
అన్నమయ్య, సాక్షి: రైల్వేకోడూరు ప్రజల అనందం చూస్తుంటే ఎమ్మెల్యేగా శ్రీనివాసులు, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. రైల్వేకోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ నందిగాం సురేష్‌బాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు.
‘నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనకు పద్నాలుగున్నర నెలల చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు పాలనలో కుళ్లు కుతంత్రాలు తప్ప చేసిందేమీ లేదు. బినామీలకు దోచిపెట్టారు. బాబు ఎవరికీ చేసిందేమీ లేదు. ఏమి చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నుపోటు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అదే వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేశారు.
ఎంత మంది ఏకమై వచ్చినా ఊడేదేమి లేదు. రాష్టానికి మేలు చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఏపీకి దశ దిశ చూపే వ్యక్తి సీఎం జగన్. కోడూరు అభివృద్దికి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. మీరు మళ్లీ అవకాశమిస్తే మళ్లీ మంత్రి అవుతారు’అని ఎంపీ సురేష్ అన్నారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ..
‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నవ్వులోనే ఎవరికి ఏ కష్టమోచ్చినా అండగా నేను ఉన్నానన్న నమ్మకం కలుగుతుంది. యాదవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమానత్వం తీసుకువచ్చారు. చంద్రబాబు మాత్రం బడుగు బలహీన వర్గాల వారిని అవమానపరిచారు. ఇలాంటి సీఎంను, ఎమ్మెల్యే శ్రీనివాసులును మళ్లీ భారీ మోజార్టీతొ గెలిపించాలి’ అని రమేష్ యాదవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment