
సాక్షి,గుంటూరు : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సాంస్కృతి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేదని, ఆయన ఆ పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
ఏపీ బడ్జెట్ సమావేశాలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘2025 బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయి. ప్రతిపక్షం లేని శాసన సభ సమావేశాలు చప్పగా సాగాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళలేదు. వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సమావేశాలు కూటమి నేతలు ఒకరినొకరు పొగుడుకోవడానికే సరిపోయింది. శాసన మండలిలో ప్రతిపక్షం ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను మండలిలో మా సభ్యులు ఎండగట్టారు.
ఒక్క క్వింటా మిర్చిని ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో పని చేస్తుందో స్వంత పార్టీ సభ్యులే శాసన సభలో చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు దొంగచాటుగా సంతకం చేయాల్సిన అవసరం ఏముంది. ప్రతిపక్షం హోదా ఇవ్వండి. స్పీకర్ అయన్నపాత్రుడు వైఎస్ జగన్ గురించి ఏవిధంగా మాట్లాడారో అందరూ చూశారు. అచ్చెన్నాయుడు ఏటువంటి వ్యాఖ్యలు చేశారో అందరికి తెలుసు. ప్రజా సమస్యలపై పోరాటం మాకు ముఖ్యం. స్పీకర్,డిప్యూటీ స్పీకర్ శాసన సభకు పవిత్రత లేకుండా చేశారు.
వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చి శునకానందం పొందుతున్నారు.మంచి మిత్రుడు అని వైఎస్ గురించి చంద్రబాబు చెబుతాడు. మరి ఆయన పేరుపై ఎందుకంత కోపం. శాసన సభ్యుల వేసిన స్కిట్స్‌లో కూడా జగన్ పేరు మర్చిపోలేకపోయారు. ఆ స్కిట్‌లో చంద్రబాబుకు శకుని పాత్ర ఇస్తే బాగుండేది. ఆయన శకుని పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారు’ అని సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment