ఏపీలో అరాచక పాలనపై కేంద్రం మౌనం సరికాదు: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ | MP Pilli Subhash Chandra Bose Key Comments In Rajya Sabha | Sakshi
Sakshi News home page

ఏపీలో అరాచక పాలనపై కేంద్రం మౌనం సరికాదు: పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

Published Fri, Mar 21 2025 1:45 PM | Last Updated on Fri, Mar 21 2025 5:23 PM

MP Pilli Subhash Chandra Bose Key Comments In Rajya Sabha

సాక్షి, ఢిల్లీ : ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోందని పార్లమెంట్‌ వేదికగా చెప్పుకొచ్చారు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలన్నారు. ఏపీలో విషయంలో కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, ఏపీలో బీసీ కులగణన జరగాలన్నారు.

రాజ్యసభలో కేంద్ర హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చర్చలో వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ పక్షనేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. చర్చలో ఆయన మాట్లాడుతూ..‘తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. తొక్కిసలాట ఘటనపైన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. సౌమ్యుడైన ఎంపీ మిథున్ రెడ్డిపై, రెడ్డప్పపై దాడి జరిగింది. ఆయన ఇల్లు, కార్లు ధ్వంసం చేశారు. ఇదేం రకమైన పరిపాలన?. దీనిపైన కేంద్రం చర్యలు తీసుకోవాలి.

ఏపీలో అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. దీని ఉపేక్షిస్తే కేంద్ర హోంమంత్రి పైన మచ్చ పడుతుంది. పోసాని కృష్ణమురళిపై కేసుల పైన కేసులు పెడుతున్నారు. సీఎంపైన విమర్శలు చేసినందుకు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలి. కేంద్ర మౌనంగా ఉంటే.. అన్యాయం జరుగుతుంది.

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వడం లేదు. వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే డీఓపీటీ ఏం చేస్తుంది?. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారు. కీలక దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోం శాఖ పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తమ బలంపై ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉందనే  ధైర్యంతో ఏపీలో అనర్ధాలు కొనసాగుతున్నాయి. నా రాజకీయ జీవిత చరిత్రలో ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడు చూడలేదు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సరిదిద్దాలి. గుంటూరు మిర్చి రైతులకు మద్దతు ధర కోసం వైఎస్‌ జగన్‌ వెళితే సెక్యూరిటీ ఇవ్వలేదు. సెక్యూరిటీని విత్‌ డ్రా చేశారు. సెక్యూరిటీపైన రాజకీయ క్రీడలు ఆడుతున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

ఏపీలో కూటమి అరాచకాలపై రాజ్యసభలో గళమెత్తిన సుభాష్ చంద్రబోస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement