ఏపీలో ఎన్నికల శంఖారావం
జనంలోకి జగన్నాధ రథచక్రాలు
ఇడుపులపాయ టు ఇచ్చాపురం
రాజన్న బిడ్డ కోసం జనం నిరీక్షణ
ప్రజాక్షేత్రంలోనే పాలనపై చర్చలు
అభిమాన నేత కోసం ప్రజల ఎదురుచూపు
సిద్ధం సభలతో YSRCP కేడర్ రెడీ
ఒంటరిగానే ఎన్నికల్లో సింహగర్జన
ప్రజాపాలనపై ముఖ్యమంత్రి రచ్చబండ
జనక్షేత్రంలోకి వెళ్తున్న జగన్‌మోహన్‌రెడ్డి
మేమంతా సిద్ధంతో YSRCP బస్సుయాత్ర
కూటమి కుట్రల్ని జగన్ ఎలా చేధిస్తారు.?
ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు.?
ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం సాయంత్రం జరగనున్న మేమంతా సిద్ధం సభ నిర్వహణ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఉన్న తిమ్మయ్య కల్యాణ మండపం ఎదురుగా సభను నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేస్తున్నారు.
- మార్చి 27, బుధవారం నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం
- వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం
- వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ
- 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర
- ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర
- సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర
- బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం
- ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ
- సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు
మేమంతా సిద్ధం
బస్సు యాత్రకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు. "రేపు(27- మార్చి) ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి,సర్వరాజుపేట,వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల,నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్,చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు" అని తెలిపారు.
జనంతో మమైకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర వీరపునాయునిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకోనుంది. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరులో జరగనున్న తొలి ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఇందు కోసం అన్ని జాగ్రత్తలు, చర్యలు చేపట్టారు. ఎమ్మె ల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
విప్లవాత్మక మార్పులను వివరిస్తూ..
వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి.
బస్సు యాత్రకు సిద్ధం
వేంపల్లె: ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే బస్సు యాత్రకు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన ఇడుపులపాయలోని బస్సుయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్, సీఐలు గోవింద్‌రెడ్డి, చాంద్‌బాషా, ఎస్సై రంగారావు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు.
జగన్ సభ రూట్ మ్యాప్
ప్రొద్దుటూరు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభ రూట్ మ్యాప్ ఇలా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. అక్కడి నుంచి వీరపునాయునిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్‌కు చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment