మార్చి 27 నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర
ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు
27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ
28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని, అదే విషయాన్ని ప్రజలకు చెప్పి ఓటు అడుగుతామని సజ్జల పేర్కొన్నారు.
‘‘నాలుగు సిద్ధం సభలతో క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేశాం. ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి. దీనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు. ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలుస్తారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు’ అని సజ్జల పేర్కొన్నారు.
సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు. ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి. ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది. వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం . తొలిరోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్. నంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర
►ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ 4 సిద్ధం సభలు లక్షలాది మంది కార్యకర్తలతో నిర్వహించింది.
►రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించాం
►ఈ నాలుగు సభలు జరిగిన తీరు, అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు..మా అధినాయకుడు సీఎం జగన్‌కి నీరాజనాలు పట్టారు
►చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారుపేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారు
►మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి.. ఇలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు అనే మార్గదర్శకత్వం ఇచ్చారు
►ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్ స్టెప్‌గా బస్సు యాత్ర చేపడుతున్నారు
►ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ బస్సు యాత్ర నిర్వహించాలని తలపెట్టాం
►ఒక వైపు సిద్ధం సభల ప్రతిధ్వని వినిపించింది
►జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఇటువైపు పడింది
►దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని బూత్ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారు
►వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నామని వారు ప్రకటిస్తున్నారు.
ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ
►ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు
►కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర
►రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అని డిక్లేర్ చేసే సందర్భం ఇది.
►27వ తేదీ మొదలైతే.. నోటిఫికేషన్ వచ్చే దాదాపు 18వ తేదీ వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది
►సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నీ కలిసి వచ్చేలా బస్సు యాత్ర ప్లాన్ జరుగుతుంది
►ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు మొదలైనప్పటి నుంచీ ఎన్నికల సభలకు ముఖ్యమంత్రి బయలుదేరతారు
►మా పార్టీ పెట్టినప్పటి నుంచీ అట్టడుగు వర్గాల వైపు నిలబడి అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు వారి కోసం జగన్ తపన పడ్డారు
►ఇదే రీతిలో 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. పండుగలు, సెలవులు వచ్చినా ఆయన అక్కడే ఉంటారు
►27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు
►ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి ‘మేమంతా సిద్ధం’సభ జరుగుతుంది
►చాలా పెద్ద ఎత్తున ఈ సభలు జరుగుతాయి.. అంచనాలకు మించి జరుగుతాయి
►గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకో ఒక మహాసభ జరుగుతుంది
►ప్రతి పార్లమెంటు, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్ చేసేలా ఈ సభలు జరుగుతాయి
►బస్సు యాత్రలో ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది
►ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు
►మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారు. సభ జరిగే నియోజకవర్గానికి వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు
►వీలైనంత వరకూ ఒక పార్లమెంటులో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడితే బాగుంటుందని భావిస్తున్నాం
►ఎంత మంది కూటమి కట్టినా మా బ్రాండ్ జగన్
►అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకంగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మా వైపు ఒంటరిగా వస్తున్నారు
►స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్సార్సీపీకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
►ఈ యాత్రల తర్వాత ఎన్నికల సభలకు వెళ్తాం. ఇప్పటికి బస్సు యాత్ర 3 రోజుల వరకూ ఖరారు అయింది
►తొలిరోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల లేదా అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ
►మూడో రోజు కర్నూలు పార్లమెంటులోకి ప్రవేశిస్తారు. ఎమ్మిగనూరులో సభ ఉంటుంది
►ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ యాక్టివిటీ అంతా పాదయాత్రలో ఎలా జరిగిందో అలానే జరుగుతుంది
మొదటి మూడు రోజుల షెడ్యూల్ విడుదల
►ఈ నెల 27 నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర
►ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
►తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
►ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు
►27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ
►28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ
►30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ
Comments
Please login to add a commentAdd a comment