భారీ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ సిద్ధం
మేమంతా సిద్దం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర
దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్న సీఎం జగన్
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర
ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ
తొలి విడతలో బస్సు యాత్ర.. ఆ తర్వాత ఎన్నిలక ప్రచార సభలు
ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్న సీఎం జగన్
ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలతో, సిద్ధం సభలతో జనంలోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది.
ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది.
మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.
( ఫైల్ ఫోటో )
ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైఎస్సార్‌సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో!?
Comments
Please login to add a commentAdd a comment