
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ఏజీ (అడ్వొకేట్ జనరల్)గా సీనియర్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పొన్నవోలు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. అడిషనల్ ఏజీగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు పలువురు పొన్నవోలుకు అభినందనలు తెలిపారు. కాగా రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment