TDP Chandrababu Cases Petitions..
09:17 PM, Nov 9, 2023
బాబు గజగజ
►స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు
► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు
►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి
►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్ బాబు
►టెన్షన్‌లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్
►స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్ కో
05:59 PM, Nov 9, 2023
తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ?
►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ?
►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్ సిటీ కట్టాడు
►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు
►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు
కింది ఫోటో చూడండి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టిడిపిది కాదు
కిందివి చదివిన తర్వాత మరిన్ని విషయాలు నిర్దారించుకోండి
►విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు.
►వైజాగ్ NAD ఫ్లై ఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు.
►బెజవాడ బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసేసాడు.
►రెండో ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ మొదలుపెట్టి, ఏడాదిలో జగనే పూర్తి చేసాడు.
►కృష్ణా నది రిటైనింగ్ వాల్ సీఎం జగనే స్టార్ట్ చేసి పూర్తి చేసాడు. ఇంకొకటి స్టార్ట్ చేసాడు.
►తిరుపతిలోని సేతు ఫ్లైఓవర్ అందంగా సీఎం జగన్ ప్రభుత్వమే పూర్తి చేసింది
►అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి సీఎం జగనే మొదలుపెట్టి, పూర్తి చేసాడు.
ఇవే కాదు
►భోగాపురం ఎయిర్‌పోర్టుకి అన్ని అనుమతులు సాధించి, సీఎం జగనే మొదలు పెట్టి పనులు చేస్తున్నాడు.
►వెలిగొండ18 కి.మీ. మొదటి టన్నెల్ సీఎం జగనే పూర్తి చేసాడు. రెండో టన్నెల్ కూడా జగనే పూర్తి చేయబోతున్నాడు.
►ఒక రూపు లేని పోలవరాన్ని కూడా సీఎం జగనే ఒక రూపుకు తెచ్చాడు. స్పిల్ వే, అప్పర్, లోయర్ కాఫర్ డ్యాములు సీఎం జగనే పూర్తి చేసాడు.
►అప్రోచ్, స్పిల్ పైలట్ ఛానెళ్ళు కూడా సీఎం జగనే పూర్తి చేసాడు. నిర్వాసితులకు వేల ఇల్లు ఈ ప్రభుత్వమే కట్టించింది
►16 మెడికల్ కాలేజీలు సీఎం జగనే మొదలుపెట్టాడు, 5 పూర్తి చేసాడు.
►4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు సీఎం జగనే మొదలుపెట్టాడు, పనులు పరుగులు పెట్టిస్తున్నాడు. సీఎం జగన్ కాబట్టే చేస్తున్నాడు.
►ఇవే కాక, వేల పాఠశాలలను, విద్యాసంస్థలను సీఎం జగనే మార్చాడు. నాడు నేడు కింద రూపురేఖలు మొత్తం మార్చేశాడు.
►లక్షల ఇళ్లు సీఎం జగనే కట్టిస్తున్నాడు.
►వేల సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు సీఎం జగనే మొదలు పెట్టి, పూర్తి చేస్తున్నాడు.
ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబుకి తాత్కాలిక కట్టడాలు తప్ప, ఒక్కటి ఏదైనా ఉందా ? మరెలా విజనరీ అయ్యాడు?
రాజధాని ప్రాంతంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయాడు అసలు ఎలా మోస్తున్నారు ?
హైదరాబాద్ రింగు రోడ్డు, ఎయిర్‌పోర్టు నుండి ఏదీ మొదలుపెట్టింది లేదు. పూర్తి చేసిందీ లేదు కానీ అన్నీ నేనే చేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టిస్తాడని ప్రచారం చేస్తున్నారు.
అందుకే .. జగనే చేసాడు... జగనే చేస్తాడు... ఏదైనా జగనే చేయగలడు... అన్న నమ్మకం ప్రజల్లో ఉంది
►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేడన్నారు, చేశాడు.
►CPS రద్దు చేయలేడన్నారు, చేశాడు. PRC ఇవ్వలేడన్నారు, ఇచ్చాడు.
నిశ్శబ్దంగా ఆయనే అన్నీ చేస్తాడు.
జనానికి అన్నీ చేస్తున్నాడు కాబట్లే అందుకే పచ్చమీడియాకు కళ్ల మంట : YSRCP
05:46 PM, Nov 9, 2023
అసలు జనసేన ఎటు వైపు?
►ఎన్డీఏలో మేం భాగస్వామిగా ఉన్నాం : నాదెండ్ల మనోహర్
►తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం
►తెలంగాణలో బీజేపీ పొత్తుతో పోటీ చేస్తున్నాం : నాదెండ్ల మనోహర్
►మరి, ఏపీలో మీ స్టాండ్ ఏంటీ?
►బీజేపీతో పొత్తులో ఉన్నవాళ్లు తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?
►రాజకీయ పార్టీగా మీకు కొన్ని విలువలు ఉండాలి కదా.!
►ఒక పార్టీతో అధికారికంగా పొత్తు, మరో పార్టీతో అనధికారికంగా పొత్తు ఉంటుందా?
►అసలు మీ మీద మీకు నమ్మకం లేదా?
►గోడ మీద పిల్లిలా ఎటు అవకాశం వస్తే అటు ఫిరాయిస్తారా?
05:06 PM, Nov 9, 2023
దీపావళి సెలవుల తర్వాతే బాబు క్వాష్‌పై కదలిక
►చంద్రబాబు క్వాష్‌పై సుప్రీంకోర్టు స్పష్టత
►దీపావళి సెలవుల తర్వాతే క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్న సుప్రీంకోర్టు
►నవంబర్ 12 నుంచి 19 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు
►సుప్రీంకోర్టు సెలవుల అనంతరం క్వాష్ పిటిషన్‌పై సమయం వెచ్చించనున్న బెంచ్
►నవంబర్ 30 లేదా డిసెంబర్ మొదటి వారంలో క్వాష్‌పై తీర్పు వచ్చే అవకాశం
►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న చంద్రబాబు నాయుడు
04:55 PM, Nov 9, 2023
అయోమయంలో తెలుగుదేశం
►నవంబర్ 28న సాయంత్రం 5గంటలకు తిరిగి జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు
►ఈలోగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం కోటి ఆశలతో ఎదురుచూపులు
►ప్రస్తుతం అనారోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్ మీద ఉన్న చంద్రబాబు
►17ఏ సెక్షన్‌ను చూపించి కేసు కొట్టేయించుకోవాలన్న వ్యూహంలో బాబు లాయర్లు
►బాబు క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 28 తర్వాత ఉత్తర్వులిస్తామన్న సుప్రీంకోర్టు
►అంటే చంద్రబాబు జైలుకు వెళ్లిన ఒకటి, రెండు రోజుల తర్వాత ఉత్తర్వులు వచ్చే అవకాశం
►ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు జైలుకే పరిమితం అయ్యే అవకాశం
►చంద్రబాబు బయట ఉంటేనే మ్యానిఫెస్టో విడుదల చేయాలన్న యోచనలో తెలుగుదేశం
►చంద్రబాబు చుట్టే ముడిపడి ఉన్న టిడిపి వ్యవహారాలు
►నవంబర్ 30 తర్వాతే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానంటోన్న లోకేష్
►అప్పటివరకు పాదయాత్ర జోలెత్తవద్దంటున్న చినబాబు
►సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నా.. టిడిపిలో కనిపించని జోష్
03:54 PM, Nov 9, 2023
అంటే.. నడుస్తాడా లేదా.? అన్నది లోకేష్ చెప్పాలేమో.?
►లోకేష్ పాదయాత్రపై దీపావళి తర్వాత నిర్ణయిస్తాం : అచ్చెన్నాయుడు
►చంద్రబాబు బెయిల్ విషయంలో మరింత క్లారిటీ వచ్చాక వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి సభలు పెడతాం
►ఆ ఉమ్మడి సభల్లో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు : అచ్చెన్నాయుడు
01:54 PM, Nov 9, 2023
విజయవాడలో టీడీపీ -జనసేన యాక్షన్ కమిటీ భేటీ
►సంయుక్త సమావేశానికి నారా లోకేష్ హాజరు
►టిడిపి నుంచి అచ్చెన్నాయుడు, పయ్యావుల,యనమల, పితాని, నిమ్మల - జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస ►యశస్వి,బొమ్మిడినాయకర్ హాజరు
►మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిద్దాం?
►ఉమ్మడి కార్యాచరణ ఎప్పుడు మొదలెడదాం?
►ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఒక కరపత్రం కావాలి కదా.!
►ఎలా ఉండాలి? ఎవరెవరు ఏం చేయాలి? రూపకల్పనపై చర్చ
►ఓట్లు, ఓటర్ల జాబితాపై ఇంటింటికి తిరగాలని ప్రణాళిక
►నియోజకవర్గాల స్ధాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నిర్ణయం
11:53 AM, Nov 9, 2023
►ఫైబర్‌నెట్ కేసులో విచారణ వాయిదా
►ఈనెల 30కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
►ఫైబర్‌నెట్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తున్నాం: సుప్రీంకోర్టు
►స్కిల్ స్కాం క్వాష్ పిటిషన్‌లోని కొన్ని అంశాలు ఫైబర్‌నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయి
►క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ చేస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం
►దీపావళి సెలవుల అనంతరం స్కిల్ కేసు తీర్పు వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు
►ఆరోగ్యకారణాల రీత్యా చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పై ఉన్నారన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు
►సుప్రీంకోర్టులో కేసు ముగిసేవరకు అరెస్టు చేయబోమన్న నిబంధన కొనసాగించాలన్న సిద్ధార్ధ లూథ్రా
►స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో తీర్పు పెండింగులో ఉన్నందున విచారణ వాయిదా
►ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దన్న సుప్రీంకోర్టు
►స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో దీపావళి సెలవుల తర్వాత తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు
►స్కిల్ స్కాం కేసులో బాబు క్వాష్ పిటిషన్‌పై ఈనెల 23లోగా తీర్పు వచ్చే అవకాశం
►కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న 17-ఏ పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత తీర్పు
11:00 AM, Nov 9, 2023
కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
►మద్యం స్కాంలో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై విచారణ
►తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
►మద్యం కుంభకోణంలో ఏ2గా ఉన్న కొల్లు రవీంద్ర
8:00 AM, Nov 9, 2023
సుప్రీంలో లిస్ట్ అయిన కేసు.. నేడు ఫైబర్ నెట్ స్కామ్‌పై విచారణ
►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసుపై విచారణ
►11వ నెంబర్ ఐటెంగా లిస్ట్ అయిన కేసు
►ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్ట్
►హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన చంద్రబాబు
►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం
►స్కిల్ స్కాం కేసులో తాము తీర్పు ఇచ్చేవరకు ఆగాలని, గత విచారణలో సూచించిన సుప్రీంకోర్టు
►స్కిల్ స్కాంలో 17A పై తీర్పు ఎప్పుడు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం
►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు
►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాఫ్ట్‌కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు
►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంపై అవినీతి ఆరోపణలు
7:30 AM, Nov 9, 2023
జనసేన పవన్‌కు బిగ్ షాక్..
►పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన ఓయూ విద్యార్థులు
►పవన్ ఒక బ్రోకర్.. రాజకీయాల్లో ఒక ఐటమ్ స్టార్
►ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు.
రాజకీయాల్లో పవన్ ఒక ఐటమ్ స్టార్ , ఒక బ్రోకర్
— 𝙈𝙖𝙣𝙖 𝙔𝙨𝙧𝙘𝙥 (@ManaYsrcp7) November 8, 2023
ఇక్కడ ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు
ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోం... తరిమికొడతాం
- ఓయూ విద్యార్థులు pic.twitter.com/a4LZ7hJ4as
6:56 AM, Nov 9, 2023
చంద్రబాబుకు సజ్జల కౌంటర్
►మేనిఫెస్టోలో హామీల సంగతేంటి బాబు.
►బాబు మర్చిపోయినా మా దగ్గర ఆధారాలున్నాయి.
2014 టీడీపీ మేనిఫెస్టోని చంద్రబాబు అధికారంలోకి రాగానే వెబ్సైట్ నుంచి తీసేశాడు. ఆ మేనిఫెస్టోలో ఏడాదికి 12 సిలిండర్లని ఇస్తానని బాబు హామీ ఇచ్చాడు. కానీ.. గెలిచిన తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఏడాదికి మూడు సిలిండర్లని ఇస్తానని హామీ ఇస్తున్నాడు. బహుశా పాత హామీని అందరూ మర్చిపోయి… pic.twitter.com/N2hxwPBb31
— YSR Congress Party (@YSRCParty) November 8, 2023
6:55 AM, Nov 9, 2023
అబద్ధాలతో ఎల్లో మీడియా దోస్తీ: YSRCP
►చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎల్లో మీడియా కృషి.
►జర్నలిజం విలువలకి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు.
►కొన్నేళ్లుగా బాబు మోచేతి నీళ్ల కోసం నిస్సిగ్గుగా నిజాల్ని దాచేస్తూ.. అబద్ధాలతో దోస్తీ చేస్తున్నారు...
6:50 AM, Nov 9, 2023
నేడు టీడీపీ పీఏసీ భేటీ
►నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ భేటీ
►చంద్రబాబు నివాసంలో ఈరోజు జరగనున్న పీఏసీ భేటీ
►టీడీపీ-జనసేన జేఏసీ భేటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చ
►ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై కసరత్తు
►ఓటర్ల జాబితా పరిశీలనలో జనసేనతో కలిసి పని చేసేందుకు ప్రణాళికలు
6:40 AM, Nov 9, 2023
సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై బుధవారం వెలువడని తీర్పు
►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం
►ఈరోజు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
►నవంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని గత విచారణలో చంద్రబాబు లాయర్లకు చెప్పిన ద్విసభ్య ధర్మాసనం
►ఫైబర్ పిటిషన్ విచారణ కంటే ముందే స్కిల్ పిటిషన్‌పై తీర్పు ఇస్తామంటూ స్పష్టీకరణ
►ఆ లెక్కన.. నేడు తీర్పు ఇచ్చాకే పిటిషన్ విచారించాల్సి ఉన్న బెంచ్
►లేకుంటే ఫైబర్ పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడే ఛాన్స్
►సుప్రీం పిటిషన్‌పైనే ఆధారపడిన ఏసీబీ కోర్టు పీటీ వారెంట్ నిర్ణయం
►సుప్రీం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఏసీబీ కోర్టు
►చంద్రబాబు(Chandrababu)పై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు
► ఫైబర్ నెట్ కేసులో.. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగం
Comments
Please login to add a commentAdd a comment