ponnavolu sudhakar reddy
-
వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై పొన్నవోలు కామెంట్స్..
-
తాడిపత్రిలో ఇంత దారుణమా..
-
మార్గదర్శి కేసులను నీరుగారుస్తున్నారు: పొన్నవోలు
-
‘మార్గదర్శి’ కేసులు నీరుగారుస్తున్నారు: పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్చిన్నం జరుగుతోందని, ప్రభుత్వమే రాజ్య హింసకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పొన్నవోలు శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌ను రావణ కాష్టంలా ప్రభుత్వం మారుస్తోంది.వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారు.ప్రజలపై దాడులు చేస్తే నో పోలీస్ అన్నట్లుగా ఉంది. మాచర్లలో దాడులు చేస్తే ఊళ్ళు కాలి చేసి పోతున్నారు .వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులే మేం ఏమీ చేయలేమంటున్నారు.మీడియా ముసుగులో మాఫియాలా తయారవుతున్నారు.ఏపీలో ఏడు నెలలుగా ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు.. ప్రభుత్వమే దాడులు చేస్తోంది.దాడులపై కమిషన్‌ను అపాయింట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని కక్ష పూరితంగా కేసులో ఇరికించారు .2023లో సత్య వర్ధన్‌ను విచారిస్తే కులం పరంగా నన్ను తిట్టలేదు అని కోర్టులోనే చెప్పాడు. విశాఖలో బందువుల ఇంట్లో ఉంటే సత్య వర్ధన్ తమ్ముడిని బలవంతంగా రప్పించి అతని వద్ద తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం చట్టాలను అవహేళన చేస్తోంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను నియోజక వర్గంలో కాలు పెడితే చంపేస్తాం అని పబ్లిక్‌గా ఓ ఎమ్మెల్యే కామెంట్ చేస్తే చర్యలేవి.మాజీ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి’అని పొన్నవోలు ప్రశ్నించారు.మార్గదర్శి కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది..రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థికనేరానికి పాల్పడిన 'మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్' కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పొన్నవోలు ఆరోపించారు. ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక నేరాల నుంచి మార్గదర్శికి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందన్నారు. 2006 లోనే దాదాపు రూ.2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన కేసు నుంచి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.‘ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఆనాడు రామోజీరావు ప్రజల నుంచి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్ట వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ విషయాన్ని అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. రామోజీరావు పాల్పడిన ఈ ఆర్థిక నేరంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై కేసులు నమోదయ్యాయి. 2006 లెక్కల ప్రకారం రామోజీరావు తన మార్గదర్శి సంస్థల ద్వారా 2.75 లక్షల మంది నుంచి రూ.2610 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ 1984 చట్టం ప్రకారం బ్యాంకులు మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. ఇతర ఏ సంస్థలు సేకరించినా అది నేరం. పత్రికను నడుపుతూ ఆర్థిక నేరాల గురించి నిత్యం పత్రికల్లో కథనాలు రాయించే రామోజీరావు తాను అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయం తెలిసే చట్టాలను ఉల్లంఘించారు. తన చేతిలో మీడియా ఉంది, తనను ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరైనా తన అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై తన మీడియా మాఫియాను ప్రయోగిస్తాననే ధీమాతో రామోజీరావు వ్యవహరించారు. మార్గదర్శి సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దీనిపై విచారణకు సీఐడీని ఆదేశిస్తూ 2006లో జీఓలు 800, 801 జారీ చేశారు. తరువాత సిఐడీ అధికారులు విచారణ జరిపి రామోజీ ఆర్థిక నేరాలపై కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. తరువాత ప్రభుత్వాలు మారడం, తిరిగి రామోజీరావు తన మీడియా మాఫియాతో పాలకులను ప్రభావితం చేసే స్థాయిలో తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు పావులు కదిపారు.రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్ బ్యాంక్, ఏపీ ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును రామోజీరావు క్వాష్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్ట్ కు వెళ్ళి క్వాష్ పిటీషన్ ను కొట్టేయించారు. తిరిగి ఈ కేసును విచారించాలని తెలంగాణ కోర్ట్ ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. విచారణలో ఉన్న ఈ కేసులో రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ తానే హిందూ అవిభక్త కుటుంబానికి కర్తను అని ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఇటీవల రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసును కొట్టేయాలని రామోజీరావు తరుఫు న్యాయవాదులు తాజాగా కోర్ట్ లో కొత్త వాదనను తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి సీఐడీ కనీసం అప్పీల్ కూడా చేయకుండా మార్గదర్శి కేసు కొట్టేసేందుకు సహకరిస్తున్నారు. అంటే గత అయిదేళ్ల పాటు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకని దుష్ర్పచారం చేయించినందుకు గానూ చంద్రబాబు ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శికి అనుకూలంగా క్విడ్ ప్రో కో కింద సహకరిస్తున్నాడు’అని పొన్నవోలు ఆరోపించారు.మార్గదర్శి సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు..‘మార్గదర్శి చిట్స్ లో జిల్లాలో సేకరించిన అమౌంట్లు హెడ్ ఆఫీస్ కు పంపడం చిట్స్ చట్టం ప్రకారం నేరం. జిల్లాల్లో సేకరించిన డబ్బులో కొందరు మధ్యలో చిట్స్ నిలిపివేస్తే, వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని, వారి ఆస్తులుగా చూపించారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ లో ఆస్తులు, అప్పులను సక్రమంగా చూపలేదు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. రూ.2610 కోట్లు డిపాజిట్లుగా చూపి, దానిలో 1300 కోట్లు నష్టాలుగా చూపించారు. ప్రజల డబ్బు చీటీల రూపంలో తమ వద్ద పెడితే, దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి సగానికి పైగా నష్టాలు వచ్చినట్లు చూపారు. ఇవ్వన్నీ సీఐడీ విచారణలో కూడా వెలుగుచూశాయి. వైయస్ఆర్ ప్రభుత్వంలో రంగాచారి కమిటీని నియమించింది. దీనిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. మార్గదర్శిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బుదరచల్లే రాతలు రాస్తూ వారిని భయపెడుతున్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం, బదిలీలు చేయించడం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్లో ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు పత్రిక దుర్మార్గమైన తప్పుడు రాతలతో వేధిస్తోంది. జేజే రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభకుల్లో ఒకరైతే, ఆయనను శంకగిరి మాన్యాలు పట్టించి, వారి ఆస్తులు గుంజుకుని, దేశం నుంచి పరారయ్యేలా చేశారు. మీడియా మాఫియాగా చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ, అధికార తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ప్రజల్లో తమకు వ్యతికులపై విషప్రచారానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు తమ చెప్పుచేతల్లో ఉంటాయని, మేం తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించుతామనే అహంకారంతో ఉన్నారు’ అని పొన్నవోలు విమర్శించారు. -
Ponnavolu: పోలీసులపై సెక్షన్ 163, 166
-
వారిపై సెక్షన్ 111 వర్తించదు: పొన్నవోలు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్ 111 వర్తించదు: పొన్నవోలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో వైఎస్సార్సీపీ శ్రేణులను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్. వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు సంబంధంలేని సెక్షన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన 111 సెక్షన్ వర్తించదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలకు ఈరోజు శుభదినం. ప్రతీ కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించారు. సజ్జల భార్గవ రెడ్డి మీద పిటిషన్ వేశాం. నెల రోజుల నుంచి ఏపీలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వ కోరల్లో చిక్కుకుని సోషల్ మీడియా కార్యకర్తలు నలిగిపోతున్నారు.జూలై 1, 2024కు ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదు. ఈ సెక్షన్ 111ను టీడీపీ దుర్వినియోగం చేసింది. సెక్షన్ 111 పెట్టాలంటే ముద్దాయిపై రెండు ఛార్జ్షీట్లు ఉండాలి. అలా కాకుండా రెండు ఛార్జ్ షీట్లు లేకుండానే సెక్షన్ 111 పెడుతున్నారు. ఇది టీడీపీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ ప్రభుత్వం చేసిన పని. సోషల్ మీడియా కార్యకర్తలు ఈ చట్టం కిందకి రారు. కొన్ని వేల మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. సజ్జల భార్గవకు అరెస్టు నుంచి రెండు వారాల రక్షణ కల్పించారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఘోరమైన నేరాలకు పాల్పడే వారికి ఇది 111 వర్తింపజేయాలని శాసన కర్తల ఉద్దేశం. ఈ ఉద్దేశాలకు వ్యతిరేకంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకే ఘటనపై మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు పెట్టొద్దని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీంతీర్పు ఉల్లంఘిస్తే అధికారులు కూడా శిక్షకు అర్హులే అంటూ కామెంట్స్ చేశారు. -
పోలీసులపై పొన్నవోలు ఫైర్
-
ఏపీలో అరాచక పాలన నడుస్తోంది : పొన్నవోలు
-
‘‘న్యాయదేవత మీద ఒట్టు.. ఎమర్జెన్సీ టైంలోనూ ఇంత ఆరాచకం నడవలేదు’’
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని, ప్రభుత్వ దమనకాండను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సోషల్ మీడియా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. సుధారాణి దంపతుల అరెస్టుపైనా ప్రభుత్వాన్ని నిలదీసిన పొన్నవోలు.. వాళ్లు ఏమైనా ఉగ్రవాదులా? అని ప్రశ్నించారు. న్యాయదేవత మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలోనూ ఇంత అరాచకం నడవలేదని అన్నారాయన. -
చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు
-
‘ఎన్ని కేసులు పెట్టినా భయపడం.. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగుతున్నాయి. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు. పీఎస్‌కి పిలిపించి కంచికచర్ల పోలీసులు రోజూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులకు లీగల్ సెల్ అండగా నిలిచింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షకట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏ కార్యకర్త మీద అక్రమంగా నిర్బంధించినా పార్టీ కేంద్ర కార్యాలయం వెంటనే స్పందిస్తుందన్నారు. బాధితులు పార్టీ దృష్టికి తీసుకు రావటానికి టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని.. అక్రమ కేసులు వేసిన పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకునేలా పార్టీ చూసుకుంటుందన్నారు.పూర్తి న్యాయ సహకారం పార్టీనే అందిస్తుందని.. జైహింద్ అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తని నందిగామలో ఎమ్మెల్యే ఇంటికి తీసుకు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చో పెట్టారని.. ఇదేనా ప్రజాస్వామ్యం?. చట్టవ్యతిరేకంగా పనిచేసిన ఏ పోలీసునూ వదిలేది లేదు. ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం’’ అని పొన్నవోలు తెలిపారు.అరాచకాలను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులా: అంబటి రాంబాబుగుంటూరు: వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షుడు వనమా వజ్రబాబు.. నగరంపాలెం, అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటూరి రవి కిరణ్, మేకా వెంకటరామిరెడ్డిని పరామర్శించారు.అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు రవికిరణ్‌ని, వెంకటరామిరెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో 41 నోటీస్ ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై లోకేష్ పవన్ కల్యాణ్ పోలీసులపైన ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు భయపడరన్నారు. పథకాలు ఎందుకు అమలు చేయలేదని సోషల్ మీడియాలో అడిగినా కూడా కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు.మా మహిళా నాయకురాలు విడదల రజినిపై దారుణంగా అసభ్యకరంగా టీడీపీ నాయకులు పోస్టులు పెట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోస్టులు పెడితే పోలీసులు ఆనందమా?. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారు. డీజీపీ పొలిటికల్ విమర్శలు మానుకోవాలి. డీజీపీకి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు లేదు’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
కేసులు నీరుగార్చే కుట్ర
ఈ కేసులకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా రూపొందించాలో దర్యాప్తు అధికారులకు కొందరు సీనియర్ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ప్రధాన నిందితుడికి తనపై ఉన్న కేసులకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం దేశంలో ఇదే తొలిసారి. ఆ కేసులను ఎప్పటిలోగా నీరుగార్చాలో దర్యాప్తు అధికారులకు గడువు కూడా విధించారు.ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ.. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరుల పాత్రపై దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఈ కేసులకు సంబంధించిన కీలక రికార్డులు చంద్రబాబుతోపాటు ఇతర నిందితులకు అందుబాటులో ఉన్నాయి. దాంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉంది. – ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు అనుమతించాలని గవర్నర్‌ను కోరే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఆ ప్రతిపాదనను మంత్రివర్గం అజెండాలో చేర్చే సాహసం అధికారులు చేయగలరా? అలాంటప్పుడు వారి అవినీతిపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది?– ఆధారాలు, న్యాయపరమైన అంశాలతో డీజీపీకి పొన్నవోలు లేఖసాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై నమోదైన ఏడు కేసుల నుంచి ఆయన పేరు తొలగించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు..’ అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి... డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వ ఒత్తిడితో ప్రస్తుత పోలీస్, సీఐడీ ఉన్నతాధికారులు ఆ కేసుల విచారణలో న్యాయస్థానానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. చార్జ్షీట్లను న్యాయస్థానానికి పునఃసమర్పించకుండా ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. తద్వారా కేసుల దర్యాప్తు సాగకుండా అడ్డుకుంటున్నారు’ అని వెల్లడించారు. ‘చంద్రబాబుపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారు. అప్పటి సీఐడీ అదనపు డీజీ సంజయ్, సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇన్చార్జ్ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నిందితులుగా ఉన్న ఈ కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ ఓ సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా పొన్నవోలు తన లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. కేసుల దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ న్యాయస్థానానికి పూర్తిగా సహకరించాలని... దర్యాప్తు అధికారులకు రక్షణగా నిలవాలని అందులో డీజీపీని కోరారు. పూర్తి ఆధారాలతో, న్యాయపరమైన అంశాలను ఉటంకిస్తూ డీజీపీకి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ..చంద్రబాబు పేరు తొలగించే కుట్ర.. ఉన్నతాధికారులకు బెదిరింపులురాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కేసు సహా దర్యాప్తులో ఉన్న ఏడు కేసుల్లో నిందితుల జాబితా నుంచి ప్రధాన నిందితుడు చంద్రబాబు పేరు తొలగించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసం సీఐడీ, పోలీసు ఉన్నతాధికారులను తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. ఆ కేసుల తుది దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించే ముందు నిందితుల జాబితా నుంచి చంద్రబాబు పేరు తొలగించాల్సిందేనని దర్యాప్తు అధికారులను ఒత్తిడి చేస్తూ బెదిరిస్తోంది. దర్యాప్తు నివేదికలను తారుమారు చేయాల్సిందేనని అధికారులను వేధిస్తున్నారు. తద్వారా ప్రధాన నిందితుడైన చంద్రబాబును ఈ కేసుల నుంచి సులువుగా బయటపడేయవచ్చన్నది అసలు ఉద్దేశం. సాక్షులుగా న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అధికారులపై ఈ కేసులను నెట్టేయాలని కుట్ర పన్నింది.చార్జిషీట్లను తొక్కిపెట్టారుచంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం మరో కుట్రకు పాల్పడింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించిన చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. దీనిపై కొంత వివరణ కోరుతూ న్యాయస్థానం వాటిని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సీఐడీకి పంపింది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆ అంశాలకు సంబంధించి కేస్ స్టడీలతో వివరాలను సీఐడీ అధికారులకు నివేదించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఆ కేసులను నీరుగార్చేలా సీఐడీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆ చార్జ్షీట్లను ఈ రోజు వరకూ న్యాయస్థానానికి సమర్పించలేదు. ఆ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి నిధులుఏడు కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులు అక్రమ మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాలకు చేరాయని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతో సహా గుర్తించారు. కానీ ఆ కేసుల దర్యాప్తునకు టీడీపీ ప్రధాన కార్యాలయం సహకరించడం లేదని సీఐడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. అంటే ఈ కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నది సుస్పష్టం. ప్రస్తుతం చంద్రబాబు సీఎంగా ఉండటంతో ఆ కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. దర్యాప్తు అధికారులను వేధిస్తున్నారుఆ ఏడు కేసుల దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉంది. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయాన్ని 2024 జూన్ నుంచి ఆగస్టు 14 వరకు మూసివేశారు. డీజీపీ ఆదేశాలతో సిట్ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ కేసులను దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అదనపు డీజీ (సీఐడీ) ఎన్.సంజయ్, సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఐజీ కె.రఘురామ్‌రెడ్డిని హఠాత్తుగా బదిలీ చేశారు. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. నిందితులుగా చంద్రబాబు, మంత్రులు.. అందుకే కేసులు నీరుగార్చే కుట్రఈ ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి–భద్రతల శాఖలను స్వయంగా నిర్వహిస్తున్న ఆయన ఈ కేసుల దర్యాప్తును నియంత్రిస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పనితీరుపై వార్షిక నివేదికలను ఆమోదించే స్థానంలో ఆయనే ఉన్నారు. దాంతో నాలుగు చార్జ్షీట్లపై న్యాయస్థానం కోరిన వివరణలను ఐపీఎస్ అధికారులు సమర్పించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కాకుండా ఇతర నిందితులు కూడా ఈ కేసుల సాక్షులను ప్రభావితం చేసే కీలక స్థానాల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు, సాక్షులపై వేధింపులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు, మరో నలుగురు మంత్రులు ఈ ఏడు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తునకు గవర్నర్ అనుమతి కోరడం లేదు. కక్ష సాధింపు చర్యలకు తార్కాణం.. ఫిర్యాదు చేశారనే మధుసూదన్‌రెడ్డిపై వేధింపులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కక్షపూరితంగా అధికారులను వేధిస్తున్నారో చెప్పేందుకు ఐఆర్ఏఎస్ అధికారి ఎం. మధుసూదన్‌రెడ్డి ఉదంతమే తార్కాణం. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ కుంభకోణంపై సంస్థ ఎండీ హోదాలో ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా ఎం.మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేయించారు. డిప్యుటేషన్ పూర్తయి ఆయన తన మాతృశాఖకు వెళ్లడానికి మూడు రోజుల ముందు సస్పెండ్ చేయడం గమనార్హం. దీనిపై ఆయన పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్‌పై స్టే విధించింది. ఈ కేసుల దర్యాప్తు అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తోంది. గవర్నర్ అనుమతి ప్రక్రియకు మోకాలడ్డుఈ కేసులో నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను గతంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి చేపట్టారు. కానీ ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా మరో నలుగురు మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి కోరే ప్రక్రియను ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ, డీజీపీ కొనసాగిస్తారనే నమ్మకం లేదు. గవర్నర్ అనుమతి కోరే ప్రతిపాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గం ముందు ఉంచాలి. కానీ ముఖ్యమంత్రి నియంత్రణలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలనకు తెస్తారనే నమ్మకం లేదు. మళ్లీ అదే పదవుల్లో నిందితులు.. కీలక రికార్డుల తారుమారుకు అవకాశంగతంలో టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పి.నారాయణ అసైన్డ్ భూములు, ఇన్నర్‌రింగ్ రోడ్డు కుంభకోణాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ మళ్లీ అదే పదవుల్లో ఉన్నారు. ఆ కేసుల్లో న్యాయస్థానం ఎదుట సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం ఇచ్చిన అధికారులు ప్రస్తుతం చంద్రబాబు, నారాయణ నియంత్రణలో ఉన్నారు. ఈ కేసుల్లో మరికొందరు సాక్షులను విచారించాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లు, రిమాండ్ రిపోర్టులు, కొల్లగొట్టిన భూములకు సంబంధించిన కీలక రికార్డులన్నీ చంద్రబాబు, నారాయణకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ కేసుల్లో సాక్షులను బెదిరించేందుకు, రికార్డులను తారుమారు చేసేందుకు వారిద్దరికీ పూర్తి అవకాశం ఉంది. ఈడీ దర్యాప్తు భయంతో..మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడిన ఈ కేసుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి గతంలోనే సీఐడీ నివేదించింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఇప్పటివరకు పరిమిత స్థాయిలో దర్యాప్తు నిర్వహించింది. స్కిల్ స్కామ్ కేసులో షెల్ కంపెనీ డిజైన్‌టెక్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ఈడీకి సమర్పించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులు డిపాజిట్ అయినట్లు సీఐడీ గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొందరు బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కేవైసీ వివరాలు తీసుకోకుండానే నోట్ల మార్పిడి చేసినట్లు కూడా ఆధారాలు సేకరించింది. ఆ వివరాలతో పాటు స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసులకు సంబంధించి న్యాయస్థానంలో సమర్పించిన చార్జ్షీట్లను ఈడీకి ఇప్పటికే సీఐడీ సమర్పించింది. వాటి ఆధారంగా చంద్రబాబుతోపాటు ఇతర ప్రధాన నిందితులపై ఈడీ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టాల్సి ఉంది. దీంతో ఈ కేసులను నీరుగార్చేందుకు ప్రభుత్వం సీఐడీపై ఒత్తిడి తెస్తోంది. దర్యాప్తు అధికారులకు రక్షణగా ఉండండి.. నిష్పక్షపాత విచారణకు సహకరించండిఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మరో నలుగురు మంత్రులు నిందితులుగా ఉన్న ఆ ఏడు కేసుల దర్యాప్తు సమగ్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. ఆ కేసుల్లో దర్యాప్తు అధికారులపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా, బలవంతపు చర్యలు తీసుకోకుండా వారికి డీజీపీ రక్షణ కవచంలా నిలవాలి. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ నిందితులకు కొమ్ముకాయడం అంటే నేరానికి పాల్పడినట్టేనని వేరే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ కేసులకు సంబంధించి వాస్తవాలను న్యాయస్థానానికి సమర్పించాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. కేసుల విచారణలో న్యాయస్థానానికి డీజీపీ పూర్తిగా సహకరించాలి.బాబు బరితెగింపు బెయిల్ నిబంధనల ఉల్లంఘన స్కిల్ స్కామ్‌తోసహా తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును ప్రభావితం చేస్తున్న సీఎం చంద్రబాబు న్యాయస్థానం ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. స్కిల్‌స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను మీడియా ఎదుటగానీ మరెక్కడాగానీ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కూడా షరతులు విధించింది. అయితే చంద్రబాబు తాను న్యాయస్థానాలకు అతీతమన్నట్టు వ్యవహరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. తాజాగా ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. అందులో స్కిల్ స్కామ్ కేసు గురించి చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించడం గమనార్హం. తనను అకారణంగా అరెస్ట్ చేశారని.. తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా విచారణలో ఉండగానే తనకు తానే తీర్పు ఇచ్చేశారు! తద్వారా స్కిల్ స్కామ్ కేసు గురించి మాట్లాడవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. అంతేకాదు.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనంటూ దర్యాప్తు అధికారులను బెదిరించే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కేసుల్లో నిందితుల వివరాలు⇒ నారా చంద్రబాబు (ముఖ్యమంత్రి): ఏడు కేసుల్లో నిందితుడు⇒ పొంగూరు నారాయణ (మున్సిపల్ శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల్లో నిందితుడు⇒ నారా లోకేశ్ (విద్యా శాఖ మంత్రి): ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడు⇒ కె.అచ్చెన్నాయుడు (వ్యవసాయ శాఖ మంత్రి): స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు⇒ కొల్లు రవీంద్ర (ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడు -
విచారణకు సజ్జల పోలీసుల ఓవరాక్షన్ పై పొన్నవోలు ఫైర్
-
బాబు కొంపముంచిన లోకేష్
-
లడ్డులో జంతువు కొవ్వు?..
-
కల్తీ నెయ్యి లడ్డూలు భక్తులు తిన్నారా? లేదా ? పొన్నవోలు ఫుల్ క్లారిటీ..
