Erpedu
-
ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబెడతాం: గుడివాడ అమర్నాథ్
-
తిరుపతి అంటే గుళ్ళు గుర్తొస్తుండే.. కానీ ఇప్పుడు: మధుసూధన్‌రెడ్డి
-
సన్నీ ఆప్కో టెక్ ద్వారా 3 వేలమందికి ఉపాధి: సీఎం వైఎస్ జగన్
-
సన్నీ అపోటెక్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ సంస్థను ప్రారంభించిన సీఎం జగన్
-
బెల్ట్ షాప్ వద్దన్నాడని.. సామాజిక బహిష్కరణ!
ఏర్పేడు (తిరుపతి): గ్రామంలో మద్యం అమ్మరాదని ప్రశ్నించాడని ఓ వ్యక్తిని గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన మండలంలోని కొత్తవీరాపురంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం.. గ్రామానికి చెందిన పెద్దమనుషులు రామదాసు, కృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, కుమార్, గిరిబాబు గ్రామంలో మద్యం అమ్మకాలకుగాను ఆదివారం రాత్రి వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పెరిబ్బ, నాగభూషణమ్మ బెల్టు షాపును వేలంలో రూ.75 వేలకు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కృష్ణయ్య మద్యం అమ్మడానికి వీలులేదని వ్యతిరేకించాడు. దీంతో కృష్ణయ్యతో మాట్లాడినా, ఇంటికి వెళ్లినా, పనులకు వెళ్లినా వారికి జరిమానా విధించి గ్రామ బహిష్కరణ చేస్తామని సోమవారం రాత్రి దండోరా వేశారు. అయితే గ్రామస్తులు దండోరా వేసే వ్యక్తిని మందలించి పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించినట్లు సమాచారం. చదవండి: (Raptadu: టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య) -
గల్లంతైన రైతు ప్రసాద్ మృతదేహం లభ్యం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మల్లెమడుగు వరద ఉధృతిలో నిన్న గల్లంతు అయిన రైతు ప్రసాద్ మృతి చెందాడు. ప్రసాద్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం శుక్రవారం వెలికి తీసింది. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా రేణిగుంట సమీపంలోని రాళ్లవాగులో నిన్న ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. వాగులో ఉన్న విద్యుల్ మోటార్లను తీసుకొచ్చేందుకు ఉదయం వాగులో దిగారు. మల్లిమడుగు నుంచి వరదనీరు రావడంతో వాగులోనే చిక్కుకుపోవడంతో ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వాగులో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందులో ప్రసాద్ అనే రైతు గల్లంతయ్యారు. గల్లంతు అయిన ప్రసాద్ కోసం నిన్నటి నుంచి గాలించగా ఇవాళ మృతదేహం లభించింది. చదవండి: (రాగుళ్లవాగులో కొట్టుకుపోయిన ముగ్గురు రైతులు) -
వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు
సాక్షి, చిత్తూరు: పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురు రైతులు వాగులో చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు రైతులను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించాయి. గల్లంతు అయిన మరో రైతు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: తీరాన్ని దాటిన నివర్ తుపాను..) -
ఆంధ్ర- కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రబావి వద్ద వేగంగా వచ్చిన లారీ ఇన్నోవాను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్ణాటక మధుగిరి ఆసుపత్రికి తరలించారు. కాగా బెంగళూరు నుంచి పావగడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. కృష్ణా : జిల్లాలోని నందిగామ మండలం మునగచర్ల గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ఎస్వీకేడీటీ ట్రావెల్స్ బస్సు మునగచర్ల సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ, బస్సు రెండు బోల్తా పడ్డాయి. కాగా ప్రమాదంలో బస్పులో ఉన్న 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కపోయిన డ్రైవర్, క్లీనర్లను స్థానికులు సురక్షితంగా బయటికి తీశారు. చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు కాగా.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్ తప్ప ఎవరు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. -
ఇసుకాసురులే రోడ్డెక్కారు..
సాక్షి, తిరుపతి: దొంగే.. దొంగ దొంగ అన్న చందంగా టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను నడిపిన వ్యక్తులే నేడు ఇసుక కొరతంటూ ఆందోళనకు దిగటం చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమరవాణాను అరికట్టండి మహాప్రభో అంటూ ఇసుకాసురులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 16 మంది ప్రాణాలు పోవటానికి కారకులైన వ్యక్తులు నేడు ఇసుక సమస్యపై ధర్నా చేయటం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ నాయకులతో కలిసి శనివారం చిత్తూరు జిల్లా ఏర్పేడులో రోడ్డుపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఏర్పేడు మండలం గోవిందవరం–మునగళపాలెం స్వర్ణముఖి నది నుంచి ఇసుకను స్థానిక టీడీపీ నాయకులు మాజీ జడ్పీటీసీ ధనుంజయనాయుడు, నాగరాజునాయుడు, చిరంజీవులునాయుడు విచ్చలవిడిగా తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునేవారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు పలుమార్లు అడ్డుకున్నారు. అయినా టీడీపీ నాయకులు లెక్కచెయ్యలేదు. దీంతో రెవిన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చెయ్యాలని మునగళపాలెం, గోవిందవరం పరిసర ప్రాంతాలకు చెందిన వారు మూకుమ్మడిగా 2017 ఏప్రిల్ 21న ట్రాక్టర్లలో ఏర్పేడుకు చేరుకున్నారు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆ సమయంలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న లారీ వారిపై దూసుకెళ్లింది. 16 మంది మృతి చెందారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారి వల్లే ఇది జరగడంతో టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తర్వాత వారు బెయిల్‌పై వచ్చారు. ఇసుకాసురులే ధర్నా: టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ఇసుక కొరతపై ధర్నా చేపట్టారు. ఏర్పేడులో చేపట్టిన ధర్నాలో 16 మంది ప్రాణాలు కోల్పోవటానికి ప్రధాన కారకులైన మాజీ జడ్పీటీసీ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో నాగరాజు నాయుడు, చిరంజీవులు ముందు నిలబడ్డారు. అప్పట్లో ఇసుకను యధేచ్ఛగా తోడేసిన వారే ఈ ధర్నాలో పాల్గొనడంపై స్థానికులు విస్తుపోయారు. -
పట్టాలు తప్పిన కేరళ ఎక్స్‌ప్రెస్
సాక్షి, చిత్తూరు : ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం జిల్లాలోని ఏర్పేడు వద్ద పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రేణిగుంట రైల్వే అధికారులు ప్రమాదం గురించి తెలుసుకొని ఇతర అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో ఆమార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
గ్యాస్ దుర్ఘటన.. నిద్రలో ఉండగానే..
-
గ్యాస్ దుర్ఘటన.. నిద్రలో ఉండగానే..
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వివరాలు.. భార్య పిల్లలతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి స్థానికంగా నివాసముంటున్నాడు. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో వాళ్లింట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని స్థానికులు తెలిపారు. కాగా, గ్యాస్ ఆఫ్ చేయడంలో నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకైంది గ్రహించక ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం జరగొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో శ్రీనివాసులురెడ్డి, బుజ్మమ్మ, నితిన్, భవ్య నిద్రలోనే ప్రాణాలొదిలారని పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉండగా.. శ్రీనివాస్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండడంతో.. ఘటనకు సంబంధించి ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, శ్రీనివాస్‌రెడ్డికి ఎవరితో విభేదాలు లేవని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోవడంతో రాజులకండ్రిగలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. -
ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం
-
ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం
తిరుపతి: చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీని డ్రైవర్‌కు బదులు క్లీనర్ నడిపినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. లారీని క్లీనర్ నడుపుతున్న దృశ్యాలు కడప సమీపంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం. డ్రైవర్ గురవయ్య లారీని నడిపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నాయుడుపేటలో లారీ యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. క్లీనర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏర్పేడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లి, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన దుర్ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా, మరో 15 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
క్షణాల్లో పెనువిషాదం!
ఏర్పేడులో మరణ మృదంగం వల్లకాడైన మునగలపాలెం తిరుపతి/ఏర్పేడు : ఏర్పేడులో మరణ మృదంగం మోగింది. కన్నుమూసి తెరిచేలోగా 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హాహాకారాలు, ఏడుపులు, రోదనలు మిన్నంటాయి. రక్తపు మడుగులో తడిసి ముద్దయిన అభాగ్యులు కొందరైతే, మాంసపు ముద్దలుగా మారి విగతజీవులైన వారు మరికొందరు. ఏర్పేడు పోలీస్‌స్టేషన్ ముందు శుక్రవారం భయానక వాతావరణం నెలకొంది. మృత్యువులా దూసుకొచ్చిన లారీ రైతులు, వ్యవసాయ కూలీలను పొట్టన పెట్టుకుంది. పచ్చని పల్లెలో కన్నీటి సుడులు మునగలపాలెం...పచ్చని పల్లెటూరు. పాడి పంటలకు కొదవ లేని ఊరు. అందరూ అనుభవం ఉన్న రైతులే. ఒక్కటే సమస్య. ఇసుక మాఫియా. అధికార పార్టీ అండదండలతో అధికారులకు మామూళ్లు సమర్పించే ఇసుకాసురులే గ్రామస్తుల పాలిట శాపంగా తయారయ్యారు. వీరి ఆగడాలు అడ్డుకుని, స్వర్ణముఖిలో ఇసుక దోపిడీని అరికట్టాలన్న గ్రామస్తుల నివేదనను పట్టించుకునే అధికారులే లేకుండా పోయారు. కడుపు మండిన బాధిత రైతులు చేతులు కలిపారు. సమస్యపై ఉద్యమించేందుకు సమాయత్తమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పేడు చేరుకుని ధర్నాకు సిద్ధమయ్యారు. పోలీస్‌స్టేషన్ తనిఖీకి వచ్చిన ఎస్పీ జయలక్ష్మికి విషయాన్ని వివరించి, ఇంటి ముఖం పట్టాల్సిన రైతులను ఒక్కసారిగా మృత్యువు రూపంలో వచ్చిన లారీ కబళించింది. ఈ దుర్ఘటనలో 15 మంది దుర్మరణం పాల య్యారు. ఈ హఠాత్పరిణామానికి మునగలపాలెం గొల్లుమంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన వారే ఎక్కువ. పోస్ట్‌మార్టం పూర్తయి రాత్రి 9 గంటలకు ఊరు చేరిన శవాలను చూసి వీధివీధినా రోదనలే. ఉదయం హుషారుగా వెళ్లి రాత్రికి విగతజీవుౖలై తిరిగొచ్చిన తండ్రులను చూసి బిడ్డలు కంటికి కడివెడై విలపించారు. మృతుల కుటుంబాలకురూ.5 లక్షలు తిరుపతి రుయా ఆస్పత్రిని సందర్భించిన కలెక్టర్ ప్రద్యుమ్న మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ అధికారులు, రుయా, స్విమ్స్ ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఏర్పేడులో లారీ బీభత్సం, 20మంది మృతి
-
అనుమానం పెనుభూతమై
-
అనుమానం పెనుభూతమై
⇒ భార్యను నరికి చంపిన భర్త ⇒ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగుబాటు కష్ట సుఖాల్లో తోడునీడగా ఉంటానని పెళ్లి రోజు చేసిన బాసలను అతను మరిచి పోయాడు. అనుమానంతో విచక్షణ కోల్పోయాడు. కత్తితో భార్యను నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేశానంటూ వీధిలోకి వచ్చి కేకలు వేసి పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీకాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఏర్పేడు : భార్యను కత్తితో నరికి చంపిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రేణిగుంట మండలం మల్లిమడుగు ఎస్టీ కాలనీకి చెందిన పంజాపి గోవిందయ్య కుమారుడు అయ్యప్ప(32)కి శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరు ఎస్టీ కాలనీకి చెందిన పాముల మహాలక్ష్మి కుమార్తె ప్రభావతి(28)తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చీరాలమ్మ(07), జయచంద్ర(05), హేమ(03) పిల్లలు ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి అయ్యప్ప భార్య ప్రవర్తనపై అనుమానించేవాడు. వేరేవారితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను చితకబాదేవాడు. పిల్లలను చూసి ఆమె అన్ని బాధలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఏడాది క్రితం కుటుంబాన్ని ఏర్పేడు మండలం కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి మార్చాడు. కొన్ని నెలల వరకు భార్యతో మంచిగా నడచుకున్నాడు. తర్వాత మళ్లీ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కత్తితో భార్యపై దాడి చేశాడు. మెడపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం అను వీధిలోకి వచ్చి భార్యను నరికేశానంటూ కేకలు వేశాడు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రామకృష్ణ అర్ధరాత్రి వేళ సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ సోమవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరామర్శ స్థానిక ఎంపీటీసీ సభ్యుడు, ఎంపీటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు మండలంలోని కొత్తకండ్రిగ ఎస్టీ కాలనీకి వెళ్లి పిల్లలను పరామర్శించారు. సాయం చేస్తానని చెప్పారు.