AP Inter Results: రేపే ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు | AP Inter Results 2025 date and time announced | Sakshi
Sakshi News home page

AP Inter Results 2025: రేపే ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు

Published Fri, Apr 11 2025 1:47 PM | Last Updated on Fri, Apr 11 2025 2:54 PM

AP Inter Results 2025 date and time announced

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఇంటర్‌లో ఈ ఏడాది 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి - 19 వరకు ఫస్టియర్‌ పరీక్షలు జరగగా, మార్చి 3- 20 వరకు సెకండియర్‌ పరీక్షలను నిర్వహించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో రేపు, ఏప్రిల్‌ 12న ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు.

AP Inter Results 2025.. ఎలా చెక్‌ చేసుకోవాలి.. ?
➤ ముందుగా https://results.sakshieducation.com ను క్లిక్‌ చేయండి.
➤ "AP Inter 1st Year / 2nd Year Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
➤ మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి.
➤ వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. 
➤ తర్వాతి స్క్రీన్‌లో ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.
➤ భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement