
సాక్షి, కృష్ణా జిల్లా: నివార్ తుపాన్ కారణంగా భారీగా పంటనష్టం సంభవించిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.41 లక్షల హెక్టార్లలో 16.12లక్షల టన్నుల వరి పండుతుందని ఆశించామని తెలిపారు. నాగాయలంక, మండవల్లి మండలాల్లో వరి పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. 1.08 వేల హెక్టార్లలో పంట నష్టానికి ఎన్యూమరేషన్ మొదలుపెట్టాం. క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఇన్‌పుట్ సబ్సిడీ డిసెంబర్ 31 నాటికి రైతుల బ్యాంకు ఖాతాలకు పంపుతామన్నారు. రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు)
పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని, వ్యవసాయాధికారులకు ఎన్యూమరేషన్ ప్రధాన బాధ్యతగా చేయాలని ఆదేశించామని తెలిపారు. మంత్రులు, స్పెషల్ ఛీప్ సెక్రెటరీలు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారని తెలిపారు. డయల్ యువర్ జేసీ రేపు(శుక్రవారం) నిర్వహిస్తామని తెలిపారు. కౌలు రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 1800425440 కంట్రోల్ రూమ్ నంబరు రైతుల కోసం ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి, 50 రోజుల క్యాంపైన్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు కలిసి ఈ క్యాంపైన్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 8.4 లక్షల కోవిడ్ టెస్టులు జిల్లాలో జరిగాయని కలెక్టర్ వెల్లడించారు. (చదవండి: మంత్రి పేర్నిపై దాడి.. టీడీపీ కుట్రే?)
Comments
Please login to add a commentAdd a comment