
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును అవమానించిన చంద్రబాబు ఘోరంగా అవమానించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి రోజునే కొలికపూడికి అవమానం జరగడం గమనార్హం. చంద్రబాబుకు తాను నమస్కారం పెట్టి పలకరించినా అదేమీ బాబు పట్టించుకోలేదు.. కొలికపూడికి కరచాలనం కూడా చేయకుండానే వెళ్లిపోయారు.
బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో పర్యటనకు వచ్చారు. ముప్పాళ్లలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు.. అక్కడున్న టీడీపీ నేతలను పలికరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా చంద్రబాబుకు నమస్కరించారు.. ఆయన్ను చూసిన బాబు ముఖంలో సీరియస్‌నెస్ కనిపించింది. దీంతో, కొలికపూడిని పట్టించుకోకుండా.. చూసీచూడనట్టుగా బాబు ముందుకు సాగారు. ఇక, పక్కనే ఉన్న టీడీపీ ఇతర నేతలు కూడా ముందుకు రావడంతో కొలికపూడి వెనక్కి వెళ్లిపోయారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడిని చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు. కరచాలనం కూడా ఇవ్వలేదు. మరోవైపు.. ప్రజావేదిక స్టేజ్‌పైన కూడా కొలికపూడికి అవకాశం దక్కలేదు. చంద్రబాబు సెక్యూరిటీ.. కొలికపూడిని దూరంగా పంపించేసినట్టు తెలుస్తోంది. అయితే, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నాడే దళిత ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరగడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
