సాక్షి, హైదరాబాద్: చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని.. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారన్నారు. పాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదు. న్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
‘‘తెలుగుదేశం పార్టీ 340 ప్రకారం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు భూములు తీసుకుంది. ఎకరాకు వెయ్యి రూపాలకే తెలుగుదేశం భూములు పొందింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రకారం రెండు ఎకరాలు చట్టపరంగా తీసుకుంది. పర్మిషన్ తీసుకోలేదని ఏడురోజుల్లో తొలగించాలని ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చారు. మేము సవాల్ చేస్తూ.. లంచ్ మోషన్ వేశాం. కూల్చేస్తున్నారని కోర్టుకు చెప్పాం. డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతామని చట్టానికి లోబడి పనిచేస్తామని కోర్టుకు తెలిపారు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంతవరకు కూల్చకూడదని చట్టం చెబుతుంది.’’ అని పొన్నవోలు తెలిపారు.
‘‘చట్టం 115 సీఆర్‌డీఏ యాక్ట్ కింద వివరణ అడగాలి, వివరణ కూడా ఇచ్చాము. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు ఆదేశాల విషయం సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలిపాం’’ అని పొన్నవోలు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment