గల్లంతైన రైతు ప్రసాద్‌ మృతదేహం లభ్యం | Farmer Prasad Body Was Found At Chittoor District | Sakshi
Sakshi News home page

గల్లంతైన రైతు ప్రసాద్‌ మృతదేహం లభ్యం

Published Fri, Nov 27 2020 11:02 AM | Last Updated on Fri, Nov 27 2020 12:00 PM

Farmer Prasad Body Was Found At Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మల్లెమడుగు వరద ఉధృతిలో నిన్న గల్లంతు అయిన రైతు ప్రసాద్ మృతి  చెందాడు. ప్రసాద్ మృతదేహాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం శుక్రవారం వెలికి తీసింది. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా రేణిగుంట సమీపంలోని రాళ్లవాగులో నిన్న ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. వాగులో ఉన్న విద్యుల్‌ మోటార్లను తీసుకొచ్చేందుకు ఉదయం వాగులో దిగారు. మల్లిమడుగు నుంచి వరదనీరు రావడంతో వాగులోనే చిక్కుకుపోవడంతో  ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది వాగులో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందులో ప్రసాద్‌ అనే రైతు గల్లంతయ్యారు. గల్లంతు అయిన ప్రసాద్ కోసం నిన్నటి నుంచి గాలించగా ఇవాళ మృతదేహం లభించింది.   చదవండి: (రాగుళ్లవాగులో కొట్టుకుపోయిన ముగ్గురు రైతులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement