chitoor district
-
పొలిటికల్ కారిడార్ : చిత్తూరు జిల్లా టీడీపీలో వణుకు
-
పెళ్లి పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
రామకుప్పం(చిత్తూరు) : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. మండలంలోని విజలాపురానికి చెందిన యువతి(26)ని పెళ్లి చేసుకుంటానని అదే గ్రామానికి చెందిన నారాయణస్వామిరెడ్డి (57) నమ్మించాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. తీరా ఆ యువతి గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు. ఈ క్రమంలో నిలదీసిన యువతిని నారాయణస్వామిరెడ్డి అతడి కుటుంబసభ్యులు కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నారాయణస్వామిరెడ్డి అతని కుటుంబసభ్యులు మహేశ్వరరెడ్డి, నళిని, గీతమ్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కే సు నమోదు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఫోన్ మాట్లాడేందుకు సెల్ తీశాడని.. దాడి చేసిన కానిస్టేబుల్ -
గ్రామీణ క్రీడా సంబరాల్లో ఎమ్మెల్యే రోజా సందడి
-
శ్రీసిటీకి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు శ్రీసిటీని వరించాయి. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందుకు సీఐఐ (భారత పారిశ్రామిక సమాఖ్య) రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు శ్రీసిటీని ఎంపిక చేసింది. శ్రీసిటీ చేపడుతున్న నీటి సుస్థిరత, అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఆగస్టు 28న సీఐఐ నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను శ్రీసిటీ యాజమాన్యం అందుకోనుంది. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇది నిజంగా తాము గర్వించదగ్గ గుర్తింపుగా వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్‌గా నీటి వనరులను సంరక్షించడానికి, నీటి నిల్వలు పెంచడానికి శ్రీసిటీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అవార్డులు తమ సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వారి భవిష్యత్ ప్రయత్నాలకు మంచి ప్రేరణ ఇస్తాయన్నారు. -
'నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతుంది..'
సాక్షి, అమరావతి: సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, తన అనూనయులతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించిన చంద్రబాబు రైతు ద్రోహి అని, అలాంటి వ్యక్తి చిత్తూరు గడ్డపై పుట్టడం ఆ జిల్లా వాసుల దురదృష్టమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. గతంలో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై ప్రసాద్ నాయుడు అనే తన అనుకూలస్తుని చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు సీమ ఎత్తిపోతల పథకంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిత్తూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. అప్పట్లో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంను ప్రసాద్ నాయుడు చేత కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడేమో సీమ ఎత్తిపోతల పథకంతో పాటు జగన్ గారు మొదలు పెట్టిన చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించాడు రైతు ద్రోహి. — Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2021 రైతులు చల్లగా ఉంటే ఓర్వలేని చంద్రబాబు.. సొంత జిల్లా ప్రాజెక్ట్‌లపైనే స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించాడని ఆరోపించారు. తనకు రాజకీయ బిక్షపెట్టిన సొంత గడ్డకు మేలు చేయాల్సింది పోయి, సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, ఆ ప్రాంత రైతుల కడుపు కొడుతున్న రైతు ద్రోహి చంద్రబాబు అని విమర్శించాడు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం.. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలోని 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించిన చంద్రబాబును చూసి నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోందని పేర్కొన్నారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్లు పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోంది బాబూ!— Vijayasai Reddy V (@VSReddy_MP) July 6, 2021 -
చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ టీడీపీ నేత ఎన్జీటీకి ఫిర్యాదు
-
‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తమకు ఆయుధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోవిడ్ తీవ్రత వల్లే ఈనెల 14న సీఎం వైఎస్ జగన్ సభ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ‘‘తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నాం. మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. బీజేపీకి ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు లేదని.. విభజన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ నేతలు ఎలా ఓట్లు అడుగుతారంటూ మంత్రి ప్రశ్నించారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్మూధైర్యం ఎప్పుడూ లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో పోరాడలేదని ఆయన మండిపడ్డారు. ‘‘రైతు సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. సీఎం జగన్ పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాల ఫలాలు చేరుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగుతోంది. రాయలసీమ కోసం వేలకోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాం. యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు. ప్రత్యేక హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే. వైఎస్సార్సీపీపై బీజేపీ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని’’ మంత్రి పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. చదవండి: కూన తీరు మారదు.. పరుగు ఆగదు! టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి.. -
పెళ్లి రద్దు.. అమెరికాలో ఏపీ యువతి ఆత్మహత్య
చిత్తూరు: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. తన పెళ్లి అకస్మాత్తుగా రద్దవడంతో ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి జరగాల్సిన రోజే ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్‌లో జరిగింది. ఆమె మరణంతో ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం అలుముకుంది. రెండు రోజుల్లో ఆమె మృతదేహం స్వదేశానికి రానుంది. అయితే పెళ్లి ఎందుకు రద్దయ్యింది? దానికి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియరాలేదు. చిత్తూరుకు చెందిన ప్రసాద్ నాయుడు కుమార్తె సుష్మ అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండేది. ఆమెకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన భరత్‌తో వివాహం నిశ్చయమైంది. మార్చి 4వ తేదీకి ముహూర్తం నిర్ణయించారు. అయితే భరత్ కుటుంబీకులు వివాహానికి ససేమిరా అన్నాడు. దీంతో వివాహం రద్దయ్యింది. అకస్మాత్తుగా పెళ్లి రద్దు కావడంతో సుష్మ మూడు రోజులుగా తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలో అదే బాధతో డల్లాస్‌లోని తన నివాసంలో సుష్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారంతో చిత్తూరులో ఉన్న కుటుంబసభ్యులు దిగ్ర్భాంతికి గురయ్యారు. సుష్మ మృతితో కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే సుష్మ మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామానికి చేరే అవకాశం ఉంది. వివాహం రద్దు చేసుకున్న భరత్ కుటుంబసభ్యులపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పాత కక్షలు: రౌడీ షీటర్ దారుణ హత్య
సాక్షి,చిత్తూరు: తిరుపతిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. నగరంలోని ఐఎస్ మహల్ వద్ద ఆదివారం రాత్రి రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని గిరిపురానికి చెందిన దినేష్(35) ట్యాక్సీ నడుపుతూ జీవన సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఐఎస్ మహల్ సమీపంలోని హారిక బార్ వద్ద గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అర్భన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అతనిపై వెస్ట్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదై ఉంది. బెల్టు మురళి హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడని, పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని తెలిపారు. నిందితులను త్వరగా పట్టుకొవాలని వెస్ట్ సీఐ శివప్రసాద్‌ను ఆదేశించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కన్యా మాసం హస్త నక్షత్రంలో శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆలయంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. (పెద్దశేష వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు) అంకురార్పణ విశిష్టత.. వైఖానసం ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. (డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు: వైవీ సుబ్బారెడ్డి) అంకురార్పణ క్రమం.. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. (చరిత్రలో తొలిసారి.. బ్రహ్మోత్సవం ఏకాంతం..) ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవోహరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కలాం ఆశయాలకు కార్యరూపం
రైతు భరోసా కేంద్రాల వల్ల భవిష్యత్‌లో అద్భుతాలు చూస్తాం.. సాక్షి ప్రతినిధి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్: ‘రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా తెలిసింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఆశయాలకు కార్యరూపంగా అద్భుతమైన ప్రణాళికతో ఆర్బీకే వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. కలామ్ ఆలోచనల మేరకు పట్టణ ప్రాంతాల్లోని సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు చేరువ అయ్యేలా వీటిలో ఏర్పాట్లు చేశార’ని తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ క్యాంపస్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత జి.కృష్ణారెడ్డి చెప్పారు. ఆర్బీకేల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని సి.రామాపురం, పూతలపట్టు మండలం వావిల్‌తోట, గంగాధర నెల్లూరు మండలం వేల్కూరు, చిత్తూరు మండలం బీఎన్ఆర్ పేట గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అక్కడి ఆర్బీకేలలో గుర్తించిన విషయాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. వ్యవసాయ రంగానికి మంచి ప్రోత్సాహం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రోత్సాహం అందించారు. సేంద్రియ విధానంతో కూరగాయలను సాగు చేస్తున్నాం. సకాలంలో సూచనలు, సలహాలు ఇచ్చేవారు లేక ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. – రాగమ్మ, మహిళా రైతు, కుప్పం బాదూరు, ఆర్సీ పురం మండలం ఏం కావాలన్నా చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది పంటల సాగుకు ఏం కావాలన్నా 15 కిలోమీటర్ల దూరంలోఉన్న చిత్తూరు వెళ్లాల్సి వచ్చేది. అధిక ధరల భారంతో పాటు, రవాణా ఖర్చు కూడా ఎక్కువ అయ్యేవి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని గ్రామంలోనే పొందే వెసులుబాటు కలిగింది. – టి.గోవిందయ్య, రైతు, వేల్కూరు, గంగాధర నెల్లూరు మండలం రైతుల ఇంటికే విత్తనాలు సి.రామాపురం ఆర్బీకేని పరిశీలించేందుకు వెళ్లగా.. రామ్మోహన్ అనే రైతు కనిపించారు. ఆయన్ని కదిలించగా ‘మండల కేంద్రానికి వెళ్లి విత్తనాలు తెచ్చుకునేవాళ్లం. గంటల తరబడి నిరీక్షించినా విత్తనాలు దొరికేవి కాదు. అనవసర ఖర్చు పెరిగేది. ఇప్పుడవేవీ లేకుండా ఆర్బీకే ద్వారా విత్తనాలు ఇంటికే వచ్చాయి’ అని చెప్పారు. వేల్కూరు ఆర్బీకేలో ఏకాంబరం అనే రైతును పలకరించగా.. పశువులకు చిన్నపాటి వైద్యం కోసం కూడా ఐదారు కిలోమీటర్లు తీసుకెళ్లాల్సి వచ్చేదని, రోజంతా దానికే సరిపోయేదని చెప్పారు. ఇప్పుడు అవసరమైతే పశు వైద్యుడే వచ్చి వైద్యం చేసేలా సౌకర్యాలు కల్పించారని చెప్పారు. భూసార పరీక్షలు నిర్వహించడం, సేంద్రియ కషాయాలు ఉండడం, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ల ద్వారా పంటల సాగుకు సూచనలు, సలహాలు ఇవ్వడం, వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి రానున్న విధానాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను. ఉత్పత్తుల వివరాలన్నీ కియోస్క్‌లో ఇస్తే మరింత మేలు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తుల వివరాలు, వాటి ధరలను కూడా పొందుపరిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఉదాహరణకు కుప్పం, పలమనేరు మార్కెట్లలో ప్రతి వారం రూ.కోటి విలువైన మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతాయి. కియోస్క్‌లో గొర్రెల పెంపకందారుల వివరాలు, వారి వద్ద ఉన్న జీవాల వివరాలు, ధరలను పొందుపరిస్తే.. వ్యాపారి నేరుగా వెళ్లి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల దళారీ వ్యవస్థను సంపూర్ణంగా నిరోధించవచ్చు. -
కొందరి నిర్లక్ష్యం.. ఉద్యోగులకు శాపం
కొందరి నిర్లక్ష్యం కరోనా విధుల్లో పాల్గొంటున్న అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు శాపంగా మారింది. కరోనా లక్షణాలున్న వారు సరైన సమయంలో పరీక్షలు చేయించుకోకపోవడం, లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడంతో ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్న అధికారులనూ కరోనా మహమ్మారి కబళిస్తోంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలందరూ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. సాక్షి, తిరుపతి : జిల్లాలో లండన్ నుంచి వచ్చిన శ్రీకాళహస్తి యువకుడికి తొలిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ యువకుడు కరోనా వైరస్‌ను ముందే గుర్తించి తనకుతానుగా ఆస్పత్రిలో చేరిపోవడం, కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కి వెళ్లడంతో వారి నుంచి ఎవ్వరికీ వైరస్ సోకలేదు. అయితే ఢిల్లీలోని మర్కత్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి జిల్లాలో కల్లోలం మొదలైంది. తిరుపతికి చెందిన యువకుడి నుంచి మొదలైన కరోనా కల్లోలం ఇప్పటికీ ఆగలేదు. ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో ఆ యువకుడితో మొదలై వారి కుటుంబ సభ్యులకు, వారి ద్వారా ఇద్దరికి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నమోదైంది. (ఎండలో ఎలా వెళ్తావు తల్లీ..) ఆది, సోమవారాల్లోనే 25 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. ఒక్క శ్రీకాళహస్తిలోనే 24, చంద్రగిరి మండలం రంగంపేటలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 53 కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు పాజిటివ్ రోగులు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 49 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఫలితంగా లాక్‌డౌన్‌ని ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లో లాక్ డౌన్‌ని పొడిగించింది. ముక్కంటి చెంత కరోనా కలకలం లండన్ నుంచి వచ్చిన యువకుడు చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉన్నా వెళ్లలేదు. కుటుంబ సభ్యులు కూడా వారి వివరాలను గోప్యంగా ఉంచారు. వారు ఇంట్లోనే ఉన్నా వైరస్ ఇంతగా వ్యాప్తి చెందేది కాదని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో కొందరు పట్టణంలో తిరగ టంతో పాటు సర్వేకు వచ్చిన అధికారులతో కలిసిపోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న అనుమానితులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా నిర్వాహకుల హెచ్చరికలను పెడచెవినపెట్టినట్లు సమాచారం. ఫలితంగా శ్రీకాళహస్తిలో వైరస్ వ్యాప్తికి కారకులయ్యారని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన 15 మంది ద్వారా కొందరు అధికారులకు ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని కలెక్టర్ భరత్‌నారాయణ గుప్త భావిస్తున్నారు. లాక్డౌన్ మరింత కఠినతరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన శ్రీకాళహస్తి, తిరుపతి, ఏర్పేడు, రేణిగుంట, నిండ్ర, పిచ్చాటూరు, నారాయణవనం, వడమాలపేట, పలమనేరు, గంగవరం, చంద్రగిరి మండలం రంగంపేటను రెడ్జోన్లుగా కలెక్టర్ ప్రక టించారు. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి సడలింపు ఇచ్చినా కరోనా కేసులు నమోదు కావటంతో రెడ్‌జోన్ ప్రాంతాల్లో పరిశ్రమలు తెరిచేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా రెండు రోజుల్లోనే శ్రీకాళహస్తిలో అత్యధిక కేసులు నమోదు కావటంతో వారు ఎవరెవరిని కలిశారనే వివరాల ద్వారా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. నివాసాల్లో ఉన్న వారిని, ఆ ప్రాంతంలో తిరుగుతున్న వారిని థర్మల్ స్కా నింగ్ చేస్తున్నారు. స్కానింగ్‌లో వ్యక్తు ల టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితే క్వారంటైన్‌కి తరలిస్తున్నారు. -
చిత్తూరులో పెరుగుతున్న కోవిడ్ బాధితులు
చిత్తూరు: జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 28కు చేరుకుంది. రెండు రోజుల్లో శ్రీకాళహస్తికి చెందిన ఐదుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారౖణెంది. శ్రీకాళహస్తిలో సర్వత్రా అప్రమత్తం శ్రీకాళహస్తిలో గురువారం ఒక్క రోజే ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్జోన్లను పెంచి ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి జనసంచారం లేకుండా చేశారు. కొత్తపేట, పీవీరోడ్డు, పాత బస్టాండు, నగాచిపాలెం, పూసలవీధి, హిమామ్వీధి, జానుల్లా వీధి, మరాఠిపాలెం, పెద్దమసీదు వీధి, జెండావీధి, గాండ్లవీధి ప్రాంతాలను కూడా రెడ్జోన్లుగా ప్రకటించారు. గురువారం పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. గత నెలలో ఢిల్లీ జమాజ్‌కు హాజరై వచ్చిన ఒకరికి, అతనితో కాంటాక్టుగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అదే బృందంలో మరో వ్యక్తి భార్యకు, ఆమె నుంచి మరో మహిళకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చి న వారిని ఐసోలేషన్‌కు తరలించారు. వీరిలో నలుగురు క్వారంటైన్లో ఉండగా, ఒక్కరిని మాత్రం ఇంటి వద్ద నుంచి ఐసోలేషన్‌కు తరలించారు. వీరితో కలిసిన మొత్తం 50 మందికి శుక్రవారం రక్తనమూనాలు సేకరించి, వారిని వికృతమాలలోని క్వారంటైన్‌కు తరలించేందు కు ప్రయత్నించగా అంగీకరించలేదు. గతంలో క్వారంటైన్లో ఉండి వచ్చిన 29 మందిని కూడా మళ్లీ ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించేందుకు క్వారంటైన్‌కు తరలించేదుకు సన్నద్ధమవుతున్నారు. వరదయ్యపాళెం క్వారంటైన్లో ఉన్న వారిని కూడా ఏర్పేడు మండలంలోని వికృతమాల క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అందుబాటులోకి రుయా కోవిడ్ ల్యాబ్ తిరుపతి తుడా : జిల్లాలో కరోనా వైరస్‌ను సమూలంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నారాయణభరత్ గుప్త తెలిపారు. శుక్రవారం వైద్యాధికారులతో కలసి కలెక్టర్ రుయాలోని కోవిడ్ ల్యాబ్ ట్రయల్ రన్‌ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వైద్య పరీక్షల కోసం రుయాలో అత్యాధునిక ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. వికృతమాల గృహ సముదాయాన్ని క్వారంటైన్ సెంటర్‌కు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 300 పడకలతో క్వారంటైన్ ప్రారంభమైందన్నారు. ఇంకా 75 బ్లాకుల్లో 1,800 గృహాలు ఉన్నాయని తెలి పారు. క్వారంటైన్‌లోని బాధితులకు అన్ని వసతులు కలి్పస్తున్నామని చెప్పారు. జేసీ–2 చంద్రమౌళి, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, తుడా సెక్రటరీ లక్షి్మ, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్, సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వీ రమణయ్య పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రికి 5 ట్రూనాట్ మిషన్లు చిత్తూరు కార్పొరేషన్: జిల్లా ఆస్పత్రికి ఐదు ట్రూనాట్ మిషన్లు కేటాయించారు. వీటిని శుక్ర వారం డీసీహెచ్ఎస్ సరళమ్మ, జిల్లా క్షయ నివా రణాధికారి రమేష్‌బాబు ప్రారంభించారు. జిల్లాలో 17 ట్రూనాట్ మిషన్లు పెట్టామని, ఒక మిషన్ ద్వారా 20 స్వాబ్స్ పరీక్షలు చేయవచ్చ ని, గంటలో ఫలితాలు వస్తాయని తెలిపారు. 113 మందికి టెస్ట్‌లు పలమనేరు: పలమనేరు పట్టణంలో కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురితో పరిచయమున్న 113 మందిని గుర్తించి శుక్రవారం స్వాబ్ టెస్టులకు కోవిడ్ పరీక్ష నిర్ధారణ కేంద్రానికి తరలించినట్టు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. పట్టణానికి చెందిన ముగ్గురు పాజిటివ్‌తో తిరుపతిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సదుంలో 49 మంది.. సదుం: సదుం, సోమల మండలాల్లోని 49 మంది కోవిడ్–19 అనుమానితులకు సదుం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రక్త నమూనాలు సేకరించారు. సదుం మండలం చెరుకువారిపల్లె పీహెచ్సీ పరిధిలో 33 మందికి, సోమల పీహెచ్సీ పరిధిలోని 16 మంది నమూనాలు సేకరించినట్టు డాక్టరు భారతి తెలిపారు. -
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రోజా
-
కరోనా: తప్పుడు ప్రచారానికి ‘సంకెళ్లు’
కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం నానాపాట్లు పడుతుంటే కొందరు అరచేతిలో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తప్పుడు వార్తలను ప్రచారంలోకి తీసుకొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం కన్నెర్ర చేస్తోంది. ఇలాంటి నేరానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేసి, జైలుకు తరలించారు. చిత్తూరు అర్బన్: అరచేతిలో సెల్‌ఫోన్ ఉంది కదా అని వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా ఎవరో పంపిన మెనేజ్‌లను ఫార్వర్డ్ చేయడం వల్ల సమస్యలు తప్పవు. ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో అతని ఫొటో పెట్టడం, మరికొందరు ఓ కాలనీలో ఐదు పాజిటివ్ కేసులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేయడం కచ్చితంగా నేరం కిందకే వస్తుందని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వాళ్లపై ఐపీసీ సెక్షన్ 153, 188, 505, 269లతో పాటు ఐపీసీ సెక్షన్ 10 (2),(1) ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్–2005, సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలుశిక్ష పడుతుంది. కాణిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్‌గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి (56) తన ఫేస్బుక్, ట్విటర్ ఖాతాల్లో తప్పుడు పోస్టులు చేశాడు. వాట్సాప్ ద్వారా పలువురికి పంపాడు. కాణిపాకం ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. గత నెల పలమనేరులో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌కు కరోనా సోకిందంటూ ఫేస్బుక్, వాట్సప్‌లలో మెసేజ్ పెట్టినందుకు గంగవరానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. నమ్మొద్దు.. వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నింటినీ నమ్మొద్దు. ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాత నిజాన్ని నమ్మండి. అంతేతప్ప వచ్చిన మెసేజ్‌లను ఫార్వర్డ్ చేస్తూ వెళితే ఓ దశలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. – ఎస్.సెంథిల్‌కుమార్, ఎస్పీ, చిత్తూరు -
13 మంది తహసీల్దార్లకు కరోనా పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్: ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని 13 మంది తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం ఇటీవల అనంతపురం జిల్లాలో విధుల్లో ఉన్న ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని రెడ్జోన్ల పరిధిలో ఉన్న తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, నారాయణవనం, పలమనేరు తహసీల్దార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. హాట్‌స్పాట్స్ జాబితాలో జిల్లా చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన హాట్‌స్పాట్ ప్రాంతాల జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న జిల్లాలను హాట్‌స్పాట్‌గా గుర్తించిన కేంద్రం ఓ జాబితాను విడుదల చేసింది. జిల్లాలో 23 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ జాబితాలో చేర్చింది. తిరుపతి, రేణిగుంట, నగరి, పలమనేరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కు వగా పాటిజివ్ కేసులు రావడంతో వీటిని రెడ్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రాకపోకలపై పూర్తిగా నిషేధం. జిల్లా హాట్‌స్పాట్‌గా గుర్తించడం వల్ల మొదటి దశ లాక్డౌన్ అమలుపై అన్ని నియమ నిబంధనలు, షరతులు అలాగే వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. పాటిజివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యశాఖ సమాయత్తం అవుతోంది. కేవలం నిత్యావసర వస్తువుల రవాణా, అత్యవసర సేవలకు మాత్రమే వర్తిస్తుంది. నేటి నుంచి ట్రూనాట్లతో స్వాబ్స్ సేకరణ చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో గురువారం నుంచి ట్రూనాట్ మిషన్ల ద్వారా కరోనా స్వాబ్స్ సేకరణ ప్రారంభిస్తామని జిల్లా టీబీ కంట్రోలర్ రమేష్‌బాబు తెలిపారు. చిత్తూరులోని జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో 5, తిరుపతి రుయాలో 5, తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో 3, పలమనేరులో 2 , మదనపల్లెలో 2 చొప్పున ట్రూనాట్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఫలితాలు గంటలోనే తెలుస్తాయన్నారు. పాజిటివ్ వస్తే తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపి మరోసారి పరీక్షిస్తామన్నారు. నెగటివ్ వస్తే ఆ ఫలితాన్ని తీసుకుంటామన్నారు. ఒక మిషన్ ద్వారా రోజుకు 20 మందిని పరీక్ష చేయవచ్చని వివరించారు. ట్రూనాట్ యంత్రాలను పరిశీలిస్తున్న రమేష్ బాబు మదనపల్లెలో కరోనా నిర్ధారణ పరీక్షలు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో గురువారం నుంచి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా ఆస్పత్రిని రమేష్‌బాబు పరిశీలించారు జిల్లా ఆస్పత్రిలో అమర్చిన ట్రూనాట్ యంత్రాలను తనిఖీచేసి వాటి పనితీరును పరిశీలించారు. -
కరోనా: యువత..జాగ్రత్త!
కంటికి కనిపించని మహమ్మారి కరోనా. ఇది నేడు ప్రపంచాన్ని వణికిస్తోంది. జిల్లాలోనూ ఈ వ్యాధి ప్రబలింది. వ్యాధిగ్రస్తుల్లో అధిక శాతం మంది యువకులే. జిల్లాలో వాతావరణ స్థితి.. రోగుల్లో అధిక వ్యాధి నిరోధక శక్తి ఉండడంతో వీరు త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా యువత జులాయిగా బయట తిరగకుండా.. ఆరోగ్యం అశ్రద్ధ చేయకుండా ఇంటిపట్టునే ఉండి, కరోనా నుంచి రక్షణ పొందాల్సి ఉంది. చిత్తూరు: కరోనా అందరినీ కలవరపెడుతోంది. ముఖ్యంగా యువకులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జిల్లా అధికార యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు దశల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఆ సర్వేల్లో అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి క్వారంటైన్లకు పంపడం చేశారు. క్వారంటైన్లలో ఉన్న వారందరికీ రక్తపరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లకు పంపారు. జిల్లా వ్యాప్తంగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో శ్రీకాళహస్తికి చెందిన మొదటి కరోనా కేసు వ్యక్తికి నెగిటివ్ రావడంతో ప్రస్తుతం 22 మంది పాజిటివ్‌గా ఉన్నారు. 22 కేసుల్లో 40 ఏళ్ల లోపు వారు 15 మంది ఉన్నారు. మిగిలిన ఏడుగురు 40 ఏళ్ల పైబడినవారు ఉన్నారు. కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. నిలకడగానే ఆరోగ్యం జిల్లాలోని 23 పాజిటివ్ కేసుల్లో శ్రీకాళహస్తిలో మొట్టమొదట నమోదైన పాజిటివ్ కేసు బాధితుడు ఇటీవల డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం పాజిటివ్‌గా ఉన్న 22 మంది తిరుపతి రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిలో, చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 22 మందిలో 15 మంది యువకులే ఉండడం వల్ల కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువకుల్లో వ్యా«ధి నిరోధక శక్తి ఉండడం వల్ల వారు త్వరగా కోలుకుంటారని వెల్లడిస్తున్నారు. ఆరుగురు మహిళలు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఆరుగురు మహిళలున్నారు. నగరిలో ఇద్దరు, తిరుపతిలో ఇద్దరు, రేణిగుంటలో ఒకరు, శ్రీకాళహస్తిలో ఒకరు ఉన్నారు. శ్రీకాళహస్తిలో 14 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చింది. వీరికి కుటుంబంలోని పురుషుల ద్వారా కరోనా సోకి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తిరుపతిలోని మరో మహిళకు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చే సమయంలో కరోనా సోకిందని తేలింది. ఆరోగ్యం నిలకడగా ఉంది కరోనా పాజిటివ్ నమోదైన వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిరుపతి, చిత్తూరు ఆస్పత్రుల్లో పాజిటివ్ కేసులను ఉంచారు. ఇంటింటి సర్వే చేశాం. మూడో దశ సర్వేలో 10 మందికి జ్వరం, దగ్గు లక్షణాలు ఉడడంతో క్వారంటైన్లకు పంపాం. విదేశాల నుంచి వచ్చిన వారికి 24 రో జుల క్వారంటైన్ పూర్తయింది. – నారాయణ భరత్‌గుప్తా, కలెక్టర్ -
చిత్తూరులో 16లక్షల కోడిగుడ్ల పంపిణీ
-
కరోనా వైరస్: ఇంకా ఎవరైనా ఉన్నారా?
సాక్షి, చిత్తూరు: కరోనాను నియంత్రించడంలో భాగంగా ఇప్ప టివరకు విదేశాల నుంచి జిల్లాకు వచ్చినవారి వివరాల కోసం ఆరాతీసిన యంత్రాంగం తాజాగా ఢిల్లీలోని ఓ ప్రార్థన కోసం వెళ్లి వచ్చిన వారిపై దృష్టి సారించింది. ఇప్పటికే అధికారులు పలువురిని గుర్తించి హోమ్ ఐసొలేషన్ (స్వీయగృహనిర్బంధం) లో ఉంచారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు..? ఎవరెవర్ని కలిశారు..? ఎన్ని రోజులైంది? అని ఆరా తీస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వారి వివరాల సేకరణలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి. పనిలో పనిగా విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు సైతం ఎక్కడైనా ఉంటే గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. (ఒక్కరోజే 21 కరోనా పాజిటివ్) దృష్టంతా వారిపైనే.. ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనకు దేశవ్యాప్తంగా 2వేల మందికిపైగా హాజరైనట్లు సమాచారం. ఈ సమావేశానికి దాదాపు 200 మంది విదేశీయులు కూడా హాజరుకావడంతో పలువురికి కరోనా సోకినట్లు గుర్తించారు. మన రాష్ట్రం నుంచి 369 మంది హాజరవగా.. జిల్లా నుంచి 46 మంది వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఇప్పటివరకు 28 మందిని మాత్రమే గుర్తించిన అధికారులు మిగిలిన 18 మంది ఆచూకీ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. 28 మందిలో శ్రీకాళహస్తి నుంచి 8 మంది, పీలేరులో 8, పుంగనూరులో ఒకరిని, చిత్తూరులో ఇద్దరిని, కురబలకోటలో ముగ్గురిని, తిరుపతిలో ఆరుగురిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. అందరి రక్తనమూనాలను సేకరించారు. త్వరలోనే వాటి ఫలితాలు రానున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వారిలో మిగిలిన 18 మంది వివరాలను తెలుసుకోవడానికి జిల్లా మొత్తం వలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే చేయిస్తున్నారు. విదేశీయులు ఇలా.. అలాగే ఇప్పటి వరకు విదేశాల నుంచి 1,816 మంది వచ్చినట్లు యంత్రాంగం గుర్తించింది. వారిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచింది. గృహ నిర్బంధానికి ఇష్టపడని వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించింది. ఇప్పటివరకు సుమారు 1,472 మందికి క్వారంటైన్ పూర్తయ్యింది. వారిలో 86 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి మాత్రం పాజిటివ్ వచ్చింది. 55 మందికి నెగటివ్ రాగా.. 30 మంది ఫలితాల వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఫలితాల కోసం యంత్రాంగం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అలాగే పోలీసులు కూడా ప్రతి స్టేషన్ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారికోసం ఆరా తీస్తున్నారు. వెంటనే ఫోన్ చేయండి కరోనా లక్షణాలు ఎవరిలో కనిపించినా సమాచారం ఇవ్వాలి. విదేశాల నుంచి వచ్చిన వారిని దాచినా, ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నా తప్పనిసరిగా డయల్–100, 104, ఫోన్– 08572–235900, 9441486168, 9849902379 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలి. వెంటనే పోలీస్, వైద్యశాఖ సిబ్బంది రంగంలోకి దిగి వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారు. అలాగే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను కూడా అధికారులకు అందించాలి. జమాత్‌కు వెళ్లిన వారు క్వారంటైన్ సెంటర్‌కు.. పలమనేరు: నియోజకవర్గం నుంచి జమాత్‌కి వెళ్లొచ్చిన 37 మందితోపాటు కుటుంబ సభ్యులతో కలిపి 150 మందిని అధికారులు మంగళవారం క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. వీరు అసోం, తమిళనాడులోని ఆంబూర్,పూణేలో జరిగిన జమాత్‌కు వెళ్లొచ్చినట్లు తెలిసింది. దీంతో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి హోమ్ ఐసొలేషన్‌లో ఉచారు. మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడుకు కాలినడకన వెళ్తున్న మరో పదిమంది వలస కూలీలను పోలీసులు స్థానిక బీసీ హాస్టల్‌కు తరలించారు. వీరికి వసతి సౌకర్యాలను కల్పించినట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. 13 మంది రుయాకు తరలింపు శ్రీకాళహస్తి: న్యూఢిల్లీ నిజాముద్దీన్‌లో నిర్వహించిన జమాత్‌కు వెళ్లిన వారిపై వలంటీర్లు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాళహస్తికి చెందిన 13మందిని తిరుపతి క్వారంటైన్‌కు పంపించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన 13 మందిని వైద్యపరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించామన్నారు. -
ఇంటికి చేరిన చిలుక..
తిరుపతి: ఆఫ్రికల్ కాంగో గ్రే పారెట్ ఎట్టకేలకు తన యజమాని చెంతకు చేరింది. ఈ చిలుక గురించి శుక్రవారం సాక్షిలో ‘ఎచ ట నుంచి వచ్చెనో..’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన మధురానగర్ వాసి జీవన్ ప్రకాష్‌రెడ్డికి ప్రాణం లే చి వచ్చినట్లైంది. చిలుక కథనం తాలూ కు క్లిప్పింగ్‌ను పలువురికి చూపిస్తూ దాని కోసం గాలించారు. ఆయన ఈ చిలుకను 3 నెలల క్రితం బెంగళూరులో రూ.36 వేలకు కొన్నారట! గురువారం ఇంటి వద్ద చిలుక తెరచి ఉన్న కిటికీలోంచి చిలుక తుర్రుమంది. దీనికోసం పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సాక్షిలో వచ్చిన చిలుక కథనంతో ఆయన మరోసారి అన్వేషించారు. ఎట్టకేలకు తన ఇంటికి అరకిలోమీటరు దూరంలోని ఓ ఇంట చెట్టు మీద ఉన్న చిలుకను కొందరి సాయంతో ప్రకాష్ గుర్తించారు. విజిల్ వేయడం ఆలస్యం..ఎగిరొచ్చి ఆయన చేతిపై వాలడం చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు! -
ఇంటికెళ్లండి ప్లీజ్..!
సాక్షిప్రతినిధి, తిరుపతి: కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు గుంపులుగా చేరకూడదంటూ 144 సెక్షన్ విధించింది. నిత్యావసరాల కొనుగోలుకు మాత్రం ఇంటికి ఒకరికి నిర్దేశిత సమయంలో వెసులుబాటు కల్పించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంచార వాహనాలతో ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని, సామాజిక దూరం పాటించాలని పోలీసులు కోరుతున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు సైతం పంపిస్తున్నారు. అప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారికి కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించేందుకు పోలీసులతో కలిసి ప్రజాప్రతినిధులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇంటి పట్టున ఉండండి, ముంచుకొస్తున్న ముప్పును గుర్తించండి అంటూ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. ఇతర దేశాల్లో ఏర్పడిన విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని విన్నవిస్తున్నారు. (అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు? ) జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పోలీసులు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు సమయంలో మార్కెట్లు, దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రోడ్డుపైకి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని బాధ్యతను గుర్తుచేస్తున్నారు. జిల్లా మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను సమాయత్తం చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిత్యం నగరంలో పర్యటిస్తూ వీధుల్లో సంచరిస్తున్న వారిని ఇళ్లకు వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గంలోని అన్ని ఇళ్లకు సుమారు 3.40లక్షల శానిటైజర్స్ పంపిణీ చేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా, పీలేరు శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తమ ప్రాంతాల్లోని ప్రజలకు మాస్క్‌లను పంపిణీ చేసి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. పట్టణంలో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా శానిటైజర్స్‌ను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, పూతలపట్టు, తంబళ్లపల్లె, మదనపల్లె ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, వెంకటేగౌడ, ఎంఎస్ బాబు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. -
చిన్నారి వర్షిత కేసు తీర్పు వాయిదా
సాక్షి, చిత్తూరు : మదనపల్లె సమీపంలోని అంగళ్లులో గతేడాది నవంబర్ 7న హత్యకు గురైన చిన్నారి వర్షిత కేసు తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. తన వాదనలు వినేందుకు సమయం కావాలని ముద్దాయి రఫీ కోరడంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు. వాదనలు విన్న తర్వాతే తీర్పు ఇచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోకనాథ్ పేర్కొన్నారు. కాగా, గతేడాది నవంబర్ 7న మదనపల్లె సమీపంలోని అంగళ్లులో చిన్నారి వర్షిత హత్యాచారానికి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మదనపల్లె మండలంలోని బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహ్మద్ రఫీ(27) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. అప్పటికే తప్పించుకున్న నిందితుడు ఛత్తీస్‌ఘడ్‌కు పారిపోయాడు. కేసును చాలెంజ్‌గా తీసుకున్న ఎస్పీ సెంథిల్ కుమార్ నిందితుడిని పట్టుకోవడానికి మదనపల్లె డీఎస్పీ రవిమనోహరచ్చారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నియమించారు. ఎట్టకేలకు నవంబర్ 16న రఫీని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచారు. ఈ ఘటనకు సంబంధించి పలు ఆధారాలు సేకరించి న్యాయస్థానానికి అందజేశారు. నేరం జరిగిన 17 రోజుల్లోనే చార్జిషీట్ పత్రాన్ని న్యాయస్థానానికి అందించారు. చిత్తూరులోని జిల్లా మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి వెంకట హరినాథ్ ఈ కేసు విచారణ ప్రారంభించారు. పోలీసులు ఇచ్చిన అన్ని సాక్ష్యాలను పరిశీలించారు. ఈనెల 14న విచారణ కూడా పూర్తయింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే ప్రచారంతో బాధితులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కేసును ఈ నెల 18కి వాయిదా వేశారు. -
చిన్నారి వర్షిత కేసులో నేడు తుది తీర్పు
-
నారావారిపల్లిలో వికేంద్రీకరణ ప్రజా సదస్సు
సాక్షి, చిత్తూరు: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయంపై ఆదివారం జిల్లాలోని చంద్రగిరి నారావారిపల్లిలో జరగనున్న ప్రజాసదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు డీసీసీ బ్యాంక్ చైర్మన్ రెడ్డమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన నారావారిపల్లి సభా ప్రాంగణం వద్ద మాట్లాడుతూ.. రాజధాని మూడు విభాగాలుగా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సదస్సుకు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా 25 వేల మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొననున్నారని ఆయన అన్నారు. దానికి అనుకూలంగా సభావేదిక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. -
జననేతకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
-
ఘనంగా జల్లికట్టు సంబరాలు
-
వాస్తు కోసం పోలీస్ స్టేషన్ గది కూల్చివేత
బి.కొత్తకోట : వాస్తు దెబ్బకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ భవనంపై గది కూలిపోయింది. మండల పరిధిలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలతో ఏదో వాస్తులోపం ఉందని భావించారు. వాస్తు రీత్యా స్టేషన్ భవనంపై ఉన్న గది ఉండకూదని గ్రహించారు. మంగళవారం ఆ గదిని కూల్చేశారు. వాస్తవంగా ఈ గది పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణంలో భాగం కాదు. 1980లో పోలీస్‌స్టేషన్‌ను నిర్మించగా, 1992లో గది నిర్మించారు. 1980 దశాబ్దంలో పీపుల్స్‌వార్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) చరిత్రలో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఉన్న గుర్తింపు ఏ ప్రాంతానికీ లేదు. పీపుల్స్‌వార్ వెలుగు వెలిగిన కాలంలో తంబళ్లపల్లె కార్యకలాపాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతోపాటు ఉద్రిక్తతలు, సంచలన సంఘటనలు జరిగాయి. వార్ కదలికలు అధికంగా ఉండటం, తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లకూ భద్రత కలి్పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో మదనపల్లె నియోజకవర్గం పరిధిలో ఉన్న బి.కొత్తకోట, ముదివేడు, తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం పోలీస్స్టేషన్లపై పీపుల్స్‌వార్ దళాలు దాడులు చేస్తే తిప్పికొట్టడం కోసం రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ భవనంపై ఓ గదిని నిర్మించి అందులో ఇసుక బస్తాలు వేసి, సాయిధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. 24 గంటలు గది నుంచి పహారా ఉండేది. స్టేషన్ల చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎవరైనా నేరుగా స్టేషన్లోకి వచ్చే వీలులేకుండా కంచెతో పలు వలయాలను నిర్మించారు. ఇలా చేయడం ద్వారా నక్సల్స్‌ను స్టేషన్లలోకి దూసుకురాకుండా నివారించడం, పై గదిలో పహారా కాస్తున్న సాయుధ బలగాలు నిలువరించడం సాధ్యమవుతుందని ఇలా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అంటే 1992–93లో బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌పై ఈ గది నిర్మించారు. అప్పుడు నిర్మించిన గది 2000 వరకు ఉపయోగంలో ఉండగా, అనంతర పరిణామాలతో పీపుల్స్‌వార్ కనుమరుగు కావడంతో నిఘా, కంచెను తొలగించారు. అప్పటి నుంచి వృథాగా ఉన్న ఈ గది ఇప్పుడిలా వాస్తు దెబ్బకు కూలిపోయింది. -
శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిసెంబర్ మాసంలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ నెలలో ధనుర్మాసం ప్రారంభకానున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు టీటీడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఉత్సవాల వివరాల్లోకెళితే.. డిసెంబర్ 9: చక్రతీర్థ ముక్కోటి. డిసెంబర్ 10: తిరుమంగై యాళ్వార్ శాత్తుమొర. డిసెంబర్ 11: కార్తీక పర్వ దిపోత్సవం, శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, శ్రీదత్త జయంతి. డిసెంబర్17: ధనుర్మాసం ప్రారంభం. డిసెంబర్ 25: శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. డిసెంబరు 26: అధ్యయనోత్సవాలు ప్రారంభం, సూర్య గ్రహణం. -
శ్రీకాళహస్తిలో ‘క్షుద్ర’ కలకలం
శ్రీకాళహస్తిలో తరచూ క్షుద్ర పూజల నిర్వహణ కలకలం రేపుతోంది. శక్తి ఆలయం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. పదవీయోగం సిద్ధిస్తుందని.. గుప్త నిధుల లభ్యమవుతాయని.. శత్రువులకు హాని చేయవచ్చనే మూఢ నమ్మకాలతో ఒళ్లు గగుర్పొడిచే పూజలు నిర్వహిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వేడాం సమీపంలోని భైరవకోనలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి సమాచారం మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ఓ ఉద్యోగిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఉన్న భైరవ కోన, వెయ్యిలింగాల కోన పరిధిలో తరచూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి, నూతన సంవత్సరం వంటి ముఖ్యమైన రో జుల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ జనసంచారం పెద్దగా ఉండదు. దీంతో ఈ ప్రాంతాన్ని కొందరు మూఢ నమ్మకాలతో కొన్ని పూజలకు నిలయంగా మార్చుకున్నారు. ఎన్నికల ముందు.. సాధారణ ఎన్నికల ముందు 2018 జనవరి 5న గుర్తు తెలియని వ్యక్తులు భైరవ కోన వద్ద క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ పూజను ఆలయంలో పనిచేసే అధికారి ధనపాల్ అనే వ్యక్తి నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల తరువాత తిరిగి ఆయన విధుల్లో చేరారు. అది కూడా పదోన్నతిపై. అతని పదోన్నతిపై తిరిగి విధుల్లో చేరేందుకు అప్పటి దేవదాయశాఖ మంత్రి రాతపూర్వకంగా లేఖ కూడా ఇచ్చారని తెలిసింది. నాటి నుంచి నేటి వరకు ఆయన ఆలయ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నా రు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ధనపాల్ సహకారంతో చెన్నైకి చెందిన కొందరు భైరవ కోనలో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉద్యోగి సూచనల మేరకే.. శ్రీకాళహస్తి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి సూచనల మేరకే భైరవ కోనలో ఈ పూజలు నిర్వహించేందుకు వచ్చినట్టు తమిళనాడు వాసులు చెప్పినట్టు సమాచారం. అయితే అక్కడ జరిగింది క్షుద్రపూజా.. మరేదైనా పూజ తేలాల్సి ఉందని సీఐ ఆరోహణరావు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయమై ప్రభుత్వం స్పందించింది. శ్రీకాళహస్తీశ్వరాలయ పరిధిలో జరిగిన పూజలపై విచారణ చేపట్టి వెంటనే నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ మంత్రి ఆదేశాలు జారీచేశారు. అవి క్షుద్రపూజలే ఆగమ సంబంధమైన ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఆలయ పరిసర ప్రాంతాల్లో రాత్రి 9 గంటలు దాటాక ఏ పూజ చేసినా క్షుద్రపూజే. – సింగరాజు ప్రకాశం పంతులు, పురోహితులు, శ్రీకాళహస్తి -
నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి..!
సాక్షి, తిరుపతి: ‘కుటుంబానికి ఆయనే పె ద్ద దిక్కు. శుభ కార్యానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలలో రక్తం గడ్డకట్టిపోవటంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. తిరుపతిలో కష్టం అని చెప్పారు. దీంతో ప్రాణపాయ స్థితి లో చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి కే ఆస్తులు అమ్మి శక్తికి మించి వైద్యం చేయించాం. ఇంకా రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందంటా. రేషన్‌కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు. నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి.’ సారూ... అంటూ తిరుపతి రూరల్ మండ లం చెర్లోపల్లె పంచాయతీ వెంకటపతినగర్ కు చెందిన రమేష్ భార్య గౌతమి కన్నీరుమున్నీరు అయ్యింది. ఆ మేరకు సోమవారం రూ రల్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ సుశీలాదేవికి వినతిపత్రం అందించింది. సాయం చేయాలని ప్రాధేయపడింది. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ రమేష్ ఎస్వీ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ నెల 14వ తేదీన పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు రామాపురం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడని, దీంతో తలకు గాయమైందన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రమే‹Ùకు తిరుపతి లో వైద్యం కష్టం అని చెప్పడంతో చెన్నై అపో లో ఆస్పత్రి ఐసీయూలో చేర్పించి, వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.7 లక్షలకు పైగా ఖర్చు అయిందన్నారు. మరో రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతా యని వైద్యులు చెప్పారన్నారు. అంత ఆర్థిక స్థోమత తమకు లేదని, దాతలు ఆదుకోవా లని వేడుకున్నారు. తమకు రేషన్, ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నారు. స్పందించిన తహసీల్దార్ కి రణ్‌కుమార్ వెంటనే ఆరోగ్యశ్రీకి వీరు అర్హులే అని సరి్టఫికెట్ అందించారు. ఇంకా అవస రం అయితే సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తామన్నారు. -
పట్టాలు తప్పిన కేరళ ఎక్స్‌ప్రెస్
సాక్షి, చిత్తూరు : ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రేణిగుంట రైల్వే అధికారులు ప్రమాదం గురించి తెలుసుకొని ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో ఆమార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
‘సంఘమిత్రలు ఉంటే గ్రామాల్లో ఆరోగ్యం’
సాక్షి, తిరుపతి: ఎన్నికలకు మూడు నెలల ముందు ఇచ్చిన హామిని.. ఎన్నికల తరువాత మూడు నెలల్లో అమలు చేయడం సామాన్యమైన విషయం కాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతి రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో భాస్కర్‌రెడ్డిని సంఘమిత్రలు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబపై ప్రజలకు నమ్మకం ఉందని తెలిపారు. సంఘమిత్రలు ఉంటే గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. ప్రతి గ్రామంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపరచి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సంఘమిత్రలను అదేశించారు. అమ్మబడి, రైతుభరోసా, ఫించన్లు, ఉగాదినాటికి గృహాలు, ఆరోగ్య శ్రీ, ఆటో కార్మికులు ఇలా ఒకే వర్గమని లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో కొన్నిచోట్ల అవినీతి జరిగిందని.. అలాంటి వాటిని సరిద్దిదుకునే సమయం వచ్చిందన్నారు. సంఘమిత్రలు భవిష్యత్తులో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా ఆర్చర్యం లేదన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలాగా సంఘమిత్ర వ్యవస్థను సీఎం జగన్ గుర్తించాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తమ కష్టాన్ని గుర్తించి ఇచ్చిన హామిని నేరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, తమ వెన్నంటి ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంఘమిత్రలు కృతజ్ఞతలు తెలిపారు. -
ఒకే కుటుంబలో ముగ్గురి ఆత్మహత్య
-
కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ సోదాలు
-
‘కల్కి భగవాన్’ పై ఐటీ దాడులు
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని వరదయ్యపాలెం, బీ. ఎన్. కండ్రిగ మండలాల్లో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ దాడులు చేశారు. కల్కి ట్రస్ట్ నిర్వాహకుడు లోకేష్ దాసజీని అధికారులు విచారిస్తున్నారు. ట్రస్ట్‌కు సంబంధించిన ఏకం, జీ.సీ 1, జీ.సీ 2, జీ.సి 3 ఆశ్రమాలలో దర్యాప్తు జరుగుతోంది. -
యుపిఎస్ బ్యాటరీ పేలి తల్లికొడుకు మృతి
-
తిరుమలలో దళారీ అరెస్టు
సాక్షి, తిరుమల: భక్తుల నుంచి నగదు వసూలు చేసి కల్యాణోత్సవ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నించిన దళారీని తిరుమల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరంధామయ్య అనే వ్యక్తి జేఈవో కార్యాలయంలో తెలంగాణ ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై రూ.10వేలకు రెండు కల్యాణోత్సవ టికెట్లు తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేయగా.. విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సిరిసిల్లకు చెందిన భక్తులకు కల్యాణోత్సవ టికెట్లు తీసి ఇస్తానని చెప్పి నగదు వసూలు చేసినట్లు తెలిసింది. టూ టౌన్ పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
తల్లిని కడతేర్చిన తనయుడు
చిన్నాన్నతో వివాహేతర సంబంధానికి స్వస్తి పలకాలని కోరినా తల్లి తన తీరు మార్చుకోలేదని ఓ కుమారుడు ఆగ్రహించాడు. పైగా, తానే వివాహేతర సంబంధం కోసం యత్నిస్తున్నానంటూ సాక్షాత్తు కన్న తల్లే తనపై నిందలు మోపడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చిన్నాన్నతో తల్లి కలిసి ఉండటం చూసి రగిలిపోయాడు. వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి తల్లిని హతమార్చాడు. కత్తిపోట్లకు గురైన అతడి చిన్నాన్న గ్రామస్తుల సాయంతో తప్పించుకున్నాడు. సాక్షి, గుడిపాల : మండలంలోని రెట్టగుంట దళితవాడకు చెందిన జ్యోతి(43)కి ఇదే గ్రామంలోని డేవిడ్‌రాజా(48) 25 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిరికి కుమార్తె సౌందర్య(24), ప్రేమ్‌కుమార్(22) సంతానం. పదేళ్ల క్రితం డేవిడ్ అనారోగ్యం బారిన పడి కొంత మతిస్థిమితం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో అవివాహితుడైన డేవిడ్ సోదరుడు సుందర్‌రాజ్‌తో జ్యోతి కొన్నేళ్ల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకుంది. సుందర్రాజ్ చిత్తూరులోని జెడ్పీ ఆఫీసులో పనిచేస్తున్నాడు. తన తల్లి, చిన్నాన్నకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరునెలల క్రితం ప్రేమ్‌కుమార్ తెలుసుకోవడంతో తల్లిని మందలించాడు. తీరు మార్చుకోవాలని హితవు పలికాడు. అయినా ఆమె ప్రవర్తన మారకపోవడంతో ప్రేమ్‌కుమార్ గొడవ పడేవాడు. దీనిపై కోపం పెంచుకున్న జ్యోతి కొడుకుపై నిందలు మోపింది. తన కొడుకే తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని పిలుస్తున్నాడంటూ ఇరుగు పొరుగు వారికి చెప్పసాగింది. ఇది ప్రేమ్‌కుమార్ చెవిన పడడంతో అతడు జీర్ణించుకోలేకపోయాడు. గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటిలో తన తల్లి జ్యోతితో గొడవకు దిగాడు. తనపైనే దారుణమైన నిందలు మోపుతావా? అని ఆమె నిలదీశాడు. దీంతో ఆమె రాత్రి 11.30 గంటలకు గుడిపాల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు తన కుమారుడు మద్యం తాగి కొట్టడానికి వస్తున్నాడని చెప్పింది. పోలీసులు ఆ సమయంలో వారింటికి వెళ్లి ప్రేమ్‌కుమార్‌కు నచ్చజెప్పారు. పోలీసులు వెళ్లిన వెంటనే ఇంటిలో ఉన్న బట్టలను సర్దుకుని ప్రేమ్‌కుమార్ ఇంటి నుంచి బయటకి వచ్చేశాడు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన చిన్నాన్న సుందర్రాజ్, తల్లి జ్యోతి ఇద్దరూ కలిసి ఉండటం చూసి ఆవేశంతో రగిలిపోయాడు. వారిపై కత్తితో దాడి చేశాడు. గొంతుకోసి తల్లిని హతమార్చాడు. ప్రేమ్‌కుమార్ దాడిలో కత్తిపోట్లకు గురైన సుందర్రాజ్ చావు కేకలు పెట్టాడు. అతడి అరుపులకు చుట్టుపక్కల వారందరూ అక్కడికి చేరుకున్నారు. వారి సాయంతో అతను తప్పించుకున్నాడు. తల్లిని కడతేర్చిన ప్రేమ్‌కుమార్ గుడిపాల పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. స్థానికంగా ఇది కలకలం సృష్టిం చింది. సంఘటన స్థలాన్ని సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, గుడిపాల ఎస్ఐ షేక్షావలి పరిశీలించారు. కత్తిపోట్లకు గురైన సుందర్‌రాజ్‌ను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి నిమిత్తం తరలించారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం జ్యోతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి పేరును కూడా ఉచ్ఛరించడానికి ఇష్టపడని ప్రేమ్‌కుమార్ ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని పోలీసులు చెప్పారు. గుడిపాల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డగోలు దోపిడీ..!
గత టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంది. ముఖ్యంగా హంద్రీ–నీవా కాలువ పనుల్లో దోపిడీ ఇష్టారాజ్యంగా సాగింది. అధిక అంచనాలతో టెండర్లు నిర్వహించి దోచుకున్నారు. అధికారి అనుకూలంగా లేకపోవడంతో పనులను వేరే సర్కిల్‌కి బదిలీ చేసి తమకు అనుకూలంగా చేసుకున్నారు. ఈ దోపిడీపై వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీ ద్వారా విచారణ చేపట్టనుంది. తద్వారా హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో గత ప్రభుత్వం సాగించిన లీలలు వెలుగులోకి రానున్నాయి. సాక్షి, బి.కొత్తకోట : 2014లో అధికారంలోకి రాగానే హంద్రీ–నీవా రెండో దశ పనులను టీడీపీ నేతలు వారి సంస్థలకే దక్కేలా చక్రం తిప్పారు. 60సీ నిబంధనను ప్రయోగించి పాత కాంట్రాక్టుల నుంచి పనులు తొలగించారు. అతి తక్కువ విలువ కలిగిన పనులను కోట్లకు పెంచుకొని దోపిడీ సాగించారు. ఈ వ్యవహారంలో అడ్డం తిరిగిన ఓ అధికారిపై కక్షగట్టి ఆయన పరిధిలోని ప్యాకేజీలను తొలగించారు. అనుకూలమైన అధికారులతో ఆడింది ఆటలా అంచనాలు పెంచుకుని అయినవారికే పనులు కట్టబెట్టారు. మాట వినలేదని ప్యాకేజీల మార్పు.. హంద్రీ–నీవా ప్రాజెక్టు 2వ దశకు చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లె సర్కిల్–3 పరిధిలోని 14 ప్యాకేజీలను ఒక్కసారిగా తప్పిస్తూ 2015 జూలై 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు చేపట్టినప్పటి నుంచి మదనపల్లె సర్కిల్ పరిధిలోని పనులను అనంతపురం జిల్లాలోని సర్కిల్‌కు మార్పు చేసింది. 2014 డిసెంబర్లో మదనపల్లె ఎస్ఈగా మురళీనాథరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పటిదాక పడకేసిన పనుల్లో కదలిక తెచ్చారు. అనంతపురం జిల్లా పరిధిలోని 6, 8, 9, 10, 11, 14, 15, 16, 18, 24, 25, 26, 52, 53 ప్యాకేజీ పనులు మదనపల్లె సర్కిల్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లోని పనులను రద్దు చేయించి, అధిక అంచనాలతో కొత్తగా టెండర్లు నిర్వహించాలని టీడీపీ ముఖ్యనేతలు ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారు. దీనికి అంగీకరించని ఆయన, పనుల్లో పురోగతి ఉందని, రద్దువల్ల ప్రభుత్వానికి నష్టమని సలహా ఇస్తే.. వారి ఆగ్రహానికి గురయ్యారు. అప్పటీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి 14 ప్యాకేజీలను అనంతపురం జిల్లాలోని సర్కిల్–2 పరిధిలోకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఆమోదం లేకున్నా చెల్లింపులు.. 2014, 2015 మధ్యలో మదనపల్లె సర్కిల్ నుంచి తొలగించిన, అనంతపురం జిల్లా పరిధిలోని రెండోదశకు చెందిన 15 ప్యాకేజీల పనుల్లో కొంత భాగం రద్దు చేశారు. ఈ ప్యాకేజీల్లో రూ.292.52 కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగా, అందులో కొంత మేర పని రద్దుచేసి పనులకు కొత్తగా 2బీ, 3బీ, 4బీ, 5బీ, 6బీ, 7బీ, 10బీ, 13బీ, 14బీ, 15బీ, 17బీ, 25బీ, 26బీ, 54బీ, 57బీ ప్యాకేజీలుగా మార్చి రూ.779.61కోట్లకు అంచనాతో టెండర్లు నిర్వహించారు. పనుల తొలగింపు, రద్దు, రీటెండర్లు పద్ధతి ప్రకారం సాగలేదని గత ప్రభుత్వమే వీటికి ఆమోదం తెలపలేదు. దీన్ని పట్టించుకోని ఉన్నతాధికారుల చర్యలు ముందుకే సాగాయి. ఈ టెండర్ల నిర్వహణలో అత్యధిక ప్యాకేజీలు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకే దక్కాయి. ఈ సంస్థ 2 నుంచి 5శాతం వరకు అదనంగా టెండర్లు వేసినా.. పనులు ఆ సంస్థకే అప్పగించారు. ఎక్సెస్ కారణంగా పనుల విలువ రూ.800 కోట్లు దాటింది. అలాగే 11, 14, 56 ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీ సొమ్మును స్వాధీనం చేసుని పనులు రద్దు చేశారు. ఇలావుండగా గత ప్రభుత్వ ఆమోదం లేకున్నా రీటెండర్లతో జరిగిన పనులకు కోట్ల బిల్లులు చెల్లించారు. ఇంకా పనులు, పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ విషయమై అనంతపురం ఎస్ఈ వెంకటరమణ వివరణ కోరగా, రీటెండర్ల నిర్వహణకు గత ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం ఇచ్చిందని చెప్పారు. చిత్తూరు రీటెండర్లకు ఆమోదం.. అనంతపురం జిల్లాలో సాగిన రీటెండర్ల వ్యవహారానికి గత ప్రభుత్వం ఆమోదించలేదని తెలుస్తుండగా, చిత్తూరు జిల్లాలో జరిగిన రీటెండర్లు, పనుల రద్దుకు గత ప్రభుత్వం 2018 జూలై 5న ఆమోదించి జీఓ నంబర్ 473 జారీ చేసింది. తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన 21, 22, 27, 28, 29, 62, 63, 64 ప్యాకేజీల్లో ఆగిపోయిన పనుల్లో కొంతభాగం పనులకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. ఈ ప్యాకేజీ పనులకు రూ.760.410 కోట్లతో అనుమతి ఇవ్వగా, రూ.521.390 కోట్లతో పనులు చేసేందుకు కాంట్రాకర్లతో ఒప్పందం జరిగింది. ఇందులో రూ.504.290 కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.17.100కోట్ల పనులు అసంపూర్తి కావడంతో వాటికి రూ.95.920 కోట్లకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. దీనిపై అప్పటి మదనపల్లె ఎస్ఈ మురళీనాథరెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్యాకేజీ అంచనాలకు లోబడి ఉండటం, అదనపు భారం లేనందున ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే పద్ధతిని అనంతపురం ఉన్నతాధికారులు పాటించకపోవడంతోనే ఆమోదం ఇవ్వలేదని జలనవరులశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా దీనిపై అనంతపురం జిల్లా ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వం నియమించిన కమిటీకి సంబంధిత వివరాలను అందిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు కమిటీ సభ్యులను కలిసి వివరాలను అందించారని సమాచారం. ప్యాకేజీ పనుల రద్దు, వాటి అంచనాల పెంపు, ఆమోదం, దానికి సంబంధించిన చర్యలను సమర్థిచుకునేందుకు రికార్డులను కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. -
ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నియమితులు కావడంతో జిల్లాకు మరో కీలక పదవి లభించింది. ఇదివరకే జిల్లా మంత్రులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామికి పదవులు దక్కాయి. తుడా చైర్మన్‌గా, ప్రభుత్వ విప్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్పర్సన్ పదవి ఎమ్మెల్యే రోజాను వరించింది. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఆమె నియమితులు కావడంతో జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో పారిశ్రామికంగా సత్యవేడు శ్రీసిటీ ఉన్న నేపథ్యంలో ఏపీఐఐసీ తరఫున పారిశ్రామిక క్లస్టర్లు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంతోషం వెలిబుచ్చుతున్నారు. -
తిరుమలలో చిరుత సంచారం
సాక్షి, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం చేస్తోందని సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు కొత్త ప్రతిపాదనలు జారీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, సీవీఎస్ఓ గోపినాథ్‌తో చర్చలు జరిపిన అనంతరం అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో... ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలు, నడక దారిలో వచ్చే భక్తులను నిలిపి వెయ్యాలని నిర్ణయించారు. అంతేగాక ఈ దారిలో వాహనాల వేగం గంటకు 20 కిమీ మించకూడదని హెచ్చరికలు జారీ జేశారు. ఈ సందర్భంగా సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. తిరుమల వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ కావడంతో జంతువుల సంచారం ఉంటుందని కావున ఆయా ప్రాంతాలలో భక్తులను అప్రమత్తం చేయడానికి సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేగాక ఆ ప్రాంతాంలో వాహనాల వేగాన్ని నియత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
అమ్మో ‘భౌ’బోయ్...
