Tirupati District
-
స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
అక్క కళ్లలో ఆనందం కోసం అత్తను హత్య చేసిన తమ్ముడు
-
మీరు కొత్త యూనిట్ పెడితే మాకేంటి?
సాక్షి, టాస్క్ పోర్సు: ‘మీరు కొత్త యూనిట్లు పెడితే మాకేంటి ఉపయోగం...? స్థానికంగా ఉన్న మా నేతలకు ఏమిటి ప్రయోజనం..?’ అంటూ తిరుపతి జిల్లాకు చెందిన అధికార కూటమి ప్రజాప్రతినిధి ఒకరు ప్రముఖ కంపెనీ ప్రతినిధులను నిలదీయడంతో వారు కంగుతిన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెక్స్ బూట్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. సుమారు 1,800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ కంపెనీ సూళ్లూరుపేటలోని అపాచీకి అనుబంధంగా ఉంది. కంపెనీ పనితీరు బాగుండటంతో యాజమాన్యం అక్కడే రెండవ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కిందట ‘తుడా’ వద్ద అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. పనులన్నీ పూర్తి చేసుకుని శుక్రవారం కొత్త యూనిట్‌ను ప్రారంభించేందుకు కంపెనీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి... పరిశ్రమ యాజమాన్యం నుంచి తనుకు ఎలాంటి పిలుపు రాలేదని ఆగ్రహించారు. ఆ పంచాయతీ సర్పంచ్‌తోపాటు స్థానిక అధికార పార్టీ నాయకులను కంపెనీ వద్దకు పంపి నానాయాగీ చేయించారు. పంచాయతీ అనుమతులు లేకుండా పరిశ్రమను ఎలా ప్రారంభిస్తారని వాగ్వాదానికి దిగారు. అలాగే పరిశ్రమలో పనిచేసే వారిని బయటకు వెళ్లాలని రచ్చరచ్చ చేశారు. దీంతో కంపెనీ హెచ్ఆర్ శరవణ్ వారికి నచ్చ చెప్పి తమకు తుడా అనుమతులు ఉన్నాయని, ఒక రోజు సమయం ఇస్తే వాటిని తీసుకువచ్చి పంచాయతీకి అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత యూనిట్‌ను ప్రారంభించుకున్నారు. మీరు పని చేసుకుంటూ వెళితే స్థానిక నాయకుల పరిస్థితి ఏమిటి? అనంతరం అపెక్స్ బూట్ల కంపెనీ ప్రతినిధులు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి వెళ్లి సర్పంచ్, స్థానిక నాయకులు చేసిన గొడవ గురించి వివరించారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి స్పందిస్తూ... ‘కంపెనీ పెట్టి మీరు పనులు చేసుకుంటూ పోతే స్థానికంగా ఉండే నాయకుల పరిస్థితి ఏమిటీ..?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో కంపెనీ ప్రతినిధులు అవాక్కయ్యారు. విదేశాలకు చెందిన కంపెనీ కావడంతో తాము ఏమి చేయగలమని వారు చెప్పడంతో సదరు ప్రజాప్రతినిధి గట్టిగానే స్పందించినట్లు తెలిసింది. -
ప్రోబా-3 రెడీ.. పీఎస్ఎల్వీ సీ-59 కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, తిరుపతి జిల్లా: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అంతర్భాగమైన న్యూస్పెస్ ఇండియా వాణిజ్యపరంగా యూరోపియన్ స్పెస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా–3 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ-59కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.సతీష్‌ధవన్ స్పెస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ అథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగ సమయాన్ని ప్రకటించారు. ప్రయోగానికి 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగం నిర్వహిస్తారు. -
శ్రీపద్మావతి అమ్మవారికి కాలినడకన సారె సమర్పించిన చెవిరెడ్డి దంపతులు
-
Fengal Cyclone: తీరం దాటిన ఫెంగల్ తుఫాన్
-
ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు!
తిరుపతి క్రైమ్: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ
-
ఆర్టీసీ బస్సులో విషాదం
-
తిరుపతి జిల్లాలో మహా దీపోత్సవం (ఫొటోలు)
-
56 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత
సత్యవేడు: తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విషజ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం ఆస్పత్రిలో చేరారు. సత్యవేడులోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఐదుగురు విద్యార్థులకు జ్వరం వచ్చింది. గురువారం మరో 51 మంది జ్వరాల బారిన పడ్డారు.దీంతో వారిని సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలలో చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనానికి వెళ్లినపుడు వర్షాల్లో తడవడం, రెండు రోజుల క్రితం జ్వరం వచ్చిన వారు అందరితో కలసి ఉండడం వల్ల మిగిలిన వారికి కూడా విష జ్వరాలు సోకాయని వైద్యులు చెబుతున్నారు. జ్వర పీడిత విద్యార్థులను వేరుగా మరో గదిలో ఉంచాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యశాల నిండిపోయింది. -
Watch Live: జిల్లాల అధ్యక్షునిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
-
చిన్నారిని చిదిమేసిన కామాంధుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి హత్య ఘటన మరువక ముందే తిరుపతి జిల్లా వడమాలపేటలో మరో దారుణం జరిగింది. ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై ఓ కామాంధుడు అతికిరాతకంగా లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేశాడు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా కేవీబీ పురం ఓళ్లూరు గిరిజన కాలనీకి చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం పది రోజుల క్రితం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీకి వచ్చారు. చిన్నారి మేనమామకు కాలు విరగడంతో ఆ బాలిక తండ్రి, కుటుంబీకులు సమీపంలోని పుత్తూరు రాచపాలెంలో శల్య వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తల్లితో ఉంది. చిన్నారికి వరుసకు మేనమామ అయిన ఏఎం పురానికి చెందిన సుశాంత్ ఆ బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని అంగడికి తీసుకెళ్లాడు. దుకాణం నుంచి చిన్నారిని పక్కనే ఉన్న సచివాలయం, పాఠశాల మధ్యలోకి తీసుకెళ్లి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కకుండా చిన్నారిని పక్కనే ఉన్న మురికి కాలువలో తొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. మృతదేహం పైకి కనిపించకుండా కాలువలోనే పూడ్చిపెట్టాడు. శరీరానికి బురద అంటుకోవడంతో పక్కనే స్నానం చేసి తిరిగి వచ్చాడు. సాయంత్రం వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ కనిపించలేదు. ఈలోపు సుశాంత్ అక్కడికి రావడంతో పాప ఎక్కడ అని ప్రశ్నించింది. చాక్లెట్ ఇచ్చాక పాపను ఇంటి వద్దే వదలేశానని, నాకు తెలియదు అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు. గట్టిగా నిలదీయడంతో సుశాంత్ తప్పించుకునేందుకు పరుగులు పెట్టాడు. కాలనీ వాసులు సుశాంత్‌ని పట్టుకుని గట్టిగా నిలదీశారు. ఎంతకూ సమాధానం చెప్పకపోవడంతో శుక్రవారం రాత్రి చిన్నారి తల్లి, బంధువులు కలిసి అతన్ని వడమాలపేట పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. అప్పటికే అతను మద్యం, గంజాయి మత్తులో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా చిన్నారి అచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు రాత్రంతా టార్చిలైట్ల వెలుతురులో పరిసర ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సుశాంత్ దారుణాన్ని ఒప్పుకున్నాడు. అతను చెప్పిన వివరాలతో శనివారం వేకువజామున మురికి కాలువలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, ఓళ్లూరు, ఏఎం పురం గిరిజన కాలనీల వారంతా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
చంపేస్తా!.. జర్నలిస్టులకు టీడీపీ ఎమ్మెల్యే భార్య బెదిరింపులు
సాక్షి, తిరుపతి జిల్లా: ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ "చంద్రగిరి రాజకీయం" గ్రూప్‌ను డిలీట్ చేయాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ సుబ్బరామిరెడ్డికి పాత్రికేయులు ఫిర్యాదు చేశారు."చంద్రగిరి రాజకీయం" వాట్సాప్ గ్రూప్‌లో ఎమ్మెల్యే నానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఈ నెల 13న సుధారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్మిన్లుగా ఉన్న వారిని ఐదుగురు జర్నలిస్టులపై ఆమె కేసు పెట్టారు. మెసేజ్‌లు పెట్టిన వారిని వదిలివేసి, తమపై కేసులు పెట్టడం ఏంటీ? అంటూ బాధిత జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.ఇదీ చదవండి: తిరుపతిలో మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక? -
అమెరికాలో రోడ్డు ప్రమాదం
రేణిగుంట/ఓజిలి: అమెరికాలోని రాండాల్ఫ్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతిచెందిన వారిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, మరో మహిళ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్య. కేవీబీపురం మండలం అంజూరుపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్న తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన డేగపూడి భాస్కర్‌రెడ్డి, లత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమార్తె హరిత (30)కు కేవీబీ పురం మండలం కాళంగి ఆదరం గ్రామానికి చెందిన సాయి (32) అనే వ్యక్తితో 2022లో వివాహం జరిగింది. సాయికి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అతనితోపాటు ఆమె కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ కంపెనీలో తనకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమెకు ఉద్యోగ అవకాశం వచ్చి మరో వారం రోజుల్లో ఉద్యోగంలో చేరనుంది.తొట్టంబేడు మండలం పెద్దకనపర్తికి చెందిన న్యాయవాది రమే‹Ùబాబు కుమారుడు శివ (29) సాయికి స్నేహితుడు. ఇతను కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినర్. ఓజిలి మండలం రాజపాళెం గ్రామానికి చెందిన తిరుమూరు రవి, సుదర్శనమ్మ దంపతుల కుమారుడు తిరుమూరు గోపి (30) కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇతను కూడా సాయికి స్నేహితుడు. సోమవారం సాయంత్రం సాయి, అతని భార్య హరిత, స్నేహితులు శివ, గోపి కలిసి కారులో వెళుతుండగా మరో కారు వీరి కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హరిత, శివ, గోపి మృతి చెందగా.. సాయి తీవ్రంగా గాయపడ్డాడు.అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్ మాట్లాడారే..మృతిచెందిన వారు ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రే తల్లిదండ్రులతో మాట్లాడారు. ‘అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్లో నవ్వుతూ మాట్లాడారే. కబుర్లెన్నో చెప్పారే. రోజులో ఒక్కసారైనా మాతో మాట్లాడకుండా ఉండే వారు కాదు.. దేవుడా మా బిడ్డలను తీసుకుపోయావే... మేము ఇంకెట్టా బతికేది’ అంటూ గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. హరిత, శివ మృతదేహాలు ఆదివారానికి స్వగ్రామాలకు రానున్నాయి. కాగా అమెరికాలో జరిగిన ప్రమాదం ఒకే మండలానికి చెందిన ఇద్దరిని పొట్టనపెట్టుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. -
బాలికపై అత్యాచార యత్నం
శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సంత మైదానం వద్ద శనివారం ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన గుర్తుతెలియని యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. సంతమైదానం సమీప ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని యువకుడు స్కూటర్ పై తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అటుగా వెళ్తున్న సుబ్బలక్ష్మి అనే యువతి అతని వాలకంపై అనుమానంతో గమనించింది. ఆపై విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో స్థానికులు మిద్దెపైకి వెళ్లి బాలికపై అఘాయిత్యం చేయబోతున్న యువకుడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. -
అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు..
తడ : వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. అందరూ చూస్తుండగానే సహోద్యోగిని కత్తెరతో విచక్షణ రహితంగా పొడిచేశాడు. తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు ప్రభుత్వ పారిశ్రామిక వాడలోని అపాచీ బూట్ల పరిశ్రమల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు.. చిట్టమూరు మండలం కుమ్మరిపాళేనికి చెందిన వెంకటాద్రి.. అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు వనజ(28)ను ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, బురదగాలి గ్రామానికి చెందిన మీజూరు సురేష్(23) కుమ్మరిపాళేనికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అపాచీలో పనికి వెళ్తున్నాడు. కొంత కాలంగా వనజను వేధించడం మొదలెట్టాడు. ఈ విషయంపై 2019, 2021లో చిట్టుమూరు పోలీస్ట్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనానికి వెళ్లిన వనజను అక్కడ మళ్లీ వేధించాడు. దీంతో ఆమె సురేష్‌ను తీవ్రంగా మందలించింది. ఆవేశానికి గురైన సురేష్ అక్కడే ఉన్న కత్తెర తీసుకుని వనజ మెడ, శరీరంపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వనజ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ కొండపనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన బాలుడు శవమై తేలాడు
చిల్లకూరు: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో సోమవారం కిడ్నాపైన బాలుడు లాసిక్ (12)... మంగళవారం సాయంత్రం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పుటేరులో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వరగలిలోని కాతారి రమేష్, సంధ్య దంపతుల కుమారుడు లాసిక్ వాకాడులోని గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే దుకాణంలో ఉండగా, అక్కడకు వచ్చిన చిత్తు కాగితాలు ఏరుకునే ముగ్గురు గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని ఉప్పుటేరు (కండలేరు క్రీక్)కు ఆవలి వైపున ఉన్న సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాళెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు మంగళవారం సాయంత్రం అక్కడి వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్లపై అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, అదుపులో ఉన్న గిరిజనుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, మత్తు మందు ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని.. బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని తెలుస్తోంది. -
ఆగని టీడీపీ దౌర్జన్యాలు
-
రెండు గ్రామాల మధ్య రోడ్డు తవ్వేశారు
చిల్లకూరు : రెండు గ్రామాల మధ్య ప్రభుత్వ భూమిలో ఉన్న రోడ్డును టీడీపీ నేతలు తవ్వేయడంతో తీర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టు సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టు పనులు చేసే వారి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణం. తీర ప్రాంతంలోని వరగలి ప్రాంతంలో వెంకటాచలం మండలం నారికేళ్లపల్లి నుంచి వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న జాతీయ రహదారి నుంచి పల్లెవానిదిబ్బ వరకు మరో కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు.అయితే ప్రభుత్వం మారాక స్థానిక టీడీపీ నాయకులు వరగలి ప్రాంతంలో పనులు చేసే కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సబ్ కాంట్రాక్టు కింద మట్టి, గ్రావెల్ తవ్వి తరలించే పనులు చేస్తున్నారు. ఈ పనుల కోసం వరగలి – మన్నెగుంట గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంది. అయితే ఇదే మార్గంలో మరో కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలు పల్లెవానిదిబ్బ వరకూ వెళ్లాల్సి ఉంది. ఆ పనులు కూడా తమకే అప్పగించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో వారు అందుకు ఒప్పుకోలేదు.దీంతో టీడీపీ నాయకులు ఆ సంస్థకు చెందిన వాహనాలు చుట్టూ తిరిగి వచ్చేలా మన్నేగుంట – వరగలి మధ్యలో ఉన్న రోడ్డును తవ్వేశారు. ప్రభుత్వ భూమిలోని ఈ రోడ్డుపై ఎన్నో ఏళ్లుగా రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. దానిని తవ్వేయడంతో చుట్టూ తిరిగి మూడు కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానిక వీఆర్వో మునిబాబును వివరణ కోరగా సాగరమాల రహదారి పనుల్లో ఇంజినీరింగ్ అధికారుల ఆదేశాల మేరకు పనులు చేస్తున్నారని అన్నారు. -
మారణాయుధాలతో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం..
-
నమ్మించి.. మత్తులో ముంచి.. బ్లాక్ మెయిల్
-
తిరుపతి పద్మావతి నగర్లో విషాదం..
-
తిరుపతి జిల్లా గూడూరులో దారుణం
-
గురుకుల విద్యార్థులకు కలుషిత ఆహారం
నాయుడుపేట టౌన్ (తిరుపతి జిల్లా)/చిల్లకూరు(తిరుపతి జిల్లా): నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 139 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వీరిని నాయుడుపేట గురుకులం, సామాజిక వైద్య కేంద్రం, సూళ్లూరుపేట సామాజిక వైద్య కేంద్రంలో, గూడూరు ఏరియా వైద్యశాలకి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కలుషిత ఆహారం వల్లే..కలుషిత ఆహారం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. శనివారం వండిన పూరీలతో పాటు బంగాళాదుంపల కుర్మా ఆదివారం ఉదయం విద్యార్థులకు వడ్డించారు. అదేవిధంగా నిల్వచేసిన కోడి మాంసం ఆదివారం ఉదయం వండి మధ్యాహ్నం, మిగిలినది రాత్రి కూడా వడ్డించారు. దీనితోనే ఆదివారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయని చెప్పారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రిన్సిపాల్ దాదాపీర్, వార్డెన్ విజయభాస్కర్ గోప్యంగా ఉంచారు. రాత్రి పరిస్థితి విషమించి విద్యార్థులకు వాంతులు, విరోచనాలు తీవ్రస్థాయిలో మొదలవడంతో సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్ర తదితర అధికారులు గురుకులం వద్దే ఉండి విద్యార్థులకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ సోమవారం ఉదయం నాయుడుపేటకు చేరుకుని విద్యార్థులకు సత్వరం వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంఅండ్ హెచ్ఓ శ్రీహరి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పద్మజ, సూళ్లూరుపేట ఆర్డీవో చంద్రముని, నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వైద్య సేవలను పర్యవేక్షించారు.ప్రిన్సిపాల్, వార్డెన్‌తో పాటు మరో ఇద్దరిపై చర్యలువిద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ దాదాపీర్‌తో పాటు వార్డెన్ విజయభాస్కర్‌రెడ్డి, శానిటేషన్ అధికారి, స్టాఫ్‌నర్సులపై చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయమై జేసీతో కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ చంద్రకళ బాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గురుకులంలోని విద్యార్ధుల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌తో పాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం తదితరులు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు.తల్లిదండ్రుల్లో ఆందోళన నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకుని తమ పిల్లలను చూసి ఆందోళన చెందారు. గురుకుల అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు కూడా నాయుడుపేట సీహెచ్‌సీ వైద్యులతో పాటు అర్బన్ వైద్యశాలల వైద్యులు, దొరవారిసత్రం ప్రభుత్వ వైద్యులు విద్యార్థులకు చికిత్సలు అందించారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున పడుకోబెట్టి వైద్య సేవలను అందించారు. బాధ్యులపై కఠిన చర్యలువిద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. నాయుడుపేటలోని గురుకులంలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం గురుకులాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీతో కలిసి పరిశీలించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సీఎంకు నివేదించారని తెలిపారు. మూడురోజులు గురుకులానికి సెలవులు ప్రకటించామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో మెరుగైన వసతుల కల్పనకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అలాగే గూడూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఆహారం కలుషితమైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.