( ఫైల్ ఫోటో )
సాక్షి, చిత్తూరు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారం లో ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే. 11వ తేదీ తెల్లవారుజామున నారాయణకు చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
చదవండి: నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..
నారాయణకు నోటీసులు..
నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై చిత్తూరు కోర్టు మధ్యాహ్నం విచారణ జరిపింది. అడిషనల్ ఏజీ పొన్నవోలు వాదనలతో కోర్టు ఏకీభవించింది. నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కేసుపై వాదనలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment