idupulapaaya
-
Watch Live: జన నేతకు వైఎస్ జగన్ నివాళి
-
YSR Jayanthi: ఇడుపులపాయకు వైఎస్ జగన్
-
Bus Yatra: జనంలోకి సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ( ఫైల్ ఫోటో ) ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైఎస్సార్సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇదీ చదవండి: ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో!? -
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ దంపతులు
-
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
వేంపల్లె : ఈనెల 7, 8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకొని పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఐఎస్‌డబ్ల్యూ శ్రీనివాసులుతో కలసి ఎస్టేట్‌లోని హెలీప్యాడ్, వైఎస్సార్ ఘాట్, ట్రిపుల్ ఐటీలో వైఎస్సార్ స్మారక విగ్రహం, ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ తరగతి గదులు, ల్యాబ్‌లను పరిశీలించి అవసరమైన గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ కోవిడ్–19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(ఎస్ఓపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి కోవిడ్–19 త్రోట్ స్వాబ్ టెస్ట్ చేయించుకున్నవారికే అనుమతించాలని ఆదేశాలు జారీచేశారు. హెలీప్యాడ్ వద్ద రోడ్డుకు ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు 36 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వైఎస్సార్ ఘాట్‌కు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వీఐపీలకే అనుమతించాలన్నారు. ట్రిపుల్ ఐటీలో వైఎస్సార్ స్మారక విగ్రహ ఆవిష్కరణ, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి గదుల ప్రారంభోత్సవంతోపాటు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనకు 60 మంది ట్రిపుల్ ఐటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ హెచ్ఓడీలు, విద్యార్థులు మాత్రమే ఉండాలన్నారు. బయటనుండి వచ్చిన వారికి ఎలాంటి అనుమతి ఉండదన్నారు. వీరన్నగట్టుపల్లె క్రాస్‌నుండి ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి చెక్‌చేసి పంపడం జరుగుతుందన్నారు. ఈ ఏర్పాట్లన్ని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పకడ్బందీగా చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 7వతేదీ మంగళవారం సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న , వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి తదితర పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో సీఎం పర్యటన
వేంపల్లె : వచ్చే నెల 7, 8తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు . రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాలు తెలిపారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు. ట్రిపుల్ ఐటీలో రూ.139కోట్లతో నిర్మించిన ఏడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విభాగాలను, తరగతి గదులను పరిశీలించారు. వైఎస్సార్ ఆడిటోరియం, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కూడా వారు పరిశీలించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలకు అధునాత హంగులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నతమైన సాంకేతిక విద్యనందించాలనే ఉద్ధేశంతో వీటిని సంస్థలను మరింత పటిష్టం చేయనున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీలను పట్టించుకోకుండా నిధులను పసుపు – కుంకుమ పథకానికి వాడుకుందని ఆయన విమర్శించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సుధీర్ ప్రేమ్‌కుమార్, ఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, అకడమిక్ డీన్ రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శరవణ్‌కుమార్, రోజర్ బిన్ని, అనిల్‌కుమార్‌రెడ్డి, రూపస్‌కుమార్, తహసీల్దార్ ఎన్.చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన
-
ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్ ప్లాంట్‌కు పునాది రాయి వేయనున్నారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరోవైపు జిల్లాలో సీఎం పర్యటనపై పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద స్టీల్‌ప్లాంట్ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఆరు నెలల్లోనే శంకుస్థాపన చేస్తున్నారు.ఇప్పటికే 3200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే 2 టీఎంసీల నీటిని కేటాయించగా, మరోవైపు స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్ ఓర్ కేటాయిస్తూ ఎన్‌ఎమ్‌డీసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. త్వరలోనే అధికారులు పనులు కూడా ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ 23.12.2019 (సోమవారం) ఉదయం 9.20 – కడపలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభం 9.55 గంటలకు – రిమ్స్‌లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపన 10.30 గంటలకు– వైఎస్సార్ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం 11.50 – జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు సీఎం శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ మధ్యాహ్నం 2.15 గంటలకు – దువ్వూరు మండలం నేలటూరు వద్ద మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరిక 24.12.2019 (మంగళవారం) ఉదయం 9.05 గంటలకు – ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌కు చేరిక 9.10 – దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళి 2.00 – రాయచోటి సభాస్ధలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు 2.15 – వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ 5.00 – పులివెందుల భాకరాపురంలోని నివాసానికి చేరుకోనున్న సీఎం 25.12.2019 (బుధవారం) ఉదయం 9.20 – క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు 11.15 – పులివెందుల జూనియర్ కళాశాల మైదానంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం 3.10 – కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయలుదేరుతారు. -
వైఎస్సార్‌కు సీఎం జగన్,కుటుంబ సభ్యుల నివాళి
-
మహానేత వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
-
‘ట్రిపుల్’ కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ట్రిపుల్ ఐటీ మంజూరు చేసినా జిల్లాలో వసతుల కల్పనను గాలికొదిలేయడంతో విద్యార్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వసతుల లేమితో జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీని తరగతులను ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్నారు. దీంతో రెండేళ్లుగా ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలోనే నడుస్తోంది. 6 వేల మంది సామర్థ్యం మాత్రమే ఉన్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిపి 8 వేల మంది ఉన్నారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మంది పైనే విద్యార్థులున్నారు. ఈ లెక్కన మొత్తం విద్యార్థుల సంఖ్య 9 వేలకు చేరుతుంది. దీంతో ఇప్పటికే అక్కడ వసతుల్లేవు. విద్యార్థులకు గదుల కొరతతో పాటు మంచాలు, కంప్యూటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఒంగోలు విద్యార్థులకు ట్యాబ్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందజేయలేదు. ఇక ఫ్యాకల్టీ కొరత వేధిస్తోంది. మరోవైపు ఉన్న ఫ్యాకల్టీ సైతం ఒంగోలు ప్రాంతానికి చెందినవారు కావడంతో ఇడుపులపాయలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వారు ఉండేందుకు వసతుల్లేకపోవడంతో బయట ప్రాంతాలలో ఉండి బోధనకు ఇడుపులపాయకు వెళ్లాల్సి వస్తోంది. శని, ఆదివా రాలు సెలవు తీసుకోవాలన్న రెండు రోజుల వ్యవధిలో ఒంగోలు ప్రాంతానికి వచ్చి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఫ్యాకల్టీ సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విద్యార్థులది అదే పరిస్థితి. వసతుల లేమితో వారి చదువులు సజావుగా సాగడం లేదు. అయితే వసతుల లేమితో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అక్కడి అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ పరిధిలో 2016–17 విద్యా సంవత్సరంలో వెయ్యి మంది విద్యార్థులు, 2017–18 విద్యాసంవత్సరంలో వెయ్యి మందితో పాటు సూపర్ న్యూమరరీ కోటా కింద మరో 114 మంది మొత్తం 2114 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు నెలలో మరో వెయ్యి సీట్లతో పాటు సూపర్ న్యూమరరీ కింద 140 సీట్లు మొత్తం 1140 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన ట్రిపుల్ ఐటీలో మొత్తం 3254 మంది విద్యార్థులవుతారు. అయితే వీరందరికీ అక్కడ తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ అధికారులు ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే నిర్వహించుకోవాలంటూ ఒత్తిడి పెంచారు. ఇటీవల మీరు కచ్చితంగా వెళ్లాల్సిందేనంటూ మరింత ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటూ తేల్చని సర్కారు: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి వంద ఎకరాలకుపైగా స్థలం కేటాయిస్తున్నట్లు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఆ తర్వాత ఒంగోలు మండలం యరజర్ల కొండ ప్రాంతాన్ని ట్రిపుల్ ఐటీకి కేటాయిస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్వే నెం.418లో 200 ఎకరాలకుపైగా స్థలాన్ని డి–నోటిఫై చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ట్రిపుల్ ఐటీకి వంద ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో 2 వేల ఎకరాలకుపైగా భూములను ఇనుప ఖనిజం తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం లీజుకిచ్చింది. అయితే ఇందులోనే ట్రిపుల్ ఐటీకి స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించారు. అయితే ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే భూములు కేటాయిస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఈ వ్యవహారం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ట్రిపుల్ ఐటీ స్థల కేటాయింపు, భవనాల నిర్మాణం ఇప్పట్లో జరిగేది కాదని తేలిపోయింది. తాత్కాలికంగా అద్దె భవనాల్లో ట్రిపుల్ ఐటీ తరగతులు నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించినా అది ముందుకు సాగలేదు. సరైన అద్దె భవనాలు దొరకలేదని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకున్నారు. దీంతో వచ్చే ఏడాది కూడా జిల్లాలో ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఇప్పటికే ఇడుపులపాయలో తరగతులు నిర్వహించటం కుదరదని అక్కడి అధికారులు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడింది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే...! ఇడుపులపాయలో మరింత ఇబ్బందిగా ఉంది.. 6 వేల మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇప్పటికే విద్యార్థులు 8 వేల మంది ఉన్నారు. దీంతో విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాకల్టీ సైతం కష్టాలు పడాల్సి వస్తోంది. తక్ష ణం ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి స్థల కేటాయిం పు లేదా తాత్కాలికంగానైనా అద్దె భవనాలు చూడాలని ప్రభుత్వానికి విన్నవించాం. కానీ ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు. వచ్చే ఏడాది మరో వెయ్యి మంది విద్యార్థులు పెరుగుతారు. దీంతో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి వచ్చే ఏడాదికైనా తరగతులు నిర్వహించుకునేలా ప్రయత్నించాలి. – వెంకట బసవరావు,ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ -
ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ జగన్
వైఎస్ఆర్ కడప: మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి కడప ఎయిర్‌పోర్టు చేరుకున్న ఆయన నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. స్థానికంగా ఉన్న నాయకులూ, కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలికారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఓ వికలాంగూడు ప్రేమతో తీసుకువచ్చిన కేక్‌ను జగన్ కట్ చేసారు. రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు ఆర్పించనున్నారు. అనంతరం ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఘాట్ వద్ద కార్యక్రమాలు పూర్తి కాగానే ఆయన హెలికాఫ్టర్‌లో గుంటూరులో జరగనున్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి బయలుదేరుతారు.