Nivar Cyclone
-
రైతు శ్రేయస్సే లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. అందుకే తొలి రోజు నుంచీ రైతుల పక్షపాతంగా, రైతు శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా అన్నదాతల కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.61,400 కోట్లు చిరునవ్వుతో వెచ్చించాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, అక్టోబర్‌లో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బ తిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) సొమ్మును మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లో రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అర కోటి మందికి పైగా రైతులకు మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మొత్తంగా రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. ఒక సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం (నెలలోగానే ఇచ్చారు) అందించే మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, ఐదేళ్లలో విడతల వారీగా కనీసం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ అధికారులే తెలిపారని చెప్పారు. ధాన్యం, విత్తనాలు, ఇన్సూరెన్సు, కరెంటు బకాయిలతో పాటు, చివరకు ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ బకాయిలు కూడా ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు రైతులకు చేసిన మోసం అంతా ఇంతా కాదని, ఇది అందరికీ తెలుసని చెప్పారు. ఆ కష్టాలు పడలేక ఆత్మహత్య చేసుకున్న 434 మంది రైతుల కుటుంబాలకు మన ప్రభుత్వం వచ్చాక పరిహారం ఇచ్చామని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆ డ్రామాలు మనమంతా చూస్తున్నాం ► రైతు భరోసా, నివర్ తుపాను బాధిత రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఇవాళ ఇస్తామని గతంలోనే చెప్పాం. నవంబర్ 24న వీడియో కాన్ఫరెన్స్‌లో, 25న సీఎంవో మీటింగులో, 27న కేబినెట్ మీటింగులో, 28న నివర్ తుపానుపై తిరుపతిలో జరిగిన రివ్యూ మీటింగ్‌లో, నవంబర్ 30న అసెంబ్లీలో చెప్పాం. ఆ తర్వాత డిసెంబర్ 18న కేబినెట్ సమావేశంలో కూడా చెప్పాం. అయినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ► ఇన్ని చేస్తున్నా ‘పండ్లు ఇచ్చే చెట్టు మీదే రాళ్లు పడతాయి’ అన్నట్లుగా, బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఎలా డ్రామాలు ఆడిస్తున్నాడో మనమంతా చూస్తున్నాం. ఇది బాధనిపిస్తోంది. గ్రామాల్లో వికాసం ► గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, విత్తనం నుంచి పంటల అమ్మకం వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. ► గ్రామాల్లోనే గోదాములు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామాల్లో జనతా బజార్లు ఏడాదిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటన్నింటికీ రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ► ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, సీఎస్ నీలం సాహ్ని, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం ► వైఎస్సార్ రైతు భరోసా కింద 51.59 లక్షల మంది రైతుల కుటుంబాలకు రూ.13,131 కోట్లు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున ఇవ్వడమే కాకుండా, కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. ► గత ప్రభుత్వం రూ.904 కోట్లు సున్నా వడ్డీ బకాయిలు పెట్టిపోతే, ఆ బకాయిలు తీర్చడమే కాకుండా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఖరీఫ్‌లో రూ.510 కోట్ల పంట రుణాలు చెల్లించాం. ► వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల కోసం రూ.1,968 కోట్లు ఇచ్చాం. రైతుల నుంచి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాం. ► ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు భారీ వర్షాలు, వరదలు, తుపానుల వల్ల 17.25 లక్షల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి 13.56 లక్షల మంది రైతులకు సుమారు రూ.1,038.46 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించాం. ► ధాన్యం కొనుగోలుకు రూ.18,343 కోట్లు వెచ్చిస్తే, ఇతర పంటల కోసం మరో రూ.4,761 కోట్లు వ్యయం చేశాం. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కోసం, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన రూ.8,655 కోట్ల బకాయిలు చెల్లించాం. ► ఫీడర్ల కెపాసిటీ పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించాం. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు టెండర్లను కూడా పిలిచాం. ► గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు చెల్లించాం. విత్తనాల సబ్సిడీ కింద గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.384 కోట్లు చిరునవ్వుతో ఇచ్చాం. శనగ రైతులకు బోనస్‌గా రూ.300 కోట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం. సీఎం చరిత్ర సృష్టించారు గతంలో పంట నష్టం జరిగితే ఎప్పుడు అంచనా వేసేవారో తెలియదు. పరిహారం ఎప్పుడిస్తారో అంతకన్నా తెలియదు. సీఎం జగన్ మాత్రం పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే సహాయం చేస్తున్నారు. చెప్పిన తేదీ కంటే ముందే ఇస్తున్నారు. హామీలన్నీ అమలు చేస్తున్నారు. రైతులందరి తరఫున కృతజ్ఞతలు. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి గత ప్రభుత్వంలో పైసా సాయం అందలేదు నాకు రెండున్నర ఎకరాల పొలం వుంది. నవంబర్‌లో తుపానుకు వరి పంట మొత్తం నీట మునిగి కుళ్లిపోయింది. ఆర్బీకే నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి సర్వే చేసుకుని వెళ్లాడు. పరిహారం కింద ఇప్పుడు రూ.13,360 వచ్చినట్లు ఆర్బీకేలో పెట్టిన జాబితాలో చూసుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో అనేక తుపాన్లు వచ్చినా ఇలా పరిహారం ఎప్పుడూ అందలేదు. ఇప్పుడు రైతులకు సంక్రాంతి ముందుగానే వచ్చింది. అన్ని హామీలూ నెరవేరుస్తున్న మీకు ధన్యవాదాలు. కునుకు నాగరాజు, పాసర్లపూడి, తూర్పు గోదావరి. అడగకుండానే వరాలు ఇస్తున్నారు నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. శనగ, పత్తి పండిస్తున్నాను. నివర్ తుపాను వల్ల పంట నష్టం జరిగింది. ఎకరాకు రూ.నాలుగు వేలు చొప్పున రూ.16 వేలు పరిహారంగా అందింది. రైతు భరోసా కింద ఇప్పుడు రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఈ డబ్బుతో నూగు పంట పెట్టుకుంటాను. రైతు కష్టాలను మీ కష్టంగా.. మా సంతోషంలో మీ సంతోషం వెతుక్కుంటున్నారు. దేవుడు అడిగితేనే వరాలు ఇస్తాడు.. మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నారు. – ఎం.అర్చన, వీఎన్ పల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు రెండున్నర ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేశాను. తుపాను వల్ల పంట నష్టం కింద ఎకరానికి రూ.ఆరు వేల చొప్పున పరిహారం అందింది. రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు రూ.11,500 వచ్చాయి. ఇప్పుడు మరో రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఆర్బీకేల వల్ల ఎంతో మేలు జరుగుతోంది. గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల నా కుమారుడు, కుమార్తెకు ఉద్యోగాలు వచ్చాయి. మీ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. – కె.నాగమణి, తుమ్మపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా మీరు మనసున్న మహారాజు నాకు రెండున్నర ఎకరాల పొలం వుంది. మిర్చి సాగు చేస్తున్నాను. ఈ ఏడాది నివర్ తుపాను వల్ల పంట నష్టం జరిగితే రూ.15 వేలు పరిహారం అందింది. 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడూ ఇలా పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే నష్ట పరిహారం రాలేదు. ఉచిత పంటల బీమా వల్ల ఎంతో మంది రైతులకు ఊరట కలుగుతోంది. మనసున్న మహారాజుగా మీరు చిరకాలం సీఎంగా ఉండాలి. – వి.సాంబశివరావు, వంకాయలపాడు, ఇంకొల్లు మండలం, ప్రకాశం జిల్లా గతంలో పంటనష్టం సర్వేకు 40–50 రోజులు పట్టేది నాకున్న 2.86 ఎకరాల పొలంలో నివర్ తుపాను వల్ల వరి పంట దెబ్బతిన్నది. ఇప్పుడు నష్ట పరిహారం కింద రూ.15 వేలు వచ్చింది. గతంలో పంట నష్టం జరిగితే సర్వే చేయడానికే కనీసం 40–50 రోజులు పట్టేది. కానీ మీరు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా వెంటనే సర్వే చేసి, నెల రోజుల్లోపే పరిహారం అందించడం చాలా గొప్ప విషయం. – పి.ప్రభాకర్ రావు, గుడ్లవల్లేరు మండలం, కౌతవరం గ్రామం, కృష్ణా జిల్లా చంద్రబాబు జూమ్‌కి దగ్గరగా ఉంటారు.. భూమికి దూరంగా ఉంటారు. రైతుల్ని రెచ్చగొడదామని చంద్రబాబు తన పుత్రుడ్ని, దత్తపుత్రుడ్ని.. ఇద్దరిలో ఏ ఒక్కరి మీదా నమ్మకం లేదు కాబట్టి ఇద్దర్నీ రంగంలోకి దించాడు. వీరిద్దరికీ రైతుల కష్టాల గురించి ఏనాడూ పట్టదు. ఆయన చెప్పాడు కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చి హడావుడి చేసి వెళ్లారు. జగన్ ఒక తేదీ చెబితే.. ఆ రోజు చేస్తాడని మీకు తెలుసు. ఇన్పుట్ సబ్సిడీని ఫలానా తేదీన ఇస్తామని చెప్పినప్పటికీ చంద్రబాబు వక్రబుద్ధి చూస్తుంటే బాధనిపిస్తోంది. – సీఎం వైఎస్ జగన్ పెట్టుబడి రాయితీ చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు -
మరో శుభకార్యానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వారికి మరో కానుక అందించింది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కంప్యూటర్లో మీట నొక్కి చెల్లింపుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నాం. మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జమ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులకు మంచి ధరలు రావాలనేదే మా లక్ష్యం. గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచింది. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పింది. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశాం. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రూ.13,101 కోట్లు అందించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు రూ,13,500 ఇస్తున్నాం. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాయం చేశాం. (చదవండి: పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని కౌంటర్) గత ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు తీర్చాం. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ఈ ఖరీఫ్‌కు రూ.510 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం రూ.1,968 కోట్లు చెల్చించాం. భారీ వర్షాలు, తుపాను పరిహారం రూ.1,038 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు చెల్లించాం. ఉచిత విద్యుత్, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఉచిత విద్యుత్ పగటి పూట ఇవ్వడం కోసం రూ.1700 కోట్లు వెచ్చించాం. విత్తనాల సబ్సిడీ కింద రూ.383 కోట్ల బకాయిలు కూడా చెల్లించాం. అధికారంలోకి రాగానే శనగ రైతులకు రూ.300 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతుల కోసం 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు వెచ్చించాం. రైతులకు ఉచిత విద్యుత్ శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి..10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌కు టెండర్లను పిలిచాం. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. గ్రామాల్లో గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, జనతాబజార్లు.. నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు.. ఈ ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 51.59 లక్షల రైతులు లబ్ది పొందనున్నారు. అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా రైతులకు సాయం అందించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ప్రాజెక్టులతో మహా సంక్రాంతి) -
నేడు రైతు ఖాతాల్లోకి రూ.1,766కోట్లు
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేయనుంది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) కింద ఈ నిధుల్ని జమచేస్తోంది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు రూ.646 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయిస్తారు. ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పెట్టుబడి రాయితీ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దీన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరులో నివర్ తుపాను వల్ల కురిసిన భారీవర్షాలు, వచ్చిన వరదలకు వ్యవసాయ, ఉద్యానపంటలు దెబ్బతిన్న రైతులకు అతి స్వల్ప సమయంలో పెట్టుబడి రాయితీ జమ చేస్తున్నారు. ‘నివర్’ బాధితులకు నెలరోజుల్లోనే పెట్టుబడి రాయితీ పంట నష్టపోయిన సీజన్లోనే పెట్టుబడి రాయితీ అందించిన ఘనత దేశ చరిత్రలో వైఎస్ జగన్ సర్కారుకే దక్కింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అక్టోబర్ 27న రైతుల ఖాతాల్లో సర్కారు జమ చేసింది. అక్టోబరులో సంభవించిన భారీ వర్షాలు, వరదలవల్ల నష్టపోయిన రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా నెల రోజుల్లోనే రూ.132 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. నవంబర్ నెలాఖరులో సంభవించిన నివర్ తుపాను వల్ల 12.01 లక్షల ఎకరాలకుపైగా (4,86,339.36 హెక్టార్ల) విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 8.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. వీరి ఖాతాల్లో రూ.645.99 కోట్ల పెట్టుబడి రాయితీని మంగళవారం సీఎం జగన్ జమ చేయనున్నారు. చెప్పినదానికంటే అధికంగా.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన మేరకు ప్రభుత్వ పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా మరో అడుగు ముందుకు వేసింది. వ్యవసాయ రంగంలో సువర్ణ అధ్యాయంగా నిల్చేలా రైతులకు వరసగా రెండో ఏడాది కూడా చెప్పినదానికంటే ముందే వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ సాయం అందిస్తోంది. అధికారం చేపట్టిన తర్వాత రెండో ఏడాది నుంచి వైఎస్సార్ రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన ఈ పథకం కింద పెట్టుబడి సహాయం నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఏటా రూ.12,500కు బదులు రూ.13,500 చొప్పున ఇవ్వాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.67,500 ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినదానికంటే 17,500 ఎక్కువ కావడం గమనార్హం. 51.59 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతుభరోసా కింద తొలివిడత ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మే 15న రూ.7,500, రెండోవిడత అక్టోబరు 27న రూ.4 వేలు రైతుల ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రూ.2 వేలను మూడోవిడతగా ఇప్పుడు ఇస్తున్నారు. 51.59 లక్షలమంది రైతుల ఖాతాల్లో రూ.1,120 కోట్లు మొత్తాన్ని జమ చేస్తున్నారు. కౌలు రైతులు, అటవీ హక్కు పత్రాలు (ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు) పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, అసైన్డ్ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తిస్తోంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు అక్టోబరు 27న ఒకేసారి రూ.11,500 ఇచ్చారు. మిగిలిన రూ.2 వేలు ఇప్పుడు ఇస్తున్నారు. ఈ సొమ్మును బ్యాంకులు బాకీల కింద తీసుకోవడానికి వీల్లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా సంప్రదించేందుకు 155251హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశారు. -
ఏపీలో ముందే వచ్చిన సంక్రాంతి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. రేపు (మంగళవారం) రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపులను ప్రభుత్వం చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత రూ.1,120 కోట్లు చెల్లింపులతో 51.59 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.(చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్) నివర్ తుపాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది. రూ.646 కోట్లు నివర్ పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్.. రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాట ప్రకారం తుపాను బాధితులకు పరిహారం అందనుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా తుపాను బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.(చదవండి: సీఎం జగన్‌కు తమిళ తంబీల ఫాలోయింగ్) -
భారీ నష్టం మిగిల్చిన ‘నివర్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెల చివరి వారంలో వచ్చిన ‘నివర్’ తుపాను రైతులను ముంచేసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. వారం రోజులకు పైగా ఎడతెరపిలేని వర్షాలు కురవడం, పెన్నా, బాహుదా తదితర నదులు ఉధృతంగా ప్రవహించడం, వాగులు, వంకలు ఉప్పొంగడంతో లక్షలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి పొలాల్లోనే కుళ్లిపోయింది. అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టమోటా, వంగ, మిరప తోటలు కుళ్లిపోయాయి. ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన కుండపోత వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు అక్కడక్కడా మిగిలి ఉన్న పంటలను ‘నివర్’ నాశనం చేసింది. నివర్ తుపాను రాయలసీమ జిల్లాలపైనే అధిక ప్రభావం చూపింది. నివర్ వల్ల వివిధ రంగాలకు రూ. 5,324.03 కోట్ల నష్టం వాటిల్లినట్లు క్షేత్రస్థాయి ప్రాథమిక అంచనా. ఇందులో రూ. 3,167.14 కోట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలదే కావడం గమనార్హం. కాగా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలకు నష్టపోయిన రైతులకు ఒక నెలలోనే పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. నివర్‌తో నష్టపోయిన రైతులకు ఈ నెలాఖరున పెట్టుబడిరాయితీ ఇచ్చి రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించింది. ఆరు జిల్లాల్లో అత్యధిక ప్రభావం.. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో 199 మండలాల పరిధిలోని 2,105 గ్రామాలపై ‘నివర్’ తుపాను ప్రభావం పడింది. ► 12 పురపాలక సంస్థలు/నగర పాలక సంస్థల్లో కూడా నివర్ తుపాను వల్ల భారీ నష్టం జరిగింది. ► వైఎస్సార్ కడప జిల్లాలోని మొత్తం 51 మండలాలు దెబ్బతిన్నాయి. ప్రకాశం జిల్లాలో 35, అనంతపురం జిల్లాలో 32 మండలాల్లో ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. ► గోడలు కూలిపోవడం, నదుల్లో కొట్టుకుపోవడంవల్ల 11 మంది చనిపోయారు. వీరిలో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, ప్రకాశంలో ముగ్గురు, వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు ఉన్నారు. ► ఏడు జిల్లాల్లో 3,679 ఇళ్లు దెబ్బతిన్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,708 ఇళ్లు, వైఎస్సార్ కడప జిల్లాలో 1,403 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ► నాలుగు జిల్లాల్లో 7,526 ఇళ్లలో వరద నీరు నిలిచింది. ఇందులో అత్యధికంగా 7,069 ఇళ్లు వైఎస్సార్ కడప జిల్లాలోనివే. వ్యవసాయోత్పత్తులపై తీవ్ర దు్రష్పభావం ► నివర్ తుపాను వల్ల 12,99,125 టన్నుల మేర వ్యవసాయోత్పత్తులకు నష్టం వాటిల్లినట్లు (ఆమేరకు దిగుబడిపై దు్రష్పభావం) ప్రాథమిక అంచనా. ► 662043.15 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఇందులో అత్యధికంగా 4,14,401 హెక్టార్లలో వరి పంట ఉండటం గమనార్హం. ► వ్యవసాయ పంట నష్టం రూ. 2,831.68 కోట్లు కాగా ఇందులో వరి నష్టమే రూ. 2,194.17 కోట్లు. ► 24,833.72 హెక్టార్లలో మిరప, కూరగాయలు, అరటి, బొప్పాయి, పసుపు తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా 7.71 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఉద్యాన పంటల ఉత్పత్తులకు నష్టం జరిగింది. నష్టం విలువ రూ. 335.46 కోట్లు. 33 శాతంపైగా పంట నష్టం జరిగిన రైతులు 47,932 మందికి రూ. 41.96 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని ఉద్యాన శాఖ అధికారులు తాత్కాలిక తుది నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. పారదర్శకతకు పెద్ద పీట పంట దెబ్బతిన్నందున పెట్టుబడి రాయితీకి ఎంపిక చేసిన రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించి వారం రోజులపాటు అభ్యంతరాలు, సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పెట్టుబడి రాయితీకి బాధిత రైతుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఏమాత్రం అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే సీఎం ఆమేరకు ఆదేశాలిచ్చారు. అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మార్పులు చేసి వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సూచించారు. ఈనెల 31న రైతులకు పెట్టుబడి రాయితీ రైతులకు భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా త్వరితగతిన ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. గత నెలాఖరులో పంట నష్టం జరగ్గా ఈనెల 31వ తేదీనే అనగా నెల రోజులకే అన్నదాతలకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు సర్వే నంబర్లవారీగా, రైతుల వారీగా పంట నష్టాల మదింపు పూర్తయింది. గ్రామ సచివాలయాల్లో ప్రదర్శన అనంతరం మార్పులతో అధికారులు ఈ నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన అన్నదాతలకు కూడా ప్రభుత్వం రికార్డు సమయంలో (నెలలోనే) పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకుంది. నివర్ బాధితులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సబ్సిడీతో విత్తనాలు కూడా సరఫరా చేస్తోంది. -
అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం: మంత్రి సురేష్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నివర్ తుపాను నష్టంపై అధికారులతో చర్చించామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు, వరద బాధితులకు నష్ట పరిహారం అందించే క్రమంలో సమీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్ష జరిపారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు అర్ధరహితమన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. (చదవండి: అక్కడ పొగడ్తలు.. ఇక్కడ తిట్లు) జిల్లాలో ఎవరు ఊహించని విధంగా వెయ్యి రెట్లు నీటి ప్రవాహం సాగిందని.. బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి అధిక స్థాయిలో నీరు చేరుకుందన్నారు. తుపాను ప్రభావంతో మృతి చెందిన వారికి సత్వరమే రూ.5 లక్షలు అందజేశామని, నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలో 22 వేల మందికి 500 రూపాయలు అందజేశామని తెలిపారు. రైతులకు నష్ట పరిహారం అందించడంలో ప్రభుత్వం ముందుందని, ప్రతి రైతును ఆదుకుంటామని.. అధైర్య పడొద్దన్నారు. బుడ్డ, శనగ పంట పూర్తిస్థాయిలో నీట మునిగింది. జిల్లాలో 1.40 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. బుగ్గవంక సుందరీకరణకోసం ఇప్పుడు 30 కోట్లు, గతంలో ఇచ్చిన 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. బురేవీ, అర్నబ్ తుపాన్ల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు.(చదవండి: కొమ్మాలపాటి.. అవినీతి కోటి) -
నివర్ బాధితులకు రూ.500 ప్రత్యేక సాయం
సాక్షి, అమరావతి: నివర్ తుపాను వల్ల పునరావాస శిబిరాల్లో గడిపిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) సహాయ ప్యాకేజీలకు అదనంగా రూ.500 ప్రత్యేక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. తుపాను వల్ల భారీ వర్షాలు, వరదలు సంభవించిన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఈ సాయం వర్తిస్తుంది. ట్రెజరీ రూల్ (టీఆర్)– 27 కింద వెంటనే వీరికి రూ.500 చొప్పున ప్రత్యేక సహాయం అందించాలని ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నాలుగు జిల్లాల్లో తుపాను సమయంలో భారీ వర్షాలతో సహాయ శిబిరాల్లో తలదాచుకున్న వారందరికీ నగదు ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఈ జిల్లాల్లో 49,123 మందికి రూ.500 ప్రత్యేక సాయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదించింది. వరదల్లో చనిపోయిన వారి వారసులకు ఎక్స్‌గ్రేషియా కోసం ప్రతిపాదనలు పంపిన కలెక్టర్లు.. బాధితుల బ్యాంకు అకౌంట్, ఆధార్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు పంపించాలని వారికి సూచించారు. ఇళ్లు కూలిపోయినవారికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, వీధి, ఇంటి నంబర్ వివరాలను పంపించాలన్నారు. -
రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
తొట్టంబేడు (చిత్తూరు జిల్లా)/నాయుడుపేట టౌన్/చిల్లకూరు: నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చొప్పున వెంటనే పరిహారం చెల్లించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం పొయ్యలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా గ్రామస్తులెవరూ హాజరు కాలేదు. పంట నష్టం పరిహారాన్ని సీఎం తమకు ఖాతాల్లోనే వేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ముఖాముఖికి హాజరు కాబోమని జనసేన నేతలకు గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో జనసేన నేతలు ముచ్చివోలు నుంచి కొంతమందిని పొయ్యకు తీసుకొచ్చి గ్రామస్తులను తిట్టించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముఖాముఖికి ఎవరూ రాకపోవడంతో పవన్ రోడ్ షో మాత్రమే చేశారు. అధికార పార్టీ నేతలు.. జనసేన కార్యకర్తల జోలికొస్తే ఊరుకోనని హెచ్చరిస్తూ రెండే నిమిషాల్లో ప్రసంగం ముగించి తర్వాత నాయుడుపేటలో పర్యటించారు. కాగా, తిరుపతి నుంచి గూడూరు బయలుదేరిన పవన్.. చిల్లకూరు మండల బూదనం టోల్‌ప్లాజా వద్ద రోడ్‌షో నిర్వహించగా వెలవెల పోయింది. -
ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల సాయం
సాక్షి, చిత్తూరు (రేణిగుంట) : నివర్ తుపాన్ సమయంలో రాళ్లకాలువ వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి కుమ్మరిపల్లె దళితవాడకు చేరుకుని బాధిత కుటుంబానికి నగదు అందజేసి వారిని ఓదార్చారు. అలాగే ప్రభుత్వం తరపున మరో రూ.5లక్షల పరిహారాన్ని మృతుడి భార్య నాగభూషణకు అందించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. మృతుడి పిల్లలు ధీరజ్, హమీష్‌లను తామే చదివిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నాగభూషణకు ఫించను మంజూరు పత్రం అందించారు. గ్రామ వలంటీర్ ఉద్యోగాన్ని సైతం ఇప్పిస్తామని ప్రకటించారు. అనంతరం అదే వాగులో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన వెంకటేష్, లోకేష్‌లను కూడా పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ ఆదిశేషారెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమలరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, జువ్వల దయాకర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, మునిరెడ్డి, శేషారెడ్డి, బాబ్జీ, హరి పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..) -
డిసెంబర్ 31 నాటికి ఇన్పుట్ సబ్సిడీ..
సాక్షి, కృష్ణా జిల్లా: నివార్ తుపాన్ కారణంగా భారీగా పంటనష్టం సంభవించిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.41 లక్షల హెక్టార్లలో 16.12లక్షల టన్నుల వరి పండుతుందని ఆశించామని తెలిపారు. నాగాయలంక, మండవల్లి మండలాల్లో వరి పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. 1.08 వేల హెక్టార్లలో పంట నష్టానికి ఎన్యూమరేషన్ మొదలుపెట్టాం. క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ డిసెంబర్ 31 నాటికి రైతుల బ్యాంకు ఖాతాలకు పంపుతామన్నారు. రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు) పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని, వ్యవసాయాధికారులకు ఎన్యూమరేషన్ ప్రధాన బాధ్యతగా చేయాలని ఆదేశించామని తెలిపారు. మంత్రులు, స్పెషల్ ఛీప్ సెక్రెటరీలు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారని తెలిపారు. డయల్ యువర్ జేసీ రేపు(శుక్రవారం) నిర్వహిస్తామని తెలిపారు. కౌలు రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 1800425440 కంట్రోల్ రూమ్ నంబరు రైతుల కోసం ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి, 50 రోజుల క్యాంపైన్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు కలిసి ఈ క్యాంపైన్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 8.4 లక్షల కోవిడ్ టెస్టులు జిల్లాలో జరిగాయని కలెక్టర్ వెల్లడించారు. (చదవండి: మంత్రి పేర్నిపై దాడి.. టీడీపీ కుట్రే?) -
ధాన్యం తడిసినా కొనుగోలు చేస్తాం
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావంతో తడిసిన, మొలకెత్తిన, పురుగు పట్టిన..ఇలా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ బుధవారం కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలనకు పౌరసరఫరాల శాఖ అధికారులు వెళ్లారన్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని, ఒక బృందం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, రెండో బృందం తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నారని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పాడైపోయిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 2,578 ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6,643 రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 4,46,000 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారని, రైతుల కోసం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కార్యాలయం: 18004251903 పశ్చిమగోదావరి: 08812 230448 తూర్పుగోదావరి: 08886613611 కృష్ణా: 7702003571, గుంటూరు: 8331056907 -
పొలాల్లో దిగకుండానే పవన్ పరామర్శ
సాక్షి, కృష్ణా: ‘నివర్ తుపాన్’ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటించారు. బుధవారం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు. పంట పొలాల్లో దిగకుండానే పవన్ రైతులను పరామర్శించడం గమనార్హం. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నివర్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని, రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని, రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానన్నారు. నష్టపోయిన పంటలను రైతులు పవన్ కల్యాణకు చూపించారు. ఎకరాకు రూ.౩౦వేల వరకు ఖర్చు పెట్టామని రైతులు తెలిపారు. నివర్ తుపానుతో సర్వం నష్టపోయామని, ఇప్పటికీ పొలాల్లోంచి నీరు బయటకుపోలేదన్నారు. మరోవైపు ఉయ్యూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పవన్ వెంట వెళ్తున్న జనసేన కార్యకర్తల బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జనసేన కార్యకర్తలు గాయలపాలయ్యారు. దీంతో స్థానికులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
రెడ్ అలర్ట్: రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం
సాక్షి, చెన్నై: నివర్ తరువాత రాష్ట్రానికి బురేవి తుపాన్ భయం పట్టుకుంది. బుధవారం సాయంత్రం లేదా రాత్రి దక్షిణ తమిళనాడు జిల్లాల్లో తీరందాటే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో తుపాన్ సహాయక చర్యలను సమీక్షించారు. దక్షిణ బంగాళాఖాతంలో గత నెల 28 నుంచి కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారి 24 గంటల్లో తుపానుగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. మంగళవారం సాయంత్రానికి వాయుగుండం 11 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతూ నేడు సాయంత్రం లేదా రాత్రి త్రికోణకొండల సమీపంలో తీరందాటగలదని అంచనావేశారు. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, తెన్‌కాశీ జిల్లాల్లో 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యలపై సీఎం ఎడపాడి సమీక్ష నిర్వహించారు. చదవండి: (అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్) బురేవిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని, భయపడాల్సిన పని లేదని రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మీడియాకు మంగళవారం తెలిపారు. అరక్కోణం నుంచి 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నాగర్‌కోవిల్‌కు పంపామన్నారు. కుమరి నుంచి 161 మరపడవల్లో ఇటీవల సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన రెండువేల మంది మత్స్యకారులు తీరం చేరకపోవడంతో ఆందోళన నెలకొంది. బురేవి హెచ్చరికల సమాచారాన్ని చేరవేసేందుకు చర్యలు చేపట్టారు. -
నివర్ తుఫాన్‌పై మండలిలో చర్చ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలి శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు నివర్ తుఫాన్ వల్ల కలిగిన పంట నష్ట్రంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మండలిలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఇద్దరే ఇద్దరూ మహనీయులను చుశానన్నారు. ఒకరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరొకరు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలోని ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండాయన్నారు. తను రైతుగా అనేక తోటలు సాగు చేస్తున్నానని, ఒక రైతుగా ఇలాంటి ప్రభుత్వాన్ని తానేప్పుడు చూడలేదన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. ఆర్బీకే పరిశీలించడానికి కర్ణాటక నుంచి కర్నూలుకు అధికారులు వచ్చారన్నారు. గత ప్రభుత్వంలో రాత్రి వేళ రైతులకు విద్యుత్ ఇవ్వడం వల్ల తన దగ్గర పనిచేసే వాళ్ళు ఇద్దరూ చనిపొయారని చెప్పారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన చెప్పారు. టీడీపీ వాళ్లకు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ లాంటి వారు కావాలని విమర్శించారు. కష్టాల్లో ఉన్న రైతులకు తమ ప్రభుత్వం మేమున్నామన్న భరోసా కల్పిస్తుందని చల్లా పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేలు, వలంటీర్లకు చేతులెత్తి మొక్కాల్సిందే!
ఇంట్లో సేద తీరుతుంటే హఠాత్తుగా వరద వచ్చి పడితే ఏం చేయాలి..మోకాలి వరకు వచ్చిన నీళ్లు చూస్తుండగానే భుజాల పైకి వస్తుంటే, అంతకంతకూ ప్రవాహం పెరుగుతుంటే ఇంటిల్లిపాదీ బయటకు రాలేక, ఇంట్లో ఉండలేక బతుకుపై ఆశలు సన్నగిల్లుతుంటే.... రోజులాగానే రోడ్డుపై వెళుతుండగా నీటి ప్రవాహం అడ్డుకుంటే.... పొలం దగ్గరికి వెళ్లి వస్తుండగా వాగు లాక్కెళ్లిపోతే.. అలాంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ వచ్చారు ఈ ప్రాణ ప్రదాతలు. మృత్యు ముంగిట ఉన్న వారిని ప్రాణాలొడ్డి ఒడ్డుకు చేర్చారు. నివర్ పంజా విసిరిన వేళ మన అధికారులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, వలంటీర్లు స్పందించిన తీరుకు చేతులెత్తి మొక్కాల్సిందే. గోడలు కూల్చి కాపాడాం చిత్తూరు అర్బన్: తుపాను ముందురోజే కమిషనర్ ఉద్యోగులు అందరినీ అప్రమత్తం చేశారు. వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులు, వలంటీర్లు అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెప్పారు. ఆ రోజు (27వ తేదీ) మధ్యాహ్నం సచివాలయ కార్యదర్శి నుంచి కమిషనర్‌కు మెసేజ్ రావడంతో వెంటనే నన్ను పురమాయించారు. మెసానిక్ మైదానం పక్కన 15 మంది వరకు చెరువునీటిలో చిక్కుకున్నారని తెలిసింది. పది నిమిషాల్లో నేను, మా సిబ్బంది వెళ్లి చూస్తే పూరిళ్లు, షెడ్లు మోకాలు లోతు నీళ్లలో ఉన్నాయి. వెంటనే అడ్డుగా ఉన్న గోడల్ని కూల్చాం, షెడ్లపైన నిల్చుని పిల్లల్ని పైకి తీసుకున్నాం. అయితే పెద్దోళ్లు ముగ్గురు అక్కడే ఉండిపోయారు. సమాచారమందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చేశారు. పెద్ద రోప్‌లు వేసి మిగిలినవాళ్లను పైకి లాగాము. చూస్తుండగానే మరో అరగంటలో ఇళ్లు మునిగిపోయాయి. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం, సిబ్బంది బాధ్యతగా పనిచేయడం వల్లే ప్రాణనష్టం లేకుండా అందరినీ కాపాడగలిగాం. – నాగేంద్ర, పట్టణ ప్రణాళిక అధికారి, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అందరం ఏడ్చేశాం ఆరోజు మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం తక్కువే ఉంది. రాత్రి 7 గంటలప్పుడు ఇంటి కింది అంతస్తు మునిగిపోతే నేను నా భార్య, ముగ్గురు పిల్లలు మెట్లపైకి వెళ్లిపోయాం. కరెంటు పోయింది. నీటిలో పురుగులు, పాము లు వచ్చేశాయని పిల్లలు భయపడిపోయారు. మేము వాళ్లతో కలిసి ఏడ్చేశాం. ప్రెస్ వాళ్లకు చెప్పడంతో పోలీసుల్ని పంపారు. వాళ్లు మాకు మరోజన్మనిచ్చారు. – యుగంధర్, చిత్తూరు వరదనీటిలో చిక్కుకుని బయటపడిన చిత్తూరు మెసానిక్ మైదానం కాలనీ వాసులు దారులన్నీ మూసుకుపోయినా .. వాట్సప్ గ్రూపులో మెసేజ్ రావడంతో చిత్తూరులోని బాలభవన్ స్కూలు పక్కనున్న కాలనీ నీటితో ముగినిపోయిందని, సాయం కోసం ఓ కుటుంబం ఎదురుచూస్తోందని తెలుసుకున్నాం. అందరూ బయటపడ్డా.. వర్షపునీళ్లు ఇంట్లోకి వచ్చేయడంతో ఒక్క కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది. వెంటనే వాళ్లతో మాట్లాడి స్పాట్‌కు వెళ్లిచూశాం. ఓవర్‌బ్రిడ్జి మీద నుంచి చూస్తే మనిషి లోతు మొత్తం నీళ్లతో నిండిపోయింది. కరెంట్‌లేదు. దారులన్నీ మూసుకుపోయాయి. కొద్దిగా టెన్షన్.. అయినా ఏదో ఒకటి చేసి కాపాడాలన్న తపన ఉంది. నాతోపాటు వచ్చిన ఎస్టీఎఫ్ పార్టీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పిల్లల్ని అలెర్ట్ చేశాం. పెద్ద రోప్‌లు వేసుకుని, ఈదుతూ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. పిల్లల్ని భుజాలపైకి ఎత్తుకుని ఈదుతూ వచ్చారు. ఇద్దరు పెద్దవాళ్లను రోప్ పట్టుకోమని గట్టుపైకి తీసుకొచ్చాం. – ఎన్.సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, చిత్తూరు చదవండి: (నివర్ తుఫాన్: వైఎస్సార్ సీపీ నేత మృతి) పునర్జన్మనిచ్చిన వలంటీర్ చంద్రగిరి: రాయలపురం పక్కన మొండికాలువ సమీపంలో దోసలంక ఏరు ప్రవహిస్తుండటంతో నేను స్నేహితులతో కలసి వెళ్లాను. ఏరు దాటే క్రమంలో కాలు జారిపడి కొట్టుకుపోయాను. అక్కడే విధులు నిర్వహిస్తున్న నాగాలచెరువు వలంటీర్ వెంకటేష్ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు. కాసేపు తర్వాత నాకు స్పృహ వచ్చింది. ఈ రోజు నేను కుటుంబ సభ్యులతో కలసి ఉండానంటే దానికి వెంకటేషే కారణం. – అభినయ్, రాయలపురం మాకిది పునర్జన్మ లాంటిది పీలేరు: పీలేరు శివారు ప్రాంతంలో కామాటంవారిపల్లె నుంచి ఆకులవారిపల్లెకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న చిన్న గుట్టపై సీతారామయ్య ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు పింఛానది ఉగ్రరూపం దాల్చడంతో గుడిసె ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో సీతారామయ్య కుటుంబం ఒక మిట్టప్రాంతంలోకి వెళ్లి, తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రాత్రంతా గడిపారు. సమాచారమందుకున్న పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎస్పీ సెంథిల్ కుమార్, మదనపల్లె సబ్‌కలెక్టర్ జాహ్నవిని సంప్రదించి, కర్నూల్‌కు చెందిన రెస్క్యూ టీమ్, అగ్నిమాపక సిబ్బందితోపాటు స్థానిక సీఐ సాధిక్ అలీ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యుల కు అల్పాహారం అందించారు. క్రేన్ సహకారంతో రోప్ కట్టి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చదవండి: (తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా) ప్రాణాలమీద ఆశ వదిలేశాం నీటి ఉధృతికి మా ఇల్లు కొట్టుకుపోయింది. అనుక్షణం బిక్కుబిక్కుమంటూ గడిపాం. నదీ ప్రవాహాన్ని చూస్తే మేము బతికి వస్తామని అనుకోలేదు. ఎమ్మెల్యే, అధికారులు మమ్మల్ని కాపాడారు. – గీత ఒంటిమీద పాములు పాకాయి రేణిగుంట: ‘‘రాళ్లకాలువ వాగులోకి గురువారం ఉదయం మేము వెళ్లే సమయంలో మోకాళ్లలోతు నీళ్లున్నాయి. నిలుచుని మోటారు స్టార్టర్లు విప్పుకుని గట్టువైపు అడుగులు వేశాం... హఠాత్తుగా వరద ఉధృతి అమాంతం పెరిగిపోయింది. చూస్తుండగానే నీళ్లు భుజాల వరకు వచ్చేశాయి. ఏం చేయాలో దిక్కు తోచలేదు... పక్కనే ఉన్న చిన్న కానుగ చెట్టును పట్టుకున్నా... అక్కడి నుంచి మెల్లగా చీమచింత చెట్టు వద్దకు చేరి కొమ్మను పట్టుకున్నా... నీటి ప్రవాహంలో పాము నా వీపు మీదుగా వెళ్లి, కాసేపు నా చుట్టూ చక్కర్లు కొట్టింది. కొమ్మను వదిలేస్తానేమోనని వణికిపోయా... నాతో వచ్చిన ఓ వ్యక్తి కళ్ల ముందే మునిగిపోతుంటే.. మరికొంత దూరంలో గట్టుమీద అయిన వాళ్ల ఆర్తనాదాలతో నాలో భయం పెరిగిపోయింది. ఆరు గంటలకు పైగా అక్కడే ఉండి బతుకుపై ఆశలు వదులుకున్నా. తరువాత రెస్క్యూ టీం నన్ను బోటులో ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చాక కాస్త కుదుటపడ్డాను.’’ – అంటూ రేణిగుంట మండలం కుమ్మరపల్లికి చెందిన సుందరమ్మ, చెంగల్రాయులు కుమారుడు ఎం.వెంకటేష్(21) వివరించాడు. డిగ్రీ పూర్తి చేసిన అతను గ్రామ వలంటీర్‌గా పని చేస్తున్నాడు. ప్రాణాలను కాపాడటానికి కృషి చేసిన అధికార యంత్రాంగానికి, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఇది పునర్జన్మే ‘‘నేను పట్టుకున్న చెట్టు పట్టుజారే పరిస్థితిని గ్రహించి కిందున్న వైర్ల ఆధారంగా వెంకటేష్ ఉంటున్న చెట్టు వద్దకు చేరడానికి నేను చేసిన సాహసం బతుకు తీపిని వదిలేసుకుని చేసిందే... ఆరు గంటల నిరీక్షణ తరువాత బోటు శబ్దం విన్నాక ప్రాణం లేచి వచ్చింది... ప్రాణాలతో ఒడ్డుకు చేరా....’’ అంటూ మరో యువకుడు కుమ్మరపల్లి దళితవాడకు చెందిన లోకేష్(25) కన్నీటి పర్యంతమయ్యాడు. గుండెలు జారిపోయాయి ఏర్పేడు: మండలంలోని శివగిరి కాలనీకి సమీపంలో ఉన్న మామిడి తోటలో కాపలా ఉంటూ వరద ఉధృతిలో చిక్కుకుని రెస్క్యూ టీం సహకారంతో బయట పడిన గిరిజనులు వారి మనోగతాన్ని సాక్షితో పంచుకున్నారు. ‘‘మేము కోన సమీపంలోని మామిడితోటలో కాపలా ఉంటున్నాము. శుక్రవారం మామిడితోట పక్కన ఉన్న కోనకాల్వ వాగు ప్రవాహం పెరిగిపోయి మేముంటున్న చోటుకి వచ్చింది. నీటిలోనే మాప్రాణాలు పోతాయని అనుకున్నాం. భయంతో తోటలో నుంచి కేకలు వేశాం. కాల్వకు అవతల వైపున్న వారిని గట్టిగా కేకలు వేసి మేమంతా ఆపదలో చిక్కుకున్నామని, కాపాడాలని కోరాం. గంట గంటకూ నీటి ప్రవాహం ఎక్కువకావడంతో మాతోపాటు మా ముగ్గురు పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయోమని భయపడ్డాం. చిన్న బిడ్డలను భుజాలకు ఎత్తుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం. గండం నుంచి బయటపడి సురక్షితంగా బయట పడాలని కొలవని దేవుడు లేదు... కొన్ని గంటల సమయానికి ఓ యంత్రం ద్వారా, ఆహారం, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు మావద్దకు పంపించారు. మాలో ఆశలు చిగురించాయి. సాయంత్రం చీకటి పడే సమయానికి మా వద్దకు ముగ్గురు వచ్చారు. మాకు ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి పంపారని వారు మాతో చెప్పారు. వారితో రాత్రంతా చిన్నపిల్లలతో కలిసి బిక్కుబిక్కు మంటూ నిద్రలేకుండా గడిపాం. శనివారం ఉద యం నీటి ప్రవాహం తగ్గిపోయింది. కాల్వ అవతల వైపు నుంచి రోప్‌లు మావద్దకు వచ్చాయి. రోప్‌ల ద్వారా మేం, మా పిల్లలు కాల్వ గట్టుకు సురక్షితంగా చేరుకున్నాం. మా ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.’’ -
అతి భారీ వర్షాలు: 2న రెడ్ అలర్ట్
సాక్షి, చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవనున్నాయి. రెండో తేదీ అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉండడంతో ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించేశారు. నివర్ నష్టం తీవ్ర తను పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం చెన్నైకు రానుంది. నివర్ తుపాన్ తీరం దాటి నాలుగు రోజులు అవుతున్నా, చెన్నై శివార్లలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీళ్లు ఇంకా తొలగలేదు. ఈ సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆదివారం మరింతగా బలపడింది. ఇది మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఒకటో తేదీ మరింతగా బలపడనున్న దృష్ట్యా, ఈ ప్రభావం రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడుపై పడనుంది. తొలుత సముద్ర తీర జిల్లాలో మోస్తరు వర్షం, రెండో తేదీ అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండో తేదీన బురేవి తుపాన్‌గా మారి అతి భారీ వర్షాలు పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో అధికార వర్గాలు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టే పనిలోపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) నేడు కేంద్ర బృందం రాక.. నివర్ రూపంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, రాష్ట్రంలోని కడలూరు, విల్లుపురంలలో ప్రభా వం ఎక్కువే. మిగిలిన జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగానే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసి, కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు సోమవారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడు గురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాత్రి చెన్నైకు వచ్చే ఈ బృందం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. ఆ తర్వాత నివర్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. చివరగా చెన్నైలో సీఎం పళనిస్వామితో ఈ బృందం భేటీ అవుతుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక మేరకు కేంద్రం సాయం ప్రకటించనుంది. ఈ తుపాన్ కారణంగా పెను నష్టం జరగనట్టు అధికారుల పరిశీలనలో తేలింది. కొంత మేరకు నష్టం ఉండడంతో ఆ వివరాలతో నివేదికను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. ఆ మేరకు నలుగురు మరణించినట్టు, ఐదుగురు గాయపడ్డట్టు తేల్చారు. 14 ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతింది. పది వేల హెక్టార్లలోని పంటల్లో వరద నీళ్లు చొచ్చుకెళ్లాయి. 108 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. 2,927 స్తంభాలు ఒరిగాయి. 199 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 1,439 గుడిసెలు పాక్షికంగా దెబ్బ తినగా, 302 గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 245 పశువులు మరణించాయి. 2,064 చెట్లు నేలకొరిగాయి. 4,139 శిబి రాల్లో 2.32 లక్షల మంది సురక్షితంగా ఉన్నట్టు తాజా నివేదికలో పేర్కొన్నారు. చదవండి: (మరో వాయు‘గండం’) సెంబరంబాక్కం గేట్లతో.. ఈనెల 26న సెంబరంబాక్కం గేట్లను తెరిచిన విషయం తెలిసిందే. తొలిరోజు 9 వేల గణపుటడుగుల మేరకు నీళ్లు వదిలారు. ఆ తర్వాత వర్షాలు ఆగడం, నీటి రాక తగ్గడం వెరసి గేట్లను మళ్లీ మూయడానికి అధికారులు సిద్ధమయ్యారు. తెరిచిన గేట్ల వద్ద చెట్ల కొమ్మలు, వేర్లు చుట్టుకుని ఉండడంతో మూత కష్టతరంగా మారింది. దీంతో ఆదివారం ఉదయాన్నే భారీ క్రేన్లను రప్పించి, గేట్లకు చుట్టుకెళ్లి ఉన్న వేర్లను, కొమ్మలను తొలగించే పనిలో పడ్డారు. దీంతో జలాశయం నుంచి వృథాగా 350 గణపుటడుగుల మేరకు నీళ్లు బయటకు వెళ్తున్నాయి. చెన్నైకు నీళ్లు అందించే సెంబరంబాక్కంలో 22 అడుగులు, పూండిలో 34 అడుగులు, తేర్వాయి కండ్రిలో 22 అడుగులు, చోళవరంలో పది అడుగులు, పుళల్‌లో 19 అడుగులు, వీరానంలో 8 అడుగుల మేరకు నీళ్లు తాజా వర్షాలకు వచ్చి చేరాయి. అన్ని చెరువులు నిండే స్థాయిలోనే ఉండడంతో ఈ వేసవిలో చెన్నైకు తాగు నీటికి ఢోకా లేదు. కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ పరిసరాల్లోని నీటి పరివాహక ప్రాంతాలు, చెరువుల్లోకి తాజా వరదల రూపంలో మొసళ్లు వచ్చి చేరి ఉండడంతో ఆ పరిసర వాసుల్లో ఆందోళన తప్పడం లేదు. ఉత్తర చెన్నైలో భారీ వర్షాల సమయంలో కొట్టుకెళ్లిన కొళత్తూరుకు చెందిన మహబూబ్ భాష మృతదేహం ఆదివారం మాధవరం సమీపంలోని కాలువలో బయటపడింది. -
మరో వాయు‘గండం’
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం రాత్రి వాయుగుండంగా మారనుంది. నివర్ తుపాను నుంచి తెప్పరిల్లుతున్న రైతులకు ఈ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించడంతో వారికి దిక్కుతోచడంలేదు. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. తొలుత వాయుగుండంగా మారే ఈ అల్పపీడనం తరువాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో డిసెంబరు 1 నుంచి 3 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైకల్‌లో అతి భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. రాయలసీమ.. దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చాలాచోట్ల ఆదివారం భారీవర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో కందుకూరులో 9 సెం.మీ., కావలిలో 6, వెలిగండ్ల, సీతారామపురం, కొనకనమిట్లల్లో 3, వింజమూరు, వెంకటగిరి, బెస్తవారిపేట, ఉదయగిరి, పొదిలిల్లో 2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిలువునా ముంచిన ‘నివర్’ అక్టోబర్‌లో కురిసిన భారీవర్షాలు, వరదలు తెచ్చిన కష్టాల నుంచి కోలుకోకముందే నివర్ తుపాను మరో దెబ్బతీసింది. పంటలను తుడిచిపెట్టేసింది. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో పలు చెరువులు, కుంటలు, రోడ్ల తెగిపోయాయి. జాతీయ రహదారుల్లో సైతం వంతెనలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన వేలాది హెక్టార్ల వరి పంట నీటమునిగింది. పలుచోట్ల కోసిన వరి పనలు నీళ్లల్లో తేలాయి. కోతకు వచ్చిన పంట నేలవాలింది. అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమమయ్యాయి. మిరప, వంగ, బెండ, టమోటా, కాకర, బీర తదితర కూరగాయలు, ఆకుకూరల తోటలు నీళ్లలో కుళ్లిపోయాయి. అరకొరగా ఉన్న పంటనైనా దక్కించుకోవాలని అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు మరో ముప్పు పొంచి ఉందని తెలియడంతో దిక్కుతోచటంలేదు. ఇప్పటికే జలవనరులు నిండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మరింత ప్రమాదమని భయపడుతున్నారు. ఫిబ్రవరి నుంచి అకాల భారీవర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిది. ముఖ్యంగా భారీ పంట నష్టాలతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ముంచేసిన అక్టోబరు రైతులకు ప్రభుత్వం చేయూత తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయూత ఇస్తోంది. ► జూన్–జూలై, ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో ఉద్యాన, వ్యవసాయ పంటల రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. ► ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల మధ్య భారీవర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.10.76 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేసింది. ► కేవలం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబరు వరకూ భారీ వర్షాలు, వరదలవల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ. 279.08 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించింది. ► చంద్రబాబు సర్కారు బకాయిలు వదిలి పెట్టగా చెల్లించిన పెట్టుబడి రాయితీ దీనికి అదనం. -
ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
సాక్షి, నెల్లూరు: నివర్ తుపాన్ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పెన్నా నది ముంపు ప్రాంతమైన నెల్లూరు, భగత్‌సింగ్ కాలనీతోపాటు పలు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. ఆదివారం మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ద్వారా తాము ప్రజలకు అండగా ఉంటామని, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇల్లు కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించి, ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయ సహకారాలు వీలైనంత త్వరగా అందిస్తామని తెలిపారు. మరో తుఫాన్ వస్తుందన్న వాతావారణ శాఖ సమాచారం నేపథ్యంలో ముంపుకు గురైన ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో వారికి కావాల్సిన సౌకర్యాలు ముందస్తుగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని చూచించారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పెన్నా నది పరివాహక ప్రాంతాన్ని రాబోయే కాలంలో వరదల వల్ల ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. బ్యారేజీ వద్ద పెన్నానది అనుకోని ఉన్న కాలనీలకు ఇబ్బంది రాకుండా నదికి ఇరువైపులా బండ్స్ నిర్మిస్తామని మంత్రులు పేర్కొన్నారు. -
చలి తగ్గుతోంది!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో తగ్గిన ఉష్ణో గ్రతలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటు న్నాయి. తుపాను నేపథ్యంలో గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. నివర్ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేనప్పటికీ... వాతావరణంలో మాత్రం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధ, గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు చలిగాలులు వీయడంతో ప్రజలు వణికిపోయారు. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి చలి తీవ్రత తగ్గుతోంది. మరో రెండు రోజుల్లో చలి తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్న ‘సాక్షి’తో అన్నారు. సాధారణం కన్నా 8.6 డిగ్రీలు తక్కువగా... నివర్ తుపాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8.6 డిగ్రీ సెల్సియస్ తగ్గాయి. దీనికితోడు వేగంగా గాలులు వీయడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సమీపంలో ఉండాల్సి ఉండగా... హకీంపేట్‌లో 21.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, భద్రాచలం, దుండిగల్, హన్మకొండ స్టేషన్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోద య్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త అటుఇటుగా నమోదయ్యాయి. రాష్ట్రంలో అతి తక్కువగా మెదక్‌లో 14.8 డిగ్రీల సెల్సీయస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, దుండిగల్, హకీంపేట్, హైదరాబాద్‌లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగు తోందని వివరించింది. రాబోయే 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా పయనిస్తూ డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని సూచించింది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం బలహీన పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 8:30 గం. వరకు ఉష్ణోగ్రతలు ఇలా.. (డిగ్రీ సెల్సియెస్లలో) స్టేషన్ గరిష్టం కనిష్టం అదిలాబాద్ 25.3 18 భద్రాచలం 22.2 16.5 హకీంపేట్ 21.2 17 దుండిగల్ 22.3 16.7 హన్మకొండ 22 17.5 హైదరాబాద్ 22.4 17 ఖమ్మం 23.6 19.2 మహబూబ్‌నగర్ 21.9 18.7 మెదక్ 25 14.8 నల్లగొండ 26.5 18 నిజామాబాద్ 24.1 18.9 రామగుండం 23 18.6 -
మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుపాన్ రూపంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక జిల్లాల్లో జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. ఉబరి నీటి విడుదల సాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చెన్నై శివార్లలో అనేక చోట్ల నీటిని తొలగించినా, కొన్ని చోట్ల మాత్రం కష్టతరంగా మారింది. దీంతో తాంబరం పరిసరవాసులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. ఇక్కడికి భారీ మోటార్ల ద్వారా నీటిని తరలించేందుకు చర్యల్ని అధికారులు చేపట్టారు. నివర్ రూపంలో రైతులకు నష్టాలు ఎక్కువే. చేతికి పంట అంది వచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో కన్నీళ్లు తప్పడం లేదు. దీంతో నష్ట పరిహారం చెల్లింపునకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పనిలో పడ్డాయి. ఇందుకు తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టే పనిలో పడింది. ప్రస్తుతం నీట మునిగిన ప్రాంతాలలో భవిష్యత్తులో మరో ముప్పు ఎదురుకాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం పళనిస్వామి ఆదేశించారు. ప్రధానంగా తాంబరం పరిసరాలపై తొలుత దృష్టి పెట్టనున్నారు. నివర్ ప్రభావం కారణంగా మరణించిన కుటుంబాలకు రూ. 12 లక్షలు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయో అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో పోలీసుల పాత్రపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో వెయ్యి మందిని తమ భుజాలపై వేసుకుని మరీ సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించడం అభినందనీయం. చదవండి: (బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి) సాగరంలో ద్రోణి.. నివర్ సహాయక చర్యలు సాగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం శనివారం మధ్యాహ్నం బయలుదేరింది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారి, తుపాన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ద్రోణి పశ్చిమ దిశలో పయనిస్తుండడంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి వర్షాలు పడనున్నాయి. ఇది తుపాన్‌గా మారనున్న దృష్ట్యా, దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ద్రోణి తుపాన్‌గా మారినానంతరం డెల్టా జిల్లాల వైపు లేదా, దక్షిణ తమిళనాడు వైపు దూసుకొచ్చేనా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి దక్షిణ తమిళనాడు, సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి తేలిక పాటి వర్షం మొదలై, క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ ఒకటి, రెండు, మూడు తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. జాలర్లు వేటకు దూరంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో గాలి వేగం గంటకు 55 కి.మీ వరకు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మేట్టుపట్టిలో 9 సె.మీ, అవినాశిలో 8 సె.మీ, చోళవందాన్, వాడి పట్టిలో 7 సె.మీ మేరకు వర్షం పడింది. బురేవి తర్వాత మరో తుపాన్‌కు అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: (మానవత్వంతో ఆదుకోండి) రూ. వంద కోట్లు ఇవ్వండి.. పుదుచ్చేరి, రాష్ట్రంలోని నివర్ బాధిత ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందో పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ఢిల్లీ నుంచి సోమ వారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. దీంతో నష్టం నివేదిక తయారీకి అధికారులు పరుగులు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో పుదుచ్చేరికి రూ. 400 కోట్లు నష్టం జరిగినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి శనివారం ప్రకటించారు. అధికారులతో సమావేశానంతరం నష్టం తీవ్రతను పరిగణించి, సహాయక చర్యల కోసం రూ. 100 కోట్లు తక్షణం కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తూ ఆయన లేఖ రాశారు. -
మానవత్వంతో ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వరదల్లో నష్టపోయిన వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ప్రతి రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణం పంట నష్టంపై అంచనా వేసి.. డిసెంబర్ 15లోపు నివేదిక అందించాలని, 31లోగా రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలన్నారు. నివర్ తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో శనివారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్‌బాషా మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సమగ్రంగా పరిశీలన ► పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి ఒక్క వరద బాధితుడిని మానవతా దృక్పథంతో చూడాలని సీఎం చెప్పారు. ఉదారంగా వ్యవహరించి, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ► పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. పునరావాస కేంద్రాలు విడిచి వెళ్లిపోయినా సరే, అలాంటి వారందరికీ రూ.500 ఇవ్వాలని చెప్పారు. బుగ్గవంకకు రూ.39 కోట్లు ► వైఎస్సార్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బుగ్గవంక సుందరీకరణ పనులకు రూ.39 కోట్లు కేటాయించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.65 కోట్లతో బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆయన మృతితో ఆ పనులు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం, అదనంగా 1.2 కిలోమీటర్ల మేర కొత్త నిర్మాణాలకు రూ.39 కోట్లు వెచ్చించాల్సి ఉందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, కలెక్టర్ హరికిరణ్‌లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు. ► అన్నమయ్య ప్రాజెక్టును 10 టీఎంసీలకు విస్తరించాలని, తక్కువ ఖర్చుతో విస్తరణ చేపట్టవచ్చని, అలాగే పింఛా ప్రాజెక్టును 2 టీఎంసీలకు విస్తరించవచ్చని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సూచించగా, ప్రతిపాదనలు చేపట్టాలని సీఎం తెలిపారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 10.15 గంటలకు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, ఎస్బీ అంజద్ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, భూమన కారుణాకర్రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలం, ఎం.ఎస్ బాబు, ద్వారాకనాథరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పలువురు అధికారులు స్వాగతం పలికారు. సీఎం వెంట రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు. వైఎస్సార్ జిల్లాలో అపార నష్టం ► వైఎస్సార్ జిల్లాలోని మైనర్ ఇరిగేష్ ప్రాజెక్టులలో పూర్తి సామర్థ్యం మేరకు 0.327 టీఎంసీల నీరు ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితిని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ► జిల్లాలో 825 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 72,755 హెక్టార్లు, ఉద్యాన వన శాఖకు సంబంధించి 3,240 హెక్టార్లలో పంట నీట మునిగిందని, 757 ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. ► జిల్లా వ్యాప్తంగా 12,741 మందిని రేస్క్యు ఆపరేషన్‌లో కాపాడామని, పునరావాస కేంద్రాలలో 15,289 మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు. 192.6 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు, 1,234 కి.మీ మేర పంచాయతీ రోడ్లు దెబ్బ తిన్నాయని వివరించారు. 8,129 మేకలు, గొర్రెలు, కోళ్లు మృతి ► చిత్తూరు జిల్లాలో 21 మండలాల్లోని 245 గ్రామాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి 9,658 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 1,729.52 హెక్టార్లల్లో పంటలు నీట మునిగాయని జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్త ముఖ్యమంత్రికి వివరించారు. ► పశు సంవర్థక శాఖకు సంబంధించి మేకలు, గొర్రెలు, కోళ్లు కలిపి 8,129 మృత్యువాత పడ్డట్లు తెలిపారు. 245 కచ్చా ఇళ్లు దెబ్బ తిన్నాయని, రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించి పలువుర్ని కాపాడామన్నారు. ► 44 పునరావాస కేంద్రాలలో 4,012 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 543.8 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్ల ఉపరితలం దెబ్బతినిందని చెప్పారు. రూ.1,082.5 లక్షలు విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయన్నారు. 34,200 హెక్టార్లలో పంటలు మునక ► శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి 18 మండలాల్లోని 107 గ్రామాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 33,269 హెక్టార్లు, ఉద్యానవన శాఖకు సంబంధించి 931 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని కలెక్టర్ చక్రధర్‌బాబు సీఎంకు వివరించారు. రేస్క్యూ ఆపరేషన్ ద్వారా 17,163 మందిని కాపాడామని, 155 పునరావాస కేంద్రాల్లో 17,163 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 343.04 లక్షల విలువ చేసే బిల్డింగులు, డ్రెయిన్లు, పైప్ లైన్లు దెబ్బ తిన్నాయని చెప్పారు. 290 కి.మీ మేర ఆర్ అండ్ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు భరోసా తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని, దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి -
మరో తుపాను హెచ్చరిక: ఏపీ అప్రమత్తం..
సాక్షి, విజయవాడ: నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వరద నీటి నిల్వ కారణంగా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలన్నారు. మరో రెండు రోజుల్లో ఇంకో తుపాను రానున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు, కంట్రోల్ రూంలను కొనసాగించాలని స్పష్టం చేశారు. పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, సీడీఎంఎ విజయకుమార్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాంమనోహర్ రావు, డిటిసిపి రాముడు, ఇంజనీరింగ్ చీఫ్ చంద్రయ్య తదితర ఉన్నతాధికారులతో కలిసి విజయవాడ ఎఎంఆర్ డిఎ కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. (చదవండి: పన్నులపై రెండు పత్రికల దుష్ప్రచారం) ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాలతో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైన మంచినీటి ట్యాంకులు, చెరువులకు గళ్లు పడకుండా, నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. రాకపోకలకు అంతరాయం కలిగించేలా, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడంతోపాటు, పూడుకుపోయిన డ్రైన్లను శుభ్రం చేయాలని అన్నారు. పంపిణీ చేస్తున్న తాగునీరు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన క్లోరినేషన్ ప్రక్రియను చేయడంతోపాటు, ఇళ్ల వద్ద ఉన్న కుళాయిల వద్ద నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పునరావాస కేంద్రాల్లోని వసతులపై కమిషనర్ల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకుని, ఈ కేంద్రాల్లో ఆశ్రయం కల్పించిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తుపాను, భారీ వర్షాల అనంతరం నీటి నిల్వల కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తూ అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. (చదవండి: ఆయన మంత్రివర్గంలో పని చేయడం అదృష్టం) మరో రెండు మూడు రోజుల్లో ఇంకో తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిథిలోని అధికారులందరూ పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి సూచించారు. అనంతరం టిడ్కో గృహ నిర్మాణంపై సమీక్షిస్తూ, లబ్ధిదారులకు అర్హతా పత్రాల అందచేత, బ్యాంకు రుణాల టైఅప్ అంశాన్ని వేగవంతం చేయాలని, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఇందుకు సంబంధించిన పనులన్నీ సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలని, లబ్ధిదారులకు సరైన, సక్రమమైన సమాచారాన్ని చేరేవేసేందుకు, వార్డు సెక్రటరీల సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతే కాకుండా వార్డు సెక్రటరీలకు వారి విధుల నిర్వహణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉన్నత స్థాయి శిక్షణా తరగతులను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. మున్సిపల్ స్కూళ్లలో అమలవుతున్న నాడు నేడు కార్యక్రమాన్ని సమీక్షిస్తూ, నిర్దేశిత కాల పరిమితిలోగా, పాఠశాలల భవనాలకు మరమ్మత్తులు చేపట్టాలని, అన్ని వసతులను కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి బిపిఎస్, ఎల్ఆర్ఎస్ లలో పథకాల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనధికార కట్టడాలు, లేఅవుట్ల పై కఠినంగా వ్యవహరిస్తామని, ఈ విషయంలో రాజీలేదన్నారు. -
తుపాన్ మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, తిరుపతి : వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంటనష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. పంటనష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతిఒక్క వరద బాధితుడిని మానవతాధృక్పథంతో చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతిచెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. (మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే) అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతిఒక్కరికి రూ.500 చొప్పున తక్షణ సాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. కాగా నివర్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుపాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను అదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నివర్ తుపాన్: మృతులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
-
వీర్లగుడిపాడుపై శాశ్వత బ్రిడ్జి నిర్మిస్తాం : మేకపాటి
సాక్షి, నెల్లూరు : నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోయకవర్గం లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వరద ముంపు గ్రామాలలో పర్యటించారు. చేజార్ల ,సంగం ,అనంతసాగరం మండలాల్లో పలు గ్రామాలతో పాటు వీర్లగుడిపాడు గ్రామాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మేకపాటి తానే స్వయంగా పడవను నడుపుతూ గ్రామస్తులను పలకరించారు. నీట మునిగిన గ్రామాన్ని చూసిన మంత్రి మేకపాటి చలించిపోయారు. వీర్లగుడిపాడుకు బ్రిడ్జి ఎలా కడితే సమస్యకు శాశ్వత పరిష్కారం అంశమై పరిశీలించారు. ఇక భవిష్యత్తులో ఎంత పెద్ద వరదలు వచ్చినా గ్రామస్తుల రాకపోకలకు అంతారయం కలగకుండా బ్రిడ్జి కట్టిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు భోజన సదుపాయాలు, ఇతర అత్యవసరాలపై అధికారులతో కలిసి చర్చించారు. వరద వస్తున్న నేపథ్యంలో ప్రజలకు మంచినీరు, భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆర్డీవోకు మంత్రి ఆదేశించారు. కాగా తాతల కాలం నుంచి వానలు, వరదలు మాకు మామూలే సారూ అంటూ గ్రామస్తులు మంత్రి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అంతకు ముందు పెన్నా నది ప్రవాహాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదేనని పేర్కొన్నారు. డిసెంబర్ 25న ఇచ్చే ఇళ్ల పట్టాలతో పాటు అప్పారావుపాలెం ప్రజలకు పట్టాలివ్వనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు, పంటపొలాలకు నష్టపరిహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జిల్లాలో పెన్నానదిపై 50 కి.మీ వద్ద సంగం ఆనకట్ట, 81 కి.మీ వద్ద నెల్లూరు ఆనకట్ట అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాలను తాకుతూ పెన్నా ప్రవాహం కొనసాగుతుంది. -
నివర్ తుపాను : సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
ముంపు ప్రాంతాల్లో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటన
-
ఏపీలో నివర్ తుఫాన్ బీభత్సం దృశ్యాలు
-
వాగులో చిక్కుకున్న 11 మంది సురక్షితం..
సాక్షి, ఏర్పేడు(చిత్తూరు): సదాశివపురం కోన వాగు ప్రవాహంలో చిక్కుకున్న 11మంది గిరిజనులను రెస్క్యూ టీమ్ శనివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరికి రక్షించడానికి శుక్రవారం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి స్వయంగా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఇద్దరు వాగులో పడిపోవడంతో.. వెంటనే అప్రమత్తమైన మిగతా సిబ్బంది వారిని రక్షించారు. చదవండి: (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన) -
ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగాము
-
నివర్ తుఫాన్: వైఎస్సార్ సీపీ నేత మృతి
ఇంటికి వస్తున్నా అని తన భార్యకు ఫోన్ చేశాడు..అతను అనుకున్నట్లు మరో రెండు నిమిషాల్లో గమ్యానికి చేరుకుని ఉంటే భార్యాపిల్లలతో ఆనందంగా గడిపేవాడే. కానీ విధి ఆ వైఎస్సార్ సీపీ నేతను చిన్నచూపు చూసింది. ఇంటికి సమీపిస్తున్న సమయంలో నదీ ప్రవాహం కబళించింది. కారుతో సహా కొట్టుకుపోయిన అతడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. వస్తాడు..వస్తాడు..అని నిరీక్షిస్తున్న ఆ కుటుంబానికి అంతులేని దుఃఖమే మిగిలింది. ఈ విషాద సంఘటన ఐరాల మండలంలో చోటుచేసుకుంది. సాక్షి, ఐరాల(యాదమరి): నివర్ తుపాను మూలాన మండలంలో గార్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పూతలపట్టు మండలం పాలకూరుకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు వినయ్ రెడ్డి(40) తన కారులో గురువారం రాత్రి కాణిపాకం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరాలలోని అత్తగారి ఇంటికి వెళ్తూ మృత్యువాత పడ్డారు. ఐరాల సమీపంలో రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తున్న గార్గేయ నదిని దాటే ప్రయత్నంలో అదుపు తప్పి కారుతో సహా ఆయన దాదాపు 300 మీటర్ల దూరం కొట్టుకుపోయారు. కారులోనే ఆయన మరణించారు. వాగులో కారు మునిగి ఉండటం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని శ్రమలకోర్చి కారును వెలికితీశారు. అందులోని మృతుడిని వైఎస్సార్సీపీ నాయకునిగా గుర్తించారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు స్థానిక నాయకులు దుర్ఘటన గురించి తెలియజేయడంతో వెంటనే సంఘటన స్థలానికి ఆయన చేరుకున్నారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. దీంతో ఆర్డీఓ రేణుక, తహసీల్దార్ బెన్నురాజ్ అక్కడికి చేరుకున్నారు. వారితో ఎమ్మెల్యే చర్చించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతోపాటు దగ్గరుండి పోస్టుమార్టం తంతు త్వరితగతిన ముగిసేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. అనంతరం పాలకూరులో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్తుల కన్నీటి నివాళుల నడుమ వినయ్‌కుమార్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన ప్రసాద్ శవమయ్యాడు రేణిగుంట: రాళ్లకాలువ వాగులో గల్లంతైన కుమ్మరపల్లె వాసి ప్రసాద్ (32) శవమై శుక్రవారం వెలుగులోకి వచ్చాడు. గ్రామ సమీపంలో వాగు మధ్యలో చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించారు. వాగు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్థానికులతో కలిసి మృతదేహం వెలికితీత పనుల్లో పాల్గొనడమే కాకుండా స్వయంగా మృతదేహాన్ని ట్రాక్టర్‌పైకి ఎక్కించారు. అక్కడి నుంచి కుమ్మరపల్లె దళితవాడకు వెళ్లి మృతుని కుటుంబాన్ని ఓదార్చారు. గల్లంతైన ప్రసాద్ ఆచూకీ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విస్తృతంగా గాలించామని, దురదృష్టవశాత్తూ అతడిని కాపాడలేకపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు. రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా మృతుని కుటుంబానికి ప్రమాద బీమా కింద ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ఎమ్మెల్యే ప్రకటించారు. మృతుని భార్య నాగభూషణకు వెంటనే వితంతు పింఛను మంజూరు చేయడంతోపాటు పిల్లల చదువులు, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయనతోపాటు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, ఆర్డీఓ కనకనరసారెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, సీఐ అంజూయాదవ్, పార్టీ నాయకులు తిరుమలరెడ్డి, బాబ్జీరెడ్డి, జువ్వల దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడు జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మూడు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానశ్రయం నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు వచ్చారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఎం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో భేటీ కానున్న సీఎం జగన్ నివర్ తుపాన్ ఏరియల్ సర్వే అనంతరం సీఎం వైఎస్ జగన్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో భేటీ అయ్యారు. తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నివేదికలతో సహా సమావేశానికి హాజరు అయ్యారు. ఈ భేటీలో వరద నష్టాలను ప్రజాప్రతినిధులు సీఎం జగన్ దృష్టికి తేనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట
సాక్షి, కొత్తపల్లి: ఉప్పాడ శివారు పాత మార్కెట్ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు. మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక మహిళకు లభ్యమైన బంగారు దిద్దులు -
పొంచి ఉన్న మరో ముప్పు
సాక్షి, చెన్నై: నివర్ తుపాన్ నీలినీడలు జనాన్ని వీడేలోగా మరో ముప్పు పొంచి ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. డిసెంబర్ 11వ తేదీన వాయుగుండం లేదా తుపాన్ తమిళనాడు సముద్రతీరాన్ని కుదిపేయగలదని సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాన్ ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున పుదుచ్చేరికి సమీపంలో తీరందాటుతూ పరిసరాలను అతలాకుతలం చేసింది. శుక్రవారం కొద్దిగా తెరపి ఇవ్వడంతో పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇదిలాఉండగా బంగాళాఖాతం ఆగ్నేయంలో మరో 48 గంటల్లో కొత్తగా అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని, ఈ అల్పపీడన ద్రోణి మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి తమిళనాడువైపు పయనించగలదని చెన్నై వాతావరణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ బాలచంద్రన్ శుక్రవారం తెలిపారు. ఈ ప్రకటనతో జనం మరోసారి ఉలిక్కిపడ్డారు. నివర్ తుపాన్ తీరందాటిన ప్రభావంతో ఈనెల 30వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే ప్రకటించారు. అయితే, కొత్తగా ఏర్పడనున్న వాయుగుండం వల్ల డిసెంబర్ 3వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. అయితే ఈ వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందే అవకాశం లేదని ఆయన స్పష్టం చేయగా, 11వ తేదీ నాటికి తుపానుగా మారి తమిళనాడు సముద్రతీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొనడం గమనార్హం. సముద్రతీరాల్లో శీతోష్ణస్థితి అధికంగా ఉన్నందున తుపానుగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రముఖ వాతావరణ నిపుణులు ప్రదీప్‌జాన్ అంటున్నారు. వాయుగుండం ఏర్పడుతుంది, అది తుపానుగా మారకుండా బలహీనపడవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. వాయుగుండం ఖాయమని తెలుస్తున్నందున వచ్చేనెల 11వ తేదీ వరకు బలమైన వర్షాలు పడతాయని ఆయన చెప్పారు. చదవండి: (రోజంతా గజగజ..) -
రోజంతా గజగజ..
సాక్షి, హైదరాబాద్: నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. శుక్రవారం చల్లటి ఈదురుగాలులు ప్రజలను వణికించాయి. పలు చోట్ల ముసురు పట్టింది. రాత్రిపూట చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలికాలం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల సాధారణమే అయినప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు కూడా ఏకంగా 5.6 డిగ్రీల మేర పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రాష్ట్రంలో గరిష్టంగా మెదక్‌లో 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, అతి తక్కువగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో 24.6 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దుండిగల్‌లో 17.4 డిగ్రీలు, భద్రాచలంలో 17.5 డిగ్రీలు, నల్లగొండలో 18 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. హైదరాబాద్‌లో తీవ్రమైన చల్లటి ఈదురుగాలులతో ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ కోస్తా ఆంధ్ర, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. మరోవైపు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శనివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో సగటున 4.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 19.4 మిల్లీమీటర్లు, కొత్తగూడెంలో 15.6 మి.మీ., సూర్యాపేటలో 11.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో పక్క జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలంలో అత్యధికంగా 3.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
పెన్నమ్మ మహోగ్రరూపం
సాక్షి, అమరావతి/సోమశిల: నివర్ తుపాను ప్రభావం వల్ల వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పించా, చెయ్యేరు, స్వర్ణముఖి నదులు ఉప్పొంగుతున్నాయి. ఇవన్నీ పెన్నాలో కలవడంతో ఆ నది మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్టులోకి 4.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో గేట్లను పూర్తిగా ఎత్తేసి 3.60 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి సోమశిలలోకి వచ్చే వరద ప్రవాహం ఐదు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 1995 తర్వాత పెన్నా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే. భారీ వరద వస్తున్న నేపథ్యంలో.. సోమశిల ప్రాజెక్టుకు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుశస్థలి, గార్గేయ, బీమా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం, అరణియార్, మల్లెమడుగు తదితర చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోవడంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పెన్నా వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమశిల ప్రాజెక్టులోకి 78 టీఎంసీలకు గానూ 72.42 టీఎంసీలను నిల్వ చేస్తూ వరదను దిగువకు వదిలేస్తున్నారు. -
బంగాళాఖాతంలో మళ్లీ ‘వాయుగండం’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నివర్ తుపాను తీవ్రత నుంచి కోలుకోక ముందే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుత నివర్ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర – పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరో రెండు తుపాన్లు!: తూర్పు హిందూ మహాసముద్రం – దక్షిణ అండమాన్ సముద్రం మీద 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 36 గంటల్లో (ఈ నెల 29న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. తదుపరి 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా అరేబియా సముద్రం వైపు పయనించి డిసెంబర్ 2 తర్వాత తుపానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తుపానుగా మారితే.. మాల్దీవులు సూచించిన ‘బురేవి’గా పేరు పెట్టనున్నారు. అదేవిధంగా.. మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వచ్చే నెల 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇది క్రమంగా బలపడి తుపానుగా మారితే దీనికి మయన్మార్ సూచించిన ‘టకేటీ’గా పేరు పెడతారు. కాగా గడిచిన 24 గంటల్లో నివర్ ప్రభావంతో.. రాష్ట్రమంతటా భారీ వర్షాలతో పాటు మోస్తరు వానలు విస్తారంగా కురిశాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికా>రులు తెలిపారు. -
నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల రహదారులు, వంతెనలకు గండ్లు పడ్డాయి. స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు, వరదలకు చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా.. వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మూడు గ్రామాల్లో తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులకు 465 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. జలదిగ్భంధంలో గ్రామాలు సోమశిల బ్యాక్‌వాటర్‌తో నెల్లూరు జిల్లాలోని అనంత సాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరు మండలాల్లో 16 లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. 42 చెరువులకు గండ్లు పడ్డాయి. ఒక వంతెన కొట్టుకుపోవడం, సోమశిల బ్యాక్‌వాటర్‌తో రోడ్డు మునిగిపోవడంతో వైఎస్సార్– నెలూరు జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే మనుబోలు వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతి మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. చెరువులు, వరదల్లో చిక్కుకున్న ఆయా ప్రాంతాల్లోని సుమారు 4,000 మందిని, నెల్లూరు నగరంలో 1100 మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. పెన్నా ఉగ్రరూపంతో నెల్లూరు నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రంగనాథస్వామి ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఎమ్మెల్యేలు.. కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో రాళ్లపాడు, గుళ్లకమ్మ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో దిగువకు నీరు వదిలేశారు. యుద్ధప్రాతిపదికన 234 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పాలేరు, ముసి, మన్నేరు, అట్లేరు పొంగిపొర్లుతుండటంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. బాధితులను రక్షించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, అధికారులు చిత్తూరు జిల్లాలో వర్షాలతో వాగులు పొంగడంతో నలుగురు మృతి చెందారు. ఐరాల వద్ద గార్గేయ నదిలో కొట్టుకుపోయి వైఎస్సార్సీపీ కార్యకర్త వినయ్‌రెడ్డి, కేవీపల్లి నూతన కాలువలో గల్లంతై రెడ్డి భాష ప్రాణాలు విడిచారు. శ్రీరంగరాజపురం పుల్లూరు పెద్దవంక వాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. రేణిగుంట రాళ్ల కాలువలో గల్లంతైన రైతు ప్రసాద్ మృతి చెందాడు. శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల చెక్కును వారికి అందించారు. ప్రసాద్ భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఏర్పేడు మండలం శివగిరి కాలనీకి చెందిన 14 మంది గిరిజనులు కోన కాలువలో చిక్కుకుపోగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వయంగా డ్రోన్‌ను తెప్పించి వారి ఆచూకీని కనిపెట్టారు. వారికి డ్రోన్ ద్వారా బిస్కెట్లు, పండ్లు, రొట్టె, తాగునీళ్లు పంపారు. ప్రస్తుతం గిరిజనులంతా కాలువకు అవతల ఉన్న మామిడి తోటలో సురక్షితంగా ఉన్నారు. అలాగే పీలేరు మండలం ఆకులవారిపల్లెలో పూరి గుడిసె కూలిపోవడం, పింఛా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామంలోకి రాలేకపోయిన ఒక కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాపాడారు. చిత్తూరు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న 3,661 మందిని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన 15 మంది వరదలో చిక్కుకుని సమీపంలోని తోటలో ఉండిపోగా అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని యానాది కాలనీలో విద్యుత్ శాఖకు చెందిన 10 మందితోపాటు మరో 12 మంది మామిడి తోటలో చిక్కకుపోగా ఎస్పీ అన్బురాజన్ స్వయంగా రెస్క్యూ టీం సహకారంతో వారిని కాపాడారు. అలాగే వైజాగ్‌కు చెందిన 200 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సురక్షితంగా చేరుకున్నారు. వీరికి అధికారులు ఫిషింగ్ హార్బల్‌లో వసతి సౌకర్యం కల్పించి తాగునీరు, ఆహారాన్ని అందించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలో ఉన్న హేమాద్రివారిపల్లి వరద నీటిలో చిక్కుకుంది. అధికారులు, రెస్క్యూ సిబ్బంది బోటులో గ్రామానికి చేరుకుని 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రికార్డు స్థాయి వర్షం ఈ నెల 23 – 26 వరకు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సగటు సాధారణ వర్షపాతం 31.0 మిల్లీమీటర్లు కాగా 288.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో గత రెండు దశాబ్దాల్లోనే లేనంతగా 25 నుంచి 28 సెం.మీ. వర్షం కురిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 99 మండలాల పరిధిలోని 299 గ్రామాలు వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. మొత్తం 15.87 లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 664 ఇళ్లు నీట మునగగా 673 ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 76.7 మి.మీ., కర్నూలు జిల్లాలో 19.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, కడప, బద్వేలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లాలోని పాపాఘ్ని, మాండవ్య, బహుదా, పింఛా, జంగమేరు, పెన్నా, సగిలేరు, పాగేరు, మొగమూరుతోపాటు పలు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పింఛా నీటితో నిండి శుక్రవారం ఉదయం తెగిపోయింది. వరద ఉధృతికి మాండవ్య నదిలో చిన్నమండెం ప్రాంతంలో ప్రయాణికులతో ఉన్న ఓ కారు కొట్టుకుపోయింది. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. బుగ్గవంక నీటిని దిగువకు విడుదల చేయడంతో కడప నగరంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం అంజద్ బాషా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. తిరుమలలో 300కు పైగా కూలిన చెట్లు తుపానుతో తిరుమలలో దాదాపు 300కు పైగా వృక్షాలు కూలినట్టు ఎఫ్ఆర్వో ప్రభాకరరెడ్డి తెలిపారు. టీటీడీ అటవీ శాఖ ఉద్యోగులు, గార్డెనింగ్ సిబ్బంది 150 మంది బృందాలుగా విడిపోయి ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారన్నారు. కాగా, తిరుమల కొండల నుంచి ఉబికి వస్తున్న నీటితో తిరుపతిలోని రహదారులు వాగుల్లా మారాయి. లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దెబ్బతిన్న పంటలు క్షేత్రస్థాయి ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అంచనా. జిల్లాల వారీగా గుంటూరులో 1,24,392, కృష్ణాలో 94,464, తూర్పు గోదావరిలో 25,000, పశ్చిమ గోదావరిలో 21,000 చిత్తూరులో 10,166, ప్రకాశంలో 1,06,000, వైఎస్సార్‌లో 4,886, నెల్లూరులో 33,269, కర్నూలులో 15,798, అనంతపురంలో 802 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం హాఫ్‌పేట, ఖాజీపేట గ్రామాల్లో తుపాను తాకిడికి దెబ్బతిన్న మినుము, వరి పంటలను వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. -
తుపాన్ వేగంతో సాయం
సాక్షి, అమరావతి: నివర్ తుపాను బాధితులను సత్వరమే అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పంట నష్టం అంచనాలను డిసెంబర్ 15నాటికి పూర్తి చేసి 31 నాటికి రైతులకు పరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించేది లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. తుపాను సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్లో 5 ప్రత్యేక పథకాలు/ కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదించింది. మొత్తం 22 అంశాలపై కేబినెట్ చర్చించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు వివరించారు. శరవేగంగా సహాయ చర్యలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నివర్ తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. డిసెంబర్ 15నాటికి పంటనష్టం అంచనాలు పూర్తి చేసి 31నాటికి రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరా. ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగిన చోట మార్గదర్శకాల ప్రకారం త్వరగా పరిహారం చెల్లింపు. 2న ‘ఏపీ అమూల్... చేయూత, ఆసరా లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ మహిళల ఆర్థిక స్వావలంబనకు అమూల్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఏపీ అమూల్’ ప్రాజెక్టు కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం. డిసెంబరు 2న ‘ఏపీ అమూల్’ ప్రాజెక్టు ప్రారంభం. మొదట విడతగా వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేయూత, ఆసరా లబ్ధిదారుల్లో ఆప్షన్లు ఎంపిక చేసుకున్న మహిళలకు ఆవులు, గేదెల యూనిట్ల పంపిణీ. 9,899 బల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 10న గొర్రె పిల్లలు, మేక పిల్లల పంపిణీ ఇదే కార్యక్రమం కింద 2.49 లక్షల యూనిట్ల గొర్రెలు, మేకల పంపిణీకి మంత్రివర్గం ఆమోదం. 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు, ఒక గొర్రెపోతు లేదా మేకపోతు కలిపి ఒక యూనిట్‌గా పరిగణన. చేయూత, ఆసరా పథకాల ద్వారా డిసెంబరు 10న లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 15న ఉచిత పంటల బీమా మొత్తం పంపిణీ 2019–20 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా మొత్తాన్ని డిసెంబరు 15న పంపిణీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం. 2016–19 వరకు మూడేళ్లలో రైతులు రూ.871.26 కోట్లు బీమా ప్రీమియం కింద చెల్లించాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించిన తరువాత రైతులకు ఇబ్బందులు తొలగాయి. 2019 ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే రైతుల తరపున రూ.1,030.74 కోట్లు బీమా ప్రీమియం చెల్లించింది. 2019–20 ఖరీఫ్ బీమా పరిహారం కింద రూ.1227.77 కోట్లను డిసెంబరు 15న రైతులకు చెల్లించాలని నిర్ణయం. 21న భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం ‘వైఎస్సార్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ’ పథకం కింద సమగ్ర భూసర్వే ప్రాజెక్టు డిసెంబరు 21న ప్రారంభం. రూ.927 కోట్లతో ల్యాండ్ సర్వే ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం. డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్ల ద్వారా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహణ. సర్వే రాళ్లను ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందచేస్తుంది. 25న పేదలకు 30.60 లక్షల ఇళ్ల పట్టాలు ‘పేదలు అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా డిసెంబరు 25న రాష్ట్రంలో 30.60 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీకి మంత్రివర్గం ఆమోదం. కోర్టు కేసులు ఉన్న చోట మినహా మిగిలిన అన్ని చోట్లా ఇళ్ల పట్టాలు పంపిణీ. లబ్ధిదారులకు డీపట్టాలు పంపిణీ చేసి కోర్టు కేసులు పరిష్కారం అయ్యాక కన్వెయిన్స్ డీడ్ ఇవ్వాలని నిర్ణయం. పేదలకు పంపిణీ చేసేందుకు రూ.23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను సేకరించారు. 11 వేల పంచాయతీల్లో 17,500 లే అవుట్లలో ఇళ్ల స్థలాలు పేదలకు పంపిణీ చేస్తారు. వైఎస్సార్–జగనన్న’ కాలనీలు... పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాల్లో ‘వైఎస్సార్–జగనన్న కాలనీల’ పేరిట పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదించింది. వీటి నిర్మాణ పనులను డిసెంబరు 25న ప్రారంభిస్తారు. 28.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుంది. మొదటి దశలో 8,494 లే అవుట్లలో దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి 2022 జూన్ నాటికి పూర్తి చేస్తారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున తొలి దశలో ఇళ్లను దాదాపు రూ.28,800 కోట్లతో పూర్తి చేస్తారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తారు. మిగిలిన 13 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 2021 డిసెంబరులో ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తారు. మొత్తం వైఎస్సార్–జగనన్న కాలనీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులైన లబ్ధిదారులకు ఏపీ టిడ్కో ఇల్లు రూపాయికే పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదించింది. టీడీపీ సర్కారు పెండింగ్‌లో ఉంచిన డీఏలతో సహా మూడు డీఏలు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం పెంపు 2018 జూలై నుంచి వర్తింపజేస్తూ 2021 జనవరి నుంచి చెల్లించనుంది. 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు. ఇది 2021 జూలై నుంచి చెల్లిస్తారు. 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు. ఇది 2022 జనవరి నుంచి చెల్లిస్తారు. మొత్తం మీద డీఏ పాత బకాయిల కింద రూ.11 వేల కోట్లు, ఇక నుంచి ఏటా రూ.4,400 కోట్ల అదనపు భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు నెలలపాటు జీతాలు, పింఛన్లలో విధించిన కోతల మొత్తాన్ని చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్చి పెండింగ్ జీతాలను డిసెంబరులో, ఏప్రిల్ పెండింగ్ జీతాలను 2021 జనవరిలో చెల్లిస్తారు. ‘పోలవరం’ సెంటీమీటరు కూడా తగ్గించం పోలవరం ఎత్తును ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించేది లేదని మంత్రివర్గం స్పష్టం చేసింది. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తన అనుకూల మీడియాతో కలసి దుష్ప్రచారం చేయటాన్ని ఖండించింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును ముందు ఆమోదించిన అసలైన డిజైన్ ప్రకారమే నిర్మిస్తామని స్పష్టం చేసింది. స్పిల్ వే పనులను యుద్ధ ప్రాతిపతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం – డ్యాం రిహాబిలిటేషన్, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండు, మూడు దశలను మంత్రివర్గం ఆమోదిస్తూ రూ.776.50 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిధులను ప్రపంచబ్యాంకు సమకూరుస్తుంది. సోమశిల – కండలేరు కాలువ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24వేల క్యూసెక్కులకు పెంచుతూ పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.918 కోట్లతో 45కి.మీ. మేర కాలువ పనులు, రెండు బ్రిడ్జీలు సహా పలు పనులు చేపడతారు. అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటి నిల్వ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం రూ.240.53 కోట్లు ఇచ్చేందుకు అనుమతించింది. నాలుగు గ్రామాల పరిధిలో 1,729 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందిస్తారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్ ఫీడర్ కాలువ విస్తరణ పనులకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.632కోట్లు వెచ్చించి దాదాపు 100కి.మీ. మేర కాలువ సామర్థ్యం పెంచుతారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఏపీ పల్నాడు ఏరియా డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు ఆమోదించింది. ఇందులో భాగంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ స్కీం, వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను చేపడతారు. కృష్ణా–కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఇతర నిర్ణయాలు ఇవీ... ఆన్లైన్ జూదంపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ‘ఏపీ గేమింగ్ యాక్ట్ – 1974’ చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ‘వైఎస్సార్–జగనన్న ’ మెగా ఇండస్ట్రియల్ హబ్ రాయితీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హబ్ ద్వారా వేలాదిమందికి ఉపాథి అవకాశాలు కల్పిస్తారు. నాణ్యమైన పశుదాణా ఉత్తత్తి, పంపిణీ, ధరల నియంత్రణకు ఉద్దేశించిన బిల్లు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారు. భూ వినియోగ మార్పిడి చట్ట సవరణ కోసం ఉద్దేశించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది. 2006 నాటి చట్టాన్ని ప్రభుత్వం సవరించనుంది. దీనిపై ఇదివరకే ఆర్డినెన్స్ జారీ చేసింది. అనంతపురం జిల్లా పెనుకొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం కోసం రూ.2.50కోట్లు ఖర్చు చేస్తారు. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టం 2020 ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. మత్స్య, ఆక్వా రంగాల సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ఈ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు ప్రవేశపెడతారు. నాగార్జున సాగర్ వద్ద విజయపురి సౌత్‌లో రెసిడెన్సియల్ కాలేజీ, మైదానం, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం కోసం విద్యాశాఖకు ప్రభుత్వం 21 ఎకరాలను కేటాయించింది. విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండిలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ కోసం జేఎన్టీయూకు 105.32 ఎకరాల కేటాయింపు. 29,752 హెక్టార్లలో పంట నష్టం... ప్రాథమిక అంచనాల ప్రకారం నివర్ తుపానుతో 29,752 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. 16,290 హెక్టార్లలో వరి, 7,362 హెక్టార్లలో మినుము, 3,571 ఎకరాల్లో పత్తి, 2,529 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. 1,371 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నవంబరు 23–26 మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 288.80 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇది 188శాతం అధికం. తుఫానుతో ముగ్గురు చనిపోగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 673 ఇళ్లు దెబ్బతిన్నాయి. -
వరదలో చిక్కుకున్న గిరిజనులు..
సాక్షి, నెల్లూరు: పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆహారం, వసతి సౌకర్యాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. (చదవండి: నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే) వరద బాధితులకు ఫుడ్ ఫ్యాకెట్లు పంపిణీ.. వైఎస్సార్ జిల్లా: వరద బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వరద బాధితులకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నప్రతి ఒక్కరికీ రూ.500 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. (చదవండి: ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం) రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్... హేమాద్రివారిపల్లె వద్ద రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. వరదలో చిక్కుకున్న 130 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. లోతట్టుప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో.. నెల్లూరు జిల్లా: పెరమన వద్ద గిరిజనులు వరదలో చిక్కుకున్నారు. రొయ్యల గుంటలకు కాపలా కోసం వెళ్లిన 11 మంది గిరిజనులు.. ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సంగం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో నెల్లూరు నుంచి కడప రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
నివర్ తుపాన్: రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాల్లో వరద నష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (శనివారం) ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షా సమావేశం అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. నివర్ తుపానుపై నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. (చదవండి: 30 లక్షల ఇళ్ల పట్టాలు: ఏపీ కేబినెట్ ఆమోదం) తుపాను ప్రభావంపై సీఎం వైఎస్ జగన్ నిన్న తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. (చదవండి: ‘నివర్’ బీభత్సం) -
29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
-
శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
సాక్షి, తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం జరిగింది. తిరుమలలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మాడ వీధుల్లో ఊరేగింపును టీటీడీ రద్దు చేసింది. ఉదయం 4.45 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయంలో ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరంలో కైశిక ద్వాదశి నాడు మాత్రమే ఉగ్ర శ్రీనివాసుడు ఆలయం నుంచి వెలుపలికి వస్తారు. కానీ తుఫాను కారణంగా ఈ ఉత్సవం ఆలయానికే పరిమితం అయింది. (వాయుగుండంగా బలహీనపడ్డ నివర్) పర్వదినం ప్రత్యేకత..? పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశికద్వాదశి ఒకటి. వరాహ పెరుమాళ్ కైశికపురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది. -
డిసెంబర్ 2న 'బురేవి'.. 5న 'టకేటి'
సాక్షి, విశాఖపట్నం: ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్2న 'బురేవి తుఫాన్' తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 7న డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. (వాయుగుండంగా బలహీనపడ్డ నివర్ తుపాను) -
గల్లంతైన రైతు ప్రసాద్ మృతదేహం లభ్యం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మల్లెమడుగు వరద ఉధృతిలో నిన్న గల్లంతు అయిన రైతు ప్రసాద్ మృతి చెందాడు. ప్రసాద్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం శుక్రవారం వెలికి తీసింది. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా రేణిగుంట సమీపంలోని రాళ్లవాగులో నిన్న ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. వాగులో ఉన్న విద్యుల్ మోటార్లను తీసుకొచ్చేందుకు ఉదయం వాగులో దిగారు. మల్లిమడుగు నుంచి వరదనీరు రావడంతో వాగులోనే చిక్కుకుపోవడంతో ఐదు గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వాగులో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందులో ప్రసాద్ అనే రైతు గల్లంతయ్యారు. గల్లంతు అయిన ప్రసాద్ కోసం నిన్నటి నుంచి గాలించగా ఇవాళ మృతదేహం లభించింది. చదవండి: (రాగుళ్లవాగులో కొట్టుకుపోయిన ముగ్గురు రైతులు) -
వాయుగుండంగా బలహీనపడ్డ నివర్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుద్దుచ్చేరి రాష్ట్రాలను అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్ క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం తుపాను దక్షిణ రాయలసీమ పరిసరాల్లో కేంద్రీకృతమై, అల్పపీడనంగా మార్పుతున్నట్లు వాతామరణశాఖ తెలిపింది. రాబోయే ఆరు గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ సూచనలు చేసింది. (‘నివర్’ బీభత్సం) రైతులను నిలువునా ముంచిన 'నివర్' కృష్ణా జిల్లా రైతులను నివర్ తుఫాన్ నిలువునా ముంచింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో వరి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు అధికారుల ప్రాథమిక అంచనా. పంట చేతికందే సమయంలో దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం రంగుమారి గిట్టుబాటు ధర రాదనే ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం ఇలాగే కొనసాగితే వరి కంకులకు మొలకలు వస్తాయని రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి నివర్ తుఫాన్ దెబ్బకు నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సోమశిలకు వరద నీరు పోటెత్తడంతో సోమశిల నుండి భారీగా దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ►గూడూరు ఆదిశంకర కాలేజి వద్ద ఎన్‌హెచ్ 16పై కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరు నుండి గూడూరు వైపు వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో హైవే పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రాత్రి నుంచి పోలీసులు పహారా కాస్తున్నారు. వరద తగ్గేవరకు ఆ మార్గం గుండా రాకపోకలను పోలీసులు నిలిపివేస్తున్నారు. చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న కలెక్టర్ హరికిరణ్ నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడపలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. దీంతో నగరంలోని బుగ్గవంక పరివాహ ప్రాంతాల్లో భారీగా వర్షపునీరు చేరిన వీధులను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ గురువారం రాత్రి పరిశీలించారు. జేసీ సాయికాంత్ వర్మ, సబ్ కలెక్టర్ పృధ్వీతేజ్లతో కలిసి వర్షపునీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలిసిన కలెక్టర్ వారిని అప్రమత్తం చేశారు. నగరంలోని నాగరాజుపేట, చెమ్ముమియా పేట పరిధిలోని హరి టవర్స్, పాత బస్టాండు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతల్లోకి వెళ్లిన కలెక్టర్.. ప్రజలను దగ్గరుండి ఇళ్లు ఖాళీ చేయించారు. ►తూర్పుగోదావరి: తుపాను నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రైతులకు సాయం అందించేలా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని, పంట నష్టం కలగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నివర్ తుఫాన్ బీభత్సం: ►తుఫాన్ ప్రభావం కారణంగా తిరుపతిలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మల్లెమడుగు రిజర్వాయర్ నుంచి దిగువకు 40వేల క్యూసెక్కులని నీటి విడుదల చేశారు. ►చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి, నాగయ్యగారిపల్లె వద్ద వరద ఉధృతికి చెక్ డ్యామ్‌లు కూలిపోయాయి. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తుపాను ప్రభావంతో చంద్రగిరి స్వర్ణముఖి నదిలో వరద ఉధృతి పెరిగింది. తిరుమలలో నివర్ తుపాను ఎఫెక్ట్ భారీ వర్షాలకు జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో అన్ని జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. శ్రీవారి మెట్టు నడకదారిని అధికారులు మూసివేశారు. భారీ వర్షంతో అనేక ప్రాంతాల్లో వృక్షాలు నేలకూలాయి. కర్నూలులో ఎడతెరిపిలేని వర్షాలు నివర్ తుపాను కారణంగా జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. -
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన
సాక్షి, తిరుపతి రూరల్/ రేణిగుంట: నివర్ తుపానుతో కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగిన రాగుళ్లవాగు వరదలో ముగ్గురు రైతులు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా మరొకరు మృతిచెందారు. రైతుల్ని కాపాడేందుకు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చూపించిన చొరవ, సహాయక సిబ్బందిని సమన్వయ పరిచిన తీరు సీఎం వైఎస్ జగన్ సహా పలువురి ప్రశంసలందుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పొలంలో మోటార్లు తీసుకువస్తూ.. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కుమ్మరిపాలెంకు చెందిన ముగ్గురు రైతులు వెంకటేష్, ప్రసాద్, లోకేష్‌లు గురువారం వర్షాలకు దెబ్బతింటాయని పొలం వద్ద ఉన్న మోటార్లను తీసుకువచ్చేందుకు వెళ్లారు. తిరిగి వస్తూ రాగుళ్ల వాగు ఉధృతికి వరదలో చిక్కుకుని దాదాపు అర కిలోమీటరు కొట్టుకుపోయారు. వారిలో వెంకటేష్, లోకేష్‌లు చెట్టును పట్టుకుని కాపాడాలని కేకలు వేయగా.. ప్రసాద్ మృతిచెందాడు. విషయం సీఎం కార్యాలయం ద్వారా తుడా చైర్మన్ చెవిరెడ్డికి తెలిసింది. ఆయన హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి హెలికాప్టర్ తెప్పించారు. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో రైతుల్ని కాపాడటం వీలుకాలేదు. దీంతో జిల్లా కలెక్టర్, పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడి స్పీడ్ బోటును తెప్పించారు. దానిలో వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రైతులను క్షేమంగా ఒడ్డుకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైతుల్ని కాపాడటానికి చొరవ చూపించిన చెవిరెడ్డిని సీఎం జగన్ అభినందించారు. పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులు కూడా ఆయన్ను ప్రశంసించారు. కాగా హెలికాప్టర్ పంపిన సీఎం జగన్‌కు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (‘నివర్’ బీభత్సం) రెస్క్యూ బృందానికి ఎమ్మెల్యే రూ.లక్ష నజరానా రైతులు వాగులో చిక్కుకున్న సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి.. తాను దూరంగా ఉండటంతో తొలుత పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి అక్కడికి పంపారు. జిల్లా కలెక్టర్‌తో, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత ఘటనా స్థలానికి చేరుకుని రైతుల్ని పరామర్శించారు. వారిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందిని అభినందించి లక్ష రూపాయలు ప్రోత్సాహకంగా అందజేశారు. -
‘నివర్’ బీభత్సం
సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ సాక్షి నెట్వర్క్ : నివర్ తుపాను అతి తీవ్రంగా ప్రభావం చూపడంతో బుధవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో కొన్ని జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలంగా మారింది. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఊహించనంతగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు వాగులను తలపిస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు నగరాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెన్నా, కుందూ స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. అధికార యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. జాతీయ విపత్తు సహాయ దళాలు, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అధికారులను ఆదేశించారు. రాత్రి 2.30 గంటల సమయంలో తీరం దాటిన తుపాన్ ► బుధవారం అర్థరాత్రి 11.30 గంటలకు సముద్రంలో కల్లోలం సృష్టిస్తూ.. ‘నివర్’ తుపాన్ తీరం వైపు కదిలింది. రాత్రి 2.30 గంటల సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ వేగంతో గరిష్టంగా 145 కి.మీ వేగంతో వీచిన బలమైన గాలులతో భూమిని తాకి.. వాయవ్య దిశగా పయనమైంది. ► అయినా సముద్రంలో కల్లోలం కొనసాగుతుండటంతో ఆశ్చర్యపోయిన వాతావరణ కేంద్రం అధికారులు.. ఇంకా నివర్లోని కొంత భాగం అక్కడ ఉందని గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటలకు మిగిలిన భాగం కూడా తీరం వైపు కదిలి, ముందు భాగంలో విలీనమై అతి తీవ్ర తుపాన్‌గా తీరం దాటింది. ► తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, వాడరేవు పోర్టుల్లో లోకల్ సిగ్నల్ మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక సూచీని ఎగరేశారు. ► శుక్రవారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా అతలాకుతలం ► పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. కోట మండలంలో ఒక్క రాత్రికే 25 సెం.మీ.వర్షం కురిసింది. 30 మండలాల్లో 10 సెం.మీ. నుంచి 24 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ► లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. గూడూరు వద్ద ఏషియన్ హైవే పైకి వరద నీరు రావడంతో రెండు మార్గాల్లో పూర్తి స్థాయిలో వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ► నాయుడుపేట–తిరుపతి మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. వెంకటగిరి–రాపూరు మార్గంలోని నేషనల్ హైవేలో లింగసముద్రం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఆత్మకూరు–సోమశిల ప్రధాన రహదారిపై దేపూరు వద్ద వరద నీరు చేరి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ► జిల్లాలోని పెన్నానదితో పాటు కాళంగి, స్వర్ణముఖి, ఉపనదులైన బొగ్గేరు, కేతామన్నేరు, పంబలేరు, చిప్పలేరు, కైవల్యా, గొడ్డేరు పొంగి ప్రవహిస్తున్నాయి. అన్ని చెరువులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. లింగాలపాడు చెరువుకు గండిపడడంతో నీరంతా గ్రామాన్ని చుట్టుముట్టింది. బొప్పాయి, మిరప, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ► ఈదురు గాలులకు 89 పెద్ద చెట్లు, పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాల నుంచి 3,365 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. ► వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరుతోంది. దీంతో సోమశిల అన్ని గేట్లు ఎత్తేసి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నానది ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో పెన్నా పరీవాహక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాయి. కలెక్టర్ చక్రధర్‌బాబు, జేసీలు ప్రభాకర్‌రెడ్డి, హరేందర ప్రసాద్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గూడూరు నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు తిప్పవరప్పాడు వద్ద కాజ్‌వేను దాటుకుని సైదాపురం కైవల్యా బ్రిడ్జి సమీపానికి వెళ్లే సరికి అక్కడ రోడ్డుపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆగిపోయింది. వెనక్కు మళ్లించే సరికి కాజేవేపై ఐదు అడుగుల మేర నీటి ప్రవాహం పెరగడంతో బస్సు సహా, ఇతర వాహనాలను నిలిపివేశారు. కిలోమీటర్ చొచ్చుకు వచ్చిన సాగరతీరం ► కృష్ణా జిల్లాలోని హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. సుమారు మూడు మీటర్లు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. కిలోమీటర్ మేర నీరు ముందుకు చొచ్చుకువచ్చింది. మూడు కిలోమీటర్ల మేర ఇసుకతిన్నెలు కోతకు గురయ్యాయి. ► కృష్ణా జిల్లాలో 27,769 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. గన్నవరం విమానాశ్రయంలో 10 సర్వీసులకు గాను మూడు మాత్రమే వచ్చాయి. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 7 సర్వీసులు విజిబిలిటీ లేక రద్దయ్యాయి. చిత్తూరు జిల్లా గజగజ ► చిత్తూరు జిల్లాను నివర్ తుపాను చిగురుటాకులా వణికించింది. ► సదు మండలం జాండ్రపేట పొట్టెంవారిపల్లెకు వెళ్లే రహదారి పక్కనున్న చెరువులో గుర్తుతెలియని మహిళ గల్లంతయ్యారు. సోమల మండలం సీతమ్మ చెరువు పొంగి ప్రవహించడంతో అటుగా వాహనంలో వెళ్తున్న నలుగురు వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. ► పెద్దమండ్యం మండలం కలిచెర్ల వద్ద పాపిరెడ్డి చెరువు మొరవ ఉధృతంగా పోతోంది. దాన్ని దాటే క్రమంలో పాల వ్యాన్ కొట్టుకుపోగా అందులో ఉన్న ఇద్దరు దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ► కాణిపాకం సమీపంలోని పుణ్యసముద్రం వద్ద ఒకరు వరదలో చిక్కుకోగా అతన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. తిరుమల ఘాట్ రోడ్లలో బండరాళ్లు విరిగిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. మాడ వీధులు, శ్రీవారి ఆలయం ఎదుట నీరు ప్రవహిస్తోంది. పాపవినాశనం, గోగర్భం గేట్లను ఎత్తిని నీటి విడుదల చేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కడపలో భయపెడుతున్న బుగ్గవంక ► కడప నగరంలో 19,000 క్యూసెక్కులతో బుగ్గవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. నాగరాజుపేట, రవీంద్రనగర్, ద్వారకానగర్, బాలాజీనగర్, మోచంపేట, పాతబస్టాండ్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ హరికిరణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ► కడప–తిరుపతి రహదారిలోని ఊటుకూరు, బాలుపల్లెల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో రాయచోటి వైపు ›ట్రాఫిక్ మళ్లించారు. రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. ► గుంటూరు జిల్లాలోని పశ్చిమ డెల్టా, పల్నాడు ప్రాంతంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల వాలింది. పత్తి, మిరప పంటలపై తుపాన్ ప్రభావం చూపింది. ► ప్రకాశం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో నీరు చేరింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 131 పునరావాస కేంద్రాలు, 93 తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. ఇదీ వర్షపాతం.. రైల్వేకోడూరులో 25 సెం.మీ, వెంకటగిరిలో 24 సెం.మీ, గూడూరులో 19, రాపూరులో 16, ఆత్మకూరు, సూళ్లూరుపేటలో 15, నెల్లూరు, కావలి, సత్యవేడు, సంబెపల్లెలో 14, రాజంపేట, తిరుపతిలో 13, తొట్టెంబేడు, పుత్తూరులో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనాల కాలం.. హిమాలయాల్లో ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో కొనసాగిన ఇంట్రా ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ (ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే ప్రాంతం) ప్రస్తుతం అరేబియా, బంగాళాఖాతాల్లో కొనసాగుతోంది. దీని వల్ల ఈ రెండు సముద్రాల్లో అల్పపీడనాలు వరుసగా ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ నిపుణుడు, ఏయూ వాతావరణ విభాగ రిటైర్డ్ ప్రొఫెసర్ భాను కుమార్ తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 29న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వివరించారు. డిసెంబర్ నెలలోనూ వరుసగా తమిళనాడు సమీప సముద్ర తీరాల్లో అల్పపీడనాలు ఏర్పడతాయని చెప్పారు. తమిళనాడుకు తప్పిన భారీ ముప్పు సాక్షి ప్రతినిధి, చెన్నై: భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దారితీయకుండా తమిళనాడులో నివర్ తుపాన్ గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. కేవలం రెండు జిల్లాలపై మాత్రమే ప్రభావం చూపడంతో భారీ నష్టం తప్పింది. గురువారం తెల్లవారుజాము 4 గంటల వరకు భయానక పరిస్థితులు కొనసాగాయి. విల్లుపురం, తిరువణ్ణామలై, కల్లకురిచ్చి, వేలూరు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకు తుపాన్ తీరందాటిన ప్రభావం కొనసాగింది. పుదుచ్చేరి–మరక్కానం మధ్య విల్లుపురం జిల్లా అళగన్కుప్పం ప్రాంతాన్ని ఎన్నడూ ఎరుగని రీతిలో అతిభారీ వర్షం, తీవ్రస్థాయిలో ఈదురుగాలులు కుదిపేశాయి. దీంతో వేలాది వృక్షాలు కూలిపోయాయి. ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపి వేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకోలేదు. కడలూరు, విల్లుపురం జిల్లాలో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం సంభవించింది. ► 2015 డిసెంబర్ స్థాయిలో కాకున్నా నివర్ తుపాన్ ధాటికి చెన్నై మరోసారి నీట మునిగింది. మొత్తం 5 లక్షల ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించగా ప్రజలు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయారు. ► చెన్నై శివార్లలోని తాంబరం–ముడిచ్చూరులలో గత 24 గంటల్లో 31.4 సెంటీమీటర్ల వర్షం పడడంతో 10 వేలకు పైగా ఇళ్లు వరద నీటితో నిండిపోయాయి. ► ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను రబ్బర్ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలో 267 వృక్షాలు కూలిపోయాయి. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక చర్యల కోసం కడపలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద పడవను సిద్ధం చేసిన యంత్రాంగం నెల్లూరు జిల్లా లింగ సముద్రం వద్ద వరద ఉధృతికి కూలిన బ్రిడ్జి చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతానికి తీసుకువస్తున్న సహాయక సిబ్బంది నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నీట మునిగిన సవారి గుంట ప్రాంతం తిరుమలలోని ప్రధాన ఆలయం వద్ద వరద నీరు భారీ వర్షాలకు కొండపై నుంచి పడుతున్న నీటితో నిండుగా కపిలతీర్థం తిరుపతిలో బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న పోలీసులు ఈదురు గాలుల ధాటికి పుదుచ్చేరిలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు నివర్ తుపాన్‌కు జలమయమైన చెన్నైలోని ముడిచ్చూరు ప్రాంతం -
నివర్ తుపాను: అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, పశ్చిమగోదావరి: నివర్ తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య బృందాలు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కాజ్‌ల వద్ద పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస చర్యలు, భోజన సదుపాయం, వైద్య సహాయం విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి: సజ్జల) అధికారులు అందుబాటులో ఉండాలి: మంత్రి అనిల్ నెల్లూరు: ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో చెరువులు గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని మంత్రి అనిల్ ఆదేశించారు. (చదవండి: శ్రీవారి మెట్టు మార్గం మూసివేత) ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు: జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. నివర్ తుపాను కారణంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, జలాశయాల్లో నీటినిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యంతోపాటు అన్ని వసతులు కల్పించాలని, అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. -
ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి: సజ్జల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశంతో తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వం ఇలాంటి విపత్తుల సమయంలో బాధితులకు సహాయాన్ని మరిచి పబ్లిసిటీ కోసం పాకులాడేది. పబ్లిసిటీ కోసం గత ప్రభుత్వం.. ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన ట్వీట్ చేశారు. (చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..) -
నివర్ తుపాను: శ్రీవారి మెట్టు మార్గం మూసివేత
సాక్షి, తిరుమల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేశారు. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు విరిగిపడుతున్నాయి. భక్తులకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా శ్రీవారి మెట్టు నడకదారిని టీటీడీ అధికారులు మూసివేశారు. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్ గేట్లు అధికారులు ఎత్తివేశారు.(చదవండి: నివర్ తుపాను: చొచ్చుకొచ్చిన సముద్రం) వాగులో రైతులు గల్లంతు.. చిత్తూరు జిల్లా ఏర్పేడు, మల్లిమడుగు వాగులో ముగ్గురు రైతులు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇద్దరిని రక్షించగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులకు ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండగా నిలిచారు. సత్యదేవుని తెప్పోత్సవం నిలిపివేత.. తూర్పుగోదావరి: తుపాన్ కారణంగా అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవాన్ని దేవస్థానం అధికారులు నిలిపివేశారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రాత్రి 7 గంటలకు జరగాల్సిన తెప్పోత్సవంకు ఆటంకం కలిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథ్ తెలిపారు.(చదవండి: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు) -
నివర్ తుపాను: చొచ్చుకొచ్చిన సముద్రం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు,తూర్పు, పశ్చిమ,ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లా సీకే దిన్నే మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 3 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జిల్లాలోని ఒంటిమిట్ట చెరువు 10 ఏళ్లు తర్వాత జలకళ సంతరించుకుంది. (చదవండి: నివర్ తుపాను.. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు) రాయచోటి-రాయవరం మార్గంలోని సద్దిగోళ్ళవంక వద్ద వరద ఉధృతి పెరిగింది. దీంతో వాహనదారులను అర్బన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. రాయచోటిలో గుడిసెలు, మట్టి మిద్దెలలో నివసిస్తున్న ప్రజలను మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ఖాళీ చేయించారు. తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సంబేపల్లిలో జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. మండలంలో 144 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దుద్యాల శెట్టిపల్లె, గున్నికుంట్ల, దేవళంపేటల్లో తుపాను దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. పూరి గుడిసె కూలిపోయింది. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష) జమ్మలమడుగు నియోజకవర్గంలో తుపాను ప్రభావంతో వరి, శనగ, మిరప, ప్రత్తి పంటలు నీటమునిగాయి. జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండ్, డీఎస్పీ, ఆఫీస్,ఎక్చేంజ్ కార్యాలయం నీటమునిగాయి. లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల, దిన్నెపాడు, అప్పలరాజు పల్లె, నరసింహారాజు గారి పల్లెలో తుపాను ప్రభావంతో పూర్తిగా నీటమునిగింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలపై చెట్లు పడిపోవడంతో విద్యుత్‌కు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పోరుమామిళ్ల మండలంలో తుపాన్ ప్రభావంతో వరిపంట పూర్తిగా నీట మునిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో రాజంపేట మండలం ఊటుకూరు వద్ద కడప - తిరుపతి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఏర్పడింది. రెండు కిలోమీటర్లు మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద ఉధృతిని ఎస్పీఅన్బురాజన్ పరిశీలించారు. తగిన భద్రతలు తీసుకోవాలని రాజంపేట డిఎస్పీ శివ భాస్కరరెడ్డికి సూచనలు చేశారు. సుండుపల్లి మండలం, సిద్దారెడ్డి గారి పల్లిలో తుపాను ధాటికి నలభై ఏళ్ల చింతచెట్టు రోడ్డుపై అడ్డంగా నేల కొరిగింది. జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా: తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్ గేట్లు అధికారులు ఎత్తివేశారు. పశ్చిమగోదావరి జిల్లా: తుపాన్ ప్రభావంతో ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారు. కోసిన వరిచేలు తడిసి ముద్దయ్యాయి. కనీస పెట్టబడులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా: తుపాను ప్రభావంతో జయలలితా నగర్ లో భారీవృక్షాలు కూలి ఇళ్లు ధ్వంసమైన బాధితులను ఎస్పీ భాస్కర్ భూషన్ పరామర్శించారు. స్థానిక 48 వార్డ్ ఇంఛార్జితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సీఐలు మధుబాబు, అన్వర్ భాష, ఎస్ఐలు సుభాని, శ్రీహరి తదితరులు ఉన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నది పొంగడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి: పిఠాపురం మండలం సూరాడపేట వద్ద సముద్రం అలల ఉధృతికి 100 మీటర్ల మేర సముద్రం చొచ్చుకొచ్చింది. ఒడ్డున ఉన్న రెండు పూరి గుడిసెలు, వెంకటేశ్వర స్వామి దేవాలయం ధ్వంసం అయ్యాయి. ప్రకాశం జిల్లా: చీరాల మండలం వాడరేవులోని మత్స్యకారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చీరాల ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద జెండాను అధికారులు ఎగురవేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుపతిలో నివర్ తుపాన్ బీభత్సం
-
నివర్ తుపాను: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శ౦కర్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన తాగునీరు, పారిశుద్ద్యం పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ఆహారం, వాటర్ ఫ్యాకెట్లు తక్షణమే సరాఫరా చేయాలన్నారు. ఓహెచ్ఎస్, చేతి పంపులు శుభ్రం చేయించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేసి పంపాలని గిరిజా శ౦కర్ ఆదేశించారు. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష) నివర్ తుపాను రాగల ఆరు గంటల్లో తీవ్ర వాయు గుండం.. ఆ తదుపరి ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ప్రభావిత ప్రాంత ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివర్ తుపాన్: ఏపీలో వర్ష బీభత్సం..) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీద నివర్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాయుడుపేటలోని స్వర్ణముఖి నది వరద నీటితో నిండిపోయింది. ఇక నాయుడుపేట ఎగువ ప్రాంతాలైన చిత్తూరు, తిరుపతి, కాళహస్తి తదితర ప్రాంతాలలో భారీ వర్షాలు కురవడంతో స్వర్ణముఖి నదికి గంట గంటకు భారీ వరద చేరి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, పోలీసులు స్వర్ణముఖి నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డుకు, బ్రిడ్జి సమీపానికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. (చదవండి: తీరాన్ని దాటిన నివర్ తుపాను..) కాగా తుపాను ప్రభావం ఇలాగే కొనసాగితే బ్రిడ్జి మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే నాయుడుపేట, మేనకూరు పరిశ్రమ వాడ, వెంకటగిరికి రాకపోకలకు అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష) వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: ఎస్పీ తుపాను ధాటికి జయలలితా నగర్లో భారీవృక్షాలు కూలి ఇళ్లు ధ్వంసమై విషాదంలో మునిగిన బాధితులను నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పరామర్శించారు. స్థానిక 48 వార్డ్ ఇంఛార్జితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సీఐలు మధుబాబు, అన్వర్ భాష, ఎస్ఐలు సుబాని, శ్రీహరి, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చిత్తూరు జిల్లాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. ఇప్పటి వరకు 16 వందల మందికి సురక్షిత ప్రాంతాలకు తరలించమన్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ప్రమాదంలో ఉంటున్న చెరువుల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: నివర్ తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని వివరించారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి వివరించారు. నివర్ (తుపాన్: ఏపీలో వర్ష బీభత్సం..) పెన్నానదిలో ప్రవాహం ఉండొచ్చని, సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. అక్కడక్కడా పంటలు నీటమునిగిన ఘటనలు వచ్చాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. (తీరాన్ని దాటిన నివర్ తుపాను..) -
నివర్ తుపాన్: ఏపీలో వర్ష బీభత్సం..
సాక్షి, అమరావతి: ‘నివర్ తుపాన్’ నేపథ్యంలో పలు జిల్లాలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా: నివర్ తుఫాన్ ఎఫెక్ట్‌తో మచిలీపట్నంలో తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షంతో పాటు చలి గాలుల వల్ల జనజీవనం స్తంభించింది. తిరువూరు, గంపలగూడెం, ఏ-కొండూరు, విస్సన్నపేట మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతాంగాన్ని రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి వీస్తున్న చలిగాలులు విస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చిత్తూరు: జిల్లాలోని తిరుపతిలో నివర్ తపాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ప్రాధాన రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఎర్ర మిట్ట, జీవకోన, లీల మహల్ సర్కిల్, సత్యనారాయణపురం, కొర్ల గుంట, వినాయక సాగర్‌లో పలు గృహాలు నీట మునిగాయి. లీలా మహల్, కరకంబాడి ప్రధాన మార్గంలో నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో సిబ్బంది వర్షపు నీరు ప్రవహిస్తున్న కాలువల్లో జేసిబి సహాయంతో పూడికలు తీస్తున్నారు. తిరుమలలో మెదటి ఘాట్ రోడ్డులో 56వ మలుపు వద్ద భారీ వృక్షం కూలిపోయింది. దీంతో టీటీడీ సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం తోలిగిస్తున్నారు. స్వామివారి భక్తులకు అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది వృక్షాన్ని తొలగిస్తున్నారు. వైఎస్సార్ కడప: జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్లో గత 12 గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రెండు మండలాల్లోని చెరువుల్లోకి వర్షపు నీరు భారీగా చేరుకుంటోంది. ఇప్పటికే పలు చెరువుల్లో 80 శాతం పైగా వర్షపు నీరు చేరింది. చెరువుల్లో నీరు నిండుగా చేరడంతో రెండు మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరుకు ఇబ్బంది ఉండదని రెండు ఏళ్ల పాటు పంటలు పెట్టు కోవచ్చని రైతులు తెలిపారు. కొద్ది గంటల్లో ఒంటిమిట్ట చెరువు నిండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటిమిట్ట చెరువు కింద 1100 ఎకరాల ఆయకట్టు భూమి సాగులోకి రానుంది. 15ఏళ్లు తర్వాత ఒంటిమిట్ట చెరువుకు నిండుగా నీరు చేరడం ఇదే మొదటిసారి. పుల్లంపేట మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పుల్లంగేరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని మానిటరింగ్ చేస్తోంది. అయితే పుల్లంగేరు ప్రవహిస్తుండటంతో రాజంపేట మండలం పోలిచేరువు కింద ఉన్న ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే కోడూరు మండలం జ్యోతికాలనీ వద్ద పొంగి ప్రవహిస్తున్న వంక తిరుపతితో కోడూరు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే కోడూర్ గుంజన నది లోతట్టు ప్రాంతమైన నరసరావుపేట, ధర్మాపురం, గాంధీనగర్‌లో పలు గృహాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్త వహించాలని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆదేశించారు. నెల్లూరు: నివర్ తుఫాన్ తీరం దాటడంతో జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంలో తెల్లవారుజామున నుండే కరెంట్ బంద్ అయింది. మరో పక్క రహదారులపై చెట్లు కూలి పడటంతో ప్రభుత్వ సిబ్బంది వాటిని తొలగింస్తున్నారు. పంటకాలువలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నెల్లూరు, తడ, సూల్లూరు పేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావాలిలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. జిల్లాల్లోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. దీంతో మరింత అప్రమత్తమైన అధికారులు.. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 950 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు. సూళ్లూరుపేటలో తుఫాన్ ఎఫెక్ట్‌తో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాళంగి నదిలోకి భారీగా వరద నీరు చేరుకుంది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. నాయుడుపేటలో నివర్ తుఫాన్ ప్రభావంతో రాత్రి కురిసిన వర్షానికి ఎగువ ప్రాంతాల నుండి స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. కండలేరు జలాశయంలో గురువారం ఉదయానికి 60.324 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమశిల నుంచి 45 వేల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. జిల్లాలో పరిస్థితిపై మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అనిల్‌కుమార్, అధికారులతో కలిసి పర్యటించారు. పలు రైళ్ల రద్దు: దక్షిణ మధ్య రైల్వే నివర్ తుపాను దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 7 రైళ్లు నిలిపివేసినట్లు తెలిపింది. మరో 8 సర్వీసులను దారి మళ్లించింది. హైదరాబాద్-తాంబరం, మధురై-బికనూరు, చెన్నై సెంట్రల్-సంత్రగచి మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకాల వైపు నడిచే మరిన్ని రైలు సర్వీసులకు అంతరాయం కలగవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కర్నూలు: నివర్ తుపాన్ కారణంగా బనగానపల్లె, కోవెలకుంట్ల,అవుకు, సంజామాల, కొలిమిగుండ్ల మండలాల్లో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. ప్రకాశం: నివర్ర్ తుఫాన్ ప్రభావంతో కందుకూరు,గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, ఉలవపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో రాళ్లపాడు రిజర్వాయర్‌కు ఇన్ ప్లో పెరుగుతోంది. రాళ్లపాడు రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 17.8 అడుగులు కొనసాగుతోంది. అనంతపురం: తుపాన్ కారణంగా కదిరిలో భారీ వర్షం కురుస్తోంది. పలు రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నివర్ తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి తీవ్ర చలి గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా అంతటా చెదురు మదురు వర్షాలతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. రాగల 48గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారలు హెచ్చరికలు జారీ చేశారు. -
తీరాన్ని దాటిన నివర్ తుపాను
సాక్షి, విశాఖపట్నం: నివర్ తుపాను పుదుచ్చేరి సమీపాన బుధవారం అర్ధరాత్రి తీరాన్ని తాకింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, పుదుచ్చేరి వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమ బెంగుళూరు, తెలంగాణల మీద ప్రభావం పడనుంది. ఉత్తరకోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక నివర్ తుపాను నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం ఓడరేవు పోర్టులో లోకల్ సిగ్నల్ మూడో నెంబర్ ప్రమాద సూచికను ఎగరవేయగా, విశాఖపట్నంలో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్ రెండో నెంబర్, కాకినాడ గంగవరం పోర్టులో నాలుగో నెంబర్ ప్రమాద సూచికలు ఎగురవేశారు. కాగా తీవ్రమైన నివర్ తుపాను క్రమంగా బలహీనపడుతూ నేటి సాయంకాలానికి వాయుగుండంగా మార్పు చెందనున్నట్లు సమాచారం. -
నివర్ తుపాన్: తిరుమలలో భారీ వర్షం
సాక్షి, తిరుపతి: నివర్ తుపాను చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ‘నివర్’ తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్ హరిణి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్సానికి శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలగా, బైక్‌లు ధ్వంసం అయ్యాయి. నెల్లూరు: జిల్లాలో ‘నివర్’ తుపాను కారణంగా నెల్లూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావలిలో కుంభవృష్టి వర్షం పడుతోంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అదేవిధంగా ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి.చెరువులకు గండ్లు పడకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. నెల్లూరు జిల్లాల్లో 100 తుపాను సెంటర్లు ఏర్పాటు చేశారు. తుపాను సహాయక చర్యల్లో 5వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నెంబర్ - 1077 ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కడప: తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడప జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్, కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలతోపాటు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08562 - 245259 కడప సబ్ కలెక్టర్ ఆఫీస్: 08562- 295990, 93814 96364, 99899 72600 రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం: 08565- 240066, 93816 81866 జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం: 96766 08282, 08560-271088 చిత్తూరు: తీవ్రమైన నివర్ తుపాన్ నేపథ్యంలో రేణిగుంటలో బాలాజీ కాలనీ నీటమునిగింది. తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. దీంతో అరినియర్, మల్లెమడుగు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేత వేశారు. పలు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. -
‘నివర్’ అతి తీవ్రం
ప్రపంచ వాతావరణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఆయా దేశాలు తమ ప్రాంతాలలో తుపానులకు పేరు పెట్టడం ఆనవాయితీ. తద్వారా తుపాను పట్ల అవగాహన పెంచి, నష్ట నియంత్రణకు మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు బంగ్లాదేశ్ ‘నిసర్గా’ అని, భారత్ ‘గతి’ అని సూచించగా, ఇరాన్ సూచించిన ‘నివర్’ పేరు ఖరారైంది. ‘ని’ అంటే కొత్త అని, ‘వర్’ అంటే దేశం లేదా స్థలం, ఇల్లు లేదా నివాస స్థలం అనే అర్థం వస్తుంది. మొత్తంగా ‘నివర్’ అంటే కొత్త ప్రదేశం అని అర్థం. ఈ పదాన్ని కుర్దిష్ నుంచి తీసుకున్నారు. సాక్షి, అమరావతి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, చెన్నై, కడప/నెల్లూరు అర్బన్/తడ : నివర్ తుపాను బుధవారం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ కరైకల్ – తమిళనాడులోని మామల్ల్లపురం మధ్య పాండిచ్చేరికి సమీపంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజాములోగా తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి ప్రకటించింది. నివర్ తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు 120 నుంచి 130 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 145 కి.మీ. గరిష్ట స్థాయికి చేరే ప్రమాదం ఉందని పేర్కొంది. నివర్ ప్రభావం వల్ల గురువారం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వచ్చే రెండు రోజులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాన్ సహాయక చర్యల కోసం ముందస్తుగా 179 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్ఎఫ్, 85 మంది సభ్యులతో 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. కాగా, దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తమిళనాడులో చెరువులు, జలాశయాలు ఫుల్ ► నివర్ ప్రభావంతో తమిళనాడు తీరంలోని చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తంజావూరు, తిరువరూరు, కరైకల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం జిల్లాల్లోని హార్బర్లలో బుధవారం సాయంత్రం 6వ నంబర్ వరకు ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. ► సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ప్రజలను కోరింది. సహాయ చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, గజ ఈతగాళ్లు, అగి్నమాపక శకటాలు, రబ్బర్ బోట్లు, వృక్షాల తొలగింపునకు యంత్రాలు, వరద నీటిని తోడేందుకు జనరేటర్లు సిద్ధంగా ఉంచారు. చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో 26 విమాన సర్వీసులను రద్దు చేశారు. ► ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పరిస్థితిని సమీక్షించారు. చెన్నై దాహార్తిని తీర్చే పూండి, పుళల్, చోళవరం జలాశయాల్లో సైతం నీటిమట్టం పెరుగుతోంది. చెంగల్పట్టు జిల్లాలో 235 చెరువులు పూర్తిగా నిండాయి. బుధవారం భీకర తుపాను గాలుల ధాటికి చెన్నైలో కుప్పకూలిన భారీ వృక్షం సముద్రంలో చిక్కుకున్న 29 మంది మత్స్యకారులు ► బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన 29 మంది మత్స్యకారులు శ్రీహరికోట పరిధిలోని తెత్తుపేట వద్ద బుధవారం సముద్రం, పులికాట్ సరస్సు మధ్య చిక్కుకున్నారు. తడ మండలం ఇరకంకుప్పానికి చెందిన 20 మంది, తమిళనాడు పరిధిలోని నొచ్చుకుప్పం, బాటకుప్పంకు చెందిన 9 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో అప్రమత్తం ► తుపాను నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కడప కలెక్టరేట్‌తోపాటు రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల్లో 24 గంటలు పనిచేసేలా టోల్ ఫ్రీ నంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ► మూడు ప్రత్యేక టీంలు, ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఒక రెస్క్యూటీం ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హరి కిరణ్, ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో 100 పునరావాస కేంద్రాలు ► నెల్లూరు జిల్లా అంతటా బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. 12 తీర ప్రాంత మండలాలు, 8 పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని లోతట్టు ఏరియాల్లో 100 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ► ఇప్పటికే సుమారు 700 కుటుంబాలను తరలించి, ఆహార సదుపాయాలు కల్పించారు. 9 మండలాలకు ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. కోట, వాకాడు, చిట్టమూరు తదితర మండలాల్లో ఇప్పటికే 90 నుంచి 110 మి.మీ. వరకు వర్షం కురిసింది. ► కోట, వాకాడు, నెల్లూరు ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తమిళనాడుకు చెందిన 124 బోట్లు నెల్లూరు వైపు కొట్టుకుని రావడంతో కృష్ణపట్నం పోర్టు సిబ్బంది.. బోట్లతో పాటు మత్స్యకారులును కాపాడారు. ► తుపాను ప్రభావంపై జల వనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘నివర్’ ముప్పు : కుష్బూ, ప్రకాశ్ రాజ్ స్పందన
సాక్షి, చెన్నై: తీవ్ర తుపానుగా ముంచుకొస్తున్న ‘నివర్’పై నటి,ఇటీవల బీజేపీలో చేరిన కుష్పూ స్పందించారు. రానున్న విపత్కర పరిస్థితి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె ట్వీటర్లో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే కరోనా భయపెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తుపానుదూసుకు వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసంవత్సరం తమిళనాడును తుపాను ముంచెత్తి భారీ నష్టాన్ని మిగులుస్తోంది.ఎవ్వరు కూడా బయటకు వెళ్లకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడు నివర్ తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే బలమైన గాలులు వీస్తున్నాయి. వర్షాలు పడుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లన్నీ మూసుకుపోయాయని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దయచేసి చెన్నై, పాండిచ్చేరి తదితర ప్రాంతంలో ప్రజలకోసం అందరం ప్రార్ధిద్దాం అని కుష్పూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు నటుడు ప్రకాశ్ రాజ్ తుపాను బాధితుల సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయారు. స్థానిక యువకుల సాయంతో, ప్రకాశ్ రాజ్‌ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగారు. కోవలం ప్రాంతంలో సుందర్ నేతృత్వంలోని స్కోప్‌ఎంటర్‌ప్రైజ్ ద్వారా కార్యక్రమాన్ని చేపట్టామంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. కాగా 2020 ఏడాదిలో ప్రజలం కరోనా మహమ్మారితో అతలాకుతలమయ్యారు. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా తీవ్ర సంక్షోభం పట్టి పీడిస్తోంది. దీనికి తోడు ప్రకృతి ప్రకోపంతో మరో ముప్పు పొంచివుంది. తీవ్రమైన తుపానుగా మారిన ‘నివర్’ తమిళనాడు వైపుకు దూసుకు వస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యల్ని మొదలు పెట్టింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #CycloneNivar #hindi pic.twitter.com/pwX9dWs32V — KhushbuSundar ❤️ (@khushsundar) November 25, 2020 #NivarCylone as the cyclone is about to strike ..we are on the field ...empowering the local team of youngsters #scopeenterprise led by Sundar in my neighbourhood #kovalam .. a #prakashrajfoundation initiative.. blessed to be able to cherish the joy of “giving back to life “ 🙏🏻🙏🏻 pic.twitter.com/dNRaI5I4EL — Prakash Raj (@prakashraaj) November 25, 2020 -
‘నివర్’ పడగ; కంట్రోల్ రూమ్ నంబర్లు
సాక్షి, కడప: నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ సూచించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించినట్టు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. (నివర్ తుఫాన్: 26 విమానాలు రద్దు..) కలెక్టర్ ఇంకా ఏమన్నారంటే.. నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలి. పూరి గుడిసెలు, పాత మిద్దెలు, మట్టితో కట్టిన ఇళ్ళల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి బంధువుల ఇంటికి కానీ, లేదా ప్రభుత్వం చూపించే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి. నివర్ తుఫాన్ కారణంగా రేపు (గురువారం) జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు దినంగా ప్రకటించిన డీఈఓ శైలజ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూమ్ : 08562 - 245259 సబ్ కలెక్టర్ కార్యాలయం, కడప : 08562 - 295990, 93814 96364, 99899 72600 సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజంపేట : 08565 - 240066, 93816 81866 ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 96766 08282, 08560- 271088 దక్షిణమధ్య రైల్వే హెల్ప్లైన్లు నివర్ తుపాను నేపథ్యంలో రైల్ సర్వీసుల్లో మార్పులుండే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. తుపాను ప్రభావం చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకా వైపు వెళ్లే రైళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సమాచారం మేరకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ప్రయాణికులు సహాయం కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు. సికింద్రాబాద్: 040-27833099 విజయవాడ: 0866-2767239 గుంటూరు: 0863-2266138 గుంతకల్లు: 7815915608 -
నివర్ తుఫాన్: 26 విమానాలు రద్దు..
సాక్షి, చెన్నై : నివర్ తీవ్ర తుఫాను ప్రభావంతో తమిళానాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయంలో 26 విమానాలను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏటీఆర్ చిన్న విమానం, చెన్నై విమానాశ్రయంలోని టుటికోరిన్, ట్రిచీతోపాటు సేలంకు 12 విమానాలు ఇప్పటికే రద్దు చేశారు. మామల్లపురం చుట్టుపక్కల తీరప్రాంత ప్రజలు, ఫిషింగ్ ప్రాంత ప్రజల భద్రత కోసం అధికారులు ఎత్తైన మైదానాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఉపయోగించే పడవలు, ఫిషింగ్ నెట్స్ యంత్రాలను 30 మీటర్ల దూరంలో అధికారులు సురక్షితంగా ఉంచారు. తిరుపోరూర్లోని, తిరుక్కలుక్కున్ పరిసరాల్లోని ఉన్న 23 సరస్సులు, 23 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోయంబత్తూరులో సముద్రంలో అయిదు అడుగుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. నిండుకుండను తలపిస్తున్న స్వర్ణముఖి నెల్లూరు : నెల్లూరు జిల్లా వాకాడులోని వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. నివర్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వరద నీరు, తెలుగు గంగ నుంచి నీటిని విడుదల చేయడంతో స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. స్వర్ణముఖి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజి నీటితో స్వర్ణముఖి పరిధిలోని చెరువులు మొత్తం నిండాయని బ్యారేజ్ అధికారులు తెలిపారు. గతంలో బ్యారేజీ కుడికాలువకు గంగన్న పాలెం వద్ద తెగిపోవడంతో ఆ ప్రాంతం ముందస్తుగా కట్టకు మరమ్మతులు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల భారీగా కురుస్తున్న వర్షాలతో సముద్రంలోకి వేటకి వచ్చిన 124 తమిళనాడు బోటులు పొర్టులో పార్కింగ్ చేశారు. (నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు) -
నివర్ తుపానుపై అనిల్ కుమార్ సమీక్ష
సాక్షి, నెల్లూరు: నివర్ తుపానుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, ఉన్నతాధికారుల తుపాను సహాయక చర్యలు బాగా తీసుకుంటున్నారని ప్రశంసించారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 700 కుటుంబాలను ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పంట నష్టం పెద్దగా లేకపోవడం అదృష్టం అన్నారు. చెరువుల విషయంలో నీటిపారుదల అధికారులు జాగ్రతగా ఉండాలని.. తీరప్రాంతంలో ఉన్న స్పెషల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాలు, నిత్యావసర లు కు ఇబ్బంది కలగకుండా చూస్తున్నమన్నారు. ఈరోజు, రేపు రెండు రోజులు ప్రజలు సహకరించాలని కోరారు. బయట తిరగకుండ జాగ్రత్తగా ఉండాలని.. చెరువుల దగ్గర ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. (చదవండి: చెన్నైకు‘నివర్’ ముప్పు!) -
నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు
సాక్షి, నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోట, వాకాడు, చిట్టుమూడు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చదవండి: తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్ అతి తీవ్ర తుఫానుగా మారనున్న నివర్ నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుపాను ప్రభావం కొనసాగుతుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కిలోమీటర్లు దూరంలో పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్ మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను కరైకల్- మహాబలిపురం మధ్య ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఈ అర్ధ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. చదవండి:నివర్ తుపాను.. అప్రమత్తంగా ఉందాం సాక్షి, వైఎస్సార్ కడప : నివర్ తుపాను వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయిల్ రన్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు 'నివర్' తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సంసిద్ధంగా మూడు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేసినట్లు, బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లను ఏఆర్ పోలీసు అధికారులు అందజేశారు. (చదవండి: తిరుమలపై ‘నివర్’ ప్రభావం) సాక్షి, చిత్తూరు : నివర్ తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉండటంతో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతోపాటు బారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 68 చెరువుల వద్ద అధికారులను అలెర్ట్ చేశామన్నారు. 16 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించినట్లు, నిరాశ్రయులకు పాఠశాల భవనాలలో అసరా కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. నివర్ తుపాను ప్రభావం నేపథ్యంలో వరదయ్యపాలెం మండలంలో 100 మంది నిరాశ్రయులైన గిరిజనులను ముందస్తుగా గుర్తించి పునరావాస కేంద్రంలకు తరలించినట్లు తెలిపారు. నివర్ తుపానుతో రేణిగుంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మల్లెమడుగు రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్
సాక్షి, విశాఖపట్నం: నివర్ తుఫాన్ దూసుకొస్తుండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 290 కి.మీ, పాండిచ్చేరికి 300 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన తుఫాను ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారు జామున కరైకల్, మహాబలిపురం వద్ద నివర్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తుంది. నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు. (తిరుమలపై ‘నివర్’ ప్రభావం) విద్యుత్ శాఖ అప్రమత్తం మహాబలిపురం మధ్య తీరం దాటే సమయంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని అదే తీవ్రతతో తుఫాను చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుఫాన్ సహాయక చర్యలపై ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ హరినాథ్ రావు మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరులలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. నాయుడుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు డివిజన్లలో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉంటుంది. ఒక్కో డివిజన్‌కు సూపరింటెండ్ ఇంజనీరు స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాము. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి 20 ప్రత్యేక టీములను రప్పించాము. ఒక్కో టీమ్‌లో 10 మంది ఉంటారు. నిర్ణయించిన నాలుగు డివిజన్స్‌కు ముందస్తుగా విద్యుత్ స్తంభాలు, కేబుల్స్, కండక్టర్ పంపాము. ఎక్కడైనా విద్యుత్‌కు అంతరాయం కలిగితే 1912 టోల్ ఫ్రీకి ఫోన్ చేయాలి అని తెలిపారు. (చెన్నైకు‘నివర్’ ముప్పు!) నివర్ ఎఫెక్ట్.. యూజీ, పీజీ పరీక్షలు రద్దు నివర్ తుఫాన్ ప్రభావం వలన అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ శశిధర్ ఓ ప్రకటన జారీ చేశారు. ఐదు జిల్లాల పరిధిలోని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల్లూరులో భారీ వర్షాలు నివర్ తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తీరప్రాంత గ్రామల్లోనూ, నదులు పొంగే ప్రాంతాల్లోను ఎన్డీఆర్ఎఫ్,ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. జిల్లాలో 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతల్లో ప్రజలను సురక్షిత కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతో సహా జిల్లాలో 5000 మంది సిబ్బంది తుఫాన్ రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హెచ్చరించారు. నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశాం. సాధ్యమైనంత వరకు, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దు. జిల్లాలో చెరువులు అన్ని నిండి ఉన్నాయి. సోమశిల జలాశయంలో 75 టీఎంసీలు, కండలేరులో 60 టీఎంసీ నీరు, సోమశిల నుండి 8,500 క్యూసెక్కులు, కండలేరు నుండి 6,500 కూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల చేశాము. ఆపదలో ఉన్న వారు 1077 కి కాల్ చేసి సాయం పొందవచ్చు అని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నెల్లూరు జిల్లాలో హైఅలర్ట్
-
తిరుమలపై ‘నివర్’ ప్రభావం
సాక్షి, తిరుపతి: నివర్ తుఫాను ప్రభావం తిరుమలపై పడింది. బుధవారం ఉదయం నుండి తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు తడిసిపోతున్నారు. దీంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. జలాశయాలలో వర్షం నీరు చేరుతుంది. మరోపక్క ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఆగకుండా కురుస్తోన్న వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దవుతున్నాయి. వెంకన్న సేవలు పలువురు ప్రముఖులు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, బీజేపీ సీనియర్ నేత సునీల్ దియెధర్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఆలయం వెలుపల జీవీఎల్ మాట్లాడుతూ శ్రీవారి కృపతో దేశప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘నివర్’ తుపాన్ భారీ వర్షాలు
-
చెన్నైకు‘నివర్’ ముప్పు!
సాక్షి ప్రతినిధి, చెన్నై, సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తుపానుగా మారింది. చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమైన ‘నివర్’ తుపాన్ తీరం వైపు వడివడిగా పయనిస్తోంది. రాబోయే 12 గంటల్లో పెను తుపానుగా మారి బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి చెన్నై సమీపంలోని మహాబలిపురం–కారైక్కాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ తీరందాటే సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. 27వ తేదీ నాటికి తమిళనాడులో నివర్ తుపాన్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు. నివర్ ప్రభావం ఎక్కువగా తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమపై ఉంటుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జి.లక్ష్మి తెలిపారు. నిండుకుండలా చెంబరబాక్కం తమిళనాడులో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఏడు జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెంబరబాక్కంతోపాటు చెన్నై దాహార్తిని తీర్చే జలశయాలన్నీ ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా చెంబరబాక్కంలోని ఉబరి నీటిని విడుదల చేస్తామని, భయం వద్దని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. తుపాన్ దృష్ట్యా బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించామని, పరిస్థితిని బట్టి సెలవు పొడిగిస్తామని చెప్పారు. తుపాన్ సహాయ చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సీఎం ఎడపాడితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరో తుపాన్ గండం.. ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు.. తుపాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో సముద్రం 30 మీటర్ల మేర ముందుకు వచ్చింది. మత్స్యకారులు చేపల వేటను నిలిపివేసి పడవలు, వలలను భద్రపరుచుకుంటున్నారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు, కాకినాడ, గంగవరం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికతో పాటు నాలుగో నం. సెక్షన్ సిగ్నల్ జారీ చేశారు. నేడు, రేపు దక్షిణ కోస్తా, సీమకు భారీ వర్ష సూచన నివర్ తుపాను ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 26వతేదీన కర్నూలు జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రైతన్నలూ... వరి ధాన్యం జాగ్రత్త తుపాన్ నేపథ్యంలో ముందస్తు సహాయ చర్యల్లో భాగంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం కమిషనర్ కన్నబాబు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. చేతికొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు వెంటనే నూర్పిళ్లు చేపట్టి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకోవాలని రైతన్నలను కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నివర్ తుపాను.. అప్రమత్తంగా ఉందాం
సాక్షి, అమరావతి: ‘నివర్’ తుపాను నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. పంటలు దెబ్బ తినకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలని చెప్పారు. కోత కోసిన పంటలను రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తుపాను నేరుగా రాష్ట్రాన్ని తాకకపోయినా, తమిళనాడుకు చేరువలో, సముద్ర తీర ప్రాంతాలలో దాని ప్రభావం ఉంటుందన్నారు. రేపు (బుధవారం) సాయంత్రం నుంచి ఎల్లుండి (గురువారం) అంతా ప్రభావం ఉంటుందని, వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయని చెబుతున్నందున మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ఆర్బీకేల ద్వారా రైతులను అప్రమత్తం చేయాలి ► నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ► ఆర్బీకేల ద్వారా రైతులను అప్రమత్తం చేయాలి. ఒక వేళ పంటలు కోయకుండా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించాలి. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ► అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షాలు పడితే.. చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ► కరెంటు సరఫరాకు అంతరాయం కలిగితే, వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధం చేసుకోండి. ప్రతి జిల్లా కలెక్టరేట్లో రోజంతా పని చేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోండి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఉండాలి. సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి ► ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించేలా తగిన పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచుకోండి. తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్లెట్లు అన్ని గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉన్నాయి. ఆ సమాచారం సిబ్బందికి, ప్రజలకు చేరవేసేలా చూడాలి. ► వైఎస్సార్ జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు లాంటి ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చోట్ల సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి. ► సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, వ్యవసాయ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అధికార యంత్రాంగం సంసిద్ధం నివర్ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గురువారం సాయంత్రం తమిళనాడులోని మమాళ్ల్లపురం–కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశముంది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇప్పటికే అవసరమైన ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. కోస్తా ప్రాంతంలోని అన్ని ఓడ రేవులలో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు. – మేకతోటి సుచరిత, హోం మంత్రి -
ఏపీ అప్రమత్తం: దూసుకొస్తున్న నివార్..
సాక్షి, అమరావతి: రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా ‘నివార్’ మారనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్) తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లాకు 2 ఎస్డీఆర్ఎఫ్, 1 ఎన్డీఆర్ఎఫ్.. చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విపత్తుల శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అప్రమత్తం చేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తీర,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివార్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు) -
అమరావతి: నివర్ తుఫానుపై సీఎం జగన్ సమీక్ష
-
ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘నివార్’ సైక్లోన్‌తో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివార్ తుపాన్‌పై జిల్లాకలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు. ఈ తుపాను ప్రభావం బుధ వారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ‘నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలపై 11-20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి. కోతకోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి. ఒకవేళ ఇంకా పొలంలోనే పంటలు ఉంటే... వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబరు వరకూ పడ్డ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే... చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉంటాయి. ఈ గండ్లు పడకుండా నిరంతరం మానిటరింగ్ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోండి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దశ, దిశ చూపండి. వీరి సేవలను పెద్ద స్థాయిలో వినియోగించుకోండి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంచేసుకోండి. అలాగే కరెంటు సరఫరాకు ఇబ్బందులు వచ్చిన సమక్షంలో వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధంచేసుకోండి.ప్రతిజిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోండి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూమ్స్‌ఉండాలి. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి వరకూ వర్షాలు ఉండే అవకాశాలున్నాయి. ఎక్కడైనా చెట్లు విరిగి పడితే వాటిని వెంటనే తొలగించేలా తగిన పరికరాలను, సామగ్రిని అందుబాటులో ఉంచుకోండి.తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌ను అన్ని గ్రామ సచివాలయాలకు అందుబాటులో ఉంచారు. ఆ సమాచారం సిబ్బందికి, ప్రజలకు చేరవేసేలా చూడాలి. రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు లాంటి ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి.నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అవసరమైన చోట్ల సహాయ, పునరావాస శిబిరాలపై దృష్టి పెట్టాలి’అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
ఏపీపైనా నివర్ తుఫాను ప్రభావం
-
దూసుకొస్తున్న ‘నివర్’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/న్యూఢిల్లీ: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. గంటకు 11 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 500 కి.మీ., చెన్నయ్‌కి ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం మరింత బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. తుపాను ఏర్పడితే ప్రపంచ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం.. ఇరాన్ సూచించిన ‘నివర్’ అనే పేరు పెడతామని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి పాండిచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో మళ్లాపురం ప్రాంతం వద్ద ఈ నెల 25న (బుధవారం) తుపానుగా మారుతుందని.. ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి అదే ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ.. 25, 26 తేదీల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు.. గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఈ దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తమిళనాడు, పుదుచ్చేరి వైపుగా కదులుతున్న వాయుగుండం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు వాయుగుండం తుపానుగా మారనుందన్న సమాచారంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్.. గంగవరం, కాకినాడ పోర్టుల్లో నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం ఓడరేవుకు అప్రమత్తత సమాచారం అందించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైతులు చేతికొచ్చిన పంటల్ని వెంటనే జాగ్రత్తపర్చే ఏర్పాట్లలో ఉండాలని సూచించారు. మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు దీని ప్రభావంతో రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అనేకచోట్ల మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి. బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. యంత్రాంగం అప్రమత్తం తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని, సరిపడా ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనరేటర్లను, ప్రతి పీహెచ్సీలో రెండేసి అంబులెన్స్‌లను సిద్ధం చేయాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యుత్ శాఖ హై అలెర్ట్ ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. డిస్కమ్‌ల సీఎండీలు, జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్లు, టవర్లను భౌగోళిక సమాచార విధానం (జీఐఎస్) పరిధిలోకి తీసుకచ్చామని, ముంపు ప్రమాదం ఉన్న టవర్లు, సబ్ స్టేషన్లు, లైన్ల వద్దకు వీలైనంత త్వరగా చేరుకునే మార్గాలను జీఐఎస్ ద్వారా సిబ్బంది తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూడండి : కేంద్రం తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్‌గాబా సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, ఎన్డీఆర్ఎఫ్ ఇతరత్రా సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నామని మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆయనకు వివరించారు. ఈ నెల 24–26 తేదీల మధ్య ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలను తుపాను ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ వివరించారు.