సాక్షి, విజయవాడ: ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
‘‘ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి. ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు. కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు. కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు. బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి. నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలకు నేను భయపడే ప్రసక్తే లేదు’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.
‘‘2:30 నుంచి 5 గంటల వరకు వాదనలు వినిపించాను. బయటకు వచ్చేసరికి ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేసింది. ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు. రేపు న్యాయమూర్తిని అడుగుతాను. కోర్టు నన్ను మందలించి ఉంటే ఏ శిక్ష కైనా సిద్ధం. నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. డిబేట్లలో నీచంగా తిట్టిస్తున్నారు. న్యాయమూర్తి నేను చెప్పిన వాదనలను ఓపికగా విన్నారు. నేను రాష్ట్రం తరపున బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చాను’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో?
Comments
Please login to add a commentAdd a comment