సాక్షి, విజయవాడ: నగరంలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలతో ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో కరోనా ఉధృతి సాగుతూనే ఉంది. జిల్లాలో గురువారం మరో 230 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4482 కేసులు నమోదు కాగా, వారిలో 3260 మంది కోలుకుని ఆసుప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.(ఇంట్లోనే 16 గంటల పాటు మృతదేహం)
Comments
Please login to add a commentAdd a comment