సాక్షి, పలమనేరు : పలమనేరులో కుక్కల బెడద పెద్ద సమస్యగా మారింది. గత ప్రభుత్వం వీధికుక్కల సమస్యను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగింది. వీటిని చంపేందుకు నిబంధనలు ఒప్పుకోనందున ఖచ్చితంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీలకు, మున్సిపాలిటీకి ఈ నిధులు అందక సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గతంలో కొన్ని కుక్కలను పట్టి వాటిని మదనపల్లికి తీసుకుని వెళ్లి స్టెరిలైజేషన్ చేయించి వదిలిపెట్టారు. మిగిలిన కుక్కలను పట్టించుకోలేదు. దీంతో సమస్య మళ్లి మొదటికొచ్చింది. రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్న జనం.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వీధుల్లో కుక్కల బెడద ఎక్కువయ్యింది. రాత్రిపూట వీధుల్లోకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా జనంపైకి వచ్చి పడుతున్నాయి. పలమనేరు పట్టణంలో గత రెండు సంవత్సరాల్లో కుక్కకాటుకు గురైన కేసులు 500 దాకా ఉన్నాయంటే వీటి బెడద ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసులను సైతం ఈ కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకి రాత్రి సమయంలో ఏవైన పనులు ఉంటే వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. బైక్‌పై వెలుతున్న వారికి తప్పడం లేదు.. రాత్రిపూట బైక్‌లపై ప్రయాణిస్తున్న వారిని రోడ్లపై కాచుకున్న కుక్కలు తరముకుంటూ వెళ్లి కాటేస్తున్నాయి. కుక్కలను చూసి వేగం పెంచడంతో బైక్ అదుపుతప్పి గాయపడిన సంఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం రోడ్డులో నక్కపల్లి, కొలమాసనపల్లి, కూర్మాయి, మదనపల్లి రోడ్డులో కల్లుపల్లి, మబ్బువాళ్లపేట, గుడియాత్తం రోడ్డులో డిగ్రీ కళాశాల, టి.వడ్డూరు, కాలువపల్లితో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పంచాయతీలకు విడుదల కాని నిధులు.. ఒక్కో కుక్కకు కు.ని శస్త్రచికిత్స చేయాలంటే రూ.500 దాకా ఖర్చు అవుతుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 20వేల కుక్కలకు రూ.కోటి అవసరముంది. కానీ పంచాయతీలకు కుక్కల స్టెరిలైజేషన్‌కోసం గత మూడు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. పలమనేరు మున్సిపాలిటీలో మాత్రం గత సంవత్సరం ‘మిషన్ రాబిస్’ అనే పథకంలో భాగంగా 600 కుక్కలను మదనపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి తిరిగి పట్టణంలో వదిలిపెట్టారు. ఈ ప్రక్రియ కొన్ని రోజులు కొనసాగి ఆ తర్వాత నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి సదరు ఏజెన్సీకి నిధులు విడుదల కాకపోవడంతో ఈ కార్యక్రమం ఆలస్యమవుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. పశువులనూ వదలడం లేదు.. నియోజకవర్గంలో గత ఏడాది కాలంలో 152 పశువులు కుక్క కాటుకు గురి కాగా ఇందులో 20 దాకా మృతి చెందాయి. వీటిని సంబందిత మండలాల్లోని వెటర్నరీ ఆస్పత్రులకు తోలుకెలితే అక్కడ వైల్స్ అందుబాటులో లేవు. దీంతో ప్రైవేటుగానే వీటిని రైతులు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మొత్తం మీద ప్రభుత్వం నుంచి అటు పంచాయతీలకు, ఇటు మున్సిపాలిటీలకు పూర్తి స్థాయిలో నిధులు మంజురైనప్పుడే కుక్కల సమస్య అదపులోకి వచ్చే అవకాశం ఉంది. -
ఈ ప్రయాణం ప్రమాదకరం
సాక్షి, భాకరాపేట : తిరుపతి–బళ్లారి జాతీయ రహదారి మార్గంలోని భాకరాపేట ఘాట్ రోడ్డు వస్తే వాహనదారులు భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఒకప్పడు తిరుపతి–బళ్లారి రహదారి మార్గం ఎన్‌హెచ్ 205 నుంచి ప్రస్తుతం ఎన్‌హెచ్ 7గా మారింది. అంటే ఈ రహదారి మార్గంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కన్యాకుమారి–వారణాసికి వెళ్లే వాహనాలు సైతం ఈ రహదారిని ఎంచుకోవడంతో మరింత రద్దీ పెరిగింది. అందుకు తగువిధంగా జాతీయ రహదారుల శాఖ రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులు, సిగ్నల్స్, రహదారిపై రాత్రి పూట దిశను చూపించే రేడియం సిగ్నల్స్ అమర్చినారు. అలాగే భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాద మలుపులు సూచికలతో సరిపెట్టారు. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గినా ..ప్రమాదం సంభవిస్తే మాత్రం ప్రాణాలు హరీ అనాల్సిందే. భాకరాపేట ఘాట్ రోడ్డు 10 కిలోమీటర్లు దూరం వస్తుంది. ఇందులో ప్రధాన మలుపులు 12 ఉన్నాయి. అందులో లోయలతో కూడిన మలుపులు 4 ఉన్నాయి. ఈ నాలుగు ములుపుల వద్ద ప్రమాదాలు జరిగితే ప్రాణాపాయం తప్పదు. మృత్యుమలుపుల వద్ద ప్రమాద సూచికలు పెట్టారు. ఇవి ప్రమాదాలను ఆపలేక పోతున్నాయి. ఇక్కడ కచ్చితంగా భారీ గేజ్‌తో కూడిన రెయిలింగ్, పిట్ట గోడలు నిర్మించాలని వాహనదారులు, డ్రైవర్లు కోరుతున్నారు. నాలుగు రోజులు క్రితం జరిగిన ప్రమాదంలో లోయలో పడ్డ వాహనాన్ని బయటకు తీసుకు రావడానికి వీలుకాక ఇబ్బంది పడుతున్నారు. -
రక్త కన్నీరు!
కంటి చూపు మందగిస్తే అద్దాలు వాడొచ్చు. కాళ్లు, చేతులు పనిచేయకపోతే కృత్రిమ పరికరాలు పెట్టుకోవచ్చు. కానీ రక్తానికి ప్రత్యామ్నాయంగా ఏ ద్రవాన్ని వాడే పరిస్థితి లేదు. కేవలం ఒక వ్యక్తి చేసే రక్తదానమే మరొకరిని ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అందుకే అన్ని దానాల్లోకన్నా రక్తదానం మిన్న అనే నానుడి ప్రాచుర్యం పొందుతోంది. కానీ జిల్లాలో ప్రస్తుతం రక్తనిల్వలు నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. చిత్తూరు అర్బన్: జిల్లాలో ఒక నెలకు 800 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. కానీ ఇందులో సగం యూనిట్లు కూడా ప్రభు త్వ వైద్యశాలల్లో, ఇతర స్వచ్ఛంద సంస్థల్లో అందుబాటులో లేవు. కారణం.. వేసవి సెలవులు కావడం. నిజం.. వేసవి సెలవులు కావడంతో ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఊర్ల కు వెళ్లిపోయారు. దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లాలో రక్తనిధి కేంద్రాల్లో రక్తం నిండుకుంది. ఫలితంగా గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సకాలంలో రక్తం అందే పరిస్థితి కనిపించడం లేదు. నెగటివ్ గ్రూపులకు ఇబ్బందే చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం వందకు పైగా యూనిట్ల రక్తం ఎప్పుడూ నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు 40 యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. ఇందులోనూ స్క్రీనింగ్ చేసిన పాజిటివ్ గ్రూపులు 30 వరకు ఉంటే నెగటివ్ గ్రూపులన్నీ కలిపి ఎనిమిదే ఉన్నాయి. బీ–నెగటివ్ అయితే ఒక్కటే యూనిట్ ఉంది. ఈ రక్త గ్రూపు ఉన్న గర్భిణి ఎవరైనా కాన్పుకోసం ఆస్పత్రికి వచ్చి తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాలపై వచ్చే పరిస్థితి నెలకొంది. శస్త్ర చికిత్స సమయంలో కనీసం మూడు యూనిట్ల రక్తం కావాలి. ఇక్కడంతలేదు. చిత్తూరు రక్తనిధిలోనే రక్తం లేకపోవడంతో జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుత్తూరు, పీలేరు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు చిత్తూరు నుంచి సరఫరా అయ్యే రక్తనిల్వలు ఆగిపోయాయి. రక్తదానం ఎవరు చేయవచ్చంటే.. వయసు 18–60 ఏళ్ల లోపు ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులైతే నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. సన్నగా ఉన్నవారు రక్తదానం చేయకూడదని చాలామందిలో అపోహ ఉంది. ఇది తప్పు. 45 కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేశాక కొన్ని రోజుల పాటు పనులన్నీ మానుకోవాలనే అపోహ వద్దు. రక్తం ఇచ్చాక కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని పళ్ల రసం, పాలు వంటి స్వల్ప ఆహారం తీసుకున్నాక మళ్లీ పనులు చేసుకోవచ్చు. డబ్బులిచ్చినా దొరకడం లేదు జిల్లాలోని 15 ప్రాంతాల్లో రక్తనిధి కేంద్రాలున్నాయి. 250మి.లీ రక్తాన్ని ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ వైద్యశాలలకు అనీమియా, రోడ్డు ప్రమాద బాధితులు వచ్చినప్పుడు కనీసం మూడు యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్తనిధి కేంద్రాలు ఉండవు. వీళ్లు ఓ వ్యక్తి ద్వారా రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేయించి, రూ.800 చెల్లించి ఒక్క యూనిట్ రక్తాన్ని వారి ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం డబ్బులు చెల్లించినా కూడా జిల్లాలో ఎక్కడా రక్తం దొరకడంలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు పక్క రాష్ట్రాల నుంచి కూడా రక్తం తెప్పించుకుంటున్నారు. -
సేవకుడిలా పని చేస్తా..
సాక్షి, పలమనేరు : మంత్రి నియోజకవర్గమని పేరేగానీ గ్రామాల్లో కాని, పట్టణంలో కానీ తాగేందుకు నీళ్లులేవు. అందుకే పలమనేరులో ఇంటింటికీ నళ్లా, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడమే తన ధ్యేయమని పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎన్.వెంకటేశగౌడ తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్న అమరనాథ రెడ్డి నియోజకవర్గంలో చేసిందేమీలేదన్నారు. రూ.900 కోట్లతో అభివృద్ది చేశామంటూ గొప్పలు చెబుతున్నారేగానీ దాంట్లో రూ.300 కోట్లదాకా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖమంత్రిగా తన సొంత నియోజకవర్గంలో కనీసం కుటీర పరిశ్రమైనా కల్పించారా అని సూటిగా ప్రశ్నించారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తి, పెద్దిరెడ్డి అండతో తాను రాజీయాల్లోకి వచ్చానన్నారు. తనను గెలిపిస్తే పేదల కష్టాలు తెలిసినా వానిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రశ్న: రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? జవాబు: నేను ఏడేళ్లుగా నియోజకవర్గంలో ఎన్వీజీ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నా. పెద్దిరెడ్డి కుటుంబ అండదండలతో నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడి అభ్యర్థిని గెలిపించడం నుంచి స్థానికంగానే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నా. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రను చూసి స్ఫూర్తి పొందాను. నాయకుడు అంటే అలానే ఉండాలనుకున్నా. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నా. ప్రశ్న: కుటుంబ నేపథ్యం గురించి జవాబు:మాది పలమనేరు నియోజకవర్గంలోని వీకోటమండలం తోటకనుమ . తండ్రిపేరు చెంగేగౌడ. నా సతీమణి పావణి గృహిణి. నాకు ఇద్దరు సంతానం. నా విద్యాభ్యాసం పక్కనే ఉన్న వీ.కోటలో సాగింది. 9వతరగతి దాకా చదువుకున్నా. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బెంగళూరుకు వెళ్లా. అక్కడ తాపీ పనులు చేశా. ఈ ప్రాంతం నుంచి వెళ్లిన కూలీలను గ్రూపుగా చేసి చిన్నచిన్న పనులు ఒప్పుకున్నాను. అదే రంగంలో అంచలంచెలుగా ఎదిగి బిల్డర్‌గా స్థిరపడ్డాను. ప్ర: ఐదేళ్ల టీడీపీ పాలనపై ఏమంటారు జ: టీడీపీ నాయకులు నిధులు దోచుకోవడానికే సరిపోయింది. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగేందుకు నీళ్లు కూడా లేవు. మంత్రి లేనిపోని మాటలు, ప్రజలను ఏమార్చేందుకు శిలాఫలకాలు తప్పా ఇక్కడ చేసిందేమీ లేదు. ప్ర:నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు... జ: నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. ఇది మెట్టప్రాంతం కాబట్టి రైతుల సాగునీటికి ఇబ్బందులున్నాయి. పెండింగ్‌లోని గంగన్న శిరస్సు, కైగల్ ఎత్తిపోతల, హంద్రీనీవాతో చెరువుల అనుసంధానం చేయాల్సి ఉంది. ఏనుగుల సమస్య, టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ఇలా చాలా సమస్యలున్నాయి. ప్ర: ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారు? జ: నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఇంతవరకు మా సొంత మండలానికి ఏ రాజకీయపార్టీలోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నా ద్వారా ఆ అవకాశం కల్పించింది. వెంకటగౌడ ఎమ్మెల్యేగా బాగా పనిచేశాడబ్బా అని జనం చెప్పుకుంటే చాలు. ఏడాదికి ఒక్కసారి .. ఐదేళ్లలో కనీసం ఐదుసార్లు ఇంటింటికీ వెళతాను. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. -
ఉద్యోగుల ‘వేదన’ బతుకులు
సాక్షి, చిత్తూరు : ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేటు ఉద్యోగులనే తేడా ఉండదు. అందరూ సమానమే. ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్సులు, టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తుంటారు. విజయవాడలోని ప్రధానశాఖ నుంచి రిపోర్టులు పంపమని ఆదేశాలు జారీచేస్తుంటారు. ప్రభుత్వ పథకాలను టీడీపీకి లబ్ధిచేకూర్చే పథకాలుగా మార్చేస్తుంటారు. వాటిపై ప్రచారాలు చేయాలంటూ చిరుద్యోగులపై ఒత్తిడి పెంచేస్తుంటారు. కాదన్న వారిని నిర్ధాక్షణ్యంగా తొలగించేస్తుంటారు. లేదంటే మానసిక క్షోభకు గురిచేయడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. జిల్లాలో ఈ ఐదేళ్లలో ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు పడ్డ బాధలు అన్నీఇన్నీకావు. ఎవరిని కదిలించినా కష్టాలగాథలే. టీడీపీ పాలనలో చితికిపోయిన తమ బతుకుల గురించి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని మరీ చెప్పడం కలచివేస్తోంది. కుటుంబ జీవితాలకు దూరం జిల్లాలో దాదాపు 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే.. వీరికి సమానంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ఉద్యోగికీ కనీస పనిగంటలనేవి లేవు. గడిచిన ఐదేళ్లలో ఉద్యోగులు ఎనిమిది గంటలు పనిచేసి ఇళ్లకు వెళ్లిన దాఖలాలులేవు. పైగా సెలవు రోజుల్లో కూడా కార్యాలయాల్లో కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి. వ్యక్తిగత జీవనంతో పాటు కుటుంబ జీవితానికి వారు దాదాపు దూరమైపోయారు. గొడ్డుచాకిరీ చేసినా కాంట్రాక్టు ఉద్యోగుల కనీస వేతనాలు సగటున రూ.15 వేలు కూడా రాలేదు. చాలీచాలని జీతాలతో మూడు పూటలు గడవని కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయంటే అతిశయోక్తికాదేమో. ఓ ఆశా వర్కర్‌కు పారితోషికంతో కలిపి నెలకు రూ.6 వేలు వస్తే ఇద్దరు పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చదివించి, ఇల్లు గడపడానికి ఏటా రూ.50 వేల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి. మరణమే శరణమా? జిల్లా వెలుగు శాఖలో పనిచేసే పది మంది వరకు ఈ ఐదేళ్లలో చనిపోయారు. మితిమీరిన పని ఒత్తిడే ఈ మరణాలకు కారణం. మృతుల్లో మొలకలచెరువుకు చెందిన ఏరియా కో–ఆర్డినేటర్ రమేష్, కార్వేటినగరం ఏరియా ప్రాజెక్టు మేనేజరు గిరిజ, క్లస్టర్ కో–ఆర్డినేటర్ భాస్కర్, చిన్నగొట్టిగల్లు క్లస్టర్ కో–ఆర్డినేటర్ చెంగల్రాయులు ఉన్నారు. ఇదేశాఖకు చెందిన గంగవరం క్లస్టర్ కో–ఆర్డినేటర్ గురుమూర్తి, గుడిపాలకు చెందిన వెంకటేశులు పక్షవాతంతో మంచాన పడ్డారు. మదనపల్లె మునిసిపాలిటీలో 2016లో శ్రీనాథ్ అనే కాంట్రాక్టు ఉద్యోగి చెప్పినపని చేయలేదంటూ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు విధుల్లో నుంచి తొలగించడం.. అతను ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల్లో సమాధానాలు చెప్పలేక పుత్తూరు మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసిన సాంబశివరావు పక్షవాతంతో మంచంపట్టిన విషయం మరచిపోలేరు. వేతనాల్లేక విలవిల జిల్లా వైద్యశాఖలో పనిచేసే 3,250 మంది ఆశా వర్కర్లకు పారితోషికం రూ.5,600, గౌరవ వేతనం రూ.3 వేలు ఇస్తామంటూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వేతనాలు అందాలి. కానీ మూడు నెలలుగా రూపాయి వేతనం ఇవ్వలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లించాల్సిన జీతాలను ఇవ్వడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తోంది. చిత్తూరులో పనిచేసే 3 వేల మంది హోంగార్డులకు బడ్జెట్‌లేదనే సాకుతో ఐదు నెలలుగా జీతాలివ్వలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్న మహిళా సంఘాలకు మూడు నెలలుగా రూ.2.51 కోట్ల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల వెతలు జిల్లా గృహనిర్మాణశాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 400 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే (2014లో) తొలగించింది. ప్రతి మండలంలో ఐదుగురు ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ల స్థానంలో ప్రస్తుతం ఒక్కరే పనిచేయాల్సి వస్తోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో 2005 నుంచి పనిచేస్తున్న 380 మంది ఫీల్డు అసిస్టెంట్లపై పనితీరు నివేదిక బాగాలేదని నాలుగేళ్ల క్రితం వేటు వేశారు. వ్యవశాయశాఖలో పనిచేసిన 2,800 మంది ఆదర్శరైతులు అవసరం లేదంటూ తీసేశారు. ఐదేళ్ల క్రితం వీరిని తొలగించే సమయానికి ఒక్కో ఆదర్శరైతుకు రూ.5 వేలు చొప్పున వేతనాలను ఇవ్వలేదు. రెండేళ్ల క్రితం కూడా సర్వశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న రిసోర్సుపర్సన్లను, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కలిపి 3,800 మందిని ప్రభుత్వం తొలగించింది. -
నగరి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా ఆర్కే రోజ నామినేషన్
-
చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
-
కృష్ణా.. మీ ఓటు తెలుసుకొండి ఇలా..
సాక్షి, కృష్ణా : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్ కాల్ సెంటర్ ఇన్చార్జి : స్వామినాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్: 9849903988 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
చిత్తూరు...మీ ఓటు ఉందో లేదో చూసుకొండి
సాక్షి, చిత్తూరు : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.inవెబ్సైట్ ఓపెన్ చేస్తేsearch your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాస్థాయిలో ఫిర్యాదు విభాగం అధికారి పేరు : గోపాలయ్య (ఎన్నికల విభాగం సూపరింటెండెంట్) సెల్ నంబర్: 94910 77009 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఎన్నికల నామినేషన్‌కు వారం ముందు వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
కడుపు మాడ్చుతున్న ఉపాధి
జిల్లాలో కరువు తీవ్ర రూపం దాల్చి విలయతాండవం చేస్తోంది. కనీసం మేరకు పంటలు కూడా లేక వ్యవసాయ భూములు బీళ్లుగామారి ఎడారిని తలపిస్తోంది. కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఉపాధి పనులైనా ఆదుకుంటాయన్న ఆశ కూడా కూలీలకు కానరావడం లేదు. నెలల తరబడి ఉపాధి పనులు చేస్తున్నా వేతనాలు అందక ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, చిత్తూరు:బతుకు జీవనం కోసం ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాల మొత్తాన్ని తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో మొత్తం 47,206 శ్రమ శక్తి సంఘాల ద్వారా 6,41,061 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ఇప్పటి వరకు రూ.622.07 కోట్ల మేరకు వెచ్చించి ఉపాధి పనులు చేశారు. మొత్తం 1.69 లక్షల పనులు చేపట్టగా 85 వేల పనులు పూర్తయ్యాయి. మరో 84 వేల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 2,76,402 కుటుంబాలకు చెందిన 4,47,354 మంది కూలీలకు 1,62,53,426 పనిదినాలు కల్పించడం జరిగింది. అందులో పురుషులు 2,01,978 మంది, మహిళలు 2,45,376 మంది ఉన్నారు. అందని వేతనాలు గత ఏడాది డిసెంబర్ 2వ తేది నుంచి ఇప్పటి వరకు చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు 25.14 లక్షల పని దినాలకు గాను రూ. 50,29,57,865 మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అదేగాక మెటీరియల్ కాంపెనెంట్ కింద రూ. 103.85 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అందులో పంచాయతీరాజ్ పనులకు రూ. 65.69 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపెనెంట్ మొత్తం రూ. 154 కోట్ల మేరకు ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టించుకోని ప్రభుత్వం జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు శనివారం వేతనాలను అందించాల్సి ఉంది. ఈ వేతనాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా కూలీల బ్యాంకు, పోస్టాఫీసుల్లోని ఖాతాలకు జమచేయాల్సి ఉంది. అయితే గత డిసెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు వేతనాలు పూర్తిగా నిలిచిపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. దీని ప్రభావంతో కూలీల సంఖ్య 90 వేల నుంచి 65 వేలకు పడిపోయింది. వేతనాలు అందక.. పనులులేక ఉపాధి హామీ పనుల వేతనాలు నెలల తరబడి రాకపోవడంతో కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇతర పనులకు వెళ్లాలన్నా కరువు పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు కూడా అంతంత మాత్రంగా ఉంది. దీంతో కూలీలకు ఇతర పనులు దొరక్క, ఉపాధి పనులకు వెళ్లలేక అవస్థలు పడాల్సి వస్తోంది. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఇప్పటికే వేలాది మంది కూలీలు తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వలసలు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని బతులతో జీవనం సాగిస్తున్నారు. ముఖ్యమంతి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోనే నిత్యం సుమారు 10 వేల మంది కూలీలు ఉదయం బెంగళూరుకు వెళ్లి కూలీ పనులు చేసి రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. -
కృష్ణార్పణం
అది మారుమూల ప్రాంతం. అక్కడ ఏం జరిగినా.. ఏం చేసినా తొంగిచూసే దిక్కులేదు.. అడ్డుకునే చేతుల్లేవు.. అదే అధికార పార్టీనేతకు కలిసొచ్చింది. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాడు. ఇదే అదునుగా ఆక్రమణకు తెగబడ్డాడు. అడ్డగోలు దందా సాగించాడు. ఎకరాల కొద్దీ చదును చేసి సాగులోకి తెచ్చుకున్నాడు. ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు ఒత్తిళ్లకు చిత్తయ్యారు. ఇష్టారాజ్యంగా పట్టాలిచ్చి చేతులు దులుపు కున్నారు. అన్నీ తెలిసినా జిల్లా ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం గమనార్హం. సాక్షి, చిత్తూరు: పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం బూడిదవేడు రెవెన్యూ గ్రామం పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి పెద్దఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఎకరాల వరకు స్వాహా చేశాడు. రాళ్లురప్పలను తొలగించాడు. మొక్కలు, కంప చెట్లను తీసేసి యంత్రాలతో చదును చేశాడు. ట్రాక్టర్లతో దున్నకాలు చేపట్టి దర్జాగా జామ, అల్ల నేరేడు తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఇప్పటికే పది ఎకరాల్లో దానిమ్మ నేరేడు సాగులోకి తెచ్చాడు. అనధికారికంగా బోర్లు కూడా వేసుకున్నాడు. సాక్షి పరిశోధనతో వెలుగులోకి.. వాల్మీకిపురం మండలంలో అధికార పార్టీ నాయకుడు కృష్ణారెడ్డి ఆగడాల గురించి గతంలో కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో పర్యటించి శోధిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బూడిదవేడు రెవెన్యూ గ్రామం 521/1, 560/2 సర్వే నంబర్లలో 16.98 ఎకరాలు, 483, 497, 521/3, 561 సర్వే నంబర్లలో 23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. అనుమతి లేకుండా బోర్లు వేశాడు. దర్జాగా ముళ్లపొదలతో కంచె వేసుకొని సాగు చేసుకుంటున్నాడు. ఒకే ఇంట్లో నలుగురికి.. కృష్ణారెడ్డికి భూములు అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు నిబంధనలను గాలికొదిలేశారు. కృష్ణారెడ్డి, ఆయన భార్య, కూతురు, అమ్మకు విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. ఎలాంటి ఆసరాలేని వారికే ప్రభుత్వ భూమిని ఇవ్వాలని నిబంధన. కానీ కృష్ణారెడ్డికి భూమి ఇచ్చే విషయంలో ప్రాథమిక నిబంధనలు కూడా పాటించలేదు. 560/2 సర్వే నంబరులో కృష్ణారెడ్డి భార్య లక్ష్మీదేవికి 4.92 ఎకరాలు, 521/1 సర్వే నెంబరులో కృష్ణారెడ్డి తల్లి సరస్వతమ్మకు 4.92 ఎకరాలు, కృష్ణారెడ్డి కూతురు బిందుకు 522/4,522/2,523/4 సర్వే నంబర్లలో4.93 ఎకరాలు, సర్వే నంబరు 560/1లో 2.21 ఎకరాలు కృష్ణారెడ్డి సమీప బంధువుకు రెవెన్యూ అధికారులు అప్పనంగా రాసిచ్చేశారు. టీడీపీ నాయకుల చేతుల్లో.. విలువైన ప్రభుత్వ భూములన్నీ టీడీపీ నాయకుల కబంధ హస్తాల్లోకి వెళుతున్నాయి. వీరి ధాటికి కొండలు గుట్టలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిన అధికారులు ఒత్తిళ్లకు లొంగుతున్నారు. సాక్షాత్తు జిల్లా అత్యున్నతాధికారే టీడీపీ నాయకుల భూ కబ్జాలపై మౌనంగా ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు చేశా పైన పేర్కొన్న భూములను వెంకటరమణ, చిన్నప్ప, నారాయణ తదితరుల నుంచి కొనుగోలు చేశా. వాటిని కూడా వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు కూడా సర్వే చేసుకుని వెళ్లారు. భూమి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తీసుకోమని చెప్పాను. నాపై బురద చల్లడానికే కబ్జా ఆరోపణలు. – కె.కృష్ణారెడ్డి, టీడీపీ నాయకుడు, వాల్మీకిపురం సర్వే చేశాం.. రిపోర్టు సిద్ధం చేస్తున్నాం.. కృష్ణారెడ్డి ఆక్రమించారు అంటున్న భూములపై ఇప్పటికే విచారణ జరిపాం. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకా నివేదిక సమర్పించలేదు. పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఆలస్యమవుతోంది. రెండు మూడు రోజుల్లో నివేదికను సబ్ కలెక్టర్‌కు సమర్పిస్తాం.– కళావతి, తహసీల్దార్, వాల్మీకిపురం కిశోర్ అండ ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురికాకుండా రక్షణ కల్పించాల్సిన వారే భూ దోపిడీకి సహకరిస్తున్నారు. పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కిశోర్‌కుమార్ రెడ్డి అండతో కృష్ణారెడ్డి రెచ్చిపోతున్నారు. కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈయన భూ బాగోతంపై అప్పటి సబ్‌కలెక్టర్ గుణభూషణ్ రెడ్డి గత సంవత్సరం ఏప్రిల్ 19న విచారణ చేయాలని వాల్మీకిపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కనీసం సర్వేయర్‌ను కూడా పంపిన దాఖలాలు లేవు. విచారణ ఆపేయాలని తహసీల్దార్‌పై పెద్ద ఎత్తున కిశోర్‌కుమార్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. రోడ్డు సర్వే, రైల్వే ట్రాక్ సర్వే అంటూ విచారణ వాయిదా వేస్తున్నారు. -
పింఛన్‌పై వంచన
టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. లబ్ధిదారులకు చెక్కులు, పింఛన్లు పంపిణీ చేసే సమయంలో టీడీపీ నేతలు ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? అంటూ ప్రశ్నించడం కనిపించింది. టీడీపీకి వేస్తానంటే ఓకే.. తటపటాయిస్తే ఒత్తిడి తేవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లా ఉన్నతాధికారులు కూడా టీడీపీ కార్యకర్తల్లా పనిచేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనానికి తూట్లుపొడవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. సాక్షి, తిరుపతి: ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు పోస్ట్‌డేటెడ్ చెక్కులు, వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను శనివారం పంపిణీ చేసింది. సాధారణంగా పింఛన్లను అధికారులే లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. శనివారం చేపట్టిన కార్యక్రమాన్ని అందుకు భిన్నంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసిన వేదికలను పూర్తిగా పార్టీ జెండాలు, పసుపు బ్యానర్లు, పార్టీ నాయకుల ఫ్లెక్సీలతో నింపేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి బంధువులు, లబ్ధిదారులందర్నీ పసుపురంగు దుస్తులతో కార్యక్రమానికి హాజరు కావాలని హుకుం జారీచేశారు. తప్పని పరిస్థితుల్లో అనేకమంది పసుపు రంగు దస్తులతో రావడం కనిపించింది. పెన్షన్‌దారులు, డ్వాక్రా సభ్యులకు చేతిలో డబ్బు, చెక్కులతో పాటు పార్టీ ప్రచార పత్రాన్ని పెట్టి టీడీపీకి ఓటెయ్యండి అని అడగడం కనిపించింది. చంద్రబాబు గురించి చెప్పిందే చెప్పి లబ్ధిదారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. లబ్ధిదారులకు తిప్పలు వృద్ధులు, వితంతువులు, మహిళలపై టీడీపీ నేతలు దౌర్జన్యం, దబాయింపుల తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పింఛన్లు, చెక్కుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, వృద్ధులకు టీడీపీ నాయకులు, అధికారులు చుక్కలు చూపించారు. లబ్ధిదారులను ఉదయం 9 గంటలకు రమ్మని చెప్పి టీడీపీ నేతలు ఆలస్యంగా రావడం కనిపించింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాలు అన్నీ ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నేతలు రాకపోవడంతో సభలను సకాలంలో నిర్వహించలేదు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో వృద్ధులకు కుర్చీలు లేకపోవడంతో నిలబడే కనిపించారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమాలు సాయంత్రం వరకు సాగాయి. అనేక చోట్ల లబ్ధిదారులు సాయంత్రం వరకు అక్కడే ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలాఉంటే టీడీపీ నేతలు పోటీపడి ఒకరు డబ్బులు, మరొకరు పెన్షన్ బుక్కు, ఇంకొకరు స్వీటు, ప్రచార పత్రాలను పంచారు. కార్పొరేషన్ ఉద్యోగులను పక్కకు నెట్టి టీడీపీ నేతలు పంపిణీ చేపట్టడంతో చేసేదిలేక ఉద్యోగులు మిన్న కుండిపోయారు. జిల్లాలో అనేక ప్రాం తాల్లో లబ్ధిదారులు ఆకలితో అలమటిం చాల్సి వచ్చింది. కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడం, టీడీపీ నేతలు చెప్పిందే చెప్పి సమయాన్ని వృథా చేయడం వచ్చినవారి సహనాన్ని పరీక్షించింది. కార్యక్రమం ఆలస్యం అవుతుందని తెలిసి కూడా లబ్ధిదారులకు కొన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆకలితో అలమటించారు. సాయంత్రం వరకు కడుపు మాడ్చుకుని వేచి ఉన్నా కొందరికి చెక్కులు, పింఛన్లు ఇవ్వకుండా మరుసటి రోజు రండి అని చెప్పి తిప్పి పంపడం గమనార్హం. పింఛన్ పాట్లు ఎన్నో బంగారుపాళ్యం మండలంలో జరిగిన పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీలో ఎంపీపీ, ఏపీఎం, సంఘమిత్రలు వివాదాస్పద వాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతి గ్రూప్ సభ్యులకు చెక్కులు, పింఛన్లు నిలిపివేయమని ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చెవిరెడ్డిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేవారందరికీ పింఛన్లు, చెక్కులు ఇస్తామని చెప్పి టీడీపీ నాయకులు పిలి పించుకున్నారు. సమావేశం అయ్యాక కొందరికి మాత్రం ఇచ్చి మిగిలిన వారిని తిప్పి పంపేశారు. పాలసముద్రం మండలంలో పింఛన్‌దారుల వద్ద వేలిముద్రలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెనక్కు పంపించారు. పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు భోజనాలు లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వచ్చింది. చంద్రగిరి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాల్లో కార్యక్రమానికి హాజరైన వారంతా పస్తులతో అలమటించారు. మదనపల్లెలో భోజనాలు వడ్డించేవారు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలమనేరు నియోకవర్గంలో మాత్రం లబ్ధిదారులకు బిర్యానీ అన్నం, కోడిగుడ్లు పెట్టారు. కుప్పంలో వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిరీక్షించి వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు చాలీచాలని భోజనాలతో తిప్పలు పడ్డారు. -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం
-
బోగస్ ఓట్లకు బీఎల్వోలు సై
బోగస్ ఓట్లను టీడీపీ నేతలు అధికార బలంతో ఓటరు జాబితాలో చేర్చారు. తాజాగా విడుదలైన తుది ఓటర్ల జాబితాలో 14 నియోజకవర్గాల్లో కోకొల్లలుగా బోగస్ ఓట్లు దర్శనమిచ్చాయి. దీనిపై ‘సాక్షి’ ఫోకస్ కథనం. చిత్తూరు కలెక్టరేట్ : అధికార తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో బీఎల్వోలను లోబర్చుకుని ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లను సృష్టించింది. ఓటర్ల పేర్లలో చిన్న చిన్న మార్పులు చేసి నకిలీ ఓట్లను జాబితాలో చేర్చేలా కుట్ర పన్నింది. అధికారంలోకి రావడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న అడ్డదారి ప్రయత్నాలు విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం ఒకరికి ఒకే ఓటు హక్కు ఉండాలి. అయితే ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను వేయించేం దుకు కుట్ర చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలో లేని ఓట్లను, ఒక్కొక్కరికి రెండు, మూడు చొప్పున సృష్టించారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాను పరిశీలించగా సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర నాథరెడ్డి ప్రాతినిధ్యం వహించే రెండు నియోజకవర్గాలలో అధిక శాతం బోగస్ ఓట్లు దర్శనమిచ్చాయి. తుది ఓటర్ల జాబితా ప్రకారం సాక్షి క్షేత్ర స్థాయిలో పరిశీలించగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. తప్పెవరిది... గతంలో తయారు చేసిన ఓటర్ల సవరణ జాబితాలో అనేక బోగస్ ఓట్లు తలెత్తిన విషయాన్ని వాస్ట్ సంస్థ గుర్తించింది. ఈ తప్పుల తడకపై రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే బోగస్ ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం స్వయంగా కలెక్టర్ ప్రద్యుమ్న క్షేత్రస్థాయిలో ముమ్మర పరిశీలనలు, తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిం చారు. తర్వాత 13,852 అనుమానిత ఓట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రక్రియలో అలసత్వం వహిం చిన ఏఈఆర్వో(తహసీల్దార్), ఈఆర్వో, బీఎల్వో, కంప్యూటర్ ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టాక తాజాగా విడుదలైన తుది ఓటర్ల జాబితాలోనూ అనేకంగా బోగస్ ఓట్లు దర్శనమిచ్చాయి. ఎన్నికల ఓటర్ల ప్రక్రియ పరిశీలకుడు శ్రీనివాస్శ్రీనరేశ్ మూడుసార్లు జిల్లాలో పర్యటిం చారు. 66 మంది ఏఈఆర్వోలు, 14 మంది ఈఆర్వోలు, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ ముసాయిదా జాబి తాను తయారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఇంత మంది చేసిన కసరత్తులో తప్పులు తలెత్తడం విమర్శలకు తావిస్తోంది. తయారవ్వని పారదర్శకమైన ఓటర్ల జాబితా.. తాజాగా విడుదలైన ఓటర్ల తుది జాబితాలో బోగస్ ఓట్లు దర్శనమివ్వడంతో జిల్లా యంత్రాంగం పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న తీవ్రంగా చర్యలు చేపట్టారు. క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే బీఎల్వోలు టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారు ఉండడంతో తప్పిదాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓటర్లుగా దరఖాస్తు చేసిన వారినందరిని ఆమోదించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఏఈఆర్వోలు, ఈఆర్వోలు తూతూ మంత్రంగా విధులు నిర్వహించారు. దీంతోనే తుది ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు ఎక్కువగా దర్శనమిచ్చాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత జాబితాలో తలెత్తిన బోగస్ ఓట్లను తొలగించి, పారదర్శకమైన ఓటర్ల జాబితాను ప్రకటించాలని రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళా లెక్చరర్‌పై టీడీపీ నేత దాడి
-
చిత్తూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
భార్య చేతిలో భర్త హతం
శాంతిపురం : మండల కేంద్రమైన శాంతిపురంలో శుక్రవారం రాత్రి ప్రముఖ వ్యాపారి శివాజీగణేషన్ (40) హత్యకు గురయ్యాడు. తానే భర్తను హత్య చేశానని భార్య మాధవీరాణి (35) శనివారం తెల్ల వారుజామున 2 గంటల ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయింది. టీడీపీ నాయకుడు పాండురంగ(పండరి) సోదరుడైన శివాజీగణేషన్ స్థానిక శివా లయం వీధిలో పాండురంగ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం నుంచి ఇంటికి వెళ్లిన ఆయన అర్ధరాత్రి తర్వాత సొంత ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. తమకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, కుమారుడి కోసం మరో పెళ్లి చేసుకుంటానని వేధిస్తుండడంతో హత్య చేసినట్టు భార్య మాధవిరాణి తెలిపింది. ఆమెను పోలీసులు కుప్పం సీఐ కార్యాలయానికి తరలించారు. శివాజీగణేశన్ శరీరంపై పదికి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. అలాగే గొంతు కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన రాళ్లబూదుగూరు ఎస్ఐ వెంకటశివకుమార్ విచారణ ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి సమాచారం సేకరించారు. మృతదేహాన్ని కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. శివాజీ స్వగ్రామమైన రామాపురంలో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. చెదిరిన కుటుంబం మృతుడు శివాజీగణేషన్కు ఇద్దరు కుమార్తెలు సాత్విక, భూమిక ఉన్నారు. తండ్రి హత్య గురికావడం, తల్లి జైలు పాలు కావడంతో వారి రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. అన్నదమ్ములైన పండరి, శివాజీగణేషన్ ఐక్యతకు నిదర్శనంగా ఉండేవారు. తమ్ముడు దూరం కావడాన్ని అన్న జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే కుమారుడి మరణాన్ని చూసి తల్లిని గుండెలవిసేలా రోదిస్తోంది. కాల్ డేటా కీలకమయ్యేనా ? శివాజీ హత్య కేసులో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లకు గట్టి ఆధారాలేవీ లభించలేదు. ఈ తరుణంలో కేసు విచారణకు కాల్ డేటా కీలకంగా మారే అవకాశం ఉంది. శాంతిపురంలోని మొబైల్ టవర్ల నుంచి అర్ధరాత్రిలో వెళ్లే, వచ్చే కాల్స్ పరిమితంగానే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఐదు కంపెనీల సెల్ టవర్ల నుంచి సంఘటనకు ముందు జరిగిన సంభాషణల వివరాలు ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పోలీసులు లోతైన విచారణ జరిపితే హత్య వెనక వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. భార్యే హత్య చేసిందా? తాను ఒక్కతే భర్తను హత్య చేశానని మాధవిరాణి చెబుతోంది. హత్య జరిగిన తీరు చూస్తుంటే పక్కా ప్రణాళికతో చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన గది పక్కనే ఉన్న మరో గదిలో మృతుడి తల్లి ఉన్నారు. ఆమెకు గానీ, ఇరుగు పొరుగు వారికి గానీ శబ్దం వినపడకుండా హత్య చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గదిలోని గోడలపై రక్తపు మరకలు ఉన్నాయి. అవి కత్తిపోట్ల సమయంలో అతను కేకలు వేయకుండా ఎవరైనా నోరు నొక్కిపెట్టారా? అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులకు చిక్కిన కత్తి మధ్య భాగంలో మాత్రమే రక్తం ఉంది. శరీరంపై కనిపిస్తున్న కత్తి పోట్లకు వాడిన ఆయుధం ఏమైంది? కూరగాయలు కోసే సాధారణ కత్తితో వ్యక్తిని పదికి పైగా చోట్ల పొడిస్తే అది వంగిపోవాలి. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న కత్తి చెక్కుచెదరకుండా ఉంది. -
వైద్యం కోసం అప్పులపాలు కాకుండా చూస్తాం
-
60వ రోజు పాదయాత్ర డైరీ
-
తల ప్రాణం బిందెలోకొచ్చింది..
దాహం తీరకపోగా తల బిందెలో ఇరు క్కుపోవడంతో వదిలించుకోవడానికి ఓ శునకం నానా పాట్లు పడింది. బెరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి–దాసార్లపల్లె రహదారిలోని తీర్థం సమీపంలో ఆదివారం ఓ శునకం ప్లాస్టిక్ బిందెలోని నీటిని తాగేందుకు ప్రయత్నించడంతో తల ఇరుక్కుపోయింది. బిందెను విదిలించుకోవడానికి పడిన అవస్థలు వర్ణనాతీతం. చివరకు రహదారి పక్కనే ఉన్న చెట్టును తలపై ఉన్న బిందెతో కొట్టుకుంటూ పగులకొట్టింది. ఉక్కిరిబిక్కిరి అయిన శునకానికి ఊపిరి ఆడడంతో పొలం గట్లపైకి వెళ్లింది. – బైరెడ్డిపల్లె -
మదనపల్లెలో దారుణం
- దొంగ అనుకొని మూగ యువకుణ్ని చావగొట్టిన జనం మదనపల్లె రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. సోదరిని పలుకరించేందుకు వెళ్లి వస్తున్న మూగ యువకుడిని అనుమానితుడిగా భావించి జనం కొట్టి చంపిన సంఘటన మదనపల్లె శివారు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె బాబుకాలనీలో ఉంటున్న లారీడ్రైవర్ షేక్ అన్వర్‌బాషా కుమారుడు షేక్ చాన్‌బాషా(24) మాటలు రావు. శుక్రవారం రాత్రి అమ్మచెరువుమిట్ట సమీపంలోని రంగనాథ పెట్రోల్ బంకు వెనుక ఇందిరమ్మ కాలనీలో ఉన్న తన అక్క షాహీన వద్దకు వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో గొర్రెల మంద వద్ద ఉన్న కాలనీవాసులు యువకుడిని అడ్డగించారు. చాన్‌బాషా మూగవాడు కావడంతో మాట్లాడలేక సైగలు చేశాడు. దీంతో వారు చోరీ చేసేందుకు వచ్చాడని భావించి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన చాన్‌బాషా ఇంటికి వె ళ్లి తండ్రి అన్వర్‌బాషాకు జరిగిన విషయాన్ని సైగలతో చెప్పి పడిపోయి ప్రాణాలు వదిలాడు. యువకుడి మృతికి కారకులైన లారీ లోడర్ మస్తాన్, మరో వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో విషాదం
-
మృత్యుఘోష
జిల్లా వాసులపై మృత్యువు విలయతాండవం చేసింది. ఒకే రోజు 11మందిని బలితీసుకుంది. బాలుడి పుట్టువెంట్రుకలు సమర్పించేందుకు శ్రీవారి సన్నిధికి కుటుంబమంతా కలిసి కారులో వెళ్తుండగా లారీ రూపంలో కబళించింది. శనివారం తిరుపతి సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కొల్లూరు మండలం చిలుమూరు లంక వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు విడిచారు. ఈ రెండు ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదం నింపాయి. విధి వారిని వెక్కిరించింది. దైవదర్శనానికి కారులో వెళుతుండగా కంటైనర్ రూపంలో వుృత్యువు కోరలు చాచింది. ఆరుగురి ప్రాణాలను బలిగొంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వద్ద నెత్తురోడిన రోడ్డు, మాంసపు ముద్దలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు స్థానికులను కలచివేసింది. వుృతులంతా గుంటూరు జిల్లా వాసులు. కాగా వారిలో వుుగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శనివారం తెల్లవారుతుండగా చోటుచేసుకున్న మృత్యుఘోషతో తీవ్రవిషాదం నెలకొంది. మరో తొమ్మిది రోజుల్లో ఇంటర్ పరీక్షలు.. అవి పూర్తికాగానే బిడ్డల ఉన్నత భవిష్యత్ కోసం ఏంచేయాలన్న ఆలోచనలతో తలమునకలౌతున్న తల్లిదండ్రులు.. ఇంతలోనే పిడుగులాంటి వార్త వారి గుండెలను చిదిమేసింది. ఏ జరిగిందోనన్న ఆత్రుత...దేవుడా బిడ్డ క్షేమంగా ఉండాలంటూ ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తూ కన్నీటి పర్యంతమైన వారికి చివరికి కడుపుకోతే మిగిలింది. ఒకే కళాశాలలో చదువుతున్న ఐదుగురు మిత్రులూ ఒకే సారి మృత్యువాత పడటంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన శనివారం కొల్లూరు మండలం చిలుమూరు లంకలో చోటు చేసుకుంది. -
గబ్బిలాల్లా వేలాడుతున్నారు
ఇంత జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ నేతలకు పదవులే ముఖ్యం: షర్మిల ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ అడ్డగోలు విభజనకు పూనుకొంది అసలు విభజనకు మూల కారణం చంద్రబాబే.. బ్లాంక్ చెక్కులా ఆయన ఇచ్చిన లేఖ వల్లే ఇంతదాకా వచ్చింది బాబు వెంటనే ఆ లేఖను వెనక్కు తీసుకోవాలి ఆయన, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయి ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అన్నదమ్ముల్లా ఉన్న తెలుగువారి మధ్య కాంగ్రెస్ పార్టీ విభజన పేరుతో చిచ్చు పెట్టిందని, రాష్ట్రం అగ్నిగుండంలా రగులుతుంటే అందులో చలి కాచుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ‘‘వైఎస్ బతికి ఉన్నపుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రం ఆయన మరణించిన నాలుగేళ్లకే తలకిందులైపోయింది.. కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది.. వైఎస్ పెట్టిన ప్రతి పథకాన్నీఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ఒక్క పెన్షన్‌గాని, ఒక్క రేషన్‌కార్డుగానీ ఇవ్వకుండా ఈ నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వారు రాక్షసుల్లా పాలిస్తున్నారు. చేసిన పాపాలు చాలవని చెప్పి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటున్నారు’’ అని నిప్పులు చెరిగారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమకు ఓట్లేసిన ప్రజలకంటే పదవులే ఎక్కువని భావిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా గబ్బిలంలా పదవి పట్టుకుని వేలాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులంతా ఢిల్లీ దర్బారుకు వంగి వంగి సలాములు చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కోట్లాది మంది ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు’’ అని విమర్శించారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యగళం వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదు కాబట్టి.. సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర రెండోరోజు మంగళవారం చిత్తూరు జిల్లాలో సాగింది. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, చిత్తూరులలో జరిగిన బహిరంగ సభల్లో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. షర్మిల ప్రసంగాలకు అడుగడుగునా జనం నుంచి మంచి స్పందన లభించింది. యాత్ర సాగిన మార్గమంతా ఆమెకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. జై జగన్, జయహో వైఎస్ఆర్ అంటూ నినదించారు. నాలుగు సభల్లో షర్మిల చేసిన ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. సీమాంధ్రను ఎడారి చేస్తారా? కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, టీఆర్ఎస్ను తనలో కలుపుకొని కేంద్ర రాజకీయాల్లో బలపడడం కోసం ఈ రోజు గొడ్డలితో నరికినట్లు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటోంది. ఇప్పటికే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మనకు నీళ్లు వదలని పరిస్థితి చూస్తున్నాం. మళ్లీ మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లెలా వస్తాయి? ఇప్పటివరకు అన్నదమ్ముల్లా బతికిన కృష్ణా ఆయకట్టు రైతులంతా తన్నుకోవాల్సిన పరిస్థితి రాదా? రాయలసీమ ప్రాంతంలో అయితే ఒక్క పంటకైనా నీళ్లు వస్తాయా? ఒక్క పూటైనా ఇక్కడి ప్రజలకు అన్నం దొరుకుతుందా? అపుడు గడప గడపకూ ఆత్మహత్యలు జరిగి గ్రామాలన్నీ శ్మశానాలుగా మారవా? పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామని అంటున్నారు.. మరి ఆ ప్రాజెక్టును ఎలా నింపుతారో మాత్రం చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ ఉప్పు నీళ్లు తప్ప మంచినీరెక్కడిది? కృష్ణా, గోదావరి జలాలను అడ్డుకుంటే సీమాంధ్ర ప్రాంతం మహా ఎడారిగా మారదా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.. ఒకప్పుడు మద్రాసు నుంచి పొమ్మన్నారు. పది కాదు, ఇరవై కాదు, అరవై ఏళ్లుగా అందరూ కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌పై ఇప్పుడు మీకు హక్కులు లేవంటున్నారు. ఈ రోజు చదువుకున్న ప్రతి విద్యార్థీ ఉద్యోగం కోసం చూసేది హైదరాబాద్ వైపే! హైదరాబాద్‌పై హక్కు లేదంటే వారంతా ఎక్కడికి వెళ్లాలి? వారిపై ఆశలు పెట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఇస్తే కొత్త రాజధాని కట్టుకోవచ్చని చంద్రబాబు అంటున్నారు... రాజధాని క ట్టుకోవడానికే నిధులన్నీ ఖర్చు చేస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి? ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్, సబ్సిడీ బియ్యం పథకాల అమలుకు నిధులెక్కడి నుంచి వస్తాయి? సీమాంధ్ర ప్రజలు ఎలా బతకాలి? అసలు వారు బతక కూడదనేది మీ ఉద్దేశమా? ఆత్మహత్యలు చేసుకోవాలనేది మీ ఉద్దేశమా? ఈ ప్రశ్నలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అసలు కారణం చంద్రబాబే.. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని నిర్ణయం తీసుకుందంటే దానికి ప్రధాన కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. ఏ షరతులూ లేకుండానే తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఆయన బ్లాంక్ చెక్‌లా లేఖ రాసిచ్చేశారు. ఆ లేఖ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత సాహసం చేసింది. ఇప్పటికైనా చంద్రబాబు తాను రాజీనామా చేసి, తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే ఆలోచన చేయడం లేదు. అసలు రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు? తెలంగాణకు అనుకూలంగా మీరు లేఖ ఎందుకిచ్చారని ప్రజలు నిలదీస్తే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? చేసిందంతా తాను చేసి.. ఇప్పుడు రాష్ట్ర విభజనకు వై.ఎస్.రాజశేఖరరెడ్డే కారణమని చంద్రబాబు అంటున్నారు. అసలు బాబుకు మనస్సాక్షి ఉందా? ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని తన ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, లేఖ వెనక్కి తీసుకోవాలి. పోరాడుతూనే ఉంటాం: విభజన చేస్తే ఒక తండ్రిలాగా అందరికీ న్యాయం చేయాలని మేం చెప్పాం. ‘అందరినీ పిలవండి, చర్చలు జరపండి’ అన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి కూడా మర్చిపోయి నిరంకుశంగా నిర్ణయం తీసుకుంది. న్యాయం చే యడం చేతకాకపోతే ఆ అధికారం ఎందుకు తీసుకుందీ కాంగ్రెస్ పార్టీ? మీరు న్యాయం చేయలేరు, అసలు మీకు న్యాయం చేసే ఉద్దేశమే లేదనేది స్పష్టంగా తేలిపోయింది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం.. అప్పటి దాకా జగనన్న నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుందని హామీ ఇస్తున్నాం. బోనులో ఉన్నా జగన్ సింహమే..: విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్మూ, ధైర్యం కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండింటికీ లేవు. అందుకే కుట్రలు పన్ని జగనన్నను జైల్లో పెట్టారు. కానీ ఒక్కటే చెబుతున్నా...బోనులో ఉన్నా సింహం సింహమే(షర్మిల ఈ మాటలంటున్నపుడు సభా ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మార్మోగింది). దేవుడి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడి దయ వల్ల జగన్ తప్పక బయటకు వస్తారు. రాజన్న రాజ్యం వస్తుంది. ఆరోజు వచ్చే వరకూ జగనన్నకు మీరంతా మద్దతు నివ్వాలని ప్రార్థిస్తున్నాను.’’ అడుగడుగునా జన నీరాజనం సాక్షి, తిరుపతి : షర్మిల బస్సు యూత్రకు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. వివిధ ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ షర్మిల మాట్లాడాల్సిందేనని జనం పట్టుబట్టారు. మంగళవారం తిరుపతిలో ఉదయం 9.30 గంటలకు బయలు దేరిన ఆమె 10.30 గంటలకు చిత్తూరు చేరుకోవాల్సి ఉంది. అడుగడుగునా అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలకడంతో మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకున్నారు. చంద్రగిరిలో పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు జై జగన్ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. నేండ్రగుంట వద్ద వేంకటే శ్వర స్వామి ఆలయం పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆమెను ఆశీర్వదించారు. చిత్తూరు రైల్వే గేటు వద్ద వందలాది మంది ఎదురేగి స్వాగతం పలికారు. పుంగనూరులో పాఠశాల విద్యార్థులు బారులు తీరి సాదరంగా ఆహ్వానించారు. పలుచోట్ల మేడలపై నుంచి పూల వర్షం కురిపించారు. మార్గ మధ్యంలో పలు చోట్ల సమైక్య వాదులు, జేఏసీ నాయకులు షర్మిలకు అభినందనలు తెలిపారు. నేడు ‘అనంత’లో షర్మిల సమైక్య శంఖారావం సాక్షి ప్రతినిధి, అనంతపురం: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర బుధవారం అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ వెల్లడించారు. అందరూ రాజీనామాలు చేసుంటే.. ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ ఒక వైపు, స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు మరో వైపు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరుగుతోందని హఠాత్తుగా సంకేతాలు వెలువడుతున్నపుడే అందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. విభజన నిర్ణయం మార్చుకునేలా చేయడానికి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు? అందరూ రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ నిలిచి ఉండేది కదా!’’ ఆ కొరడాతో బాబును కొట్టి ఉంటే.. పార్లమెంటు ప్రాంగణంలో టీడీపీ ఎంపీ తనను తాను కొరడాతో శిక్షించుకునే బదులుగా అదే కొరడాతో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కొట్టి ఉంటే తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఉండే వారని షర్మిల అన్నారు. విభజనలో కాంగ్రెస్‌కు ఎంత బాధ్యత ఉందో చంద్రబాబుకు కూడా అంతే బాధ్యత ఉందని ఆమె దుయ్యబట్టారు. వీరిద్దరి కుమ్మక్కు వల్లనే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. పలమనేరులో ఒక చోట చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బొమ్మతో కూడిన బ్యానర్ కట్టి ఉండటాన్ని షర్మిల చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలను ప్రజలు ఈలలు, చప్పట్లతో స్వాగతించారు. వాస్తవానికి పలమనేరు సభ షర్మిల యాత్ర షెడ్యూల్లో లేదు. అయితే షర్మిల అటుగా వస్తున్నారని తెలిసి అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారినుద్దేశించి ఆమె ప్రసంగించారు. సమైక్య ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న జేఏసీ నేతలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. పుంగనూరు సైతం షెడ్యూల్లో లేనప్పటికీ ఇలాగే ప్రజలు పెద్ద ఎత్తున చేరడంతో ఆమె వారినుద్దేశించి కాసేపు మాట్లాడారు. మంగళవారం షర్మిల యాత్రలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎ.వి. ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఎన్.అమరనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నారాయణస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.వి.గాయత్రి, చిత్తూరు, మదనపల్లె కోఆర్డినేటర్లు ఎ.ఎస్.మనోహర్, షమీమా అస్లం సహా పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.