సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు విచారణలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం(ACB Court)లో దర్యాప్తు సంస్థ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక ఆధారాలను సమర్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని ఏఏజీ వెల్లడించారు.
నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులను దిగమింగారు. ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టీడీపీ ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఏఏజీ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లను ACB కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన ఆడిటర్‌ను విచారణకు పిలిచామని, ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారని ఏఏజీ తెలిపారు. డొల్ల కంపెనీలను సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని ఏఏజీ పొన్నవోలు వివరించారు.
చదవండి: పవన్ కల్యాణ్‌ను బీజేపీనే వద్దనుకుందా?
Comments
Please login to add a commentAdd a comment