-
శ్రీవారి లడ్డూ వివాదంలో నిజానిజాలు తెలియాలి: న్యాయవాది పొన్నవోలు
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకులు నాసిరకంగా ఉన్నాయని, ఈ నాలుగు ట్యాంకులలో వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని అన్నారు. ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్తో తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.చదవండి: లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం‘ఆ పరీక్షల్లో సఫలమైన తర్వాతే ఆ టాంకర్ల నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారు. కల్తీ జరిగిందని నిర్ధారించే ల్యాబ్స్ లేవని ఈవో చెప్పడం దుర్మార్గం. 2014-19 వరకు పరీక్ష కేంద్రాలకు హెడ్‌గా ఉన్న శర్మిస్ట.. టీటీడీకి కల్తీ పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. మే 15న మొదటి ట్యాంక్ పంపించారు. అప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నాసిరకం నాలుగు ట్యాంకర్ల నెయ్యి వెనక్కి పంపారు. అటువంటి సమయంలో లడ్డూలలో కల్తీ ఎలా జరిగిందని చెప్పారు.భక్తుల మనోభావాలు గాయపరిస్తే మీకు ఒరిగేదేమిటి. రాజకీయ లాభం కోసం దేవుడిని కూడా ఉపయోగించడం సిగ్గుచేటు. రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లలో ఎస్ వాల్యూ తక్కువగా ఉందని ఈవో చెప్పారు. 2019 నుంచి ఆగస్టు 2023 వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. వై వి సుబ్బారెడ్డి హయంలో ఈ టెండర్లను పిలవలేదు. ఏఆర్ ఫుడ్స్ అసలు బిడ్డరే కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏఆర్ ఫు డ్స్కు ఆర్డర్ ఇవ్వలేదు. సప్లై జరగలేదు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆర్డరు, సప్లై జరిగింది. ఎస్ వాల్యూ తగ్గిందని టీటీడీ ఈఓ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. 319 రూపాయల కేజీ నెయ్యిలో 1, 450 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారు? రాగి బిందెలో బంగారం కలుపుతారా ?కానీ రాజకీయ దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు.పంది కొవ్వు కలిపారని చెప్పడం అబద్ధం -
తిరుమల లడ్డుపై బాబు వ్యాఖ్యలకు పొన్నవోలు కౌంటర్
-
ఎస్ఆర్సీ నివేదికను సవాల్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ప్రాణహాని లేదంటూ సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్ఆర్సీ) ఇచ్చిన నివేదికను సవాల్ చేసుకోవాలని మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఆర్సీ నివేదికను సుధాకర్‌రెడ్డికి అందజేయాలని హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనకు భద్రతను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఇందుకు అయ్యే వ్యయాన్ని సుధాకర్‌రెడ్డే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసులు వాదించానన్న కక్షతో తనకున్న భద్రతను ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, తన భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పొన్నవోలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.రాంసింగ్ వ్యాజ్యంపై విచారణ వాయిదా12న తుది విచారణ జరుపుతామన్న హైకోర్టుసాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ ఈనెల 12కి హైకోర్టు వాయిదా వేసింది. ఆ రోజున ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, అలాగే ఫిర్యాదుదారు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మెమో రూపంలో కోర్టు ముందుంచేందుకు రాంసింగ్‌కు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ అప్పటి దర్యాప్తు అధికారి రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్ ఫిర్యాదు అనంతరం పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2022 ఫిబ్రవరి 23న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. తాజాగా గురువారం రాంసింగ్ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఆయన తరఫున కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జూపూడి యజ్ఞదత్ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులను మెమో రూపంలో కోర్టు ముందుంచుతామన్నారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు ఉదయ్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులోలాగే మరో వ్యక్తిని కూడా రాంసింగ్ బెదిరిస్తే కోర్టు రాంసింగ్‌పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిందన్నారు. ఆ కేసును కొట్టేయాలని రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందన్నారు. అదే రీతిలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కూడా కొట్టేయాలని ఆయన కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు. -
జగన్ పై రఘురామ పెట్టిన కేసు.. ఆధారాలతో పొన్నవోలు కౌంటర్
-
ఎవరి సంతోషం కోసం మూడేళ్లకు అక్రమ కేసు?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.ఆయన అరెస్ట్ విషయంలో, ఆ తరువాత కూడా సీఐడీ అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమో మూడేళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెర తీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరినో సంతోషపెట్టడం.. మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే 2021 మే 14న అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాగా ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి సంబంధిత జ్యూరిస్ డిక్షన్ పరిధిలోని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారని పొన్నవోలు చెప్పారు. ‘పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు విచిత్రంగా మూడేళ్ల తర్వాత.. గత నెల 11న గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదుపై నెల రోజుల తరవాత పోలీసులు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు కొందరు పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఎవరినో సంతోషపెట్టడం, మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే ఈ కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం ఒకటి.. ఫిర్యాదు మరొకటి 2021లో రఘురామకృష్ణరాజును గుంటూరు కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు ఏమాత్రం పొంతన లేదు. ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కస్టడీలో తనను టార్చర్ చేశారని నాడు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. కానీ గత నెలలో చేసిన ఫిర్యాదులో మాత్రం విచిత్రంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్, సీతారామాంజనేయుల పేర్లు ప్రస్తావించారు. తనను హింసిస్తున్న వీడియోను వైఎస్ జగన్ చూశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకన్నా తప్పుడు కేసు ఉండదు మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే.. అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం పూర్తిగా అసమంజసం. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు? ఇంతకన్నా తప్పుడు కేసు మరొకటి ఉండదు. కేవలం దురుద్దే«శం, ద్వేషంతో రఘురామరాజు ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారు. నాడు మెజి్రస్టేట్ ఎదుట రఘురామ చెప్పిందేమిటి? మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటి? అని పోలీసులు కనీసం ఆలోచించరా? టార్చర్ చేయనేలేదు రఘురామరాజును నాడు సీఐడీ కస్టడీలో ఏమాత్రం టార్చర్ చేయలేదు. ఆయన కోరడంతో కోర్టు ఆదేశాల మేరకు వైద్య బృందం పరీక్షించి రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల అయిన తరువాత రఘురామరాజు ఒక్కరే తన సొంత వాహనంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల సూచనను బేఖాతర్ చేస్తూ అలా వెళ్లిన రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలో తన శరీరంపై గాయాలు చూపారు. దాన్నిబట్టి ఆయన ప్రయాణంలో ఏం జరిగి ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. ముందే కల గన్నారా? రఘురామరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వైఎస్ జగన్‌ను, డాక్టర్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చడం సరికాదు. పాలించే వ్యక్తి మారితే చట్టం మారుతుందా? ఆ వ్యక్తికి వంత పాడుతుందా? అసలు చట్టం, న్యాయం, ప్రాథమిక సూత్రాలు ఏం చెబుతున్నాయో పట్టించుకోరా? 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయం తెలియదా? అలాంటప్పుడు మూడేళ్ల తర్వాత విచారిస్తే ఏం జరుగుతుంది? రఘురామ గత నెల 11న ఈ – మెయిల్ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అంతకు ఒక రోజు ముందే అంటే జూన్ 10వ తేదీనే పోలీసులు లీగల్ ఒపీనియన్ ఎలా పొందారో చెప్పాలి. రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా? చట్టపరంగానే ఎదుర్కొంటాం ఈ తప్పుడు కేసును చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం సరికాదు. ఇదో సంప్రదాయంగా మారితే భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్ధకే కళంకం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయలేదు. 2015లోనే టీడీపీ హయాంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆ కేసు నమోదు చేసింది. -
జగన్‌పై ద్వేషంతోనే ఈ తప్పుడు కేసు: పొన్నవోలు
గుంటూరు,సాక్షి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు. రఘురామ రాజు ఆరోపణలపై, కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎం వైఎస్ జగన్ తోపాటు మరికొందరు అధికారులపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది. కేవలం దురుద్దేశంతో, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ కృష్ణంరాజు ఈ పని చేశారు. అరెస్ట్ చేశాక తనని కస్టడీలో వేధించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కానీ, అయన్ని అరెస్టు చేసిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో కేసులో ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు రాశారు. కేవలం జగన్ పై రఘరామ ద్వేషం పెంచుకుని మూడేళ్ల తర్వాత ఈ కేసు పెట్టారు. అధికారులు పీవీ సునీల్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదు?. .. డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్డిన గాయాలు లేవని చెప్పారు. అయినాసరే అత్యంత దారుణంగా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు. రఘురామ జూన్ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 10వ తేదీనే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ కి రాశారు?. ఒక ప్లాన్ ప్రకారం తప్పుడు కేసు నమోదు చేయటానికి చేసిన కుట్ర అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి? అని పొన్నవోలు అన్నారు. పైగా.. ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని, మరి మూడేళ్ల తర్వాత రఘురామ కేసులో జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారు? అని పొన్నవోలు నిలదీశారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా హత్యలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి చూస్తున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారాయన.ఎవర్నో ఇబ్బందులు పెట్టాలన్న కక్ష్యతోనే ఇలాంటి తప్పుడు కేసు పెట్టారని, ఇలాంటి తప్పుడు ఒరవడినే అవలంభిస్తే రాబోయే రోజుల్లో కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని అన్నారాయన. ‘‘రెడ్ బుక్ రాసుకుని అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడవద్దు. అదే జరిగితే అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరు. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు మానుకోవాలి అని పొన్నవోలు హితవు పలికారు. -
అధికారం ఉందని చట్టాన్ని పట్టించుకొరా.. సంచలన నిజాలు బయటపెట్టిన పొన్నవోలు
-
Big Question: పచ్చి అబద్దాలు.. కోర్టు ఆర్డర్ బయటపెట్టిన మాజీ ఏఏజీ పొన్నవోలు
-
కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చి వేయడం చట్ట విరుద్ధమని, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చేయకుండా వ్యవహరించారని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి రావడంతోనే టీడీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరిస్తోంది.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం వెయ్యి రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది.భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రభుత్వం రావడంతోనే మాకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్నా, మాకు ఇచ్చింది మాత్రం 15వ తేదీ. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందాం. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సీఆరీ్డయేను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు’ అని మండిపడ్డారు. ప్రజావేదికతో సంబంధం లేదు ప్రజా వేదికతో కొందరు పోలుస్తుండటం సరికాదని.. దానికి, దీనికి సంబంధం లేదని పొన్నవోలు తెలిపారు. ‘నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే.. చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అంతే తప్ప అందులో కక్ష పూరితం లేదు.వైఎస్సార్సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు, కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. ఐదేళ్లు హూందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్సార్సీపీ ముందుకు వెళ్లింది. ఏదేమైనా చట్ట విరుద్ధంగా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునేలా పోరాడతాం’ అని వివరించారు.సీఆర్డీయే ప్రకటనలో అంశాలు వాస్తవం కాదు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈనెల 1వ తేదీనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చామంటూ సీఆరీ్డయే పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందన్న విషయం మా దృష్టికి వచ్చిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇందులోని అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఆరీ్డయే ప్రొవిజనల్ ఆర్డర్‌పై ఈనెల జూన్ 10వ తేదీ వేసి, మాకు జూన్ 15వ తేదీన ఇచ్చారు. నిన్న (శుక్రవారం) కోర్టులో దీనిపైనే వాదోపవాదాలు జరిగాయన్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీ ముందు (మీడియా) ఉంచుతున్నామన్నారు.కూల్చి వేయము అని కోర్టుకు చెప్పి..విచారణ సందర్భంగా న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని అధికారులు చెప్పారని పొన్నవోలు తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారన్నారు. రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూర్యోదయానికి ముందు.. సూర్యాస్థమయానికి తర్వాత ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ప్రభుత్వాలకు గతంలోనే తేల్చి చెప్పింది. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చి వేయడానికి వీల్లేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవతలి వారి వాదనలు వినాల్సి ఉంటుంది.అందుకు 15 రోజుల సమయం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళితే.. బాధితులు ట్రిబ్యునల్‌కు కూడా వెళ్లవచ్చు. ట్రిబ్యునల్‌లో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ల్యాండ్ వ్యాల్యూపై 20 శాతం ఫైన్ స్వీకరించాలి. అట్లా పర్మిషన్ తీసుకోకుండా కడితే శిక్షార్హులు. కూల్చి వేత అనేది ఆఖరి అస్త్రం. అది కూడా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే. ప్రొవిజినల్ ఆర్డర్ మీద కూల్చి వేయడం చట్ట వ్యతిరేకం. ఇది చట్ట ప్రకారం పాటించాలి్సన విధానం. కానీ, ఇలాంటివేవీ పాటించ లేదు. ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నేనే కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించా. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. వారిపై సివిల్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరతాం’ అని వెల్లడించారు. -
