
ఎన్టీఆర్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ముప్పాలలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో భాగంగా చంద్రబాబు ప్రసంగం మొదలవ్వగానే జనం వెళ్లిపోయిందేకు సిద్ధమయ్యారు. ఇది చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తూ, అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వారికి క్లాస్ పీకారు.
‘ మిమ్మల్ని చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది.. గుర్రాన్ని తొట్టె దగ్గరగా తీసుకువెళ్లగలం కానీ నీరు తాగింలేం కదా’ అంటూ సామెత చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీ తీరు కూడా ఇలానే ఉందన్నారు. ‘మీకోసం నేను అన్ని పనులు వదిలేసుకుని 2:30 అవుతున్నా భోజనం కూడా చేయకుండా ఉన్నా. నేను చెప్పేది అర్ధం చేసుకోండి. నేను చెప్పేది మీరు అర్ధం చేసుకోవాలి. ఆపై కార్యాచరణ స్పూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది’ అంటూ ప్రసంగించారు.