పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు | Man Who Cheated Woman Over Love And Marriage At Chittoor district | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

Published Wed, Apr 27 2022 11:51 AM | Last Updated on Wed, Apr 27 2022 11:53 AM

Man Who Cheated Woman Over Love And Marriage At Chittoor district - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రామకుప్పం(చిత్తూరు) : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్‌ తెలిపారు.  మండలంలోని విజలాపురానికి చెందిన యువతి(26)ని పెళ్లి చేసుకుంటానని అదే గ్రామానికి చెందిన నారాయణస్వామిరెడ్డి (57) నమ్మించాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. తీరా ఆ యువతి గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు.

ఈ క్రమంలో నిలదీసిన యువతిని నారాయణస్వామిరెడ్డి అతడి కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు  నారాయణస్వామిరెడ్డి అతని కుటుంబసభ్యులు మహేశ్వరరెడ్డి, నళిని, గీతమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కే సు నమోదు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఫోన్‌ మాట్లాడేందుకు సెల్‌ తీశాడని.. దాడి చేసిన కానిస్టేబుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement