ఎనిమిదో రోజు మేమంతా సిద్ధం.. చింతరెడ్డి పాలెం వద్ద ముగియనున్న బస్సు యాత్ర | CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 8 Updates, Highlights | Sakshi
Sakshi News home page

మేమంతా సిద్ధం @ డే 8: చింతరెడ్డి పాలెం వద్ద ముగియనున్న బస్సు యాత్ర

Published Thu, Apr 4 2024 9:00 AM | Last Updated on Thu, Apr 4 2024 7:23 PM

CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 8 Updates, Highlights - Sakshi

Memantha Sidham Day 8 Highlights CM Jagan Bus Yatra Details

సీఎం జగన్‌ ప్రసంగం..
నాయుడుపేటలో మహా జనప్రభంజనం కనిపిస్తోంది: సీఎం జగన్‌

  • మంచిని అడ్డుకుంటున్న దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధమా?
  • అన్ని వర్గాలకు మనం మంచి చేశాం
  • పేదలు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి.
  • మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా సిద్ధమా?
  • మంచిన అడ్డుకుంటున్న దుష్టచతుష్టయంపై యుద్ధానికి సిద్ధమా?
  • ప్రభంజనం అనే పదానికి అర్థం చెప్పేలా ఈ సభ నిలిచిపోతుంది
  • మంచిని అడ్డుకుంటున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి
  • మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగబోతుంది
  • ఈ ఎన్నికలు కేవలం, ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదు
  • మనం వేసే  ఓటు మన భవిష్యత్తు, తలరాతలు రాసుకోవడం కోసం
  • మనం వేసే ఓటుతో రాబోయే ఐదేళ్లలో పేదల తలరాతను నిర్ణయిస్తుంది
  • ఇంటింటి అభివృద్ధిని కొనాసాగించేందుకు మీరంతా సిద్ధమా?


ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్‌

  • పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం
  • నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం
  • పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు
  • 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం
  • ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు
  • తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు
  • తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు
  • పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?
  • పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు
  • 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?
    31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?


మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్‌

  • జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది
  • నా మొట్టమొదటి సంతకం మళ్లీ వాలంటీర్లను తీసుకురావడం కోసమే
  • చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి
  • ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు
  • చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు
  • చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది
  • జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది
  • మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే

మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు: సీఎం జగన్‌

  • బాబుకు నా అనేవాళ్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు
  • వీళ్ల రాజకీయం దోచుకోవడం, దాచుకోవడం
  • క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను పేదలకు అందించాలని శ్రీకారం చుట్టాం
  • పిల్లలకు క్వాలిటీ చదువు అందించాలన్నదే నా తపన
  • ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని తీసుకొచ్చాం
  • సాధ్యం కాని హామీలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు
  • బాబులా నేను మోసపూరిత హామీలు ఇవ్వను
  • జగన్‌ చేయలేని  ఏ స్కీంను చంద్రబాబు చేయలేడు
  • చంద్రబాబు కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని అనుకోవడం లేదు
  • మంచి చేసి ఆత్మవిశ్వాసంతో మీ బిడ్డ మీ ముందుకు వచ్చాడు
  • మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసాలు చేయడు
  • మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు

హామీలు నెరవేర్చలేని బాబుకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: సీఎం జగన్‌

  • 58 నెలల్లో మేనిఫెస్టోలో చెప్పనవి కూడా అమలు చేశాం
  • రైతులకు చంద్రబాబు రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా?
  • పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా?
  • ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తా అన్నాడు.. చేశాడా?
  • ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా?
  • 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు.. కనీసం సెంటు స్థలమైన ఇచ్చాడా?
  • మోసాల నుంచి మన పేదల భవిష్యత్‌ను కాపాడుకునే యుద్ధానికి మీరంతా సిద్ధమా?
     

జగన్‌ అంటే జనం.. జనం అంటే జగన్‌: కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి, సూళ్లూరుపేట

  • గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, అంబేడ్కర్ కలలు కన్న సమ సమాజం, శ్రీశ్రీ వంటి కవులు కలలు కన్న మరో ప్రపంచం...ఈ కలలన్నీ నిజం చేస్తూ నవశకాన్ని నిర్మిస్తున్న నిర్మాత, సంక్షేమదాత, అభివృద్ధి ప్రదాత, యువత భవితను మార్చి రాస్తున్న విధాత, నా దైవం సీఎం వైఎస్‌ జగన్‌ గారికి నమస్కారం. 
  • తిరుపతి జిల్లా మేమంతా సిద్ధం సభకు స్వాగతం. 
  • జగనన్నా అంటే జనం
  • జగనన్న వెంటే ఈ జనం
  • ఆయన పిలుపు ఒక ప్రభంజనం
  • ఆయన పేరే ఒక రణ నినాదం
  • మన జగన్‌ నినాదంతో దిక్కులు పిక్కటిల్లాలి
  • శతృవుల గుండెల్లో భూకంపం పుట్టాలి
  • నాతో గొంతు కలిపి జైజగన్ అనండి.
  • జై జగన్ జై జగన్
  • ఒక పేద దళిత కుంటుంబంలో పుట్టి, సాధారణ ప్రభుత్వ ఉద్యోగినైన నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేని చేసారు. ఇప్పుడు మూడో సారి మీ సైనికుడిగా నన్ను పోటీలో నిలిపారు. అందుకు ధన్యవాదాలు. 
  • మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు వలలో, మగ్గాలో, మేకలో ఇచ్చి మిమ్మల్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పుకున్న నాయకుల్ని చూసాం. 
  • ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అనే పెత్తందారీ వ్యవస్థకు మూలపురుషుడు చంద్రబాబును చూసాం. 
  • బీసీల తోకలు కత్తిరిస్తాం అనే చంద్రబాబు అహంకారాన్ని చూసాం.
  • నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ మమ్మలన్ని అందరినీ ఆదరించి, మీ అందరి చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదు, రాజ్యాధికారం అని..మా వర్గాల నుంచి డిప్యూటీ సీఎంలను, మంత్రులను చేసి సామాజికసాధికారత కల్పించిన ఏకైక పాలకులు మీరే సార్. 
  • నన్నే తీసుకుంటే ఆలయ ప్రవేశంలేని సామాజిక వర్గం నాది. అలాంటిది టీటీడీ బోర్డులో నాకు చోటిచ్చిన గొప్ప నాయకులు మీరు. జగనన్న పాలనలో సామాజిక న్యాయానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇంత గొప్ప అవకాశాన్ని మీరు నాకు అందించినందుకు...జన్మ జన్మలకీ రుణపడే ఉంటాను. 
  • మా నియోజకవర్గంలో, మన ప్రభుత్వ హయాంలో,  మీసారధ్యంలో సుమారు 1400 కోట్లతో అభివృద్ధి పనులు చేసాం. 
  • 2,400 కోట్లు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మీకే దక్కింది. 
  • అందుకు ఈ సూళ్లూరుపేట ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటారు.
  • మాదో చిన్న విన్నపం...2024 లో మీరు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు..
  • అప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత - ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేందుకు, స్వర్ణముఖి నదిలో సబ్ సర్పేజ్ డ్యామ్‌లు, నాయుడుపేట నడిబొడ్డులో పోతునవెన్నువాను కాలువ ఆధునీకరణ, చెంబేడు రిజర్వాయిర్, తడలో మత్స్యకార సోదరులకు ఆశ్రమ పాఠశాల, ఎస్సీఎస్టీలకు ఆశ్రమ పాఠశాల నిర్మించాలని కోరుకుంటున్నాను. 
  • వంచన చేసే చంద్రబాబు పార్టీకి సమాధికట్టి
  • మంచిచేసే జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం
  • తిరుపతి జిల్లాలోని 7 నియోజక వర్గాలు, పార్లమెంట్ స్థానాలు గెలిపించి జగనన్నకు గిఫ్టుగా ఇచ్చి, 175కు 175 అనే జగనన్న టార్గెట్‌లో భాగస్వాములు అయ్యేందుకు మీరు సిద్ధమా...

ప్రారంభమైన నాయుడుపేట మేమంతా సిద్ధం సభ

నాయుడుపేట బహిరంగ సభలో తిరుపతి జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ర్యాంప్‌ మీద ప్రజలకు అభివాదం చేస్తూ నడిచిన సీఎం జగన్‌

నాయుడుపేట బహిరంగ సభా వేదిక నుంచి అభిమానులకు, పార్టీ కేడర్‌కు సీఎం జగన్‌ అభివాదం
 

తిరుపతి మేమంతా సిద్ధం సభ ప్రారంభం

  • దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి నివాళర్పించిన సీఎం జగన్‌
  • జ్యో‍తి ప్రజ్వలనతో సీఎం జగన్‌ బహిరంగ సభ ప్రారంభం

నాయుడుపేట చేరుకున్న సీఎం జగన్‌

  • నాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ 
  • సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్‌
  • అశేష జనవాహిని నడుమ జై జగన్‌.. జగన్‌ వన్స్‌మోర్‌ నినాదాలతో మారుమోగుతున్న సభా ప్రాంగణం

కాసేపట్లో నాయుడుపేటలో బహిరంగ సభ

  •  తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • నాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభ
  • కాసేపట్లో నాయుడుపేట సభా ప్రాంగణం చేరుకోనున్న సీఎం జగన్‌

సమస్యలు వింటూ.. 

  • మేమంతా సిద్ధం పేరిట వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం
  • బస్సు యాత్రలో ముందుకు సాగుతున్న సీఎం జగన్‌
  • మార్గం మధ్యలో జనంతో మమేకం
  • వాళ్ల కష్టాలు, కన్నీళ్లు సైతం వింటున్న వైనం
  • తాజాగా తిరుపతి జిల్లాలోనూ అవే దృశ్యాలు 
  • జగనన్న మాకు కష్టం వచ్చిందనగానే.. వాళ్లకు దగ్గరగా వెళ్లి సమస్య అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్‌


ఏర్పేడు వద్ద సీఎంను కలిసి తన సమస్య చెప్పుకున్న మహిళ

శ్రీకాళహస్తిలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన గజమాల

చిల్లకూరులో సీఎం జగన్‌ 

  • చిల్లకూరు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • పూలు చల్లుతూ.. గజమాలతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు
  • ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్‌

జ్యోతి, ఆటో డ్రైవర్, శ్రీకాళహస్తి

  • ఈ ప్రభుత్వంలో నా పిల్లలను బాగా చదివించుకుంటున్నా.
  •  ఈ తడవ కూడా జయం మనదే జగనన్నా. 
  • శ్రీకాళహస్తిలో ఏడు ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను.
  • ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలూ అందుకున్నాను.
  • నా పిల్లలను బాగా చదివించుకుంటున్నాను. 
  • నా ఆటో బాడుగ కట్టుకోలేకపోతున్నా, ఓ సొంత ఆటో ఇప్పించన్నా?

సీఎం వైఎస్ జగన్..  సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా లారీ, టిప్పర్ కొనాలన్నా..తక్కువ వడ్డీతో కొనుక్కునేందుకు వీలుగా బ్యాంకులతో మాట్లాడి ఏదన్నా చేద్దాం. 

వెంకటేష్, ఆటో అసోసియేషన్ సభ్యుడు, తిరుపతి

  • ప్రతి పేదవాడి గుండెలో దేవుడై కొలువున్నారు మీరు
  • ఈ ప్రభుత్వంలో నవరత్నాల ద్వారా మా అమ్మకి వృద్ధాప్య పింఛన్ వచ్చింది,
  • మా అబ్బాయికి అమ్మ ఒడి వచ్చింది, నాన్నకు రైతుభరోసా వచ్చింది.
  • ప్రతి పేదవాడి గుండెలో మీరు దేవుడిలా ఉన్నారు.
  • మీరు టిప్పర్ డ్రైవర్‌ కి సీటు ఇవ్వడం సంతోషంగా ఉంది. 


పూర్ణేష్, శ్రీకాళహస్తి, ఆటో డ్రైవర్

  • మేమంతా నీ స్టార్ కేంపెయినర్లం
  • పదేళ్లుగా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను.
  • ఇలాగే మీరు పేద ప్రజలకు మీరు అండగా ఉండండి జగనన్నా.
  • మేమంతా నీ స్టార్ కేంపెయినర్లమై నీ వెంటే ఉంటాం.
  • నా బిడ్డకు అమ్మ ఒడి వస్తోంది, నాకు ఇంటి స్థలం వచ్చింది.
  • పేద ప్రజలు నీవల్లే చల్లగా ఉన్నారు. దె
  • య్యాలను తరిమి కొట్టి దేవుడిలాంటి నిన్ను మళ్లీ గెలిపించుకునేందుకు మా ఆటో డ్రైవర్లందరం సిద్ధంగా ఉన్నాం. 


జయశంకర్, లారీ డ్రైవర్, శ్రీకాళహస్తి

  • జగనన్నా మీరు పెద్ద మనసుతో శింగనమల సీటు ఓ డ్రైవర్ కు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది.
  • కానీ చంద్రబాబు అతన్ని దూషించడం తప్పు.
  • ఆ డ్రైవర్‌ ను అసెంబ్లీకి పంపింస్తాం.
  • అతడినే కాదు రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలు 175 మందినీ అసెంబ్లీకి పంపేందుకు ఐదుకోట్ల ఆంధ్రులూ సిద్ధంగా ఉన్నారు.
  • జగనన్నా మా లారీ డ్రైవర్లకు ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే వారికి ఆర్థిక సాయం దొరికేలా ఏదైనా బీమా వచ్చే మార్గం చూడాలని మా డ్రైవర్లందరి తరఫునా కోరుతున్నాను. 

సీఎం వైఎస్ జగన్.. నువు చెప్పిన విషయాన్ని తప్పకుండా ఆలోచిస్తాం. 


వెంకటేష్, ఆటో డ్రైవర్, పూర్ణకుంభం సర్కిల్, తిరుపతి

జగనన్నా నేను మీ ద్వారా చాలా లబ్ది పొందాను. మా అమ్మకు ఆసరా, మా పాపకు అమ్మ ఒడి వచ్చాయి. ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది. జగనన్నా మీతో మాట్లాడాలంటే మాట రావడం లేదు. మా ఆటో, టాక్సీ డ్రైవర్లకు కూడా ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరో 30 ఏళ్లు సీఎంగా మీరే ఉండాలి. 

ఓంకార్, మల్లిగుంట, టిప్పర్ డ్రైవర్, తొట్టంబేడు మండలం, తిరుపతి

  • జగనన్నా ఆటోవాళ్లకు ఇస్తున్నట్టే టిప్పర్ డ్రైవర్లకు కూడా ప్రతి ఏటా ఏదైనా లబ్ది అందించేలా చూడండి అన్నా.
  • మా ఎమ్మెల్యే మాకు మోటార్లు ఏర్పాటు చేసి పంటలకు నీళ్లు ఇస్తున్నాడు.
  • మేం రెండు కార్లు పంటలు వేసుకుని పచ్చగా బతుకుతున్నాం. 


ఆటో డ్రైవర్,  తిరుపతి ఆర్టీసీ బస్టాండ్

  • మా ఆటో స్టాండ్ లోని ప్రతి డ్రైవర్ నవరత్నాల పథకాలు పొందుతున్నారు.
  • మా నాయకులు రెండేళ్లలో తిరుపతిలో రోడ్లు వెడల్పు చేసి మా ట్రాఫిక్ కష్టాలు తీర్చి, నగరాన్ని సుందరణీకరణ చేసారు.
  • అనంతపురంలో ఒక డ్రైవర్‌ కు ఎమ్మెల్యే సీటు మీరు ఇచ్చారని తెలిసి ఎంతో సంతోషించాం.
  • కానీ అవతల పక్క టీడీపీ వాళ్లు డ్రైవర్లను తక్కువ చేసి మాట్లాడటం విని బాధపడ్డాం.
  • ఆ చంద్రబాబుకు మా డ్రైవర్లు అందరం ఓటుతో గుణపాఠం చెబుతాం. 

సుధాకర్, ఆటో డ్రైవర్, తిరుపతి

  • 22 ఏళ్లుగా నేను ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాను.
  • ఒక ఆటో డ్రైవర్‌ గా నేను వాహన మిత్ర అందుకున్నాను.
  • మా ఇంట్లో డ్వాక్రా రుణ మాఫీ వల్ల మా కుటుంబం లబ్ది పొందింది.
  • లైసెన్స్‌ లు తీసుకుని అద్దె ఆటోలు నడుపుకునే వారికి కూడా పదివేలు వాహన మిత్ర అందించాలని కోరుతున్నాం. 


అల్లాభక్ష్‌  శేషాద్రీ టాక్సీ యూనియన్ సభ్యుడు, 

  • మీ సాయం మరిచిపోలేను
  • జగనన్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ మాకు ఒకసారి అమ్మ ఒడి, నాలుగుసార్లు వాహనమిత్ర, డ్వాక్రా, ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్ వచ్చాయి.
  • నాకు గుండెపోటు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది.
  • నా జీవితంలో మిమ్మల్ని, మీరు చేసిన మేలును మరిచిపోలేను. 


రవి కుమార్ రెడ్డి, ఆటో డ్రైవర్, శ్రీకాళహస్తి

  • జగనన్నా.. మళ్లీ మీరే సీఎం
  • 2004 నుండి నేను ఆటో నడుపుతున్నాను.
  • మీరు ఇచ్చిన ప్రతి పథకం అందరికీ అందుతున్నాయి.
  • మాకోసం మీరు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది.
  • ఆటో డ్రైవర్లంతా మీ పక్షానే ఉన్నారు.
  • మళ్లీ మీరే మా సీఎం.


చిన్నసింగమల చేరుకున్న సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి

  • ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు
  • టిప్పర్‌ డ్రైవర్‌కు చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్‌ ఇచ్చా
  • వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌, బీఈడీ చదివాడు
  • చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా బాధపడలేదు
  • ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు
  • జగన్‌ టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు
  • టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇస్తే తప్పేంటి బాబు?
  • కోట్ల రూపాయాలు ఉన్నవారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు
  • జగన్ ఏం తప్పు చేశాడని టీడీపీ అవహేళన చేస్తోంది. 
  • ఆటో, ట్యాక్సి, టిప్పర్‌ డ్రైవర్లకు తోడుగా ఉంటున్నాం
  • ఏడాది రూ.10వేల చొప్పున, ఐదేళ్లలో రూ.50 వేలు ఇచ్చాం
  • వాహనమిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చాం

శ్రీకాళహస్తిలో సీఎం జగన్ బస్సుయాత్రకు అపూర్వ స్పందన

  • మండుటెండలోనూ శ్రీకాళహస్తిలో రోడ్డుకిరువైపులా బస్సుయాత్రలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన మహిళలు
  • విజయవంతంగా సాగుతున్న ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర
  • అడుగడుగునా సీఎం జగన్‌కు బ్రహ్మరథం పుడుతున్న ప్రజలు
  • ప్రజలతో మమేకం అవుతున్న సీఎం జగన్‌, సంక్షేమంపై ఆరా
     

మరి కాసేపట్లో శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డుకి వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర

  • సీఎం జగన్‌కు స్వాగతం పలకడానికి భారీగా చేరుకుంటున్న ప్రజానికం

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరికలు

  • ఎద్దల చెరువు వద్ద బస్సుయాత్రలో సీఎం జగన్‌ సమక్షంలో వైఎ‍స్సార్‌సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి 
  • పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైఎస్సార్‌సీపీలో చేరిక
  • కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  • 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన విష్టువర్ధన్‌ రెడ్డి

ఏర్పేడు దాటిన సీఎం జగన్ బస్సు యాత్ర

  • తిరుపతి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర కొనసాగుతోంది
  • సీఎం జగన్‌కు ప్రజలు భారీగా స్వాగతం పలుకుతున్నారు

చిన్నసింగమల రానున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర

  • చిన్నసింగమలలో‌ ఆటో, టిప్పర్ డ్రైవర్లతో సమావేశం కానున్న సీఎం వైఎస్ జగన్
  • చంద్రబాబు తమను దూషించటం, ఎగతాళి చేయటంపై డ్రైవర్ల ఆగ్రహం
  • జగన్ టిప్పర్ డ్రైవర్కి సీటు ఇచ్చి అక్కున చేర్చుకుంటే చంద్రబాబుకు కడుపుమంట ఎందుకంటూ ఫైర్
  • సంక్షేమ పథకాలతో తమ కుటుంబాలు బాగు పడుతున్నాయంటున్న ఆటో డ్రైవర్లు
  • ప్రతి ఏటా అందిస్తున్న రూ.10 వేలు తమకెంతో ఉపయోగపడుతున్నాయంటున్న ఆటోవాలాలు

  • ఏర్పేడులో సీఎం జగన్‌ కలిసి ఫోటో దిగేందుకు పరిగెడుతున్న అభిమాని కాళ్ళకు ఉన్న చెప్పులు తెగిపోయాయి
  • అది గమనించిన సీఎం జగన్  పిలిచి సెల్ఫీ దిగారు

  • సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది
  • ఏర్పేడు మండలంలోని ఇసుక తాగేలి వద్ద మహిళలతో సీఎం జగన్‌ మాట్లాడారు

  • మరికొద్దిసేపటిలో ఏర్పేడుకి చేరుకోనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..
  • బస్సు యాత్రలో వస్తున్న సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలకనున్న ఏర్పేడు గ్రామస్థులు
  • ఏర్పేడు చౌరస్తాకి భారీగా చేరుకొంటున్న కార్యకర్తలు, అభిమానులు.

మరోసారి సీఎం జగనే సీఎం అవుతారు: తిరుపతి ప్రజలు

  • రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం  అవటం ఖాయం
  • వృద్ధులను చాలా ఇబ్బందులకు గురిచేశారు
  • గురవరాజుపల్లెలో సీఎం జగన్‌కు ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు
  • సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేశారు
  • ఓ మహిళ సమస్యను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు

సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం

  • గురవరాజుపల్లె నుంచి  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభమైంది
  • తిరుపతి జిల్లాలో సీఎం జగన్‌  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతుంది.

తిరుపతి జిల్లాలో కాసేపట్లో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం

  • కాసేపట్లో గురవరాజుపల్లె నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం
  • మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల చేరుకోనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • చిన్నసింగమలలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లోతో సీఎం జగన్‌ ముఖముఖి
  • అనంతరం చావలి మీదుగా నాయుడుపేటకు బస్సు యాత్ర
  • సాయంత్రం నాయుడుపేటలో ‘మేమంతా సిద్ధం’బహిరంగ సభ 
  • నాయుడుపేట బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌
  • అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్ , మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెంకు బస్సు యాత్ర

తిరుపతి జిల్లా సిద్ధమా...?

  • సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇవాళ తిరుపతి జిల్లాలో కొనసాగనుంది
  • ఈ సందర్భంగా ‘Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా...? ’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు

  • తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం- 8వ రోజు షెడ్యూల్..
  • మేమంతా సిద్ధం ఎనిమిదో రోజు బస్సు యాత్రలో భాగంగా సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు గురవరాజుపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. 
  • మల్లవరం, ఏర్పేడు మీదగా పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదగా చిన్న సింగమల సమీపంలో 11 గంటలకు చేరుకుని లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లో తో ముఖముఖిలో పాల్గొంటారు.
  • అనంతరం చావలి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
  • సాయంత్రం 3:30 గంటలకు నాయుడుపేట లోనుంచి చెన్నై జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 
  • సభ అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్ , మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బసకు చేరుకుంటారు.ఘేడ

ఏడో రోజు సీఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్రకు పోటెత్తిన జనం

  • ఉమ్మడి చిత్తూరు జిల్లా మురిసిపోయింది
  • ప్రచండ భానుని ఎదురొడ్డి అభిమాన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడింది
  • సీఎం జగన్‌కు అడగడుగునా అపూర్వ స్వాగతం లభించింది
  • జగనన్న జైత్రయాత్రకు ఊరూవాడా కదిలివచ్చింది
  • దారిపొడవునా హారతులు పట్టి.. పూల వర్షం కురిపించి ఆనందోత్సాహాలను చాటుకుంది
  • ‘నువ్వే కావాలి... నువ్వే రావాలి’ అంటూ ఉద్వేగంతో నినదించింది
  • కుట్రలను ఓడించేందుకు ‘మేమంతా సిద్ధం’ అని ప్రతినబూనింది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement