'మేమంతా సిద్ధం @ డే 3': సీఎం జగన్‌ బస్సు యాత్ర అప్‌డేట్స్‌ | Memantha Siddham Day 3: CM Jagan Bus Yatra Public Meeting Updates | Sakshi
Sakshi News home page

'మేమంతా సిద్ధం @ డే 3': సీఎం జగన్‌ బస్సు యాత్ర అప్‌డేట్స్‌

Published Fri, Mar 29 2024 8:45 AM | Last Updated on Fri, Mar 29 2024 9:47 PM

Memantha Siddham Day 3: CM Jagan Bus Yatra Public Meeting Updates - Sakshi

Memantha Siddham Yatra.. CM Jagan Bus Yatra Day-3 Highlights And Updates

సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది
  • ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో  నిలిచిపోతుంది
  • వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది
  • మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది
  • జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం

  • మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది
  • పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
  • 58 నెలల పరిపాలనలో జరిగిన మంచిని, మార్పును గమనించమని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నా
  • మీరంతా కూడా ప్రతీ ఇంటికి వెళ్లి ఈ మార్పుల గురించి చెప్పాలని కోరుతున్నాను
  • ఈ రోజు మన విద్యారంగంలో జరుగుతున్న మార్పులు ఎలాంటివి అంటే.. 15-16 ఏళ్ల తర్వాత మన విద్యార్థి చదువుల తర్వాత ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు అని ఆలోచించి.. వారి భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం
  • ఈ ప్రభుత్వానికి ఏ కుటుంబమైనా మద్దతు పలకకుండా ఎందుకు ఉంటుంది అని ఆలోచన చేయమని కోరుతున్నాను
  • గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఉద్యోగం రావడం లేదని, ఈ చదువుల వల్ల ఉపయోగం లేదని, పట్టాలు చేతికొచ్చినా ఉపయోగం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు
  • కాబట్టే విద్యా రంగంలో కనివినీ విధంగా మార్పులు తీసుకొచ్చాం
  • భవిష్యత్తును నిలబెట్టే చదవులు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతికే అవకాశాలు కల్పించడానికి మొత్తంగా మన విద్యా విధానంలో 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేశాం
  • పిల్లలు బడిబాట పట్టాలని అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాం
  • పిల్లల చేతులకు విద్య నేర్పే ట్యాబ్‌లు ఇచ్చాం
  • ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చాం
  • పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టటం గతంలో ఎప్పుడైనా జరిగిందా?
  • పెద్ద చదువుల కోసం పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం
  • ప్రతి గుండె  ఐదేళ్లుగా మంచి జరిగిందని చెబుతున్నాయి
  • మా గవర్నమెంట్‌ స్కూళ్లు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది
  • కార్పోరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం
  • అమ్మ ఒడి, విద్యా దీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం
  • పిల్లల చదువుల గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు
  • పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలి

  • పిల్లల చదువుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదు
  • ఒక గింజను పండించడంలో ఒక రైతు పాత్ర, ఒక కూలీ పాత్ర నా కళ్లతో నేను చూశా
  • ప్రతీ గింజ పండించడంలో నా అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడ్డారో నా కళ్లతో నేను చూశా
  • ఈ రోజు పనివాళ్లుగా, రోజు కూలీలుగా  చిన చిన వ్యాపారాలు చేసుకుంటూ ఆత్మగౌరవం లక్ష కుటుంబాలు వారి బతుకు బండిని ఎలా లాగుతున్నాయో నా కళ్లతో నేను చూసుకుంటూ వచ్చా
  • వారి ముఖాల్లో సంతోషం, వారి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తేనే వారి బ్రతుకు బాగుంటుందని ఆలోచించే నా 58 నెలల పాలనలో అడుగులు వేశాం
  • ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులు, మట్టిలో మాణిక్యాలు పండాలంటే, ఒక రోజు కూలీ, ఒక ఆటో డ్రైవర్‌, ఒక కూరగాయల అమ్మే చెల్లెమ్మ, దోశెలు, ఇడ్డీలు అమ్మే చెల్లెమ్మ..  ఇలా వీరి జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచన చేశాం
  • ఈ ఆలోచనల నుంచి పుట్టించి ఒక అమ్మ ఒడి, ఒక విద్యా దీవెన, ఒక వసతి దీవెన, ఒక తోడు అనే పథకం, ఒక చేదోడు అనే పథకం, ఓ నేతన్న నేస్తం అన్న పథకం, మత్య్సకార భరోసా అనే పథకం ఈ ఆలోచనల నుంచే పుట్టాయి
  • కుదేలైన పొదుపు సంఘాలను జీవితాలను చిన్నా భిన్నం అయిన పరిస్థితుల చూసి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే ఆలోచనతో పుట్టింది.. ఒక సున్నా వడ్డీ అనే పథకం, ఒక ఆసరా అనే పథకం పుట్టింది
  • నలభై సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న అక్కలు నా చెల్లెమ్మల జీవితాలు బాగుంటాయని ఆలోచన చేసే ఒక కాపు నేస్తం అనే పథకం పుట్టింది, ఒక ఈబీసీ నేస్తం అనే పథకం పుట్టింది, ఒక చేయూత  అనే పథకం పుట్టింది
  • అన్నింటికీ మించి ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే సంక్షేమ ఫలాల్ని పెట్టగలిగితేనే ఆ కుటుంబాలు బాగుంటాయనే ఆలోచనల నుంచే ప్రతీ పథకం పుట్టింది
  • ఐదేళ్లుగా నేను అమలు చేసిన సంక్షేమాన్ని చూశారు..

  • వైఎస్సార్‌సీపీ తరఫున మొత్తం 200 సీట్లలో(లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు కలిపి) 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం
  •  అంటే 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం

  • నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని  ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను..
  • ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా
  • ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్‌ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను
  • నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను
  • అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్‌ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను.
  • ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్‌ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్‌ కట్టమని కోరుతా ఉన్నా
  • మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్‌ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్‌ కట్టమని కోరుతా ఉన్నా
  • అభాగ్యులైన అక్క చెల్లెమ్మల కోసం, అవ్వా తాతల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం మనది..  అది ఆదివారం అయినా, సెలవు దినం అయినా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధికంగా మూడు వేల రూపాయలు పెన్షన్‌ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ బిడ్డ ప్రభుత్వం
  • 66 లక్షల మందికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం
  • 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లు పేదల ఖాతాలకు బదిలీ చేశాం

  • మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల  కుటుంబాల్లోకి ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు..
  •  ప్రతీ ఇంట్లో కూడా లక్షల లక్షల కనిపిస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి
  • ఇదంతా కేవలం 58 నెలల కాలంలోనే జరిగింది అనేది గుర్తుపెట్టుకోమని చెబుతున్నా
  • ప్రతి పక్షం మాయల్ని, మోసాన్ని నమ్ముకుంటే.. మన అందరి ప్రభుత్వం చేసిన మంచిని నమ్ముకుంది.
  • కాబట్టే చెబుతా ఉన్నా.. ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు మాత్రమే కాదు..  ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల అక్క చెల్లెమ్మల భవిష్యత్‌, వారి భవిష్యత్‌ నిర్ణయించే ఎన్నికలని ప్రతీ అక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను.
     
  • మాది పేదవాళ్ల పార్టీ.. అందుకు డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం
  • వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు
  • వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు.. బీఈడీ కూడా చేశాడు
  • బాబు హయాంలో ఉద్యోగం దొర్క టిప్పర్‌ డ్రైవర్‌ అయ్యాడు
  • పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్‌ ఇచ్చాం
  • మేం టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చామని బాబు హేళన చేశాడు

ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభలో బుట్టా రేణుకా ప్రసంగంలోని ముఖ్యాంశాలు 

  • కర్నూలు నుంచి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, ఎమ్మిగనూరు  నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారాలు
  • ఎప్పుడు కనివినీ ఓ చారిత్రాత్మక పరిపాలన అందించిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికు దక్కుతుంది
  • ఎవ్వరూ ఊహించని విధంగా సంక్షేమ అభివృద్ధి, ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందాన్ని నింపాలని, ప్రతివాడి పేదవాడి ముఖాల్లో చిరునవ్వు ఉండాలని.. ప్రతీ నిమిషం పేదవాడి గురించే ఆలోచించే సంక్షేమ అభివృద్ధిని తీసుకొచ్చారు సీఎం జగన్‌
  • ఈ ఐదేళ్లు చక్కటి పాలన అందించిన ఘనత సీఎం జగన్‌ది
  • ఈ ఐదేళ్లలో విద్య, వైద్య రంగలో రూపురేఖలు మార్చి ఓ కార్పోరేట్‌ను విద్యను అందిస్తూ, పేద ప్రజలకు కార్పోరేట్‌ వైద్యాన్ని అందిస్తున్న ఘనత సీఎం జగన్‌గారికే దక్కుతుంది.

ఎమ్మిగనూరుకు చేరుకున్న సీఎం జగన్‌

  • ఎమ్మిగనూరు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

ఎమ్మిగనూరులో జనహోరు

  • నంద్యాల, ప్రొద్దుటూరు సభకు మించి పోటెత్తిన ప్రజా ప్రవాహం
  • అంచనాలను మించి మేమంతా సిద్ధం బహిరంగ సభ
  • ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిన బహిరంగ సభా ప్రాంగణం
  • మేమంతా సిద్ధం సభకు తరలివస్తున్న జనసందోహం
  • ఎమ్మిగనూరు సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనం
     

కాసేపట్లో ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభా ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం జగన్‌

  • ఇప్పటికే ఎమ్మిగనూరు సభకు భారీ స్థాయిలో తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • జన జాతరలా సాగుతున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర
  • దారులన్నీ మేమంతా సిద్ధం బహిరంగ సభ వైపే

బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో  చేరిన టీడీపీ నేత కృష్ణారెడ్డి

హెచ్‌ కైరవాడిలో సీఎం జగన్‌ రోడ్ షోకు విశేష స్పందన

మేమంతా సిద్ధం మహాసభకు తరలి వెళ్లిన ఆదోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు

  • ఎమ్మిగనూరు పట్టణంలో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం జరిగే మేము సిద్ధం మహాసభకు ఆదోని నుంచి భారీగా తరలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 150 బస్సులు 150 ట్యాక్సీలలో  తరలి వెళ్లిన పార్టీ కార్యకర్తలు, నాయకులు

వేముగోడు గ్రామానికి చేరుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

  • స్వాగతం పలికిన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక

అభిమానంతో కానుకలు..

  • కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర 
  • కోడుమూరులో జననేత సీఎం జగన్‌పై హద్దులు లేని అభిమానం ప్రదర్శించిన గ్రామస్తులు
  • వివిధ వర్గాల తరఫున సీఎం జగన్‌కు కానుకలు
  • చిరునవ్వులతో స్వీకరించి.. ఫొటోలు దిగిన సీఎం జగన్‌


 

కోడుమూరులో అశేష ప్రజాభిమానం

  • కోడుమూరు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • దారిపొడవునా బారులు తీరిన గ్రామస్తులు
  • బస్సు పైకి ఎక్కి ప్రజాభివందనం చేస్తున్న సీఎం జగన్‌
  • భారీ గజమాలతో స్వాగతం పలికిన కోడుమూరు గ్రామస్తులు


 

మేమంతా సిద్ధంకు ప్రజల బ్రహ్మరథం

  • మూడో రోజు కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • దారిపొడవునా జై జగన్‌ నినాదాలు
  • సీఎం జగన్‌ యాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
  • బస్సు దిగి ప్రజలను పలకరిస్తున్న సీఎం జగన్‌

పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • మూడో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం
  • పెంచికలపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • పెంచికలపాడు శిబిరం వద్ద భారీగా గూడిన జనం
  • ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్‌
  • సీఎం జగన్‌ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎం‌ఏ హఫీజ్ ఖాన్, డా.జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు 

జననేతకు స్వాగతం కోసం

  • జగనన్నను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు మేమంతా సిద్ధం అంటున్న కోడుమూరు ప్రజలు
  • కోడుమూరులో సీఎం జగన్‌ రాక కోసం ఉదయం నుంచే ఎదురుచూస్తున్న అభిమాన గణం

  • మరికాసేపట్లో కోడుమూరు నియోజక వర్గం పెంచికాల పాడు నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం 
  • మేమంతా సిద్దం అంటూ సీఎం జగన్‌ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలు


కాసేపట్లో కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్న  సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

కర్నూలు జిల్లా సిద్ధమా.. అంటూ ట్వీట్‌ చేసిన సీఎం జగన్‌


నేడు కర్నూల్‌ జిల్లాలో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం

  • మూడో రోజుకి చేరిన మేమంతా సిద్ధం యాత్ర 
  • కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో కొనసాగనున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బస్సు యాత్ర
  • మధ్యాహ్నాం రాళ్ల దొడ్డి వద్ద హాల్టింగ్‌.. భోజన విరామం
  • సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ
  • నిన్న నంద్యాల జిల్లాలో కొనసాగిన యాత్ర
  • నంద్యాల పార్లమెంట్‌ స్థానం పరిధిలో మేమంతా సిద్ధం బహిరంగ సభ సూపర్‌ సక్సెస్‌ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌

జన సంద్రంగా మారిన నంద్యాలలో జగనన్న.. క్లిక్‌ చేయండి

ఇది కదా అభిమానం అంటే..


సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు ఉదయం 6 గంటలకే  పర్లకు చెందిన చిన్న మద్దిలేటి అనే దివ్యాంగుడు అక్కడికి చేరుకున్నారు


మేమంతా సిద్ధం - 3వ రోజు ముందుకు ఇలా.. 

  • మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభం
  • పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి  చేరుకోనున్న సీఎం జగన్‌
  • రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం
  • కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని  వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్న సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార రథం 
  • సాయంత్రం బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం
  • సభ ముగిశాక.. తిరిగి ప్రారంభం కానున్న బస్సు యాత్ర 
  • అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి మీదుగా పత్తికొండ బైపాస్ చేరిక 
  • స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో విడిది ఏర్పాటు.. సీఎం జగన్‌ రాత్రికి అక్కడే బస

ఇదీ చదవండి: ప్రభం‘జనం’.. సీఎం జగన్‌ బస్సు యాత్రకు నీరాజనాలు

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్‌

  • వైఎస్సార్‌సీపీ ‘మేమంతా సిద్ధం’ పేరిట రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో సీఎం జగన్‌
  • అడుగడుగునా సాదర స్వాగతం పలుకుతున్న ప్రజలు, పార్టీ శ్రేణులు
  • అభిమానానికి సీఎం జగన్‌ ఫిదా

  • మొన్న ప్రొద్దుటూరు, నిన్న నంద్యాల బహిరంగ సభకు పోటెత్తిన జన సంద్రం
  • సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్‌ ఓనర్‌ 
  • సోషల్‌ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం 
  • పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు  
  • 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం 
  • 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? 
  • ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్లెదుటే కన్పిస్తోంది 
  • పిల్లల భవిష్యత్‌కు దారి చూపాం.. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం
  • సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం 
  • రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం 
  • ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందాం 
  • చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం అంటూ నంద్యాల ఓటర్లకు పిలుపు ఇచ్చిన సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement