సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా సిద్దం పేరుతో తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని.. రాయలసీమ నుంచే యాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు ధృవీకరించాయి ఇప్పుడు.
బస్సు యాత్ర ప్రారంభానికి ముందు.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌ను సీఎం జగన్ సందర్శిస్తారు. దివంతగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్రను మొదలుపెడతారు. మేమంతా సిద్ధం యాత్ర ద్వారా సీఎం జగన్ పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ ఉండనుంది. కడప పార్లమెంట్ స్థానం పరిధి నుంచి లక్ష మంది ఈ సభకు హాజరు కావొచ్చని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది.
ఇక.. ఆ మరుసటి రోజు అంటే 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం పార్లమెంటరీ స్థానాల పరిధిలో మేమంతా బస్సు యాత్ర కొనసాగనుందని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. అలాగే సిద్దం సభలు జరిగిన చోట్ల.. బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉండవని స్పష్టం చేసింది.
పూర్తి రూట్ మ్యాప్, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ను ఇవాళ సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబోయే మీడియా సమావేశంలో సీనియర్ నేతలు స్పష్టత ఇవ్వనున్నారు. ఇంకోపక్క బస్సు యాత్ర ప్రకటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. యాత్రలో హుషారుగా పాల్గొనేందుకు మేమంతా సిద్ధం అంటూ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటిస్తున్నారంతా.
ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ సెట్టర్.. వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment