
సాక్షి, అన్నమయ్య జిల్లా: ‘పోసాని కృష్ణమురళి కేసులో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. సెక్షన్లు 111, 67 వర్తించవని రైల్వే కోడూరు కోర్టు చెప్పింది.. అయినప్పటికీ పోసానికి రిమాండ్ విధించటం సరికాదు‘‘ అని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు. కోర్టు ధిక్కారణ కింది హైకోర్టు లో కేసు వేస్తాం’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.
‘‘పోసాని కృష్ణమురళి పై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేయటమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం కొనసాగిస్తాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యం గా ఉండాలి’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు.
కాగా, పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం మార్చి 13 వరకు (14 రోజులు) రిమాండ్ విధించింది. పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎస్‌ఎన్ 111 యాక్ట్‌నమోదు చేయడంపై పొన్నవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డనైజ్డ్ క్రైమ్స్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని పొన్నవోలు వాదించారు.
రాత్రి 9 గంటల నుంచి కోర్టులోనే పోసాని కృష్ణమురళి ఉన్నారు. రాత్రి 9.20 గంటలకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. రాత్రి నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు సాగాయి. ఉదయం 5 గంటల వరకు వాదనలు సాగాయి. అంతకు ముందు ఓబువారి పల్లె పీఎస్‌లో 9 గంటల పాటు పోసాని విచారణ సాగింది. ఎస్పీ విద్యాసాగర్ పోసానిని స్వయంగా విచారించారు.
ఇదీ చదవండి: కూటమి సర్కార్ వికటాట్టహాసం
రెడ్‌బుక్ రాజ్యాంగమే పరమావధిగా బరితెగింపు
రెడ్‌బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది.

జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్‌ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు.
ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment