YSR Kadapa Elections
-
Bus Yatra: ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. బుధవారం ఉదయం 10.56 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహా్ననికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అరి్పస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజాక్షేత్రంలోనే జననేత.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నాటి అరాచకాలను ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. అదే సమయంలో టీడీపీ–జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జతకలిశాక మూడు పారీ్టలు చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టటాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు. -
మార్చి 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్‌ను వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని, అదే విషయాన్ని ప్రజలకు చెప్పి ఓటు అడుగుతామని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగు సిద్ధం సభలతో క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేశాం. ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి. దీనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు. ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుస్తారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు’ అని సజ్జల పేర్కొన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు. ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి. ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది. వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం . తొలిరోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్. నంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర ►ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ 4 సిద్ధం సభలు లక్షలాది మంది కార్యకర్తలతో నిర్వహించింది. ►రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించాం ►ఈ నాలుగు సభలు జరిగిన తీరు, అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు..మా అధినాయకుడు సీఎం జగన్‌కి నీరాజనాలు పట్టారు ►చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారుపేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారు ►మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి.. ఇలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు అనే మార్గదర్శకత్వం ఇచ్చారు ►ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్ స్టెప్‌గా బస్సు యాత్ర చేపడుతున్నారు ►ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ బస్సు యాత్ర నిర్వహించాలని తలపెట్టాం ►ఒక వైపు సిద్ధం సభల ప్రతిధ్వని వినిపించింది ►జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఇటువైపు పడింది ►దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని బూత్ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారు ►వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నామని వారు ప్రకటిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ►ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు ►కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర ►రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అని డిక్లేర్ చేసే సందర్భం ఇది. ►27వ తేదీ మొదలైతే.. నోటిఫికేషన్ వచ్చే దాదాపు 18వ తేదీ వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది ►సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నీ కలిసి వచ్చేలా బస్సు యాత్ర ప్లాన్ జరుగుతుంది ►ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు మొదలైనప్పటి నుంచీ ఎన్నికల సభలకు ముఖ్యమంత్రి బయలుదేరతారు ►మా పార్టీ పెట్టినప్పటి నుంచీ అట్టడుగు వర్గాల వైపు నిలబడి అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు వారి కోసం జగన్ తపన పడ్డారు ►ఇదే రీతిలో 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. పండుగలు, సెలవులు వచ్చినా ఆయన అక్కడే ఉంటారు ►27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు ►ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి ‘మేమంతా సిద్ధం’సభ జరుగుతుంది ►చాలా పెద్ద ఎత్తున ఈ సభలు జరుగుతాయి.. అంచనాలకు మించి జరుగుతాయి ►గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకో ఒక మహాసభ జరుగుతుంది ►ప్రతి పార్లమెంటు, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్ చేసేలా ఈ సభలు జరుగుతాయి ►బస్సు యాత్రలో ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది ►ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు ►మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారు. సభ జరిగే నియోజకవర్గానికి వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు ►వీలైనంత వరకూ ఒక పార్లమెంటులో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడితే బాగుంటుందని భావిస్తున్నాం ►ఎంత మంది కూటమి కట్టినా మా బ్రాండ్ జగన్ ►అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకంగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మా వైపు ఒంటరిగా వస్తున్నారు ►స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్సార్సీపీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ఈ యాత్రల తర్వాత ఎన్నికల సభలకు వెళ్తాం. ఇప్పటికి బస్సు యాత్ర 3 రోజుల వరకూ ఖరారు అయింది ►తొలిరోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల లేదా అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ ►మూడో రోజు కర్నూలు పార్లమెంటులోకి ప్రవేశిస్తారు. ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ►ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ యాక్టివిటీ అంతా పాదయాత్రలో ఎలా జరిగిందో అలానే జరుగుతుంది మొదటి మూడు రోజుల షెడ్యూల్ విడుదల ►ఈ నెల 27 నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర ►ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం ►తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ►ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు ►27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ ►28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ ►30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ -
బద్వేల్.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు. ఇప్పటివరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావమయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. అమృత్‌కుమార్ నుంచి డాక్టర్ రాజశేఖర్ వరకూ.. అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్‌కుమార్ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరుగయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎన్డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల నాటికి డాక్టర్ రాజశేఖర్ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. బాబుది సైతం అదే ధోరణి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్ రాజశేఖర్ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే’
సాక్షి, బద్వేల్: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. ‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్‌ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్‌ను బీజేపీకి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్‌పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్ పరుగులు -
AP: మళ్లీ జగనే సీఎం: బస్సు యాత్రలో ఎంపీ నందిగాం
అన్నమయ్య, సాక్షి: రైల్వేకోడూరు ప్రజల అనందం చూస్తుంటే ఎమ్మెల్యేగా శ్రీనివాసులు, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. రైల్వేకోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ నందిగాం సురేష్‌బాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు. ‘నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనకు పద్నాలుగున్నర నెలల చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు పాలనలో కుళ్లు కుతంత్రాలు తప్ప చేసిందేమీ లేదు. బినామీలకు దోచిపెట్టారు. బాబు ఎవరికీ చేసిందేమీ లేదు. ఏమి చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నుపోటు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అదే వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేశారు. ఎంత మంది ఏకమై వచ్చినా ఊడేదేమి లేదు. రాష్టానికి మేలు చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఏపీకి దశ దిశ చూపే వ్యక్తి సీఎం జగన్. కోడూరు అభివృద్దికి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. మీరు మళ్లీ అవకాశమిస్తే మళ్లీ మంత్రి అవుతారు’అని ఎంపీ సురేష్ అన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నవ్వులోనే ఎవరికి ఏ కష్టమోచ్చినా అండగా నేను ఉన్నానన్న నమ్మకం కలుగుతుంది. యాదవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమానత్వం తీసుకువచ్చారు. చంద్రబాబు మాత్రం బడుగు బలహీన వర్గాల వారిని అవమానపరిచారు. ఇలాంటి సీఎంను, ఎమ్మెల్యే శ్రీనివాసులును మళ్లీ భారీ మోజార్టీతొ గెలిపించాలి’ అని రమేష్ యాదవ్ అన్నారు. ఇదీచదవండి.. కేశినేని నాని వర్సెస్ చిన్ని -
చంద్రబాబుకు నిరసన సెగ.. నల్ల జెండాలతో గోబ్యాక్ అంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్వేలులో నిరసన సెగ తగిలింది. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. వివరాల ప్రకారం.. బద్వేలు పర్యటన వేళ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసనలు చెప్పారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు