YSR Kadapa Assembly Constituencies
-
Bus Yatra: ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. బుధవారం ఉదయం 10.56 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహా్ననికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అరి్పస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజాక్షేత్రంలోనే జననేత.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నాటి అరాచకాలను ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. అదే సమయంలో టీడీపీ–జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జతకలిశాక మూడు పారీ్టలు చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టటాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు. -
Jagan Bus Yatra : మేమంతా సిద్ధం
ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం సాయంత్రం జరగనున్న మేమంతా సిద్ధం సభ నిర్వహణ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఉన్న తిమ్మయ్య కల్యాణ మండపం ఎదురుగా సభను నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తున్నారు. మార్చి 27, బుధవారం నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. "రేపు(27- మార్చి) ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి,సర్వరాజుపేట,వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల,నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్,చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు" అని తెలిపారు. జనంతో మమైకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర వీరపునాయునిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరులో జరగనున్న తొలి ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఇందు కోసం అన్ని జాగ్రత్తలు, చర్యలు చేపట్టారు. ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. బస్సు యాత్రకు సిద్ధం వేంపల్లె: ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే బస్సు యాత్రకు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన ఇడుపులపాయలోని బస్సుయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐలు గోవింద్‌రెడ్డి, చాంద్‌బాషా, ఎస్సై రంగారావు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. జగన్ సభ రూట్ మ్యాప్ ప్రొద్దుటూరు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభ రూట్ మ్యాప్ ఇలా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. అక్కడి నుంచి వీరపునాయునిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్‌కు చేరుకోనున్నారు. -
Bus Yatra: 'మేమంతా సిద్ధం'.. YSRCPలో నయా జోష్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైసీపి అధినేత మరో 48 గంటలే.. కాగా, వైఎస్సార్సీపీ బస్సుయాత్ర మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ఈనెల 27న ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సీఎం జగన్ ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సీఎం జగన్ విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకన్యకాపరమేశ్వరి సర్కిల్, సినీ హబ్, ఆర్టీసీ బస్టాండ్, శివాలయం వీధి, రాజీవ్ సర్కిల్, కొర్రపాడు రోడ్డు మీదుగా బస్సు యాత్ర జరగనుంది. ఐదు గంటలకు పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఇందు కోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఫుల్ జోష్‌లో పార్టీ శ్రేణులు బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. క్లీన్ స్వీపే లక్ష్యంగా అడుగులు టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు. -
మార్చి 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్‌ను వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని, అదే విషయాన్ని ప్రజలకు చెప్పి ఓటు అడుగుతామని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగు సిద్ధం సభలతో క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేశాం. ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం. సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి. దీనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు. ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుస్తారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర సాగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు’ అని సజ్జల పేర్కొన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు. ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి. ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది. వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం . తొలిరోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్. నంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర ►ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ 4 సిద్ధం సభలు లక్షలాది మంది కార్యకర్తలతో నిర్వహించింది. ►రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించాం ►ఈ నాలుగు సభలు జరిగిన తీరు, అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు..మా అధినాయకుడు సీఎం జగన్‌కి నీరాజనాలు పట్టారు ►చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారుపేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారు ►మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి.. ఇలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు అనే మార్గదర్శకత్వం ఇచ్చారు ►ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్ స్టెప్‌గా బస్సు యాత్ర చేపడుతున్నారు ►ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ బస్సు యాత్ర నిర్వహించాలని తలపెట్టాం ►ఒక వైపు సిద్ధం సభల ప్రతిధ్వని వినిపించింది ►జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఇటువైపు పడింది ►దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని బూత్ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారు ►వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నామని వారు ప్రకటిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ►ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు ►కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర ►రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అని డిక్లేర్ చేసే సందర్భం ఇది. ►27వ తేదీ మొదలైతే.. నోటిఫికేషన్ వచ్చే దాదాపు 18వ తేదీ వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది ►సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నీ కలిసి వచ్చేలా బస్సు యాత్ర ప్లాన్ జరుగుతుంది ►ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు మొదలైనప్పటి నుంచీ ఎన్నికల సభలకు ముఖ్యమంత్రి బయలుదేరతారు ►మా పార్టీ పెట్టినప్పటి నుంచీ అట్టడుగు వర్గాల వైపు నిలబడి అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు వారి కోసం జగన్ తపన పడ్డారు ►ఇదే రీతిలో 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. పండుగలు, సెలవులు వచ్చినా ఆయన అక్కడే ఉంటారు ►27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు ►ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి ‘మేమంతా సిద్ధం’సభ జరుగుతుంది ►చాలా పెద్ద ఎత్తున ఈ సభలు జరుగుతాయి.. అంచనాలకు మించి జరుగుతాయి ►గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకో ఒక మహాసభ జరుగుతుంది ►ప్రతి పార్లమెంటు, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్ చేసేలా ఈ సభలు జరుగుతాయి ►బస్సు యాత్రలో ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది ►ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు ►మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారు. సభ జరిగే నియోజకవర్గానికి వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు ►వీలైనంత వరకూ ఒక పార్లమెంటులో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడితే బాగుంటుందని భావిస్తున్నాం ►ఎంత మంది కూటమి కట్టినా మా బ్రాండ్ జగన్ ►అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకంగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మా వైపు ఒంటరిగా వస్తున్నారు ►స్పష్టమైన ఒక బ్రాండ్ వైఎస్సార్సీపీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►ఈ యాత్రల తర్వాత ఎన్నికల సభలకు వెళ్తాం. ఇప్పటికి బస్సు యాత్ర 3 రోజుల వరకూ ఖరారు అయింది ►తొలిరోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల లేదా అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ ►మూడో రోజు కర్నూలు పార్లమెంటులోకి ప్రవేశిస్తారు. ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ►ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ యాక్టివిటీ అంతా పాదయాత్రలో ఎలా జరిగిందో అలానే జరుగుతుంది మొదటి మూడు రోజుల షెడ్యూల్ విడుదల ►ఈ నెల 27 నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర ►ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం ►తొలుత ఇడుపుల పాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ►ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు ►27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ ►28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ ►30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ -
Bus Yatra: జనంలోకి సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ( ఫైల్ ఫోటో ) ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైఎస్సార్సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇదీ చదవండి: ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో!? -
బాబు మాటలే బట్టీపట్టి చెబుతున్న షర్మిల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి, రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని షర్మిల.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఇచ్చిన స్క్రిప్ట్‌నే పోటీ పరీక్షలకు విద్యార్థి సిద్ధమైనట్లుగా బట్టీ పట్టి చదువుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆమె మాట్లాడుతున్న మాటలకు ఒకదానికి, మరొకదానికి పొంతన లేదన్నారు. షర్మిల మాటలను చూస్తే.. బహుశా ఆమె తెలంగాణలో ఉండి మాట్లాడుతున్నట్లుగా అనుకుంటున్నారేమో అని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సోనియా వేధింపులు షర్మిలకు తెలుసు వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తాళలేక మరణించిన వారి కుటుంబాలకు భరోసా కల్పించడానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి సోనియాగాంధీ యత్నించారు. అప్పట్లో సోనియాను జగన్, విజయమ్మ, షర్మిల కలిశారు. అక్కడేం జరిగిందో షర్మిలకు కూడా తెలుసు. వైఎస్ పథకాలను తుంగలో తొక్కి, ఆశయాలను పక్కన పెట్టేందుకు సిద్ధమైన సోనియాతో విభేదించి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి కక్ష సాధింపు మొదలు పెట్టి వేధించిన విషయమూ షర్మిలకు తెలుసు. వైఎస్ వివేకానందరెడ్డిని మంత్రిని చేసిన సోనియా.. వైఎస్సార్సీపీ స్థాపించాక పులివెందుల ఉప ఎన్నికలో వైఎస్ విజయమ్మపై వివేకానందరెడ్డిని పోటీ పెట్టడం ద్వారా కుటుంబాన్ని చీల్చిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడూ అదే రీతిలో కుటుంబాన్ని చీల్చి షర్మిలను పీసీసీ చీఫ్‌గా చేశారని జగన్ ఎత్తిచూపారు. ప్రజలు జగనే వైఎస్‌కు సరైన వారసుడు అనుకున్నారు కాబట్టే వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. మహానేత వైఎస్ ఆశయ సాధనే ఊపిరిగా.. సీఎం జగన్ వైఎస్సార్ బిడ్డగా ఆ రోజు మొదలు పెట్టిన ప్రస్థానం.. నేడు ఉధృతమైన ప్రవాహంలా సాగుతోంది. దానికి కారణం వైఎస్ ఆశయాలను, ఆలోచనలను జగన్ మనసా వాచా నమ్మి వాటిని మరింత మెరుగుపర్చి అమలు చేస్తున్నారు. పార్టీని నడపడం, విలువలను పాటించడం, నిజాయితీ, నిబద్దతలో ఎన్ని ఆటుపోట్లనైనా తట్టుకొంటూ వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆనాడు అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో పెట్టడం నుంచి చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నప్పుడూ జగన్ చలించలేదు. ఇలా సొంతంగా ఎదిగిన వ్యక్తి జగన్. జగన్ తండ్రి వైఎస్ అని చెప్పుకోవడం ఏ తండ్రికైనా గర్వకారణమే. వైఎస్ బిడ్డగా, జగన్ సోదరిగా షర్మిలకు అభిమానులు గౌరవం ఇస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు. ఏం అన్యాయం జరిగిందో షర్మిలే చెప్పాలి జగన్ కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీని స్థాపించినప్పుడు లక్షలాది కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. త్యాగాలు చేశారు. అందరూ కష్టపడ్డారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనే కదా షర్మిల పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ ఎంతో కష్టపడ్డారు. అందరికీ రకరకాల బాధ్యతలు అప్పజెప్పారు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించారు. షర్మిల పాదయాత్ర చేశారు. అన్యాయం జరిగిందని షర్మిల అంటున్నారు. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలి. పదవి కోసమే ఆమె ఆరోజు జగన్ కోసం నిలబడ్డానని స్పష్టంగా చెప్పగలిగితే సమాధానం చెప్పొచ్చు. పదవుల పంపకంలో అన్యాయం చేశారా? కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా? అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది చర్చించడానికి అర్హమైనదేనా? కుటుంబం పదవులు పంచుకొంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? వైఎస్సార్టీపీ కార్యకర్తలకు షర్మిల ఏం న్యాయం చేశారు? తెలంగాణలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీ కోసం చాలా మంది కష్టపడి ఉంటారు కదా. వారికి షర్మిల ఏం న్యాయం చేశారు? వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేశారు? వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాష్ట్రానికి వచ్చిన షర్మిలను భుజానికెత్తుకుని మోస్తున్న ఎల్లో మీడియా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో షర్మిలకు భాగముందని ఎందుకు రాయలేదు? అప్పుడూ ఇప్పుడూ జగన్‌పై షర్మిల బాణాలు ఎక్కుపెట్టినప్పుడే వాటినే ఎల్లో మీడియా ప్రచురిస్తోంది. వైఎస్ మరణంపై రేవంత్‌రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు షర్మిల ఎందకు స్పందించలేదు? వైఎస్ పథకాలు లేవంటే తీసుకున్న వాళ్లంతా ఎవరు? వైఎస్ పథకాలను తీసేశారని షర్మిల మాట్లాడితే ఏమనాలో అర్థం కావడంలేదు. చంద్రబాబు, రాధాకృష్ణ వద్ద నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి చెప్పినప్పుడు వాస్తవాలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో వైఎస్ అమలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా ఇప్పుడు షర్మిల లేవంటున్నారు. రైతులకు నేడు ఇస్తున్నంత భరోసా దేశంలో మరెక్కడైనా ఉందా? అసలు క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటున్నారు. తీసుకున్న రైతులంతా ఏమనుకుంటారు? పాపం ఆమె తెలియక ఇంత అబద్ధం మాట్లాడి ఉండొచ్చు. బహుశా చంద్రబాబు కూడా వీటిపై మాట్లాడటానికి సాహసం చేయకపోవచ్చు. చంద్రన్న కానుకలు లేవని అనొచ్చు కానీ, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లేవని మాత్రం ఆయనా అనలేడు. షర్మిలమ్మే తిట్లు తింటుందిలే అని చంద్రబాబు ఆ తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చి ఉండొచ్చు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో సీఎం జగన్ ఆరోజుతో పొలిస్తే 3వేలకు పైగా ప్రొసీజర్స్ పెంచారు. రూ.25 లక్షల వరకూ పరిమితి పెంచారు. అర్హత కోసం ఆదాయాన్ని రూ.5 లక్షలు చేశారు. 90 శాతం కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవి నిజం కాదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఆనాడు రూ.30 వేల నుంచి రూ. 35 వేలు ఇస్తే, ఇప్పుడు వంద శాతం చెల్లిస్తున్నది వాస్తవం కాదా? కేవలం జగన్ చెల్లెలు, వైఎస్ బిడ్డ అనే ఏకైక అర్హతతో ఇక్కడకు సోనియా గాంధీ తెచ్చి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. రోజు రోజుకు అబద్ధాలతో షర్మిల మాటల దాడి చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలి. హోదా, విశాఖ స్టీల్‌పై మోదీ సభలోనే గళమెత్తిన జగన్ బీజేపీకి వైఎస్సార్సీపీ టూల్లా మారిందని, రాష్ట్రాన్ని అప్పజెప్పిందని షర్మిల చేసిన ఆరోపణలు అర్థరహితం. స్టీల్ ప్లాంట్ విషయం కేంద్రానికి సంబంధించింది. ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్‌ను నడిపేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం మేం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అప్పులను రీస్ట్రక్చర్ చేయడం, గనులు కేటాయించడం, అదనంగా ఉండే భూమిని అమ్మి ఆ సొమ్ముతో అప్పులను తగ్గించుకోవడం ద్వారా స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపించవచ్చని సూచిస్తూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ పరిశ్రమ వ్యాపారం కాదని, సెంటిమెంట్‌కు సంబంధించినదని కూడా చెప్పాం. ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? ప్రధాని ఉన్న వేదికపైనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం జగన్ గళమెత్తారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఇంకేదైనా ఉందా? పోరాటం అంటే నిర్వచనం, స్వరూపం ఎలా ఉండాలో షర్మిలే చెప్పాలి. గంగవరం పోర్టుపై షర్మిల మాటలు సత్యదూరం. ఆ పోర్టులో మనకున్న వాటా బదులుగా వచ్చిన రూ.600 కోట్లను మరో మూడు పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తున్నాం. గంగవరం పోర్టుపై మన హక్కును కోల్పోలేదు. లీజు తర్వాత మళ్లీ అది ప్రభుత్వానికే వస్తుంది. ఇది కాక కొంత రెవెన్యూ షేరింగ్ కూడా ప్రభుత్వానికి వస్తుంది. ఒక పెద్ద సంస్థ వచ్చి ఆపరేషన్స్ చేస్తే రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇలానే చేస్తోంది. ఆమె ఇచ్చింది తలా తోక ఉన్న స్టేట్మెంటేనా? మణిపూర్‌పై అప్పుడెందుకు మాట్లాడలేదు? మణిపూర్ అంశం షర్మిలమ్మ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎందుకు పోరాడలేదు? ఇక్కడకు రాగానే బీజేపీ, మణిపూర్ అంటూ క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనడంలో ఆంతర్యం తెలియడంలేదా? ఇదంతా ఆమె అనుకున్నది కాదు... చంద్రబాబు అనుకున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఆయనకు రావాలి. అలాగే వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లు కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చారు. సంఖ్యా బలం లేకున్నా పోటీనా? శాసనసభలో సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే.. ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీకి దక్కుతాయి. సంఖ్యా బలం లేకున్నా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని దుర్మార్గమైన, వికృతమైన ఆలోచనలతో చంద్రబాబు నాటకం ఆడాలనుకుంటున్నారు. ఎన్నికలప్పుడు అభ్యర్థుల మార్పు సాధారణం. మరింత మెరుగైన ఫలితాల కోసమే మార్పులు చేస్తున్నాం. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలను ఎలా ఉపయోగించుకోవాలో మేం చూసుకుంటాం. దొంగతనంగా వారిని లాక్కోవాలని చంద్రబాబు ప్రయత్నించడం ప్రజాస్వామ్యమేనా? గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారం. భావోద్వేగంతో స్పందించిన మాటలపై చిల్లర రాజకీయమా? సీఎం జగన్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఏదీ ఆయన హక్కు అనుకోరు. చంద్రబాబు అధికారం ఆయన హక్కు అనుకుంటాడు. చంద్రబాబు ఎప్పుడూ బాధ్యతతో అధికారంలోకి రాలేదు. అందుకే ఆయన అధికారంలోకి రాగానే.. మరో 50 ఏళ్ల తర్వాత ఏం చేస్తాడో ఇప్పుడే చెబుతుంటాడు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. ఆ స్పృహ జగన్‌కు ఉంది. ఎప్పుడైనా ప్రజలే నిర్ణేతలని గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ల తర్వాత ప్రజల వద్దకు వెళ్లి దీవెనలు కోరాలని భావిస్తారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో రాజ్‌దీప్ సర్దేశాయ్ ‘మీకిది సంతృప్తినిస్తోందా’ అని అడిగితే.. దానికి భావోద్వేగంతో జగన్ స్పందించారు. నాలుగున్నరేళ్ల తన పాలనలో ఇన్ని కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించి.. ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు నింపినందుకు జన్మ ధన్యమైందని చెబుతూ.. ఒకవేళ తప్పుకోవాలన్నా పూర్తి సంతృప్తితో చేస్తాను అన్నారు. ఎవరైనా ఇలా అనగలరా? మహా స్థితప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. ఇప్పటికీ 75 ఏళ్ల వయసులోనూ ఎలా ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకోవాలని అనుకునే చంద్రబాబు అయితే ఈ మాట అనలేడు. ఈ రాష్ట్రానికి ఏమి చేయగలిగాడో చెప్పుకోవడానికి జగన్‌కు చాలా ఉంది. ఆ తృప్తినే ఆయన వ్యక్తీకరించారు. దానికి ఓ చిల్లర భావాన్ని ఇచ్చి ఎల్లో మీడియా సంతోషిస్తే ఏం చేయలేం. -
కమలాపురం: చంద్రబాబు ‘రా..కదలిరా’ సభ అట్టర్‌ఫ్లాప్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కమలాపురంలో చంద్రబాబు రా..కదలిరా సభ అట్టర్‌ప్లాప్ అయ్యింది. అబద్ధాలు, అవాస్తవాలతో చంద్రబాబు ప్రసంగం ఆకట్టుకోలేకపోయింది. చంద్రబాబు తన ప్రసంగంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సభకు జన సమీకరణలో టీడీపీ నేతలు విఫలమయ్యారు. చంద్రబాబు ప్రసంగం పూర్తికాక ముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. మద్యం ధరలపై చంద్రబాబు మాట్లాడుతుండగా సభలో మందుబాబులు క్వాటర్ బాటిళ్లు చూపించారు. టికెట్లపై స్పష్టమైన హామీ ఇస్తారనుకున్న ఆశావహులు.. బాబు నుంచి క్లారిటీ రాకపోవడంతో వెనుదిరిగారు. -
బద్వేల్.. ఓ బలిపీఠం.. వాడుకొని వదిలేస్తున్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలిపీఠంగా మారింది. ఉన్నత ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారంతా క్రమేపీ తెరమరుగయ్యారు. అటు ఉద్యోగానికి దూరమై, ఇటు స్థానిక నాయకత్వాన్ని మెప్పించలేక రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారు. ఆయా అభ్యర్థుల పట్ల అధినేత చంద్రబాబు సైతం ఆదరణ చూపకపోగా..వారిని కరివేపాకు చందంగా అవసరానికి వాడుకొని వదిలేశారు. ఇప్పటివరకు ముగ్గురికి ప్రత్యక్షంగా ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బద్వేల్ నియోజకవర్గంలో దివంగత నేత బిజివేముల వీరారెడ్డిదే ఆధిపత్యం. ఆయన మరణానంతరం 2001 ఉప ఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అరంగేట్రంతోనే విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా సాగింది. అనంతరం వైఎస్సార్సీపీ ఆవిర్భావమయ్యాక..మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వుడు స్థానమైంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోమారు అవకాశం లేకుండా స్థానిక నాయకత్వం మోకాలడ్డుతోంది. అమృత్‌కుమార్ నుంచి డాక్టర్ రాజశేఖర్ వరకూ.. అధ్యాపకునిగా స్థిరపడిన లక్కినేని అమృత్‌కుమార్ (చెన్నయ్య) 2009లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా..ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2014 ఎన్నికల నాటికి లక్కినేని పార్టీలో కనుమరుగయ్యారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న ఎన్డీ విజయజ్యోతి 2014 టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల నాటికి విజయజ్యోతిని కూడా తెరమరుగు చేశారు. అప్పట్లో ప్రభుత్వ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓబులాపురం రాజశేఖర్‌కు అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల నాటికి డాక్టర్ రాజశేఖర్ రాజకీయ ప్రస్థానమూ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్నను తెరపైకి తీసుకువచ్చారు. బొజ్జాతో ఉద్యోగానికి రాజీనామా చేయించి టీడీపీ అభ్యర్థిగా శ్రేణులకు పరిచయం చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని అవసరానికి వాడుకొని వదిలేస్తుండటం రివాజుగా మారిపోయింది. బాబుది సైతం అదే ధోరణి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుటుంబానిదే టీడీపీలో ఆధిపత్యం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా విజయమ్మ మెప్పు లేకపోతే, ఆయా అభ్యర్థుల రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకమే అన్నట్లు తలపిస్తోంది. లక్కినేని చెన్నయ్యతో మొదలు డాక్టర్ రాజశేఖర్ వరకూ చోటుచేసుకున్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. ఉన్నత ఉద్యోగాలను పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీ అభ్యర్థుల పట్ల చంద్రబాబు కూడా అలాంటి ధోరణినే అవలంబిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై 2021లో చంద్రబాబును నమ్మి పార్టీ తీర్థం పుచ్చుకున్న అప్పటి ఎమ్మెల్యే తిరువీధి జయరాములు కూడా తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే బద్వేల్ టీడీపీ అభ్యర్థుల పాలిట బలిపీఠంగా మారందని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే’
సాక్షి, బద్వేల్: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. ‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్‌ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్‌ను బీజేపీకి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్‌పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్ పరుగులు -
చంద్రబాబుకు నిరసన సెగ.. నల్ల జెండాలతో గోబ్యాక్ అంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుకు బద్వేలులో నిరసన సెగ తగిలింది. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో గోబ్యాక్ అంటూ నిరసనలు తెలిపారు. వివరాల ప్రకారం.. బద్వేలు పర్యటన వేళ చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. ఎమ్మెల్యే దాసరి సుధా ఆధ్వర్యంలో దళిత నేతలు నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసనలు చెప్పారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో దళిత నేతలు నిరసనలు తెలిపారు. క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు బద్వేల్ రావాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: అమ్మ ఒడి పథకం చాలా మంచిది: టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు