TV-5
-
ఏబీఎన్, టీవీ-5పై పొన్నవోలు తీవ్ర ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి. ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు. కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు. కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు. బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి. నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలకు నేను భయపడే ప్రసక్తే లేదు’’ అని పొన్నవోలు పేర్కొన్నారు. ‘‘2:30 నుంచి 5 గంటల వరకు వాదనలు వినిపించాను. బయటకు వచ్చేసరికి ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేసింది. ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారు. రేపు న్యాయమూర్తిని అడుగుతాను. కోర్టు నన్ను మందలించి ఉంటే ఏ శిక్ష కైనా సిద్ధం. నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. డిబేట్లలో నీచంగా తిట్టిస్తున్నారు. న్యాయమూర్తి నేను చెప్పిన వాదనలను ఓపికగా విన్నారు. నేను రాష్ట్రం తరపున బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చాను’’ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? -
భారతి సిమెంట్‌కు టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డు
హైదరాబాద్: టీవీ-5 నిర్వహించిన బిజినెస్ లీడర్-2015 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగింది. వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన భారతి సిమెంట్ సంస్థతో పాటు, 23 విభాగాల్లో ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. మాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ అండ్ ఐటీస్ తదితర రంగాల్లో అవార్డులు గెలుపొందినవారు ఈ సందర్భంగా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు ద త్తాత్రేయ, మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, సినీనటులు నాగార్జున, మంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.