టీడీపీ దమనకాండ.. హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?: పొన్నవోలు
సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని.. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారన్నారు. పాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదు. న్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.‘‘తెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుంది. ఎకరాకు వెయ్యి రూపాలకే తెలుగుదేశం భూములు పొందింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రకారం రెండు ఎకరాలు చట్టపరంగా తీసుకుంది. పర్మిషన్ తీసుకోలేదని ఏడురోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారు. మేము సవాల్ చేస్తూ.. లంచ్ మోషన్ వేశాం. కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాం. డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంతవరకు కూల్చకూడదని చట్టం చెబుతుంది.’’ అని పొన్నవోలు తెలిపారు.‘‘చట్టం 115 సీఆర్డీఏ యాక్ట్ కింద వివరణ అడగాలి, వివరణ కూడా ఇచ్చాము. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు ఆదేశాల విషయం సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలిపాం’’ అని పొన్నవోలు వివరించారు. -
వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు
-
వైఎస్సార్ పేరును కాంగ్రెస్సే ఇరికించింది
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగా వైఎస్సార్ పేరును కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించానని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్‌ను కాంగ్రెస్ పార్టీ దోషిగా చిత్రీకరించే కుట్రలను అడ్డుకునేందుకు తాను న్యాయపరంగా పోరాటం చేశానన్నారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచన చేరి తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్న షర్మిల వ్యాఖ్యలను వీడియోలను ప్రదర్శించి పొన్నవోలు వినిపించారు. వైఎస్సార్‌పై కేసులు పెట్టింది కాంగ్రెస్ అన్న షర్మిల.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నాతో ఎవరూ కేసులు వేయించలేదు.. కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్సార్ పేరును అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. ‘వైఎస్సార్ పేరును కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్‌ను చూడలేదు.. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆనాడు వైఎస్సార్‌పై చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కేసుల్లో సంతకాలు చేసిన మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారు. ఈ వాస్తవం కోర్టుకు వివరించే ప్రయత్నం చేశాను’ అని పొన్నవోలు వివరించారు. రాజధానిలో చంద్రబాబు భూదోపిడీ, వందల కోట్ల విలువైన సదావర్తి భూముల దోపిడీ, తెలంగాణలో ఓటుకు కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ తాను పోరాటం చేశానన్నారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం చూసి సీఎం జగన్ ఏఏజీగా అవకాశం కల్పించారన్నారు. క్విడ్ ప్రోకో అంటే వైఎస్సార్‌పై ఫిర్యాదు ఇచ్చిన శంకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కాదా అని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. షర్మిల చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై, సీఎం జగన్‌పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొంత మంది పకోడిగాళ్లు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన భుజం మీద తుపాకీ పెట్టి సీఎం జగన్‌ను కాల్చాలని చూస్తున్నారని.. ఈ విషయం షర్మిల తెలుసుకోవాలన్నారు. -
షర్మిల అబద్ధాలు ఆధారాలతో బయటపెట్టిన పొన్నవోలు
-
చెల్లెమ్మా..ఇక చాలమ్మ
-
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
-
షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్‌ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్‌పై కేసులు పెడుతుంటే చూడలేక..‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్‌ను చూడనేలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్‌కు ఏం సంబంధం ఉంది?చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్!వాస్తవాలు తెలుసుకోవాలి..వైఎస్సార్‌ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్‌ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మీకు తెలిసి కూడా అబద్ధం ఎలా చెబుతున్నారు షర్మిలమ్మ
-
చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో లాయర్ పొన్నవోలు సంచలన నిజాలు
-
సుప్రీం తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్కిల్ డెవలప్మెంట్ కేసులో రూ.371 కోట్లు ప్రజల సొమ్మును పక్కదారి పట్టించి స్వాహా చేసిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబునాయుడుకు చెంపపెట్టులాంటిదని రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని దోచిన కేసులో ప్రభుత్వం చట్టపరంగా ముందుకెళితే రాజకీయ కక్ష సాధింపులంటూ కొంతమంది నాయకులు, పచ్చ మీడియా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఇన్ని రోజులూ వారు ప్రభుత్వంపై చల్లిన బురద సుప్రీంకోర్టు తీర్పుతో కొట్టుకు పోయిందని తెలిపారు. పూణేలోని కేంద్ర సంస్థలు, స్కిల్లర్ అనే సంస్థ లావాదేవీలను సీబీఐ అధికారులు పరిశీలిస్తుండగా చంద్రబాబు ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం బయటకు వచ్చిందని చెప్పారు. పూణేలోని అనేక సంస్థలకు వందల కోట్లు నిధులు వస్తున్నాయని సీబీఐ పరిశీలనలో తేలిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఎంవోయూలో మార్పులు చేసి రూ.371 కోట్లు ఇతర సంస్థలకు మళ్ళించి, వాటి ద్వారా నిధులను స్వాహా చేశారన్నారు. ఈ విషయంపై 2018 జూన్ 6న సీబీఐ విచారణకు ఆదేశించిందని చెప్పారు. జీవో ప్రకారం సీమెన్స్ 90 శాతం నిధులు ఇవ్వలేదని అప్పటి ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబుకు చెప్పినా, ఆయనకున్న విస్తృత అధికారాలతో ఆమోదించారని, ఆ తర్వాత నిధుల స్వాహా జరిగిందని అన్నారు. ఈ కుంభకోణంపై చట్ట ప్రకారమే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని, ఈ కేసులో విచారణ, అరెస్టు, రిమాండ్ అన్నీ సక్రమంగానే జరిగాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కోర్టు విచారణను కొనసాగించాలని చెప్పిందని తెలిపారు. ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని చంద్రబాబు కోరినా సుప్రీంకోర్టు అంగీకరించలేదని చెప్పారు. ఈ కేసు వాదనలు వినిపిస్తున్న తనను ప్రచార మాధ్యమాల ద్వారా దారుణంగా దూషించారని, ఇది సబబు కాదని అన్నారు. గౌరవనీయ కోర్టులు, న్యాయమూర్తులపై కూడా దుష్ప్రచారం చేశారన్నారు. మహిళా న్యాయమూర్తిని కూడా దూషించారన్నారు. న్యాయమూర్తులపై డీబేట్లు పెట్టి మానసికంగా హింసించారన్నారు. భార్య అనారోగ్యం కారణంగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ శెలవు పెడితే, ప్రభుత్వం ఆయన్ని బెదిరించి శెలవు పెట్టించిందని ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలిచి్చన ఐఏఎస్ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇంత ప్రచారం చేసే వ్యక్తులు రూ.371 కోట్లు సక్రమంగా విడుదల చేశామని ఎక్కడా చెప్పడంలేదన్నారు. అరెస్టు సక్రమం కాదంటున్నారే తప్ప అవినీతి జరగలేదని చెప్పడం లేదని చెప్పారు. ప్రభుత్వం చంద్రబాబు పట్ల గౌరవంతోనే వ్యవహరించింది చంద్రబాబు అరెస్టు, రిమాండ్ సమయంలో ప్రభుత్వం ఆయన పట్ల సహృదయంతో, గౌరవంతో వ్యవహరించిందని తెలిపారు. బాబును అరెస్టు చేయడానికి డీఐజీ స్థాయి అధికారిని ప్రభుత్వం పంపిందని, ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి ఇంత పెద్ద స్థాయి అధికారిని పంపడం దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పారు. రోడ్డుపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాఫ్టర్ సౌకర్యం కల్పించిందన్నారు. జైలు మాన్యువల్‌ను కాదని చంద్రబాబుకు అవసరమైన సదుపాయాలు కల్పించిందన్నారు. బాబు కోసం జైల్లో బ్లాక్‌లను శుభ్రం చేసి, ఏసీలు ఏర్పాటు చేసిందని చెప్పారు. దేశంలో ఎందరో సీఎంలు, ప్రముఖ నాయకులు జైలుకు వెళ్లారని, ఎవరికీ ఇవ్వని సకల సౌకర్యాలు చంద్రబాబుకు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇలా సకల సౌకర్యాలు కల్పించడం కక్ష సాధింపు అవుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు మెడికల్ బెయిల్ పొందిన తర్వాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరలేదని, ఆయన పట్ల ప్రభుత్వం రాగద్వేషాలకు పోలేదనడానికి, సహృదయంతో వ్యవహరించిందని అనడానికి ఈ ఒక్క విషయం చాలని తెలిపారు. -
రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు
సాక్షి, నెల్లూరు: స్కిల్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని అన్నారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు పట్ల కక్ష సాధింపు లేదు కాబట్టే జైలులో ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు. తాజాగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి. ప్రభుత్వం తరపున కోర్టులో నేను వాదనలు వినిపించాను. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొందరు అంటున్నారు. జీవో నెంబర్-4లో స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదు. జీవో ప్రకారం జరగడం లేదని అప్పటి అధికారులు చెప్పినా ప్రభుత్వ పెద్దలు వినలేదు. అప్పట్లో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు ముందుకు సాగారు. ఎల్లో మీడియా విశ్వప్రయత్నం.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని ముందుగా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం చట్ట పరంగానే విచారణ చేసింది. ప్రజాధనం కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగింది. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. స్కిల్ స్కామ్ పేరుతో రూ.371కోట్లను చంద్రబాబు కాజేశారు. రాజకీయ కక్ష అనే మంత్రజాలంతో పాపాన్ని కడిగేసుకోవాలని టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా విశ్వ ప్రయత్నం చేసింది. ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని సుప్రీంకోర్టే చెప్పింది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదనలు.. చంద్రబాబు వయసుకు గౌరవం ఇచ్చి జైలులో సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. చంద్రబాబు పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాము. జైలు మన్యువల్లో లేనివి కూడా చంద్రబాబుకు అందించాము. చంద్రబాబుకు అన్ని సదుపాయాలు కల్పించినా కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కూడా కల్పించాము. ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించినా కక్ష సాధింపు చర్య ఎలా అవుతుంది. చంద్రబాబు అరెస్టు సక్రమమే అని న్యాయస్థానం తెలిపింది. కోర్టుల్లో వ్యతిరేక తీర్పు వస్తే వ్యవస్థల్ని మేనేజ్ చేశారని కొందరు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నేను గల్లీ నుంచి వెళ్లి కమిట్మెంట్తో వాదించాను. కొందరు ఢిల్లీ నుంచి వచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు అరెస్ట్ కక్షసాధింపు అంటూ అసత్య ప్రచారం చేశారు
-
చంద్రబాబు అరెస్ట్ గురించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కామెంట్స్
-
ద్విసభ్య ధర్మాసనంలో భిన్న తీర్పులు
-
బాబు, ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారానికి తెరపడింది: పొన్నవోలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో సుప్రీం తీర్పులపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తీర్పు అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడేందుకు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయింది. సుప్రీంకోర్టులో ఈరోజు పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. కేసు విషయంలో నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ ఊగిపోయారు. రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు తీరు తేటతెల్లమయింది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడింది. బాబు గోబెల్స్ ప్రచారానికి, ఎల్లో మీడియా అసత్యాలకు తెరపడింది అంటూ కామెంట్స్ చేశారు. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. ఇది కూడా చదవండి: బాబు రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం -
చంద్రబాబుకు సుప్రీం కోర్ట్ నోటీసులపై పొన్నవోలు కామెంట్స్
-
చంద్రబాబు బెయిల్ పై పొన్నవోలు కామెంట్స్
-
సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
దోచేసిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించారు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు తదితరులు లూటీ చేసిన డబ్బు మొత్తాన్ని హవాలా మార్గంలో మళ్లించారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తనకు సంబంధించిన చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా రూ. 10 నోట్లను వినియోగించి కావాల్సిన చోటుకు హవాలా మార్గంలో నిధులను మళ్లించారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా జరిగిన వారి చాటింగ్ వివరాలను ఆయన కోర్టుకు వివరించారు.నిధులు మళ్లింపు, డబ్బు జమకు వారి మధ్య కోడ్ భాషలో సంభాషణలు జరిగాయని తెలిపారు. సీమెన్స్ ప్రతినిధి మాథ్యూ థామస్ అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు వాంగ్మూలం ఇచ్చారని ఆయన కోర్టుకు వివరించారు. 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన సీమెన్స్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక ముందే చంద్రబాబు ప్రభుత్వం రూ. 270 కోట్లను ముందుగానే విడుదల చేసేసిందని, ఈ విషయంలో ప్రతీ దశలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిధులను విడుదల చేయాలని కోరగానే, ఆ నిధులను విడుదల చేసినట్లు అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ తన నోట్‌ఫైల్‌లో పేర్కొన్నారని, ఇదంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగిందని సుధాకర్‌రెడ్డి కోర్టుకు వివరించారు. టీడీపీ ఖాతాల్లోకి నిధులు స్కిల్ కుంభకోణం నిధుల్లో కొంత భాగం అంతిమంగా తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో చేరాయని, ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ కోరితే ఆ పార్టీ వర్గాలు ఇవ్వడం లేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. సీఐడీ ఇచ్చిన నోటీసులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. స్కిల్ కుంభకోణంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి నిధుల దుర్వినియోగాన్ని ధ్రువీకరించిన శరత్ అసోసియేట్స్‌పై ఈ కేసులో నిందితుడైన వికాస్ ఖన్వీల్కర్‌తో చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా వద్ద ఫిర్యాదు చేయించారన్నారు. ఇలా చేయించడం ద్వారా ఈ కేసులో కీలక సాక్షి అయిన శరత్ అసోసియేట్స్‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక చంద్రబాబు అరెస్ట్ తర్వాత దర్యాప్తుకు విఘాతం కలిగేలా సుమన్ బోస్, ఖన్వీల్కర్లు మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని.. ఆ పిటిషన్ కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. గుండె జబ్బన్నారు.. ఈసీజీలో అలాంటిదేమీ లేదు కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో సహనిందితుల ద్వారా సాక్షులను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని ఏఏజీ తెలిపారు. తమ పార్టీ నేతల ద్వారా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం, స్టేట్మెంట్లు ఇప్పించడం, పోలీసులపై కేసులు పెట్టించడం వంటివి చేస్తున్నారని వివరించారు. బెయిల్ పొందేందుకు వీలుగా తప్పుడు మెడికల్ రిపోర్ట్‌ను కోర్టు ముందుంచారని ఆయన తెలిపారు. తాజా మెడికల్ రిపోర్టులో చంద్రబాబు ‘హైపర్‌ట్రోపిక్ కార్టియోపతి విత్ ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్’తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారని.. ఇది శుద్ధ అబద్ధమని, ఆ వ్యాధితో బాధపడేవారికి వైద్యులు ఐసీడీ అనే పరికరాన్ని అమరుస్తారని తెలిపారు. ఇదేమీ అసాధారణ వ్యాధి కాదన్నారు. ఆ జబ్బు ప్రభావం ఈసీజీ ద్వారా తెలుస్తుందని, అయితే చంద్రబాబు ఈసీజీలో అలాంటిది ఏమీ లేదని ఆయన వివరించారు. కేవలం బెయిల్ కోసం ఈ మెడికల్ రిపోర్టును సృష్టించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వైద్యుల బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు చేయించుకునేలా చంద్రబాబును ఆదేశించాలని కోరారు. చంద్రబాబును ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తనకు కావాల్సిన చోట చికిత్స పొందేందుకు చంద్రబాబుకు అనుమతినివ్వడం ద్వారా ఈ కోర్టు ఓ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించిందని, రాజమండ్రి జైలులో ప్రస్తుతం 2 వేల మంది ఖైదీలు ఉన్నారని, వారంతా కూడా కోర్టుకొచ్చి తమకూ అలాంటి అవకాశం ఇవ్వాలని కోరే ప్రమాదం ఉందన్నారు. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించేలా వైద్య నివేదికలు వాస్తవానికి మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పలు షరతులు విధించిందని, చంద్రబాబు వైద్య నివేదికలను రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్ కవర్లో ఇవ్వాలని వైద్యులను ఆదేశించిందని ఏఏజీ తెలిపారు. అయితే వైద్యులు నేరుగా చంద్రబాబుకే ఆ నివేదికలు ఇచ్చారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా చంద్రబాబు కోర్టు షరతులను ఉల్లంఘించారన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. తీర్పు రిజర్వు సీఐడీ వాదనలకు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. నిధుల మళ్లింపుతో చంద్రబాబునాయుడుకు సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రతీకారంలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్నారు. ఆయన షరతులను ఉల్లంఘించలేదని తెలిపారు. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న సుధాకర్‌రెడ్డి రెండో రోజూ గురువారం తన వాదనలను కొనసాగించారు. కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదు.. స్కిల్ కుంభకోణంలో సీఐడీ పలు కీలక విషయాలను హైకోర్టు ముందుంచింది. కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా ఎలా మళ్లించారు.. వాటిని తిరిగి టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి ఎలా తీసుకొచ్చారు.. డీమానిటైజేషన్ సమయంలో డబ్బును ఎలా మార్పిడి చేశారు.. తదితర వివరాలను సీఐడీ లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచింది. ఈమేర అదనపు కౌంటర్‌ను కోర్టులో దాఖలు చేసింది. 2014 జూన్ 1 నుంచి 2018 జూన్ వరకు మొత్తం రూ. 65.86 కోట్లు టీడీపికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి చేరాయని సీఐడీ వివరించింది. అంతేకాక 2016 నవంబర్, 2017 జనవరి మధ్య మొత్తం నగదు డిపాజిట్లన్నీ కూడా రూ. 500, రూ. 1,000 నోట్ల ద్వారా మాత్రమే జరిగిన విషయాన్ని దర్యాప్తులో గుర్తించామని సీఐడీ తెలిపింది. డీమానిటైజేషన్‌ను నవంబర్ 8న ప్రకటించారని, అందువల్ల ఈ రూ. 500, రూ. 1,000 జమ లావాదేవీలన్నీ కూడా అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయంది. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన వారి వివరాలేవీ సరిగా లేవని, కేవైసీ నిబంధనలు అసలు పాటించలేదని సీఐడీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎంత మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని, తామిచ్చిన నోటీసులకు సైతం సరైన రీతిలో స్పందించడం లేదని వివరించింది. చంద్రబాబు ప్రభావితం చేస్తున్న కారణంగా కీలక సాక్షులు దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని విదేశాలకు పారిపోయారని సీఐడీ తన అదనపు కౌంటర్లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. -
రఘురామరాజు ఇంప్లీడ్ పిటిషన్‌పై తక్షణ విచారణ అవసరం లేదు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. పిటిషనర్ వంటి రాజకీయ నాయకుడు దాఖలు చేసిన ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతిస్తే ఈ వ్యవహారం రాజకీయరంగు పులుముకుంటుందని వ్యాఖ్యానించింది. ఈ ఇంప్లీడ్ పిటిషన్ విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇదే సమయంలో ఏఏజీ సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను తర్జుమా చేసి తమ ముందు ఉంచకపోవడంపై పిటిషనర్‌ను హైకోర్టు నిలదీసింది. ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏ నిబంధనలు ఉల్లంఘించారో, వారిపై ఏం చర్యలు కోరుతున్నారో చెప్పాలంది. నిబంధనల ప్రకారం వారిని తొలగించడమో, సస్పెండ్ చేయడమో చేయాలని పిటిషనర్ న్యాయవాది గిరిబాబు తెలిపారు. చంద్రబాబు కేసు వివరాలను వారు బహిర్గతం చేశారని, ఇది ఎంతమాత్రం సరికాదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. స్కిల్ కుంభకోణం కేసు లేదా ఇతర ఏ కేసుకు సంబంధించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్‌లను ఆదేశించాలని కోరుతూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ అధ్యక్షుడు ఎన్.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో తనను కూడా ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ప్రజా సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నిస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తప్పుకున్నారు. దీంతో జస్టిస్ రఘునందన్‌రావు సభ్యుడిగా లేని బెంచ్ ముందు ఈ వ్యాజ్యాన్ని ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే
సాక్షి, అమరావతి: కంటి శస్త్ర చికిత్స కోసం తాత్కాలిక బెయిల్ పొందిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అప్పుడే ఉల్లంఘించడం మొదలు పెట్టారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అనారోగ్యం సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే రాజకీయ ర్యాలీ ప్రారంభించారని, జైలు బయటే మీడియాతో కూడా మాట్లాడారని తెలిపారు. హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వీటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం, కేసు గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది. సీఐడీ అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసి కూడా చంద్రబాబు వాటికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. తాము అదనపు షరతులు విధించాలని ఎందుకు మొత్తుకుంటున్నామో దీనినిబట్టి అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు సమర్పించి, దానిని పరిశీలించాలని కోరారు. చంద్రబాబు కోర్టు షరతులకు లోబడి వ్యవహరిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ అధికారులు చంద్రబాబు స్వేచ్ఛకు ఏ రకంగానూ భంగం కలగనివ్వబోరని, ఇది తాము ఇస్తున్న హామీ అని నివేదించారు. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు తెలిపారని సుధాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు జోక్యం చేసుకుంటూ.. మీ వద్ద ఇంటెలిజెన్స్ ఉందిగా.. దాని సాయంతో చంద్రబాబుపై నిఘా పెట్టొచ్చుగా అని వ్యాఖ్యానించారు. నిఘా వేరు, ఓ వ్యక్తి వెంట వెళ్లడం వేరని, నిఘా అనేది వ్యక్తికి తెలియకుండా చేసేదని సుధాకర్‌రెడ్డి వివరించారు. అనంతరం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ కోరుతున్న అదనపు షరతులు దర్యాప్తు కోసం కాదని, ఇతర కారణాలున్నాయని అన్నారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకే బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానాలు షరతులు విధిస్తాయన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, ర్యాలీలో పాల్గొనలేదన్నారు. ఆయనకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు ఆయన వద్దకే ప్రజలు వచ్చారన్నారు. న్యాయస్థానం షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దును కోరే స్వేచ్ఛ సీఐడీకి ఉందని, అందువల్ల సీఐడీ కోరుతున్న విధంగా షరతులు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు. -
బాబుకు మళ్లీ భంగపాటు
సాక్షి, అమరావతి :చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సిŠక్ల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేస్తారనే సీఐడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించిన ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సర్వత్రా తీవ్ర ఆసక్తి కలిగించిన ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు గత నెల 10 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఆయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకించింది. వాడీవేడిగా వాదనలు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వరుసగా మూడ్రోజులపాటు ఇరుపక్షాల న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినపిస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే, సీఐడీ తరపున వాదనలు వినిపించిన ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ విదేశాలకు పరారైన విషయాన్ని పొన్నవోలు ప్రస్తావించారు. గతంలో న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన ఆర్థిక శాఖ రిటైర్డ్ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు విరుద్ధంగా పలు టీవీ చానళ్లలో మాట్లాడడాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు బెదిరింపులు, ఒత్తిడితోనే వారిద్దరూ పరారయ్యారని, పీవీ రమేశ్ మాట మార్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర సాక్షులను కూడా బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పొన్నవోలు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు 44 పేజీల తీర్పును వెలువరించారు. పీటీ వారెంట్లపై విచారణ వాయిదా.. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో చంద్రబాబును అరెస్టుచేసి విచారించేందుకు పీటీ వారెంట్లను అనుమతించాలన్న సీఐడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. పీటీ వారెంట్లపై రైట్ టు ఆడియన్స్ పిటిషన్ వేశాం కాబట్టి తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద అభ్యంతరం వ్యక్తంచేశారు. పీటీ వారెంట్లపై న్యాయస్థానం ఆదేశాలు సరిపోతాయన్నారు. ఈ అంశంపై న్యాయమూర్తి లేవనెత్తిన సందేహాలకు సీఐడీ తరపు న్యాయవాది సమాధానాలు ఇస్తుండగా.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. న్యాయస్థానాన్ని ఎవరూ శాసించలేరని స్పష్టంచేస్తూ చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇలా అయితే ఈ కేసులను విచారించలేనని.. స్పెషల్ కోర్టుకో వేరే వారికో బదిలీ చేయాలని రిజిస్ట్రీకి చెబుతానన్నారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు వెనక్కి తగ్గారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలకు అవకాశం ఇచ్చేందుకు కేసు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. మళ్లీ కస్టడీకి నిరాకరణ.. మరోవైపు.. చంద్రబాబును మరోసారి విచారించేందుకు కస్టడీకి అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. గతంలో ఇచ్చిన రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదు కాబట్టి ఆయన్ని మరోసారి విచారించేందుకు మూడ్రోజుల కస్టడీకి అనుమతించాలని సీఐడీ కోరింది. జ్యుడీషియల్ కస్టడీ 15 రోజుల గడువు ముగిసినందున మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబును కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. -
చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు: ఏఏజీ పొన్నవోలు
-
ఆడిటర్ వెంకటేశ్వర్లు కీలక పాత్ర...సంచలన నిజాలు బయటపెట్టిన ఏఏజీ పొన్నవోలు..!
