Tenth Question papers Leakage
-
నో సెల్‌ఫోన్ జోన్లుగా ‘పది’ పరీక్ష కేంద్రాలు
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నందికొట్కూరు, కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె హైస్కూళ్లలో జరిగిన ఘటనల దృష్ట్యా ఈ ఏడాది ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. అదే విధంగా ప్రశ్నపత్రంలో ఏడు అంకెల ప్రత్యేక కోడ్‌ను ముద్రించారు. ఎక్కడైన ప్రశ్నపత్రం లీకేజీ అయినా.. ఆ పేపర్‌పై ఉన్న ఏడు అంకెల కోడ్‌ను బట్టి సులువుగా ఏ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిందో స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రాలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గదుల్లో లైటింగ్ ఉండేలా, ఫ్యాన్లు తిరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన బడి నాడు–నేడు కింద రెండో విడతలో చేపట్టిన పనులు పూర్తి చేసేలా సమగ్ర శిక్ష విభాగం, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల దగ్గర అదనపు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. 149 కేంద్రాల్లో పరీక్షలు వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 149 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు దగ్గర ఉండేవి) 79, బీ సెంటర్లు(పోలీసు స్టేషన్లకు 8 కి.మీ. లోపు ఉండేవి)56, సీ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు 8 కి.మీ.కు పైగా ఉన్నవి)14 ఉన్నాయి. ఈ కేంద్రాలలో 490 ఉన్నత పాఠశాలలకు చెందిన 32,780 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల విధులు నిర్వహించేందుకు 149 మంది ముఖ్య పర్యవేక్షకులను, 149 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 1,664 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 11 సమస్యాత్మమైక, 9 అత్యంత సమస్యాత్మకమైన పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఉండనున్నారు. అలాగే 7 ప్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు పనిచేయనున్నాయి. జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 149 పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించాం. నాతో సహా ఏ స్థాయి అధికారి అయినా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకపోకూడదు. కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు. ఏ చిన్న తప్పు జరిగినా సంబంధిత కేంద్రా ల్లో విధులు నిర్వహించే వారే బాధ్యులు అవుతారు. జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. – డాక్టర్ వెంకట రంగారెడ్డి, డీఈఓ నేడు, రేపు జిల్లాకు ప్రశ్నపత్రాలు పదో తరగతి ప్రశ్నపత్రాలు నేడు, రేపు జిల్లాకు రానున్నాయి. నేడు(గురువారం) మొదటగా సెట్–1, రేపు(శుక్రవారం)రెండో సెట్ ప్రశ్నపత్రాలు రానున్నాయి. వీటిని జిల్లాలో ఎంపిక చేసిన 38 స్టోరేజీ పాయింట్లకు చేర్చి అక్కడ భద్రపరచనున్నారు. ఇందుకు ఇప్పటికే 11 రూట్లకు ఆఫీసర్లను సైతం ఎంపిక చేశారు. -
నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
-
నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్
-
నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
సాక్షి, చిత్తూరు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారం లో ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే. 11వ తేదీ తెల్లవారుజామున నారాయణకు చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు.. నారాయణకు నోటీసులు.. నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై చిత్తూరు కోర్టు మధ్యాహ్నం విచారణ జరిపింది. అడిషనల్ ఏజీ పొన్నవోలు వాదనలతో కోర్టు ఏకీభవించింది. నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కేసుపై వాదనలు జరగనున్నాయి. -
నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..
అనంతపురం క్రైం/చిత్తూరు అర్బన్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం, సేకరించిన ఆధారాలతోనే నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని డీఐజీ ఎం.రవిప్రకాష్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేసును పకడ్బందీగా, క్షుణ్నంగా విచారించడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా, ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నారాయణ యాజమాన్యం వ్యవహరించిందన్నారు. నారాయణ ఆదేశాల మేరకు డీన్, వైస్ ప్రిన్సిపాళ్లు, ప్రిన్సిపాళ్లు కలసి కొందరు స్వార్థపరులైన ఉపాధ్యాయులను, సిబ్బందిని డబ్బులతో లోబర్చుకున్నట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని వారే పోలీసు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తెప్పించుకుని నారాయణ విద్యా సంస్థల హెడ్ ఆఫీస్‌కు పంపారని చెప్పారు. దర్యాప్తులో ఇవన్నీ నిర్ధారణ కావడంతో నారాయణతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సాక్ష్యాధారాలతో కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు. కాగా, చిత్తూరు మేజిస్ట్రేట్ న్యాయస్థానం మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని పేర్కొన్నారు. -
నారాయణ నాటకాలు!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణిని నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పి.నారాయణ కూడా పుణికిపుచ్చుకున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో ప్రధాన నిందితుడైన నారాయణ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారం, బోగస్ డాక్యుమెంట్లను సమర్పించి బెయిల్ పొందినట్లు స్పష్టమవుతోంది. నారాయణ విద్యాసంస్థలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, 2014లోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తాజాగా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చిన నారాయణ.. దాదాపు రెండు నెలల క్రితం ఈటీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం మూడేళ్లుగా తానే నారాయణ విద్యాసంస్థలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించడం గమనార్హం. ఇంటర్వూ చేస్తున్న యాంకర్ కూడా స్వయంగా నారాయణ విద్యా సంస్థల చైర్మన్ అంటూ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మేరకు నారాయణ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిబట్టి ఇప్పటికీ ఆయనే నారాయణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు తేలిపోతోంది. ఇదే విషయాలను చంద్రబాబుకు సైతం చెప్పానంటూ అందులో నారాయణ పేర్కొనడం గమనార్హం. నారాయణ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకునే మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీక్ కావడం, ఆధారాలతో సహా నారాయణ విద్యాసంస్థల డీన్, ప్రిన్సిపాల్ దొరకడం, నేరాన్ని అంగీకరిస్తూ నారాయణ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లు వారు వెల్లడించడం, ఆ తర్వాతే పోలీసులు నారాయణను అరెస్టు చేయడం తెలిసిందే. తమ విద్యాసంస్థకు సంబంధించి ఏ నిర్ణయమైనా పైస్థాయిలో నారాయణే స్వయంగా తీసుకుంటున్నారని ఉద్యోగులు కూడా వెల్లడించారు. సంస్థ వ్యవహారాల్లో ఆయన ఇంత చురుగ్గా పాలు పంచుకుంటున్నట్లు స్పష్టం అవుతుండగా తప్పుడు సమాచారం ఇచ్చి బెయిల్ పొందడంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాలకుపైగా టీడీపీతో.. 2000 సంవత్సరం నుంచి తాను టీడీపీతో సంబంధాలు కొనసాగించానని, రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు తనకు ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్నికల బాధ్యతను అప్పగించడమే కాకుండా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి పదవిని చేపడుతుండటంతో 2014లో నారాయణ ఫౌండర్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినా ఆ విద్యా సంస్థలతో సంబంధం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని 2,000 మునిసిపల్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా నారాయణ టెక్నో స్కూల్స్ సిలబస్‌ను ప్రవేశపెట్టానన్నారు. పదో తరగతిలో 11 మంది మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా, నారాయణ స్కూళ్లలో 2,000 మంది పదికి పది పాయింట్లు తెచ్చుకున్నారని నారాయణ చెప్పారు. -
నారాయణ అరెస్టు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాలుగా వ్యవస్థీకృతమై విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టింది. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ సూత్రధారి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం చిత్తూరుకు తరలించి ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి తర్వాత మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, 2 గంటల సమయానికి నిర్ణయం ఇంకా వెలువరించలేదు. ఇదిలాఉండగా నారాయణ ఆదేశాలతోనే ప్రశ్నపత్రాలను లీక్ చేశామని ఈ కేసులో ఇటీవల అరెస్టయిన తిరుపతి నారాయణ స్కూల్స్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి, డీన్ బాల గంగాధర్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించడం గమనార్హం. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులే ప్రశ్నాపత్రాల లీకేజీ తీరును సాక్ష్యాధారాలతో వెల్లడించడంతో మాజీ మంత్రి నారాయణను తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ విద్యా సంస్థలు కేంద్రంగానే రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో చిత్తూరు నుంచి వెళ్లిన పోలీసుల బృందం హైదరాబాద్‌లో నారాయణను అదుపులోకి తీసుకుంది. ఆయన భార్య రమాదేవికి 50 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. నారాయణను రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి తరలించగా ఆమె కూడా అదే వాహనంలో చిత్తూరు వచ్చారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేసినట్లు ప్రకటించిన పోలీసులు పరీక్షల మాల్‌ప్రాక్టీస్ యాక్ట్ 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు లీక్ చేయాలని ఉద్యోగులకు నారాయణ ఆదేశం తమ విద్యా సంస్థల విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేసేందుకు నారా>యణ ఎన్నో ఏళ్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తిరుపతి నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డి, డీన్ బాలగంగాధర్ నేరాన్ని అంగీకరించారు. ప్రశ్నాపత్రాలను లీక్ చేయాలని నారాయణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ఏటా పరీక్షలకు ముందు నారాయణ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రశ్నాపత్రం లీక్ చేసి తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేయాలని ఆదేశిస్తారని తెలిపారు. అందుకోసం విద్యా శాఖ కార్యాలయం నుంచి ఇన్విజిలేటర్లుగా నియమితులయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయుల జాబితాను తెప్పించుకుంటారు. కొందరిని లంచాలు, బహుమతులతో ప్రలోభాలకు గురి చేసి వారి ద్వారా ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తారు. పరీక్షా కేంద్రాల్లో ఉండే కొందరు కిందిస్థాయి సిబ్బంది ద్వారా వాటిని బయటకు తెప్పించిగానీ వాట్సాప్ ఫొటోల ద్వారాగానీ లీక్ చేస్తారు. ముందుగానే సబ్జెక్టులవారీగా సిద్ధం చేసుకున్న జవాబులు తమ విద్యార్థులకు అందజేస్తారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నట్లుగానే నారాయణ ఈ ఏడాది కూడా తమ ఉద్యోగుల ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రశ్నాపత్రం లీక్ కాగానే జవాబులు సిద్ధం చేసి వాట్సాప్‌లో పెట్టేలా ఓ బృందాన్ని నియమించారు. ఇందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సహకారం కావాలని, ఎంత డబ్బు వెచ్చించైనా కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు ఇన్విజిలేటర్లను ప్రభావితం చేసి మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే రూ.వేలల్లో ముట్టజెప్పడం, ప్రత్యేక పార్టీలు, బహుమతులు ఇవ్వాలని తమ సిబ్బందిని నారాయణ ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇచ్చి జీతాలు కూడా పెంచుతామని ఎర చూపారు. ఈ విషయాలన్నీ తిరుపతి నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డి, డీన్ బాల గంగాధర్ పూస గుచ్చినట్లుగా విచారణలో వెల్లడించారు. సిండికేట్‌గా ఏర్పడి... ప్రశ్నాపత్రం లీకేజి కోసం నారాయణ విద్యా సంస్థలు కేంద్ర బిందువుగా మరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఏకంగా ఒక సిండికేట్‌గా ఏర్పడ్డాయి. నారాయణతోపాటు చైతన్య, శ్రీకృష్ణారెడ్డి చైతన్య, ఎన్ఆర్ఐ అకాడమీ తదితర విద్యా సంస్థలు ఆ సిండికేట్‌లో భాగస్వాములుగా ఉన్నాయి. తమ విద్యార్థులకు అక్రమమార్గాల్లో ఎక్కువ మార్కులు వచ్చేలా చేయడం ద్వారా ప్రచారం చేసుకుని భారీగా అడ్మిషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నాయి. బండారం బట్టబయలు ఇలా... విద్యా శాఖ, పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించడంతో నారాయణ విద్యా సంస్థల లీకేజీ బాగోతం బట్టబయలైంది. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని నారాయణ స్కూల్ బ్రాంచ్ డీన్ బాల గంగాధర్(బాలు) తమ స్కూల్ తెలుగు లెక్చరర్ గిరిధర్ సహాయంతో పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయించి నారాయణ విద్యా సంస్థలకు చెందిన గ్రూపులలో పెట్టారు. వాటికి సమాధానాలు తయారు చేసి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల సహాయంతో వారి విద్యార్థులకు అందించారు. అందుకోసం చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలంలోని నెల్లేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డికి రూ.10 వేలు, రూ.15 వేలు చొప్పున ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి తమకు అనుకూలంగా మలచుకున్నారు. గత నెల 27న తెలుగు పరీక్ష ప్రారంభం కాగానే పవన్‌కుమార్‌రెడ్డి ( ఆయనకు పరీక్ష విధులు కేటాయించనప్పటికీ) నెల్లేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల రూమ్ నంబర్ 1కు వెళ్లి పశ్నాపత్రాన్ని ఫొటో తీశాడు. సిండికేట్ వ్యూహంలో భాగంగా ప్రశ్నాపత్రం ఫొటోను శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్‌కు వాట్సాప్ చేశాడు. ఆయన ఎన్ఆర్ఐ అకాడమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్‌కు వాట్సాప్‌ను ఫార్వర్డ్ చేశారు. ఆయన నుంచి చైతన్య స్కూల్ డీన్ కె.మోహన్, నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డికి ఒకేసారి వాట్సాప్ చేశారు. తిరిగి మోహన్ ఆ ప్రశ్నాపత్రాన్ని చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఆరీఫ్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు. అలా రాష్ట్రవ్యాప్తంగా చాలామందికి పంపించారు. డివైజ్‌లు, సెల్ఫోన్లు సీజ్ ఆ ప్రశ్నాపత్రం చిత్తూరు టాకీస్ అనే వాట్సాప్ గ్రూపులోకి రావడంతో విద్యా శాఖ, పోలీసు అధికారులు దృష్టిసారించారు. చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోములతోపాటు పి.సురేష్ (ప్రిన్సిపాల్ , శ్రీకృష్ణారెడ్డి చైతన్య స్కూల్, చంద్రగిరి), కె. సుధాకర్(ఎన్ఆర్ఐ అకాడమి, తిరుపతి), ఆరీఫ్ (ప్రిన్సిపాల్, చైతన్య స్కూల్, తిరుపతి), ఎన్.గిరిధర్‌రెడ్డి (వైస్ ప్రిన్సిపాల్, నారాయణ స్కూల్, తిరుపతి), కె.మోహన్, డీన్, చైతన్య స్కూల్, తిరుపతి)లను చిత్తూరు పోలీసులు గత నెల 29న అరెస్టు చేశారు. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్‌బాబు, పవన్‌కుమార్‌లను ఈ నెల 9న పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణే ప్రధాన సూత్రధారని వెల్లడించారు. ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఉపయోగించిన ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. వారి మధ్యసాగిన వాట్సాప్ సందేశాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. పదేళ్ల జైలు శిక్ష! తమ బండారం బయటపడిందని తెలియడంతో నారాయణ కొద్ది రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్‌లో వాకబు చేసినా జాడ లేరు. ఆయన సెల్‌ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఆయన ఆచూకీ పోలీసులకు సోమవారం రాత్రి తెలిసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ వెళ్లిన పోలీసు బృందాలు నారాయణను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాయి. ఈ కేసులో నేరం రుజువైతే నారాయణతో పాటు నిందితులకు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నారాయణ చెబితేనే లీక్ చేశా.. ప్రశ్నాపత్రం లీకేజీపై గిరిధర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇదీ...‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నారాయణ స్కూల్స్‌లో పదో తరగతి విద్యార్థులు ఎక్కువగా జేఈఈ, నీట్లో ఎక్కువ మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం లాంగ్వేజ్ సబ్జెక్టులు, సోషల్ స్టడీస్ మినహా మిగిలిన సబ్జెక్టులకే ప్రాధాన్యమిస్తూ తరగతులు నిర్వహిస్తారు. దీంతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి లాంగ్వేజ్ సబ్జెక్టులు, సోషల్ స్టడీస్‌లో తమ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేయడానికి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ పదో తరగతి పరీక్షలకు ముందు తమ సెంట్రల్ ఆఫీసు ఇన్‌చార్జ్‌లు, స్కూల్ హెడ్లు, ప్రిన్సిపాళ్లతో విజయవాడలోగానీ హైదరాబాద్‌లోగానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇన్విజిలేటర్లుగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులకు రూ.10 వేలు, అంతకంటే ఎక్కువ ఇచ్చి లోబరుచుకోవాలని చెబుతారు. వాటర్ ప్యాకెట్లు అందించే సాకుతో.. ఈ ఏడాది ప్రశ్నాపత్రం లీక్ చేయమని నారాయణ ఆదేశించడంతో స్కూల్ డీన్ బాల గంగాధర్ సూచనలతో చిత్తూరు జిల్లా పరీక్షల డ్యూటీలో ఉన్న టీచర్ల వివరాలు ముందుగా తెప్పించుకుని వారితో మాట్లాడా. గతంలో మా స్కూల్లో పనిచేసి ప్రస్తుతం ఎన్ఆర్ఐ అకాడమీలో ఉన్న సుధాకర్ ద్వారా తెలుగు ప్రశ్నాపత్రాన్ని తెప్పించా. వాటికి సమాధానాలు తయారు చేసి వివిధ పరీక్షా కేంద్రాల సిబ్బందికి పంపి వాటర్ ప్యాకెట్లు ఇచ్చే సాకుతో మా విద్యార్థులకు అందించాం. తరువాత నేను అదే ప్రశ్నా పత్రాన్ని నా సెల్‌ఫోన్ వాట్సాప్ నంబర్ 9177133613 ద్వారా నారాయణ విద్యాసంస్థల గ్రూపులో పోస్ట్ చేశా. తరువాత ప్రభుత్వానికి అపకీర్తి తేవాలన్న చెడు ఉద్దేశంతో ఆ ప్రశ్నాపత్రాన్ని చిత్తూరు ప్రెస్ రిపోర్టర్ల వాట్సాప్ గ్రూపు ‘‘చిత్తూరు టాకీస్’’లో కూడా పోస్ట్ చేశా. ప్రశ్నాపత్రం లీకేజీ సాగింది ఇలా... గత నెల 27న తెలుగు ప్రశ్నాపత్రం లీకేజి వాట్సాప్‌ల ద్వారా ఇలా సాగింది... ఉదయం 09.30: చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులోని నెల్లెపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పవన్ కుమార్ రెడ్డి వాట్సాప్ చేశారు. ఉదయం 09.37 : తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణా రెడ్డి చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పి. సురేష్ వాట్సాప్ చేశారు. ఉదయం 09.39 : తిరుపతిలోని ఎన్ఆర్ఐ అకాడమీకి చెందిన కె.సుధాకర్ ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ చేశారు. ఉదయం 09.40 : తిరుపతిలోని చైతన్య స్కూల్ డీన్ కె.మోహన్, తిరుపతి నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఎన్. గిరిధర్ రెడ్డి వాట్సాప్ చేశారు. ఉదయం 09.41 : తిరుపతిలోని చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ అరీఫ్ వాట్సాప్ చేశారు. నాందేడ్ పరారీకి యత్నం విఫలం సాక్షి, హైదరాబాద్: టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పి.నారాయణ అరెస్టు నేపథ్యంలో హైడ్రామాకు తెర తీశారు. కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న నారాయణ కోసం చిత్తూరు పోలీసులు హైదరాబాద్ చేరుకుని గాలిస్తున్నారు. కొండాపూర్‌లోని నివాసంలో నారాయణ అందుబాటులో లేకపోవడంతో నిఘా ఉంచారు. మంగళవారం ఉదయం ఆయన తన భార్యతో కలిసి నారాయణ మహారాష్ట్రలోని నాందేడ్ పారిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. ఐకియా చౌరస్తా వద్ద ఆయన వాహనాన్ని ఆపి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ భార్య హైదరాబాద్‌లోని మాదాపూర్, రాయదుర్గం పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ డ్రామాకు తెర తీశారు. అనంతరం తనను తరలిస్తున్న పోలీసుల వాహనం కొత్తూరు వద్దకు చేరుకోగానే నారాయణ మరో ఎత్తుగడ వేశారు. అక్కడ స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండటంతో తనను కిడ్నాప్ చేశారంటూ కేకలు వేశారు. ఏపీ పోలీసులు అసలు విషయాన్ని వివరించడంతో వారు అడ్డుకోలేదు. బెయిల్ మంజూరు.. మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు అయ్యింది. వ్యక్తిగత పూచీకత్తుతో మెజిస్ట్రేట్ సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ. లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని మెజిస్ట్రేట్ పేర్కొంది. -
సంచలనం సృష్టిస్తున్న టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ
-
టెన్త్ ఇంగ్లీష్ పేపర్ లీక్..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సంచలనం సృష్టిస్తోంది. సోమవారం ఉదయం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం... పరీక్షకు అరగంట ముందే ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలలో లీకైంది. ఓ టీచర్ ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫోటో తీసి సర్క్యులేట్ చేసినట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీతో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తం అయింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. నాలుగు పోలీసు బృందాలు విచారణ జరుపుతున్నాయి. మరోవైపు రెండు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఫోన్లో మాట్లాడారు. లీకైన సెంటర్ల సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇక ప్రశ్నాపత్రం లీకేజీపై ఆదిలాబాద్ డీఈవో మాట్లాడుతూ.. వాట్సప్ ద్వారా క్వశ్చన్ పేపర్‌ను లీక్ చేసినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నలుగురు అధికారులపై వేటు టెన్త్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నలుగురు అధికారులపై వేటు పడింది. ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఇద్దరు సూపర్ వైజర్లతో పాటు విద్యార్థులుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. -
బినామీ కనుకే ‘నారాయణ’ను రక్షిస్తున్నారా?
-
బినామీ కనుకే ‘నారాయణ’ను రక్షిస్తున్నారా?
చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రశ్న ⇒ టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది... ⇒ ప్రాథమిక సాక్ష్యాధారాలున్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? ⇒ యాజమాన్యాన్ని వదిలేసి చిరుద్యోగులపై చర్యలేమిటి? సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారాన్ని కప్పిపుచ్చుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన శాసనసభ లాబీల్లోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నపత్రం లీకేజీ జరిగిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే బదులుగా చిరుద్యోగులను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు నారాయణ బినామీ అన్న ప్రచారం జరుగుతోందని, అందుకే ప్రభుత్వం నారాయణను కాపాడుతోందా అన్న అనుమానాలు న్నాయని ఆయన చెప్పారు. ప్రాథమిక సాక్ష్యాధారా లున్నా ఈ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణను ఎందుకు జరిపించడం లేదని జగన్ ప్రశ్నించారు. వివరాలు ఆయన మాటల్లోనే..... ‘‘ఈ ఏడాది ఆరున్నర లక్షల మంది పరీక్షలు రాస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. కానీ ప్రభుత్వం ఏ మాత్రం లెక్కలేనట్లుగా వ్యవహరి స్తోంది. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టంగా తెలిసి పోయింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఇచ్చిన రోజు వారీ నివేదికను శాసనసభలో చూపిస్తూ ప్రస్తావించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో.. ‘నెల్లూరు జిల్లా విద్యా శాఖాధికారి ప్రశ్నపత్రం లీకయినట్లుగా పేర్కొన్నారు’ అని ప్రస్తావించారు. ప్రశ్నపత్రం 4,238వ కేంద్రం, నారాయణ హైస్కూలు– నెల్లూరు నుంచి లీకైనట్లు తెలిపారు. అంతే కాదు, ఆ కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్‌పై విచారణకు ఆదేశించామని టెలీకాన్ఫ రెన్స్‌లో వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నామని చెప్పారు. అయినా ప్రభు త్వం అంగీకరించలేదు. మేం అసెంబ్లీలో ఈ అంశం పై గొడవ చేసి, నివేదిక ప్రతిని చూపించాక మంత్రి గంటా ఢిల్లీ నుంచి విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. లీకేజికి వాడిన సెల్ ఫోన్ ఒక అటెండర్దని తేల్చినట్లు వివరించారు. నేనడుగుతున్నది ఒక్కటే.. ఆ అటెండరు ఏ స్కూలు యాజమాన్యానికి చెందిన వాడు? ఆ సెల్‌ఫోను ఏ యాజమాన్యానిది? అసలు అటెండర్ ఇలాంటి పని ఎందుకు చేస్తాడు? అటెండ ర్కు ఉన్న ఆసక్తి ఏమిటి? తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి అతనెందుకు రిస్క్ తీసుకుంటాడు? యాజమా న్యాలు చెప్పాయి కాబట్టి, సెల్ఫోన్లు పరీక్షా కేంద్రం లోకి అనుమతించారు కాబట్టి దాని సాయంతో ప్రశ్నపత్రం ఫొటో తీసి వాట్సాప్‌లో మిగిలిన వీరి ప్రతినిధులకు ఆ డేటాను పంపించి ఉంటాడు. వారు ఆ ప్రశ్నలకు సమాధానాలు రూపొందించి పంపార నేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఫలితాలను తారుమారు చేసే కార్యక్రమం కాదా? ఇలా చేయడం అంటే యాజమాన్యాలు పరీక్షా ఫలితా లను తారుమారు చేయడమే కదా? రాత్రింబవళ్లు కష్టపడిన విద్యార్థులకు ర్యాంకులు రావు. ఇంత అడ్డ గోలుగా వ్యవహారం జరిగింది. ఒక్క నెల్లూరులోనే కాదు, మడకశిరలో కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో హిందూపురంలోని నారాయణ పాఠశాలకు చెందిన ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు. (ఫోటోలు చూపుతూ) చూడండి ఇది పోలీసు స్టేషను.. ఇందులో ముత్యాలు స్టేషన్ దగ్గర ఉన్న దృశ్యం కనిపిస్తోంది. ముత్యాలును అదుపులోకి తీసుకుని తరువాత వదలి వేశారు. తెలుగు, హిందీ, సైన్సు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు మనకు తెలిశాయని, జరుగుతున్నది వాస్తవమేనని ఏకంగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కూడా నివేదిక ఇచ్చారు. నారాయణ, చంద్రబాబుకు బినామీ అంటున్నారు! నారాయణ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి అయిన నారాయణ సీఎం చంద్రబాబుకు బినామీ అని, వైద్య కళాశాలలో ఆయనకు భాగస్వామ్యం ఉందనే ప్రచారం బలంగా ఉంది. నారాయణ, విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడనే విషయం అందరికీ తెలుసు. అసలు నారాయణను ఎందుకు మంత్రి చేశారో తెలియదు. నారాయణకు, చంద్రబాబుకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఎలాంటివి అంటే.. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా లేకపోయినా బాబు ఏకంగా మంత్రిని చేశారు. ఆ తరువాతనే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. బాబుకు నారాయణ బినామీ అనే ప్రచారం ఉంది. ఎవరినడి గినా ఇదే చెబుతున్నారు. అంతా కలిసి నారాయణను ఇంత దారుణంగా రక్షిస్తూ విద్యావ్యవస్థను దిగజారు స్తున్నారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు సంబంధించిన ఇంత ముఖ్యమైన ఉదంతంపై తక్షణం స్పందించాల్సిన సీఎం 30వ తేదీ తరువాత సభలో ప్రకటన చేస్తారట. అప్పటికి పరీక్షలన్నీ పూర్తిగా అయిపోతాయి. ఇదెలా ఉందంటే.. ఇల్లు తగుల బడుతూ ఉంటే ఫైర్‌ఇంజన్ తక్షణమే రాదు, ఇల్లంతా తగులబడిన తరువాత వస్తుందన్నట్లుగా ఉంది. ఈ విషయంలో యాజమాన్యాలను వదలి వేసి అటెండర్లు, ఇన్విజిలేటర్లు వంటి చిన్న ప్రాణుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుని మొత్తం కేసును తప్పు దోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? లీకేజీ చేయాల్సిన అవసరం చిరుద్యోగులకు ఏముంటుంది అని ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఈ వ్యవహారాన్ని మొత్తం యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకు అనిపించడం లేదు? అటెండర్ల మీదనో ఇన్విజిలేటర్ల మీదనో కేసులు పెట్టి వ్యవహారాన్నంతా మూసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? ఫలితాలన్నీ ప్రకటించేశాక నారాయణ పాఠశాలకు 1 మొదలు 100 ర్యాంకులు వచ్చేశాక అపుడు దయదలచి స్టేట్మెంట్ ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే.... రోమ్ నగరం తగులబడి పోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్లుగా ఉంది. తగులబడి పోతున్న ఈ అంశంపై చర్చ పెడితే ఒక సానుకూల సందేశం ప్రజల్లోకి వెళుతుందని మేం ఎంత చెప్పినా వినలేదు. గతంలో మంత్రులు రాజీనామాలు చేశారు గతంలో ప్రశ్నపత్రాలు లీకైనపుడు అప్పటి మంత్రులు రాజీనామాలు చేసిన సంఘటనలున్నాయి. అంతే కాదు, ముఖ్యమంత్రులు సీబీఐ విచారణకు కూడా ఆదేశించారు. ఇపుడెందుకు జరుగడం లేదు? చంద్రబాబుకు ఈ వ్యవహారంలోని వారిపై ఆసక్తి లేకపోతే ఎందుకు మంత్రులను బర్తరఫ్ చేయరు? సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? మేం ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చాం, 344 నిబంధన కింద స్వల్ప వ్యవధి చర్చనూ కోరాం. ఆ సమయంలో సభలో ముఖ్యమంత్రి లేరు. ఇద్దరు మంత్రులూ లేరు. నారాయణ మాత్రం కొంత సేపు ఉండి వెళ్లి పోయారు. విచారణలు ఫార్సుగా మారాయి.. దేవుడే రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్రంలో అనేక ఉదంతాలపై వేసిన విచారణలు ఒక ఫార్సుగా తయారయ్యాయి. పుష్కరాల్లో మరణాలపై ఓ విచారణ కమిషన్‌ను వేశారు. అది కూడా సిటింగ్ జడ్జి ఆధ్వర్యంలో వేయలేదు. వీళ్లకు కావల్సిన మనిషితో రిటైర్డు జడ్జితో వేశారు. అది ఏమైందో ఇప్పటి వరకూ తేలలేదు. ఎందుకు తేల్చరు అంటే ఇందులో చంద్రబాబే దోషి అని తేలుతుంది కాబట్టి. అగ్రిగోల్డ్ కుంభకోణం విషయంలోనూ అంతే. హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తే దాన్ని పట్టించుకోలేదు. లీకేజి వ్యవహారాన్ని కూడా సీబీఐకి అప్పగిస్తేనే లోతు పాతులు తెలుస్తాయన్నాం. అసలు ఈ అంశం చర్చకే రానివ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలి.... (సభలో ఉండి ఈ విషయం చెప్పవచ్చు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించినపుడు) మీరే చూస్తున్నారుగా... అసలు మమ్మల్ని మాట్లాడినిస్తే కదా! సీబీఐ విచారణ ఎందుకు జరిపించరు? ఇన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలున్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే కదా వారు లోతుల్లోకి వెళ్లి సెల్ఫోన్ల నుంచి ఎవరెవరికి మెసేజ్‌లు పెట్టారు, వీళ్లంతా ఎన్ని కేంద్రాల్లో ఇలా చేశారు అనేది తెలిసేది?