ్వర్యంలో.. రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన.. రెడీమేడ్ సూట్స్, వస్త్ర ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన, పేరెన్నికగన్న "ఆదిత్య బిర్లా యూనిట్" ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారభించారు. ఈ పరిశ్రమ స్థాపనతో 2100 మందికి ఉద్యోగావకాశాలు అందనున్నాయి. ఇప్పటికే 500 మంది ఉద్యోగాలను కూడా పొందారు. ► ఇడుపులపాయ ఎస్టేట్ లో రూ.39.13 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ, పాడా నిధులతో 16 ఎకరాల్లో నిర్మించిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఇప్పటికే పరిసర అందాలు, నెమళ్ల పార్కు, పచ్చదనంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఇడుపులపాయ ఎస్టేట్.. నూతనంగా ఏర్పాటు చేసిన డా. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ తో మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇందులో 48 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం, ఆడియో విజువల్ బ్లాక్, ఫోటో గ్యాలరీ, ఎంట్రన్స్ బ్లాక్, పెవిలియన్ బ్లాక్ లతో పాటు.. చిల్డ్రన్ పార్క్, డిపేక్షన్స్, ట్రాపికల్ గార్డెన్ లోటస్ పాండ్, స్టెప్పుడ్ గార్డెన్, ఫ్లోరల్ పార్క్, స్టోన్ గాజేబోస్, పాదయాత్రకు సంబందించిన 21 విగ్రహాల సమూహం, 3 టాయిలెట్ బ్లాకులు పర్యాటకులకు సంతృప్తి స్థాయిలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అందివ్వనున్నాయి. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ రోజు తన సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా మీ అందరిముందు నిలుచున్నానంటే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే" అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి.. పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతం అని.. కాలానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందన్నారు. సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాలన్నింటిలోను.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు పాల్గొనగా.. జిల్లా ఎస్పి సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర కమీషనర్ ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవోలు అన్ని కార్యక్రమాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి లతో పాటు.. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఎం. టి.కృష్ణబాబు, పాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
పులివెందులలో సీఎం జగన్ పర్యటన
AP CM YS Jagan Pulivendula Tour Updates ఆదిత్యా బిర్లా గార్మెంట్స్ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►ఆదిత్యా బిర్లా యూనిట్ ఫేజ్-1 ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ వైఎస్సార్ మెమోరియల్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►వైఎస్సార్ పార్క్‌లో చిల్డ్రన్ పార్క్, గార్డెన్ నిర్మాణం. ►రూ.39.13 కోట్లతో వైఎస్సార్ మెమోరియల్ పార్క్ నిర్మాణం. పులివెందులలో మినీ సెక్రటేరియెట్ ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందుల నియోజకవర్గంలో డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ►ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ►ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా కాంప్లెక్స్ నిర్మాణం వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం జగన్ ►పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ►వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్ బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభం.. ►పులివెందులలో బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.20 కోట్ల రూపాయల వ్యయంతో ప్యాక్ హౌస్‌ను నిర్మించిన ప్రభుత్వం ►బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వల్ల రైతులకు ఉపయోగం ►అరటి నాణ్యత ఆధారంగా ఎగుమతులకు అవకాశం పులివెందులలో డాక్టర్ వైఎస్సార్ సర్వజన(జనరల్) ఆస్పత్రి ప్రారంభం ►పులివెందులలో వైఎస్అర్ మెడికల్ కాలేజీ, అసుపత్రిని ప్రారంభించిన సిఎం వైఎస్ జగన్ ►అసుపత్రిలో డాక్టర్ వైఎస్అర్ విగ్రహాన్ని అవిష్కరించిన సీఎం జగన్ ►మెడికల్ కళాశాల, అసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన వైద్య అరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణబాబు ►కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్దానిక నాయకులు పులివెందులలో మెడికల్ కాలేజీ ►51 ఎకరాల్లో, రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మితం ►డా. వైయస్సార్ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తరగతులు 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం ► ఆస్పత్రి నిర్మాణ పనుల్ని పరిశీలించిన సీఎం జగన్ ►స్థానిక సిబ్బందితో నేరుగా మాట్లాడి వాళ్ల ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్ ►ఆ సమస్యల్ని నోట్ చేసుకోవాలని ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్ సూచన ►అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే వాళ్ల సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్న సీఎం జగన్ వైఎస్సార్ ఆస్పత్రికి చేరుకున్న సీఎం జగన్ ►పులివెందుల పర్యటనలో.. డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ ►మెడికల్ సిబ్బందిని పలు వివరాలు అడిగిన తెలుసుకున్న సీఎం జగన్ ► పలువురికి సీఎం జగన్ అభినందనలు ►కాసేపట్లో సీఎం జగన్ చేతుల మీదుగా కాలేజ్ ప్రారంభం పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►రోడ్డు మార్గాన మెడికల్ కాలేజీ వద్దకు బయలుదేరిన సీఎం జగన్ ►కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్. ►ముఖ్యమంత్రి జగన్‌కు స్వాగతం పలికిన అధికారులు, జిల్లా నేతలు పులివెందుల బయల్దేరిన సీఎం జగన్ ►వైఎస్సార్ జిల్లా పులివెందుల పర్యటన కోసం తాడేపల్లి నుంచి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించనున్న సీఎం సొంత నియోజక వర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చేరుకుని దానిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్సార్ జంక్షన్ కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. పులివెందులలో గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్-1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. -
వైఎస్సార్సీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు. ‘‘నాతో వైఎస్సార్సీపీ నేతలు టచ్‌లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది. ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది. వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారు’’ అని సతీష్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది. సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తా’’ అని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
బాబు మాటలే బట్టీపట్టి చెబుతున్న షర్మిల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని షర్మిల.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్‌నే పోటీ పరీక్షలకు విద్యార్థి సిద్ధమైనట్లుగా బట్టీ పట్టి చదువుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆమె మాట్లాడుతున్న మాటలకు ఒకదానికి, మరొకదానికి పొంతన లేదన్నారు. షర్మిల మాటలను చూస్తే.. బహుశా ఆమె తెలంగాణలో ఉండి మాట్లాడుతున్నట్లుగా అనుకుంటున్నారేమో అని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సోనియా వేధింపులు షర్మిలకు తెలుసు వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తాళలేక మరణించిన వారి కుటుంబాలకు భరోసా కల్పించడానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి సోనియాగాంధీ యత్నించారు. అప్పట్లో సోనియాను జగన్, విజయమ్మ, షర్మిల కలిశారు. అక్కడేం జరిగిందో షర్మిలకు కూడా తెలుసు. వైఎస్ పథకాలను తుంగలో తొక్కి, ఆశయాలను పక్కన పెట్టేందుకు సిద్ధమైన సోనియాతో విభేదించి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి కక్ష సాధింపు మొదలు పెట్టి వేధించిన విషయమూ షర్మిలకు తెలుసు. వైఎస్ వివేకానందరెడ్డిని మంత్రిని చేసిన సోనియా.. వైఎస్సార్సీపీ స్థాపించాక పులివెందుల ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మపై వివేకానందరెడ్డిని పోటీ పెట్టడం ద్వారా కుటుంబాన్ని చీల్చిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడూ అదే రీతిలో కుటుంబాన్ని చీల్చి షర్మిలను పీసీసీ చీఫ్‌గా చేశారని జగన్ ఎత్తిచూపారు. ప్రజలు జగనే వైఎస్‌కు సరైన వారసుడు అనుకున్నారు కాబట్టే వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. మహానేత వైఎస్ ఆశయ సాధనే ఊపిరిగా.. సీఎం జగన్ వైఎస్సార్ బిడ్డగా ఆ రోజు మొదలు పెట్టిన ప్రస్థానం.. నేడు ఉధృతమైన ప్రవాహంలా సాగుతోంది. దానికి కారణం వైఎస్ ఆశయాలను, ఆలోచనలను జగన్ మనసా వాచా నమ్మి వాటిని మరింత మెరుగుపర్చి అమలు చేస్తున్నారు. పార్టీని నడపడం, విలువలను పాటించడం, నిజాయితీ, నిబద్దతలో ఎన్ని ఆటుపోట్లనైనా తట్టుకొంటూ వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆనాడు అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో పెట్టడం నుంచి చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నప్పుడూ జగన్ చలించలేదు. ఇలా సొంతంగా ఎదిగిన వ్యక్తి జగన్. జగన్ తండ్రి వైఎస్ అని చెప్పుకోవడం ఏ తండ్రికైనా గర్వకారణమే. వైఎస్ బిడ్డగా, జగన్ సోదరిగా షర్మిలకు అభిమానులు గౌరవం ఇస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు. ఏం అన్యాయం జరిగిందో షర్మిలే చెప్పాలి జగన్ కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీని స్థాపించినప్పుడు లక్షలాది కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. త్యాగాలు చేశారు. అందరూ కష్టపడ్డారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనే కదా షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ ఎంతో కష్టపడ్డారు. అందరికీ రకరకాల బాధ్యతలు అప్పజెప్పారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించారు. షర్మిల పాదయాత్ర చేశారు. అన్యాయం జరిగిందని షర్మిల అంటున్నారు. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలి. పదవి కోసమే ఆమె ఆరోజు జగన్ కోసం నిలబడ్డానని స్పష్టంగా చెప్పగలిగితే సమాధానం చెప్పొచ్చు. పదవుల పంపకంలో అన్యాయం చేశారా? కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది చర్చించడానికి అర్హమైనదేనా? కుటుంబం పదవులు పంచుకొంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? వైఎస్సార్టీపీ కార్యకర్తలకు షర్మిల ఏం న్యాయం చేశారు? తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీ కోసం చాలా మంది కష్టపడి ఉంటారు కదా. వారికి షర్మిల ఏం న్యాయం చేశారు? వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేశారు? వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాష్ట్రానికి వచ్చిన షర్మిలను భుజానికెత్తుకుని మోస్తున్న ఎల్లో మీడియా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో షర్మిలకు భాగముందని ఎందుకు రాయలేదు? అప్పుడూ ఇప్పుడూ జగన్‌పై షర్మిల బాణాలు ఎక్కుపెట్టినప్పుడే వాటినే ఎల్లో మీడియా ప్రచురిస్తోంది. వైఎస్ మరణంపై రేవంత్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు షర్మిల ఎందకు స్పందించలేదు? వైఎస్ పథకాలు లేవంటే తీసుకున్న వాళ్లంతా ఎవరు? వైఎస్ పథకాలను తీసేశారని షర్మిల మాట్లాడితే ఏమనాలో అర్థం కావడంలేదు. చంద్రబాబు, రాధాకృష్ణ వద్ద నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి చెప్పినప్పుడు వాస్తవాలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో వైఎస్ అమలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా ఇప్పుడు షర్మిల లేవంటున్నారు. రైతులకు నేడు ఇస్తున్నంత భరోసా దేశంలో మరెక్కడైనా ఉందా? అసలు క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటున్నారు. తీసుకున్న రైతులంతా ఏమనుకుంటారు? పాపం ఆమె తెలియక ఇంత అబద్ధం మాట్లాడి ఉండొచ్చు. బహుశా చంద్రబాబు కూడా వీటిపై మాట్లాడటానికి సాహసం చేయకపోవచ్చు. చంద్రన్న కానుకలు లేవని అనొచ్చు కానీ, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లేవని మాత్రం ఆయనా అనలేడు. షర్మిలమ్మే తిట్లు తింటుందిలే అని చంద్రబాబు ఆ తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చి ఉండొచ్చు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో సీఎం జగన్ ఆరోజుతో పొలిస్తే 3వేలకు పైగా ప్రొసీజర్స్ పెంచారు. రూ.25 లక్షల వరకూ పరిమితి పెంచారు. అర్హత కోసం ఆదాయాన్ని రూ.5 లక్షలు చేశారు. 90 శాతం కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవి నిజం కాదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఆనాడు రూ.30 వేల నుంచి రూ. 35 వేలు ఇస్తే, ఇప్పుడు వంద శాతం చెల్లిస్తున్నది వాస్తవం కాదా? కేవలం జగన్ చెల్లెలు, వైఎస్ బిడ్డ అనే ఏకైక అర్హతతో ఇక్కడకు సోనియా గాంధీ తెచ్చి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. రోజు రోజుకు అబద్ధాలతో షర్మిల మాటల దాడి చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలి. హోదా, విశాఖ స్టీల్‌పై మోదీ సభలోనే గళమెత్తిన జగన్ బీజేపీకి వైఎస్సార్సీపీ టూల్లా మారిందని, రాష్ట్రాన్ని అప్పజెప్పిందని షర్మిల చేసిన ఆరోపణలు అర్థరహితం. స్టీల్ ప్లాంట్ విషయం కేంద్రానికి సంబంధించింది. ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్‌ను నడిపేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం మేం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అప్పులను రీస్ట్రక్చర్ చేయడం, గనులు కేటాయించడం, అదనంగా ఉండే భూమిని అమ్మి ఆ సొమ్ముతో అప్పులను తగ్గించుకోవడం ద్వారా స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపించవచ్చని సూచిస్తూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ పరిశ్రమ వ్యాపారం కాదని, సెంటిమెంట్‌కు సంబంధించినదని కూడా చెప్పాం. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? ప్రధాని ఉన్న వేదికపైనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం జగన్ గళమెత్తారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఇంకేదైనా ఉందా? పోరాటం అంటే నిర్వచనం, స్వరూపం ఎలా ఉండాలో షర్మిలే చెప్పాలి. గంగవరం పోర్టుపై షర్మిల మాటలు సత్యదూరం. ఆ పోర్టులో మనకున్న వాటా బదులుగా వచ్చిన రూ.600 కోట్లను మరో మూడు పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తున్నాం. గంగవరం పోర్టుపై మన హక్కును కోల్పోలేదు. లీజు తర్వాత మళ్లీ అది ప్రభుత్వానికే వస్తుంది. ఇది కాక కొంత రెవెన్యూ షేరింగ్ కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఒక పెద్ద సంస్థ వచ్చి ఆపరేషన్స్ చేస్తే రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇలానే చేస్తోంది. ఆమె ఇచ్చింది తలా తోక ఉన్న స్టేట్మెంటేనా? మణిపూర్‌పై అప్పుడెందుకు మాట్లాడలేదు? మణిపూర్ అంశం షర్మిలమ్మ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎందుకు పోరాడలేదు? ఇక్కడకు రాగానే బీజేపీ, మణిపూర్ అంటూ క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనడంలో ఆంతర్యం తెలియడంలేదా? ఇదంతా ఆమె అనుకున్నది కాదు... చంద్రబాబు అనుకున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లు కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చారు. సంఖ్యా బలం లేకున్నా పోటీనా? శాసనసభలో సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీకి దక్కుతాయి. సంఖ్యా బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని దుర్మార్గమైన, వికృతమైన ఆలోచనలతో చంద్రబాబు నాటకం ఆడాలనుకుంటున్నారు. ఎన్నికలప్పుడు అభ్యర్థుల మార్పు సాధారణం. మరింత మెరుగైన ఫలితాల కోసమే మార్పులు చేస్తున్నాం. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలను ఎలా ఉపయోగించుకోవాలో మేం చూసుకుంటాం. దొంగతనంగా వారిని లాక్కోవాలని చంద్రబాబు ప్రయత్నించడం ప్రజాస్వామ్యమేనా? గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారం. భావోద్వేగంతో స్పందించిన మాటలపై చిల్లర రాజకీయమా? సీఎం జగన్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఏదీ ఆయన హక్కు అనుకోరు. చంద్రబాబు అధికారం ఆయన హక్కు అనుకుంటాడు. చంద్రబాబు ఎప్పుడూ బాధ్యతతో అధికారంలోకి రాలేదు. అందుకే ఆయన అధికారంలోకి రాగానే.. మరో 50 ఏళ్ల తర్వాత ఏం చేస్తాడో ఇప్పుడే చెబుతుంటాడు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. ఆ స్పృహ జగన్‌కు ఉంది. ఎప్పుడైనా ప్రజలే నిర్ణేతలని గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్లి దీవెనలు కోరాలని భావిస్తారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘మీకిది సంతృప్తినిస్తోందా’ అని అడిగితే.. దానికి భావోద్వేగంతో జగన్ స్పందించారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో ఇన్ని కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించి.. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు నింపినందుకు జన్మ ధన్యమైందని చెబుతూ.. ఒకవేళ తప్పుకోవాలన్నా పూర్తి సంతృప్తితో చేస్తాను అన్నారు. ఎవరైనా ఇలా అనగలరా? మహా స్థితప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. ఇప్పటికీ 75 ఏళ్ల వయసులోనూ ఎలా ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకోవాలని అనుకునే చంద్రబాబు అయితే ఈ మాట అనలేడు. ఈ రాష్ట్రానికి ఏమి చేయగలిగాడో చెప్పుకోవడానికి జగన్‌కు చాలా ఉంది. ఆ తృప్తినే ఆయన వ్యక్తీకరించారు. దానికి ఓ చిల్లర భావాన్ని ఇచ్చి ఎల్లో మీడియా సంతోషిస్తే ఏం చేయలేం.