-
టీడీపీకి.. స్కిల్ కార్పొరేషన్‌కు ఒక్కరే అడిటర్
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. గత రెండు రోజులుగా ఇరపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ(శుక్రవారం) అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తుది వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ఇవాళ కూడా కొన్ని సంచలన విషయాల్ని బయటపెట్టారాయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్కిల్ స్కామ్‌లో టీడీపీ ఖాతాలోకి మళ్లిన నిధుల వ్యవహారాన్ని నిన్న వాదనల సందర్భంగా డాక్యుమెంట్లతో సహా బయటపెట్టిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి.. మూడవ రోజు వాదనలోనూ సంచలనాలు వెలుగులోకి తెచ్చారు. టీడీపీకి.. స్కిల్ స్కామ్‌లో ఆడిటర్‌గా పని చేసిన వ్యక్తి ఒక్కరేనని.. ఆయన్ని విచారిస్తే కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలియజేశారు ఏఏజీ పొన్నవోలు. ఈ కేసులో టీడీపీ అడిటర్ వెంకటేశ్వర్లుని విచారించాల్సి ఉంది. ఈ నెల 10వ తేదీన సీఐడీ విచారణకి రావాలని ఆయనకి నోటీసులిచ్చాం. ఆడిటర్ వెంకటేశ్వర్లే స్కిల్ కార్పోరేషన్‌కి ఆడిటర్ గా పనిచేశారు. ఈ రెండింటికీ ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధులు దారి మల్లింపు వ్యవహారం బయటపడకుండా మేనేజ్ చేశారు. తద్వారా చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. పైగా సీఎం హోదాని చంద్రబాబు అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారు. జీవో నెంబర్ 4 ని అడ్డం పెట్టుకుని నిధులు దిగమింగారు. కాబట్టి.. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుంది అని పొన్నవోలు కోర్టులో వాదించారు. ఈ దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దని.. ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై చంద్రబాబును విచారించాల్సి ఉందని ఏఏజీ పొన్నవోలు ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారాయన. చంద్రబాబు సహకరించలేదు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత.. చంద్రబాబు కస్టడీ పిటీషన్‌పై ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. స్కిల్ కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు గత రెండు రోజులకస్టడీలో సీఐడీకి సహకరించలేదు. సెంట్రల్ జైలులోనే చంద్రబాబుని మరోసారి విచారించడానికి అవకాశమివ్వండి. [di చంద్రబాబుని కనీసం మూడు రోజుల కస్టడీకి ఇవ్వండి. చంద్రబాబుని విచారణ చేస్తేనే కొంతవరకైనా నిజం బయటకి వస్తుంది అని కోర్టును కోరారాయన. ఇక బ్యాంకర్ల నుంచి వివరాలు సేకరించారన్న చంద్రబాబు లాయర్ల ఆరోపణలపై ఏఏజీ పొన్నవోలు స్పందించారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఐటీ రిటర్స్ని మాత్రమే డౌన్ లోడ్ చేశాం. బ్యాంకర్ల నుంచి ఎక్కడా తీసుకోలేదని స్పష్టత ఇచ్చారాయన. -
‘స్కిల్ స్కామ్’ సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అనేందుకు ఆధారాలను సీఐడీ ఒక్కొక్కటిగా కోర్టు ముందుంచుతోంది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గురువారం ఏసీబీ న్యాయస్థానం ముందుంచారు. ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని ఏఏజీ స్పష్టంచేశారు. దారి మళ్లించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరాయని చెప్పారు. అందులో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని చెబుతూ ఆ రికార్డులను న్యాయస్థానానికి సమర్పించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయకూడదని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా రెండో రోజు గురువారం విచారించింది. సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా తరలించిన నిధుల్లో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరడం సాధారణ విషయం కాదని చెప్పారు. ఈ అంశంపై విచారించేందుకు టీడీపీ ఆడిటర్‌ను ఈ నెల 10న సీఐడీ విచారణకు పిలిచిందని తెలిపారు. ఈ కుంభకోణంలో మిగిలిన నిధులు కూడా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ఎలా చేరాయో వివరించారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేశారని చెప్పారు. నిధుల విడుదలకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలిపారు. నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ను సీఐడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వగానే ఆయన పరారైన విషయాన్ని మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయని గతంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలని చెప్పారు. దర్యాప్తు సక్రమంగా సాగి మొత్తం కుట్రను వెలికితీసే వరకూ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. రెండు రోజుల కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించలేదని, అందువల్ల ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఒప్పందంతో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ముగిసిందని, ఆ తరువాత జరిగే అవినీతి, అక్రమాలతో ఆయనకు సంబంధం లేదని అన్నారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుతో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. సీఎం హోదాలోనే చంద్రబాబు నిధుల మంజూరుకు అనుమతించారని చెప్పారు. కాబట్టి చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలను శుక్రవారం కూడా వింటామని ఏసీబీ న్యాయస్థానం తెలిపింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
ఈ నెల 19 వరకు చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు
-
స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం(ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు. నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులను దిగమింగారు. ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టీడీపీ ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఏఏజీ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లను ACB కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన ఆడిటర్‌ను విచారణకు పిలిచామని, ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారని ఏఏజీ తెలిపారు. డొల్ల కంపెనీలను సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని ఏఏజీ పొన్నవోలు వివరించారు. చదవండి: పవన్ కల్యాణ్‌ను బీజేపీనే వద్దనుకుందా? -
స్కిల్ స్కామ్ లో బాబు పాత్రపై ఆధారాలున్నాయి: పొన్నవోలు
-
దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు
సాక్షి, విజయవాడ: ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు కీలక దశలో ఉంది. రూ.371 కోట్లు కొల్లగొట్టిన ఈ సామాజిక, ఆర్థిక కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా తానై చంద్రబాబు వ్యవహరించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బెయిల్‌పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతున్నా’.. అని రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించేందుకు ఉన్న బలమైన కారణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర సుస్పష్టమన్నారు. జీఓ జారీ, అందుకు విరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవడం, అధికారుల నియామకం, ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధుల విడుదల.. ఇలా అన్ని దశల్లోనూ చంద్రబాబే ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. అందుకు 13 నోట్‌ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేయడమే నిదర్శనమన్నారు. జీఓ నంబర్ 4 కంటే ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ, ఆ ఒప్పందాన్ని జీఓలో ఎందుకు ప్రస్తావించలేదన్నది ఈ కేసులో కీలకమన్నారు. ఆర్థిక శాఖ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను చంద్రబాబు దురుద్దేశపూరితంగానే తన విచక్షణాధికారాలు (వీటో)తో తోసిపుచ్చారని న్యాయస్థానానికి వివరించారు. బాబు బెదిరింపులపై ఆధారాలున్నాయి.. అంతేకాదు.. తాను చెప్పినట్లు చేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వారిని పదవుల నుంచి తొలగిస్తానని ఆనాడు సీఎంహోదాలో చంద్రబాబు అధికారులను బెదిరించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని కూడా పొన్నవోలు న్యాయస్థానానికి వివరించారు. స్కిల్ కుంభకోణం ఏమీ ఫిక్షన్ కథ కాదని, ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారమని చెప్పారు. ఆ మేరకు సమగ్ర దర్యాప్తు ద్వారా సీఐడీ గుర్తించి నివేదించిన ఆధారాలను పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్ల ద్వారా పన్ను ఎగవేతను 2017లోనే జీఎస్టీ అధికారులు గుర్తించారన్నారు. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులో ఉండగానే 2018లో 17వ సవరణ చేశారనే విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరు పరార్.. ఇక నిధులను అక్రమంగా తరలించడంలో కీలక వ్యక్తులైన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని దేశం విడిచి పరారైన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని వారిని సీఐడీ నోటీసులు ఇవ్వగానే దేశం విడిచిపెట్టి పోవడం తీవ్రమైన పరిణామమన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే వారిద్దరూ పరారయ్యారని చెప్పారు. పెండ్యాల శ్రీనివాస్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసేలా న్యాయస్థానం ఆదేశించాలని కోరారు. ఇక ఈ కేసులో గతంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రస్తుతం అందుకు భిన్నంగా మీడియా చానళ్లలో చర్చల్లో మాట్లాడుతుండటం వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్నారు. కాబట్టి ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన తన రాజకీయ పలుకుబడితో సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోరారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశంలేదు : దూబే అంతకుముందు.. ఈ కేసులో ముద్దాయి చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆర్థిక శాఖ అధికారులు గుజరాత్ వెళ్లి అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్నారు. ఈ ప్రాజెక్టు విలువను నిర్ణయించిన కాస్ట్ వేల్యూయేషన్ కమిటీలో చంద్రబాబు లేరన్నారు. ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న భాస్కరరావు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని చెప్పారు. కేబినెట్ నిర్ణయం మేరకు చేసుకున్న ఒప్పందంలో చంద్రబాబును తప్పుబట్టడానికి లేదన్నారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ఆధారాలను ధ్వంసం చేయడంగానీ పరారయ్యే అవకాశంగానీ లేనందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అనంతరం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనకు పీటీ వారంట్ జారీచేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా న్యాయస్థానం గురువారం విచారించే అవకాశాలున్నాయి. వాదనలపై వక్రీకరణలా!? ఏబీఎన్, టీవీ–5పై ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం మరోవైపు.. న్యాయస్థానంలో జరిగిన వాదనలను వక్రీకరిస్తూ ఏబీఎన్, టీవీ–5 చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు చానళ్లు తనను లొంగదీసుకోవాలని చూస్తున్నాయని.. అది సాధ్యం కాకపోవడంతో తనపై బురద జల్లుతున్నాయని ఆయన విమర్శించారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు విచారణ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు ఏబీఎన్, టీవీ–5 చానళ్లు దుష్ప్రచారం చేశాయని విమర్శించారు. అత్యంత కీలకమైన ఈ కేసులో ప్రభుత్వం తరఫున తాను బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు వినిపించిన వాదనను న్యాయస్థానం ఓపిగ్గా విందన్నారు. ఆ సమయంలో న్యాయస్థానం తనపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని.. నిరూపించలేకపోతే ఏం చేస్తారని ఏబీఎన్, టీవీ–5 చానళ్లకు పొన్నవోలు సవాల్ విసిరారు. ఆ రెండు చానళ్లు టీవీ చర్చల్లో తనను తిట్టిస్తున్నా సహించానని కానీ, ఏకంగా న్యాయస్థానంలో వాదనలను వక్రీకరించడాన్ని మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఈ విషయాన్ని గురువారం విచారణ సమయంలో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆ రెండు చానళ్లకు ధైర్యం ఉంటే గురువారం న్యాయస్థానం విచారణ సమయంలో రావాలని సవాల్ విసిరారు. -
ఏబీఎన్, టీవీ-5పై పొన్నవోలు తీవ్ర ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి. ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు. కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు. కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు. బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి. నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలకు నేను భయపడే ప్రసక్తే లేదు’’ అని పొన్నవోలు పేర్కొన్నారు. ‘‘2:30 నుంచి 5 గంటల వరకు వాదనలు వినిపించాను. బయటకు వచ్చేసరికి ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేసింది. ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు. రేపు న్యాయమూర్తిని అడుగుతాను. కోర్టు నన్ను మందలించి ఉంటే ఏ శిక్ష కైనా సిద్ధం. నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. డిబేట్లలో నీచంగా తిట్టిస్తున్నారు. న్యాయమూర్తి నేను చెప్పిన వాదనలను ఓపికగా విన్నారు. నేను రాష్ట్రం తరపున బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చాను’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? -
బెయిల్ పిటిషన్ వేసి... వాదనలకు సిద్దం కావడం లేదు ఎందుకు..?
-
బాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: యుద్ధభేరి పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు టీడీపీ శ్రేణులు ఇటీవల సాగించిన విధ్వంసంపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు మంగళవారం ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అసలు ఈ బెయిల్ పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. మరో కేసులో అరెస్టయినందున ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. పలు కేసులు ఒకే పోలీస్టేషన్లో నమోదై, వాటిని ఒకే అధికారి దర్యాప్తు చేస్తుంటే అప్పుడు డీమ్డ్ (అన్నీ కేసుల్లో అరెస్ట్ అయినట్లు) అరెస్ట్ వస్తుందని, వేర్వేరు కేసులు, వేర్వేరు దర్యాప్తు అధికారులున్నప్పుడు అది డీమ్డ్ అరెస్ట్ కిందకు రాదని స్పష్టంచేశారు. డీమ్డ్ అరెస్ట్ అయితే పీటీ వారెంట్‌తో పనేముంటుందని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే పీటీ వారెంట్ దాఖలు చేశామన్నారు. అసలు చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు ఘటన జరిగిందన్నారు. అంగళ్లు వద్ద మొదలైన టీడీపీ శ్రేణుల విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబే దగ్గరుండి శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. మారణహోమం సృష్టించడం ద్వారా శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలన్నదే చంద్రబాబు వ్యూహమన్నారు. అంతిమంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలని ఆయన కోరారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ మరో కేసులో అరెస్టయి జైలులో ఉన్నందున, ఈ కేసులో కూడా అరెస్టయినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. అందుకే బెయిల్ పిటిషన్ వేశామని తెలిపారు. అధికార పార్టీ నేతలు చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని, ఆ దాడి నుంచి ఆయన్ని వ్యక్తిగత భద్రతా సిబ్బంది రక్షించారని తెలిపారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరైందని చెప్పారు. -
స్కిల్ కుంభకోణం బాబు ఆలోచనల నుంచే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగిశాయి. దాదాపు మూడున్నర గంటల పాటు వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అంతకు ముందు సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబు ఆలోచనల నుంచే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పుట్టిందని కోర్టుకు నివేదించారు. దీనికి సంబంధించిన ప్రతి విషయం ఆయనకు తెలుసని, ఈ కుంభకోణంలో అంతిమ లబ్దిదారులు చంద్రబాబుతో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులేనని నివేదించారు. తమ వద్ద ఉన్న ఆధారాలను దగ్గర పెట్టుకుని చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద కుంభకోణంలో 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబును తాము (సీఐడీ) విచారిస్తే ఆయనకు వ చ్చిన నష్టం ఏమీ ఉండదని, అదే తాము విచారించకుంటే దర్యాప్తునకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. పోలీసు కస్టడీకి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టే చంద్రబాబు పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నిందితుడు కోర్టును అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదని శాసించలేడన్నారు. నిందితుడు ముందు న్యాయం మోకరిల్లరాదని, ఒకవేళ అలా జరిగితే వ్యవస్థ కుప్పకూలినట్లేనన్నారు. విచారణలో మౌనంగా ఉండే హక్కు నిందితుడికి ఉందని, అయితే విచారణకు సహకరించాల్సిన బాధ్యత కూడా నిందితుడిపై ఉందని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణాన్ని రాజకీయ కారణాలతో వెలికి తీసినట్లు చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారని, వాస్తవానికి దీన్ని పుణె జీఎస్టీ అధికారులు వెలికి తీశారని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను జీఎస్టీ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ సర్కారు) దృష్టికి తెచ్చారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా దారి మళ్లించారో వివరించారని చెప్పారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో జీఎస్టీ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. ఆ తరువాత షెల్ కంపెనీల గుట్టు రట్టు కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి వాటితో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశాయని చెప్పారు. ఐటీ శాఖ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పారిపోయారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఇలాంటి కేసును రాజకీయ ప్రేరేపితం, కక్ష సాధింపు అనడం దారుణమన్నారు. చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందని, దీన్ని బట్టి ఎంత పకడ్బందీగా ఈ కుంభకోణానికి వ్యూహరచన చేశారో అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. చంద్రబాబును విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. ఇప్పుడు కస్టడీ కోరడం ఏమిటి? చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించామని, వాటి ఆధారంగా చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని సీఐడీ మొదటి రోజే కోర్టును కోరిందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు సేకరించినప్పుడు ఇప్పుడు తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఏముందన్నారు. స్కిల్ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2023లో చంద్రబాబును అరెస్ట్ చేసిందని, ఇంత కాలం సీఐడీ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. వారి అలసత్వానికి చంద్రబాబును కస్టడీకి కోరడానికి వీల్లేదన్నారు. 45 ఏళ్లుగా చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చిన ప్రతిష్టను కాలరాసేందుకే సీఐడీ ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతోందన్నారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తున్న సమయంలో దర్యాప్తు అధికారులు ఆ వివరాలను మీడియాకు లీక్ చేశారని తెలిపారు. చంద్రబాబు ఎమ్మెల్యే కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ కేసు మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదన్నారు. పరిధి లేకుంటే ఎందుకీ పిటిషన్లు? దీనికి సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ వివేకానంద తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులు.. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో చార్జిషీట్ దాఖలైన తరువాత ట్రయల్ మొదలు పెట్టి విచారణ కొనసాగించేందుకు మాత్రమే ఉద్దేశించినవన్నారు. రిమాండ్ విషయంలో ఆ కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. ఒకవేళ ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదని భావిస్తే ఆ విషయాన్ని మొదటే చెప్పి ఉండాల్సిందన్నారు. ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేకుంటే హౌస్ రిమాండ్, బెయిల్, మధ్యంతర బెయిల్ ఇలా ఇన్ని పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఒకవైపు పరిధి లేదంటూనే మరో వైపు ఇన్ని పిటిషన్లు వేయడం చంద్రబాబు తీరును తెలియచేస్తోందన్నారు. మేం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు.. ఏసీబీ కోర్టు కేసు విచారణ మొదలు కాగానే సీఐడీ కస్టడీ పిటిషన్లో చంద్రబాబు దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించింది. అందులో కోర్టును శంకించేలా పేర్కొన్న అంశాలపై అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు న్యాయవాదుల తీరుతో ఒకింత మనస్తాపం చెందిన కోర్టు.. ఈ కేసును తాము విచారించడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా? అంటూ సీఐడీ న్యాయవాదులను ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమకు అభ్యంతరం లేదని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. ఇదే ప్రశ్నను చంద్రబాబు తరఫు న్యాయవాదులను కోర్టు అడిగినప్పటికీ వారు మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ కోర్టు మరోసారి అడగటంతో.. తాము సర్టిఫై చేయాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఒకింత తీవ్ర స్వరంతో బదులిచ్చారు. దీంతో కోర్టు విచారణను ప్రారంభించింది. ఆ దృశ్యాలతో మాకేం సంబంధం లేదు.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ దృశ్యాలు మీడియాలో రావడంపై ప్రశ్నించింది. ఆ దృశ్యాలను తాము లీక్ చేశామంటున్న చంద్రబాబు న్యాయవాదులు అందుకు ఆధారాలుంటే చూపాలని సీఐడీ స్పెషల్ పీపీ వివేకానంద కోరారు. ఆ దృశ్యాలు మీడియాలో ఎలా వచ్చాయో, వాటిని ఎవరు చిత్రీకరించారో తమకు తెలియదన్నారు. విచారణ రోజు చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు, సహాయకులు కూడా కలిశారని కోర్టు దృష్టికి తెచ్చారు. -
చంద్రబాబును అన్ని ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసింది: ఏఏజీ
-
అవినీతి కేసులో బాబును జైలుకు పంపిన వ్యక్తి పొన్నవోలు: న్యాయవాదులు
-
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు: ఏఏజీ
-
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు: ఏఏజీ
-
‘స్కిల్’ స్కామ్ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు
సాక్షి, అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం అధికార విధుల్లో ఎంతమాత్రం భాగం కాదని, అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చంద్రబాబు స్వలాభాపేక్షతో, ఉద్దేశపూర్వకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు మంగళవారం నివేదించారు. ఇదంతా అప్పటి సీఎం చంద్రబాబుకు తెలిసే, ఆయన సమక్షంలోనే జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.371 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించేందుకు సీఐడీకి ఇంత సమయం పట్టిందని, చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదని, పక్కా ఆధారాలున్నాయని నిర్ధారించుకున్న తరువాతనే చంద్రబాబు అరెస్ట్ వరకు వెళ్లామన్నారు. గుజరాత్లో ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలకు రూ.కోటి చెల్లించగా, మన రాష్ట్రంలో మాత్రం అవే కేంద్రాలకు రూ.వందల కోట్లు చెల్లించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు రాజకీయ ప్రేరితమంటూ చంద్రబాబు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. నిజాయతీతో పనిచేసే అధికారులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులను రాజకీయ కక్ష సాధింపుల నుంచి కాపాడేందుకే అవినీతి నిరోధక చట్టంలో 17ఏను చేర్చారే కానీ, నిర్భీతితో పట్ట పగలే ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు వంటి వారి కోసం కాదన్నారు. ప్రజాధనానికి ధర్మకర్తగా, రక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి భక్షకుడిగా మారి రూ.వందల కోట్లను దారి మళ్లించేశారన్నారు. ఇది పూర్తిగా అనధికారిక విధుల కిందకే వస్తుందని, అందువల్ల చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ఎంత మాత్రం వర్తించదని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఈ దశలో దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం దర్యాప్తు చేపట్టాయని నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విచారణ నిమిత్తం చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను సోమవారం వరకు ఒత్తిడి చేయవద్దంటూ ఏసీబీ కోర్టును ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి పొడిగించలేదు. సుదీర్ఘంగా వాదనలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు గత మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో మధ్యాహ్నం 12.05 గంటలకు మొదలైన వాదనలు సాయంత్రం 5.20 వరకు నిరాటంకంగా కొనసాగాయి. వాదనల సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. చంద్రబాబు తరఫున దేశంలోనే అత్యంత ఖరీదైన సీనియర్ న్యాయవాదిగా పేరున్న హరీష్ సాల్వే, టీడీపీ తరఫున ప్రతి కేసును వాదించే మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. లండన్‌లో ఉంటున్న హరీష్ సాల్వే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా అర్ణబ్ గోస్వామి కేసును కూడా ప్రస్తావించారు. 2024లో ఎన్నికలు రాబోతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వం తన కౌంటర్‌ను చివరి నిమిషంలో తమకు అందచేసిందని, ముందే అందచేసి ఉండాల్సిందని సాల్వే పేర్కొనగా, సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ జోక్యం చేసుకుని ఇది కూడా కక్షపూరిత రాజకీయంలో భాగమేనంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మనుషులు విదేశాలకు పారిపోయారు.. ఐటీ శాఖ అధికారులు చంద్రబాబుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు నోటీసులు ఇవ్వగానే ఒకరు దుబాయ్‌కి, మరొకరు వాషింగ్టన్కు పారిపోయారని సీఐడీ తరఫున న్యాయవాదులు తెలిపారు. డిజైన్ టెక్ కంపెనీ రూ.200 కోట్లు దారి మళ్లించినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమైందన్నారు. పలు కీలక డాక్యుమెంట్లను మాయం చేశారని, వాటన్నింటినీ కూడా వెతికే పనిలో దర్యాప్తు అధికారులుఉన్నారని తెలిపారు. ముగ్గురి వాదనలు పూర్తి కాగానే దీనిపై సాల్వే, లూథ్రా తిరుగు సమాధానం ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ వ్యవహారంలో ఏం చెప్పాలనుకున్నా, ఇప్పుడే చెప్పాలని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని, ప్రధాన వ్యాజ్యంపైనే నిర్ణయం వెలువరిస్తానని తేల్చి చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు పూర్తి చేయడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. 10 రోజుల్లోనే కొట్టేయాలంటున్నారు సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు వాదనలు వినిపిస్తూ స్కాం జరిగిన తీరును వివరించారు. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, పలువురిని విచారించాల్సి ఉందని, మరి కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. దర్యాప్తు దశలో కేసును కొట్టేయడానికి వీల్లేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందంటూ నిహారికా కేసులో సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. సెప్టెంబర్ 7న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని, 9న అరెస్ట్ చేశారని, 12న ఆయన తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి కేవలం 10 రోజులే అయిందన్నారు. తాము కౌంటర్ ఇప్పుడే ఇచ్చామని చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారని, వాస్తవానికి 900 పేజీల అదనపు డాక్యమెంట్లను వారు ఇప్పుడే తమకు అందచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అసలు వర్తించదన్నారు. కేసు నమోదు చేసింది 2021లో కావొచ్చు, కానీ కథ నడిచింది మొత్తం 2014, ఆ తరువాతేనని కోర్టుకు నివేదించారు. 2018కి ముందే ఈ కుంభకోణం వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక దర్యాప్తు జరిపిందని వివరించారు. రికార్డులను తారుమారు చేయడం, ప్రజాధనాన్ని కొల్లగొట్టడం పబ్లిక్ డ్యూటీ కిందకు రానే రాదన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్ద ఆలోచనల నుంచే ఈ కుంభకోణం మొదలైందని రోహత్గీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐశాఖ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డ్యాం కట్టాం, వరదల వల్ల అది కొట్టుకుపోయింది.. మా తప్పేమీ లేదని చెప్పేంత చిన్న వ్యవహారం కాదని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణం వెనుక లోతైన కుట్ర ఉందన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన పెద్దలు, దానిని దారి మళ్లించేందుకు పలు షెల్ కంపెనీలను సృష్టించారని, ఇందుకు పక్కా ఆధారాలున్నాయంటూ కోర్టు ముందుంచారు. కేసు డైరీని సైతం కోర్టుకు సమర్పించి కీలక ఆధారాలను నివేదించారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే హైకోర్టు సీఆర్సీసీ సెక్షన్ 482 కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించగలదన్నారు. ప్రాథమిక దశలో దర్యాప్తును కొనసాగించకుండా పోలీసులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో కోర్టులు ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు పోలీసులకు అనుమతినివ్వాలని కోరారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అని చెబుతున్నారని, అదే నిజమైతే 2021లోనే చంద్రబాబును నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే వారమన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఆధారాలు లభించాయి కాబట్టే ఇప్పుడు అరెస్ట్ చేశామన్నారు. స్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందే రూ.300 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రైవేటు కంపెనీల పేరు మీద మళ్లించేశారు, అదే ఇక్కడ కీలక విషయమని కోర్టుకు వివరించారు. ఒప్పందంలో భాగమైన రెండు ప్రైవేటు కంపెనీలు కలిసి మూడో కంపెనీని తెరపైకి తెచ్చి, ఆరు షెల్ కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించేశాయన్నారు. ఇదంతా కూడా చంద్రబాబుకు తెలిసే జరిగిందని వివరించారు. నిధుల చెల్లింపునకు ఆయనే అనుమతినిచ్చారని తెలిపారు. ఇదంతా తాము చెబుతున్నది కాదని, కాగితాలే అందుకు సాక్ష్యమన్నారు. కార్పొరేషన్‌ను ప్రతివాదిగా చేర్చాల్సిందే.. ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ)ను ప్రతివాదిగా చేర్చకుండానే పిటిషన్ దాఖలు చేశారని న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో కె.అజయ్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చారని, ఆయనకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. అందువల్ల కార్పొరేషన్‌ను ప్రతివాదిగా చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. -
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఖజానా ఖాళీ
-
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు
-
దోపిడీలో బాబు, వికాస్ ఖన్వేల్కర్ కోర్టులో లూథ్రా వాదనలు.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి షాకింగ్ నిజాలు..
