షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు | AAG Ponnavolu Sudhakar Reaction On YS Sharmila Comments | Sakshi
Sakshi News home page

షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు

Published Fri, Apr 26 2024 7:36 PM | Last Updated on Fri, Apr 26 2024 7:42 PM

AAG Ponnavolu Sudhakar Reaction On YS Sharmila Comments

సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. 

ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్‌ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు.  

వైఎస్సార్‌పై కేసులు పెడుతుంటే చూడలేక..
‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్‌ను చూడనేలేదు.  వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్‌కు ఏం సంబంధం ఉంది?
చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్‌!

వాస్తవాలు తెలుసుకోవాలి..
వైఎస్సార్‌ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్‌ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్‌ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.

నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..
షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement