
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని, ప్రభుత్వ దమనకాండను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సోషల్ మీడియా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు.
సుధారాణి దంపతుల అరెస్టుపైనా ప్రభుత్వాన్ని నిలదీసిన పొన్నవోలు.. వాళ్లు ఏమైనా ఉగ్రవాదులా? అని ప్రశ్నించారు. న్యాయదేవత మీద ఒట్టేసి చెబుతున్నా.. ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలోనూ ఇంత అరాచకం నడవలేదని అన్నారాయన.