-
ఇది 100 శాతం ఫ్రాడ్.. తేల్చేసిన సీమెన్స్ కంపెనీ
-
తిరిగి తిరిగి హైదరాబాద్‌కు.. 5thలేయర్లో షాకింగ్ నిజాలు..
-
బేసిక్ లా తెలియని వారే అలా మాట్లాడతారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో ప్రవేశపెట్టామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. తీర్పు అనంతరం ఏఏజీ పొన్నవోలు.. మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రిమాండ్‌పై ఆయన తరపు న్యాయ వాదులు తీవ్రమైన వాదనలు వినిపించారు. సీఆర్.పీఎస్ చట్టంలో రెండు కస్టడీ పిటిషన్లే ఉన్నాయి. ఒకటి పోలీస్ కస్టడీ, రెండవది జ్యుడీషియల్ కస్టడీ. హౌస్ కస్టడీ పిటిషన్ అనేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాజమండ్రి సెంట్రలో జైలులో భద్రత లేదని వారి ఆరోపణ. చంద్రబాబు జైల్లో ఉన్న ప్రాంతం ఒక కోటలా మారింది. ప్రత్యేకంగా ఒక బ్యారెక్స్‌ను కేటాయించారు. 24x7 గంటలూ సీసీ కెమెరాల నిఘా, వైద్యులు అందుబాటులో ఉన్నారు. చంద్రబాబు భద్రత ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది. సెంట్రల్ జైల్ అంటేనే పటిష్టమైన భద్రతా ప్రదేశం. ప్రైవేట్ గృహంలో ఉంటేనే భద్రత ఉండదు.. అక్కడ ఏదైనా జరగొచ్చు. అదే జైల్లో ఉంటే ఎలాంటి భద్రతా పరమైన సమస్యా ఉండదు. జైల్లో ఫలానాది లేదని చెప్పమనండి.. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదనే వాదన సరైనది కాదు. బేసిక్ లా తెలియని వారు.. చట్టంపై అవగాహన లేని వారు చెప్పే మాటలే ఇవి’’ అని ఏఏజీ పేర్కొన్నారు. ‘‘ఎంక్వైరీలో పేరు ఉందా లేదా అనేదే ముఖ్యం. తనను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేశారని చంద్రబాబే కోర్టులో అంగీకరించారు. చంద్రబాబు ఇటీవల పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానన్నారు. ఇప్పుడు తన అరెస్ట్ కేసులో హౌస్ కస్టడీ పిటిషన్ కోరడం ద్వారా ఖైదీలకు ‘‘వర్క్ ఫ్రమ్ హోం’’ అనే మెసేజ్‌ను ఇచ్చినట్లుంది. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశాం. రేపు(బుధవారం) చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం ఉంది’’ అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. చదవండి: ‘హౌస్ అరెస్ట్‌లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?’ -
చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని ఏఏజీ వెల్లడి
-
జైలులో ఖైదీలు ఉండక.. స్వామీలు ఉంటారా?: సాక్షితో AAG
-
చంద్రబాబు అధికారులను బెదిరించి డబ్బులు విడుదల చేయించారు..
-
ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ కల్పించాం: పొన్నవోలు
-
‘అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్ ఫండ్స్ ఇచ్చారు’
సాక్షి, విజయవాడ: గత ప్రభుత్వ పెద్దలే స్కిల్ డెవలప్స్కామ్కు తెరలేపారని సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు స్పష్టం చేశారు. ఎలాంటి చర్చ లేకుండా ఎంఓయూ కుదుర్చుకుని ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. అసలు డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్ ఫండ్స్ ఇవ్వాలని ఆదేశించారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు ఏఏజీ పొన్నవోలు. చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్‌పై విచారణను రేపటికి(మంగళవారం) ఏసీబీ కోర్టు వాయిదా వేసిన అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. ‘రాజమండ్రి జైలువద్ద చంద్రబాబుకు భారీ భద్రత ప్రభుత్వమే కల్పించింది. ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కంటే ఎక్కువ సెక్యూరిటీ కల్పించాం. 24 గంటలు వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. సీఆర్పీసీ చట్టంలో అసలు హౌజ్ అరెస్టు అనేది లేదు. ప్రజల సొమ్మును దోపిడీ చేసి షెల్ కంపెనీలకు మళ్లించారు. స్కాం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా తెలుస్తోంది. రూ. 371 కోట్ల రాష్ట్ర ఖజానా దోపిడీకి గురైంది’ అని తెలిపారు. చదవండి: Khaidi No 7691 : జైల్లో బావ - సీట్లో బాలయ్య చంద్రబాబు హౌజ్ అరెస్టుపై విచారణ రేపటికి వాయిదా -
చంద్రబాబు అరెస్ట్ గురించి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి..!
-
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ, పెత్తందారులు అడ్డుకున్నారు: పొన్నవోలు
-
ప్రజాధనం దోపిడీకే తెరపైకి ‘సీమెన్స్’
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టాలన్న ముందస్తు పథకంలో భాగంగానే గత సర్కారు పెద్దలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్‌ను తెరపైకి తెచ్చారని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,356 కోట్లకు కృత్రిమంగా పెంచారని, ఇందులో సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ప్రసాద్ కీలక పాత్ర పోషించారని నివేదించారు. ఇలా పెంచిన మొత్తాన్ని పెద్దల అండతో దారి మళ్లించేందుకు భారీ కుట్రకు తెర తీశారని తెలిపారు. అందులో భాగంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య ఒప్పందం కుదరగానే యూపీలో ఐఏఎస్ అధికారిగా ఉన్న భాస్కర్ ప్రసాద్ భార్య ఊర్మిళను ఇంటర్ కేడర్ డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదో భారీ కుంభకోణమని, ఇంత తీవ్రమైన కేసులో మేస్ట్రేస్టేట్ చాలా యాంత్రికంగా భాస్కర్ ప్రసాద్ రిమాండ్‌ను తిరస్కరించారని తెలిపారు. కింది కోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భాస్కర్ ప్రసాద్‌పై ఐపీసీ సెక్షన్లు 409, 120 (బీ) కింద సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే మేస్ట్రేస్టేట్ విస్మయకరంగా రిమాండ్ సమయంలోనే మినీ ట్రయల్ నిర్వహించి సెక్షన్ 409 వర్తించదని తేల్చడంతోపాటు భాస్కర్ ప్రసాద్ రిమాండ్‌ను తిరస్కరించారని వివరించారు. ఏ సెక్షన్ వర్తిస్తుంది? ఏ సెక్షన్ వర్తించదు? అనే అంశాలను దర్యాప్తు పూర్తై చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత చేపట్టే తుది విచారణలో తేల్చాలే కానీ రిమాండ్ సమయంలో కాదన్నారు. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో రిమాండ్ సమయంలోనే ఫలానా సెక్షన్ వర్తించదంటూ రిమాండ్‌ను తిరస్కరించే ట్రెండ్ నడుస్తోందని, దీనిపై హైకోర్టు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సుధాకర్‌రెడ్డి నివేదించారు. ఈ కుంభకోణం వెనుక దాగిన పెద్దల పాత్ర బహిర్గతం కావాలంటే భాస్కర్ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించడం సీఐడీకి అనివార్యమన్నారు. సీఐడీ తరఫున వాదనలు ముగియడంతో భాస్కర్ ప్రసాద్ తరఫు న్యాయవాది వీఆర్ మాచవరం వాదనల నిమిత్తం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్.భానుమతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
విద్యార్థుల జీవితాలతో నారాయణ ఆడుకున్నారు: ఏజీ పొన్నవోలు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేయడం ద్వారా నారాయణ విద్యా సంస్థ, దాని అధిపతి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి వారి పట్ల న్యాయస్థానం మెతక వైఖరి అవలంబించకూడదని అన్నారు. తీవ్ర నేరానికి పాల్పడిన నారాయణకు రిమాండ్ తిరస్కరించి, బెయిల్ మంజూరు చేయడం ద్వారా మేజి్రస్టేట్ తప్పు చేశారని, పరిధి దాటి వ్యవహరించారని, మినీ ట్రయల్ నిర్వహించారని తెలిపారు. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్లో ఈ కోర్టు జోక్యం చేసుకుంటే, మేజిస్ట్రేట్ల తప్పులను సమర్థించినట్లవుతుందని తెలిపారు. అందువల్ల మేజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తీర్పును రిజర్వ్ చేశారు. నారాయణ ఈ నెల 30వ తేదీలోపు లొంగిపోవాలంటూ సెషన్స్ కోర్టు నిర్దేశించిన గడువును తీర్పు వెలువరించేంత వరకు పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్) మేజి్రస్టేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు మంగళవారం మరోసారి విచారణ జరిపారు. ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నారాయణకు బెయిల్ రద్దు ఉత్తర్వులు తాత్కాలికమైనవి కావని, మధ్యంతర ఉత్తర్వులని వివరించారు. అందువల్ల వాటిపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయాలే తప్ప, క్వాష్ పిటిషన్ కాదని అన్నారు. ఈ సందర్భంగా చట్ట నిబంధనలను, పలు తీర్పులను వివరించారు. నిబంధనల ప్రకారమే బెయిల్ మంజూరు చేయాలి తప్ప, ఫలానా సెక్షన్ వర్తించదని రిమాండ్ సమయంలో మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని, ప్రస్తుత కేసులో మేజి్రస్టేట్ ఇలాంటి ట్రయల్ నిర్వహించారని, దీనిపైనే తమ ప్రధాన అభ్యంతరమని తెలిపారు. ప్రశ్నపత్నం లీకేజీ వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, అందుకు నారాయణను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల వల్ల దర్యాప్తునకు విఘాతం కలిగిందన్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవహారమైనందువల్ల నారాయణ చర్యలను తేలిగ్గా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నారాయణ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.