
సాక్షి, చిత్తూరు : ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రేణిగుంట రైల్వే అధికారులు ప్రమాదం గురించి తెలుసుకొని ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో ఆమార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.