చంద్రబాబు ‘స్కిల్‌’ స్కాం: కోర్టులో ఎవరి వాదన ఏంటీ? | Chandrababu Skill Development Scam: Arguments In Acb Court | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ‘స్కిల్‌’ స్కాం: కోర్టులో ఎవరి వాదన ఏంటీ?

Published Sun, Sep 10 2023 9:20 AM | Last Updated on Sun, Sep 10 2023 2:37 PM

Chandrababu Skill Development Scam: Arguments In Acb Court - Sakshi

సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబును ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి ముందు సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొలుత చంద్రబాబు అరెస్ట్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది. మొత్తం 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించింది. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లాయర్లు వివేకాచారి, వెంకటేష్ హాజరు కాగా, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రాతో పాటు తానే స్వయంగా వాదనలు చెప్పుకుంటానని విజ్ఞప్తి చేసుకున్నారు.

రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏముందంటే..
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకు చంద్రబాబే ప్రధాన సూత్రధారి 
టీడీపీ నేత ఇల్లందుల రమేష్ ద్వారా డిజైన్‌టెక్, సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు
కేబినెట్ తీర్మానాల్ని పక్కనపెట్టి, గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ లాంటి అధికారుల ద్వారా బాబు కుట్రకు పాల్పడ్డారు
అచ్చెన్నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్తశాఖను ఏర్పాటు చేశారు
కేవలం కంపెనీల ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ల ఆధారంగానే ప్రాజెక్టుకు ఆమోదం చెప్పారు
ప్రాజెక్టుకు సంబంధించి మార్కెట్ సర్వే జరగలేదు


ఎలాంటి ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండానే సీమెన్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ఆధారంగా రూ.3,281 కోట్ల బడ్జెట్ ను కేబినెట్ ముందు పెట్టారు
90 శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని కేబినెట్ కు అబద్ధాలు చెప్పారు
దీనికి సంబంధించిన నోట్ ఫైల్ ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్రూవ్ చేశారు
ఎలాంటి పర్‌ఫామెన్స్ గ్యారంటీ, బ్యాంకు గ్యారంటీలు లేకుండానే ప్రభుత్వం రూ.371 కోట్లను డిజైన్‌టెక్ కు ఇచ్చేసింది
అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సునీత వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదు
అప్పటి సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయి

చంద్రబాబుకు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయని, స్కిల్ స్కాంకు సంబంధించిన ఈడీ కూడా విచారణ జరుపుతోందని తెలిపింది. కేసులో మనోజ్ వాసుదేవ్‌కు సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చామని, నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని సీఐడీ తెలిపింది.

ఏసీబి కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసుకున్నారు. 
రాజకీయ లబ్ధి కోసమే నాపై తప్పుడు ఆరోపణలు 
రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలి
గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నది  కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం
ప్రభుత్వ నిర్ణయాలపై  క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చాం
దీనికి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది
అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు.
2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కాని.. రిమాండ్‌ రిపోర్టులో కూడా నా పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదు

వాదనలు తర్వాత న్యాయమూర్తి చంద్రబాబును కోర్టు హాల్‌లోనే ఉంటారా అని ప్రశ్నించగా.. విచారణ పూర్తయ్యే వరకు ఉంటానని చంద్రబాబు చెప్పారు. అనంతరం చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. 

24 గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలన్న నిబంధన పాటించలేదు 
చంద్రబాబు దగ్గరకు వచ్చిన పోలీసుల మొబైల్ లొకేషన్ రికార్డ్స్ పరిశీలించాలి
409 సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదు
409 సెక్షన్ పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలి
రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలి

చంద్రబాబు తరపున వాదనల తర్వాత సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించారు ఏఏజీ పి.సుధాకర్ రెడ్డి
►చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్‌ చేశారు
►ఈ కేసులో మరో ఏడుగురిని సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది 
►24 గంటలలోపే చంద్రబాబుని కోర్టులో హాజరుపరిచాం 
►ఈ కేసులో A 35 రిమాండ్‌ను ఇదే కోర్టు తిరస్కరిస్తే అపెక్స్ కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది
►హైకోర్టు ఈ కేసులో A 35 ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సస్పెండ్ చేసింది
►2015లో జీవో 4 ద్వారా స్కామ్ కు తెర తీశారు

స్కిల్ కేసులో నెల క్రితమే ఈ కేసులో చంద్రబాబుకి ED నోటీసులు
► 4 ఆగస్టు 2023 న దొండపాటి వెంకట హరీష్ అనే IRSఅధికారి నోటీసులు 
► ఆ నోటీసుల ప్రకారం చంద్రబాబుపై అభియోగాలు
 2017 నుండి 2019 మధ్యలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం
 విషయం బయటకు రావడంతో పెండ్యాల శ్రీనివాస్ పరారీ
 ప్రభుత్వ ఉద్యోగి గా ఉంటూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ నెల 6 న అమెరికాకు పెండ్యాల శ్రీనివాస్

విజయవాడ ఏసిబి కోర్టులో సిఐడి తరపున వాదనలు పూర్తయ్యాయి. ఈ సమయంలో న్యాయమూర్తి  15 నిమిషాలు విరామం ప్రకటించారు. విరామం తర్వాత వాదనలు చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా కొనసాగించారు.
ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసింది: లూథ్రా
ఈ స్కాం రాజకీయ ప్రేరేపితం
2021లో నమోదైన ఈకేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి
ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయింది
ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ మంజూరైంది
చంద్రబాబును ఇరికించాలనే ఈ కేసును ఓపెన్ చేశారు
రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు వాడిన భాషను గమనించండి
చంద్రబాబు పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారు

చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు : లూథ్రా
నిబంధనల ప్రకారం దగ్గర్లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి
శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ చెబుతోంది
ముందు రోజు రాత్రి 11 గంటలకే చంద్రబాబును సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు
వ్యక్తిని చుట్టుముట్టి కదలకుండా చేయడం హక్కుల ఉల్లంఘనే
దీన్ని కూడా అరెస్ట్ గానే పరిగణించాలి
సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డ్స్ ను కోర్టుకు ఇచ్చేలా ఆదేశించాలి
సీఐడీ అధికారుల కాల్ డేటా గమనిస్తే చంద్రబాబును ఎప్పుడు అరెస్ట్ చేశారో తెలుస్తుంది
సీఐడీ నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదు
దీని ప్రకారం చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి అవసరం

17A సెక్షన్ గురించి వివరిస్తున్న న్యాయవాది లూథ్రా
కేసుకు సంబధించి వ్యవహారాలన్నీ 2015లో జరిగాయి
సెక్షన్ 24, 8 ఆఫ్ పీసీ యాక్ట్ గురించి చంద్రబాబు లాయర్ల వివరణ

చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.. అయినా కూడా ప్రభుత్వం వాళ్లనుకున్నచోటే ప్రవేశపెట్టింది 
కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటలపాటు చంద్రబాబును ఎందుకు నిర్భందించారో అర్థం కాలేదు 
సీఐడీ ఆరోపణలు చేసినట్టు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు
చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్టు సీఐడీ చెబుతోంది 
కానీ చంద్రబాబుని ముందు రోజు రాత్రి 11 గంటలకే సీఐడీ పోలీసులు చుట్టుముట్టారు
ఆ సమయం నుంచే అరెస్ట్ చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలని కోరిన లూథ్రా
రాత్రి 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే
సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను కోర్టుకు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన లూథ్రా
అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదు
చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి అవసరమని లూథ్రా వాదన 
ఇది అనుబంధ పిటిషన్ మాత్రమే.. రిమాండ్ రిపోర్ట్ వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలి: సీఐడీ న్యాయవాది

ముగిసిన చంద్రబాబు తరపు లాయర్‌ లూథ్రా వాదనలు
చంద్రబాబుకు రిమాండ్‌ విధిస్తే.. తక్షణమే బెయిల్‌ అప్లికేషన్‌ పరిగణనలోకి తీసుకోవాలన్న లూథ్రా

బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టులో తిరిగి వాదనలు ప్రారంభం
చంద్రబాబు తప్పు చేయడం లేదని ఆయన తరఫు లాయర్లు చెప్పడం లేదు: ఏఏజీ
అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు
ఎంతసేపూ సాంకేతిక అంశాలగురించి మాట్లాడుతున్నారు
గవర్నర్ అనుమతి కోరాలి, కోర్టులో ప్రవేశపెట్టేనాటికి 24 గంటల సమయం అయిపోయిందని వాదిస్తున్నారు
రిమాండు రిపోర్టులో భాష గురించి మాట్లాడుతున్నారు
అంతేకాని ఇచ్చిన ఆధారాలు తప్పని కాని, అవినీతి జరగలేదని కాని చెప్పడంలేదు:

గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని వాదిస్తున్నారు
అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు
స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుంది:
ఈ నియమాలు మేం పాటించాం

మామూలు కేసుల్లో వారంరోజులకు ముందు నోటీసు ఇవ్వాలి: ఏఏజీ
ప్రజాధనం దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన కేసుల్లో నోటీసు అవసరంలేదు:
ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయొచ్చు
ముఖ్యమంత్రి హోదాలో నిధుల విడుదలకు చంద్రబాబు ఆదేశించారు:
దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి:
​​​​​​​రాజ్యాంగ ప్రకారం వచ్చిన పదవిని దుర్వినియోగంచేస్తూ అవినీతికి పాల్పడ్డారు:
​​​​​​​సెక్షన్‌ 409 చంద్రబాబుకు వర్తిస్తుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement