ఆ అర్హత ‘ఆళ్ళ’కు లేదు | He dont have that Eligibility | Sakshi
Sakshi News home page

ఆ అర్హత ‘ఆళ్ళ’కు లేదు

Published Sat, Dec 10 2016 12:51 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఆ అర్హత ‘ఆళ్ళ’కు లేదు - Sakshi

ఆ అర్హత ‘ఆళ్ళ’కు లేదు

- ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు  
- ఈ కేసుతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు..
- చంద్రబాబు లంచం ఇవ్వజూపలేదు
- టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయమని అడగలేదు
- ఏసీబీని ప్రభావితం చేస్తున్నారన్నదీ ఊహాజనితమే..
- తీర్పులో జస్టిస్‌ సునీల్‌ చౌదరి

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో జోక్యం చేసుకునే అర్హత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదని హైకోర్టు చెప్పింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ఏసీబీ అధికారులను ఆదేశిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ప్రత్యేక కోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తోందని, ప్రత్యేక కోర్టు ఆదేశాల వల్ల మరో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏసీబీకి ఏర్పడిందని తెలిపింది. ఒకే కేసుకు 2 ఎఫ్‌ఐఆర్‌ల నమోదు చెల్లదని పేర్కొంది. చంద్రబాబు ఏపీకి చెందిన వ్యక్తి అంటూ, ఆయనకు తెలంగాణ యంత్రాం గం, ఏసీబీలపై  నియంత్రణ ఉండదంది. ఏసీ బీని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణ కేవలం ఊహాజనితమేనని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి తాళ్లూరి సునీల్‌ చౌదరి శుక్రవారం తీర్పు వెలువరించారు.

కేసు పూర్వాపరాలు
ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు సక్రమంగా సాగడం లేదంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ   న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోరు.. దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాల ను చంద్రబాబు హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రత్యేక కోర్టు ఆదేశాల అమలును నిలిపేస్తూ  సెప్టెంబర్‌ 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గత నెలలో పూర్తిస్థాయిలో వాదనలు విని తీర్పును వాయిదా వేసిన జస్టిస్‌ చౌదరి శుక్రవారం తీర్పు వెల్లడించారు.

ఆ అర్హత ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదు..
‘ఏసీబీ దర్యాప్తు సక్రమంగా సాగడం లేదు కాబట్టే తాను జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. దీనిని బట్టి దర్యాప్తు బాధ్యతలను చేపట్టేందుకు ఆయన ముందుకొచ్చినట్లు అనిపిస్తోంది. వాస్తవానికి చట్ట ప్రకారం ఓ కేసు దర్యాప్తు బాధ్యత సంబంధిత దర్యాప్తు సంస్థదే. దర్యాప్తు బాధ్యతలను ఓ ప్రైవేటు వ్యక్తికి అప్పగిం చడానికి చట్టం ఎంత మాత్రం అంగీకరించదు. దర్యాప్తు సంస్థ సక్రమంగా దర్యాప్తు చేయకపోతే అప్పుడు బాధితుడు లేదా అసలు ఫిర్యాదుదారు లేదా అతనికి కావాల్సిన వారు తమ ఫిర్యాదు గురించి పోరాటం చేయవచ్చు. కానీ ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉంది. పిటిషనర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే. కేసు తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు సంబంధించినది.

చంద్రబాబు లంచం ఇవ్వజూపలేదు..
చంద్రబాబు ప్రేరణతోనే మిగిలిన నిం దితులు స్టీఫెన్‌సన్‌ను కలిశారని ఫిర్యా దులో ఎక్కడా ఆరోపించలేదు. అయితే చంద్రబా బు ఫోన్‌ సంభాషణ ఆధారంగా ఆయన్ను ఈ కేసులోకి లాగేందుకు ఆ తరువాత నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే మిగిలిన నిందితులు స్టీఫెన్‌ సన్‌ను కలసి ఓటు వేసేందుకు అతనికిలం చం ఇవ్వజూపారని ఆరోపిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు సంభాషణలను పరిగణనలోకి తీసుకున్నా ఆయన స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూ పలేదు. టీడీపీ అభ్యర్థికి అనుకూలం గా ఓటు వేయమని గానీ, ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని గానీ కోరలేదు. టెలిఫోన్‌ సంభా షణలో ఓ వాక్యంపై ఆధారపడే రామకృ ష్ణారెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. మిగిలిన వాక్యాలతో సంబంధం లేకుండా ఓ వాక్యం ఆధారంగా ఓ నిర్ణయానికి రావడం సరికా దు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబా బును నేర విచారణ ఎదుర్కోవాలని బలవంతం చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే..’ అని జస్టిస్‌ చౌదరి తన తీర్పులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement