విచారణ జరిగితే తన నిజస్వరూపం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. విచారణను ఎదుర్కొని తన నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన చంద్రబాబు.. విచారణ ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారని విమర్శించారు.
విచారణ జరిగితే తన నిజస్వరూపం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. కేసులో పసలేదన్న చంద్రబాబు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నిజంగా నిప్పు అయితే విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆర్కే తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు.