సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్‌ 111 వర్తించదు: పొన్నవోలు | YSRCP Ponnavolu Sudhakar Reddy Key Comments Over Section 111 In AP | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై సెక్షన్‌ 111 వర్తించదు: పొన్నవోలు

Published Mon, Dec 2 2024 2:39 PM | Last Updated on Mon, Dec 2 2024 3:50 PM

YSRCP Ponnavolu Sudhakar Reddy Key Comments Over Section 111 In AP

సాక్షి, ఢిల్లీ: ఏపీలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తోందన్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్‌ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు సంబంధంలేని సెక్షన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన 111 సెక్షన్‌ వర్తించదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఈరోజు శుభదినం. ప్రతీ కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సజ్జల భార్గవ రెడ్డి మీద పిటిషన్‌ వేశాం. నెల రోజుల నుంచి ఏపీలో ఫ్యాసిస్ట్‌ ప్రభుత్వ కోరల్లో చిక్కుకుని సోషల్‌ మీడియా కార్యకర్తలు నలిగిపోతున్నారు.

జూలై 1, 2024కు ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదు. ఈ  సెక్షన్ 111ను టీడీపీ దుర్వినియోగం చేసింది. సెక్షన్‌ 111 పెట్టాలంటే ముద్దాయిపై రెండు ఛార్జ్‌షీట్లు ఉండాలి. అలా కాకుండా రెండు ఛార్జ్‌ షీట్లు లేకుండానే సెక్షన్‌ 111 పెడుతున్నారు. ఇది టీడీపీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్‌ ప్రభుత్వం చేసిన పని. సోషల్ మీడియా కార్యకర్తలు ఈ చట్టం కిందకి రారు. కొన్ని వేల మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. 

సజ్జల భార్గవకు అరెస్టు నుంచి రెండు వారాల రక్షణ కల్పించారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఘోరమైన నేరాలకు పాల్పడే వారికి ఇది 111 వర్తింపజేయాలని శాసన కర్తల ఉద్దేశం. ఈ ఉద్దేశాలకు వ్యతిరేకంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకే ఘటనపై మల్టిపుల్ ఎఫ్ఐఆర్‌లు పెట్టొద్దని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీంతీర్పు ఉల్లంఘిస్తే అధికారులు కూడా శిక్షకు అర్హులే అంటూ కామెంట్స్‌ చేశారు. 

వారిపై సెక్షన్‌ 111 వర్తించదు: పొన్నవోలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement